ఓటీటీలో భారీ విజయం అందుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఓటీటీలో భారీగా ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్’ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ షూటింగ్ పనులను గతేడాదిలో ప్రారంభించారు. అయితే, తాజాగా ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్3’ గురించి ఒక శుభవార్తను మేకర్స్ పంచుకున్నారు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. అందుకు సంబంధించి వారు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజ్ అండ్ డీకేతో పాటు మనోజ్ బాజ్‌పాయ్,గుల్‌పనాగ్, ప్రియమణి, సమంత పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో వారు పంచుకున్నారు.
ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్‌లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కూడా మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, విడుదల తేదీని ప్రకటించలేదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది.
It's a wrap on Season 3 of The Family Man! Thank you to the wonderful crew and cast for going through with the toughest shoot yet! ❤️#TFM #TheFamilyMan3 pic.twitter.com/WXogsICE6v
— Raj & DK (@rajndk) January 23, 2025
Comments
Please login to add a commentAdd a comment