అహ్మదాబాద్: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతూ డబ్బులన్నింటినీ తగిలేస్తుండడంతో మరికొందరు వివిధ వెబ్‌సైట్లు తెరచి అందులో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఆన్‌లైన్‌లో పరిచయమైన వారితో రహస్య వీడియోలు పంపుతుండడం.. అవి ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్‌సైట్‌లో పోస్టు చేయడంతో వారికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన గుజరాత్‌లో జరిగింది. (చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి)
అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్‌లైన్ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది.
ప్రత్యేక గదిలో ఆన్‌లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది.
ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలిసీ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్‌సైట్ వివరాలు తెలుసుకుంటున్నారు.
చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు
Comments
Please login to add a commentAdd a comment