Indecent photos
-
భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్
-
భద్రాద్రి ఆలయం పేరుతో అశ్లీల చిత్రాల పోస్టింగ్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సోషల్ మీడియాలో భద్రాద్రి ఆలయం పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడమే కాదు.. అందులో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం టెంపుల్ సిటీ, భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆగంతకులు. అంతటితో ఆగకుండా ఆ పేజీల్లో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం గమనించిన కొందరు రామభక్తులు.. భద్రాచలం ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే.. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయబడుతున్న పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు జరుగుతోంది. -
అరచేతిలో అశ్లీలం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరగడంతో ‘అశ్లీలం’ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. వాటికితోడు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల అశ్లీల సాహిత్యం విరివిగా వ్యాప్తి చెందుతోంది. టెలికామ్ పోర్టల్ ‘ది మొబైల్ ఇండియన్ డాట్ కామ్’ఇటీవల రూపొందించిన ఒక నివేదిక ప్రకారం 2021లో 4.5 కోట్ల మందికిపైగా భారతీయులు అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసుకొని వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఇలాంటి దృశ్యాలు చూస్తున్న (25 కోట్లు) వారిలో భారతీయుల వాటా 16 శాతం కావడం గమనార్హం. ఇక స్మార్ట్‌ఫోన్ వాడకం పెద్దగా తెలియని వారి కోసం మొబైల్‌ఫోన్ రిపేర్ షాపుల్లో, సైబర్ కేఫ్‌లలో మైక్రో మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్‌ల రూపంలో విరివిగా అశ్లీల వీడియోలు లభిస్తున్నాయని, ఈ తరహా వ్యాపారం భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువని నివేదిక పేర్కొంది. రూ. వందకో అశ్లీల వీడియో... ‘ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వెలుపల 4–5 దుకాణాలు రూ. కోట్లలో అశ్లీల వీడియోల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దుకాణాల నుంచి అశ్లీల వీడియోలు కొనుగోలు చేస్తున్న వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలు, ఆఫీసు బాయ్లే. అక్కడి దుకాణదారులు రూ. 1,000 నుంచి రూ. 2,500 మధ్య లభించే ఫోన్లను పెద్దమొత్తంలో కొని వాటిలో అశ్లీల వీడియోలను నింపి ఒక్కో మొబైల్‌ను రూ. 3,500–4,000 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే అశ్లీల సాహిత్యాన్ని వారు ఎంపిక చేసుకున్న భాషను బట్టి కనిష్టంగా రూ. 100, గరిష్టంగా రూ. 500కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు’అని లీగల్ న్యూస్ అండ్ కామెంటరీ సర్వీస్ వెబ్సైట్ నిర్వాహకుల్లో ఒకరైన నిర్మలా గోవాల్కర్ వివరించారు. దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక అశ్లీల వీడియో రూపొందుతోందని, ఇందులో 38 శాతం పిల్లల లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది గడిచిన 65 రోజుల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వచ్చిన అంశాల్లో 25 శాతం మైనర్ బాలికల అశ్లీలతకు సంబంధించినవే ఉండటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన రెస్క్యూ అనే గ్రూపు దక్షిణాదిలో 5,575 మంది కళాశాల విద్యార్థులపై చేపట్టిన సర్వే ప్రకారం 65 శాతం మంది క్రమం తప్పకుండా తమ ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారు. ఈ విషయంలో బాలికల కంటే బాలురు 16 శాతం ఎక్కువ. హైదరాబాద్‌లోనూ అధికమే... హైదరాబాద్ అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో మొబైల్ షాపు నిర్వహించే ఓ వ్యక్తి రోజుకు 250–300 నీలిచిత్రాలను అప్లోడ్ చేస్తున్నాడు. ఇంగ్లిష్ వీడియోలను కావాలంటే తక్కువ ధరకు, తెలుగు, హిందీ భాషల వీడియోలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ గలీజు దందాపై అతన్ని ప్రశ్నిస్తే తాను కేవలం పోర్న్ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోలనే విక్రయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. పైగా పోలీసులు గతంలో తనను నాలుగైదుసార్లు అనవసరంగా అరెస్టు చేశారని పేర్కొనడం గమనార్హం. అయితే గతంలో ఆ షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినప్పుడు అతని సెల్ఫోన్లో భారీగా అశ్లీల వీడియోలు కనిపించినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఓ షోరూంలోని మహిళల ట్రయల్ రూంలో అమర్చిన కెమెరా ద్వారా రికార్డు చేసిన వీడియోలూ అతని వద్ద లభించాయన్నారు. నిపుణుల సూచనలు... ►మొబైల్ కంపెనీలు తమ ఫోన్ల ఉత్పత్తుల్లో నీలిచిత్రాలు డౌన్లోడ్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుతుంది. (యాపిల్ సంస్థ ఇప్పటికే నీలిచిత్రాల డౌన్‌లోడ్‌ను నిరోధించడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. వాటిని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే వార్నింగ్ వచ్చేలా ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది.) ►అశ్లీల చిత్రాలను చూడటాన్ని బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణించే చట్టం తేవాలని కోరుతూ ఇండోర్‌కు చెందిన న్యాయవాది కమలేశ్ వాస్వాని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కర్ణాటక శాసనసభలో ఏకంగా ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. -
ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక
అహ్మదాబాద్: ఆన్లైన్ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతూ డబ్బులన్నింటినీ తగిలేస్తుండడంతో మరికొందరు వివిధ వెబ్సైట్లు తెరచి అందులో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఆన్లైన్లో పరిచయమైన వారితో రహస్య వీడియోలు పంపుతుండడం.. అవి ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్సైట్లో పోస్టు చేయడంతో వారికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. (చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి) అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్లైన్ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది. ప్రత్యేక గదిలో ఆన్లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్సైట్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలిసీ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్సైట్ వివరాలు తెలుసుకుంటున్నారు. చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు -
అసభ్య ఫొటోలు షేర్ చేస్తోన్న పిల్లలు
సాక్షి, న్యూఢిల్లీ : పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని అమాయక పిల్లలుగా మనం భావిస్తుంటే వారేమో సోషల్ మీడియా పుణ్యమా అని అన్నీ తెలిసిన పెద్దల వలే చెడు మార్గాన పయనిస్తున్నారు. పట్టుమని 14 ఏళ్లు కూడా లేని బాల బాలికలు సోషల్ మీడియాలో నగ్న ఫొటోలను షేర్ చేయడంతోపాటు లైంగిక పరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అలా గత రెండేళ్లుగా ఇంగ్లండ్, వేల్స్లో బాల ప్రేప పురాణం సాగిస్తున్న 6000 మందికిపైగా పిల్లలను 27 పోలీసు దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పసిగట్టాయి. వారిలో 306 మంది పదేళ్లలోపు బాల బాలికలవడం మరింత ఆశ్చర్యం. ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో 14 ఏళ్లలోపు పిల్లలు ఇలా వ్యవహరించడం నేరం. 2017, జనవరి నెల నుంచి 2019, ఆగస్టు నెల మధ్య ఒకరికొకరు నగ్న ఫొటోలను పంపించుకోవడంతోపాటు తమ ఫాలోవర్లయిన ఇతరులకు అలాంటి ఫొటోలను పంపించిన 6,499 మంది పిల్లలను గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిలో ఆరేళ్ల వయస్సు గల పిల్లలు 17 మంది ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించినట్లు వారు చెప్పారు. వారిలో ఒక్కొక్కరు నెలకు కనీసంగా 183 నుంచి గరిష్టంగా 241 అసభ్య ఫొటోలను పంపించారని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు వారిలో 9 ఏళ్ల బాలిక తన అసభ్య ఫొటోలను ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయగా, అంతే వయస్సు గల బాలుడు తన నగ్న సెల్ఫీని ‘ఫేస్బుక్’లో షేర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంగ్లండ్, వేల్స్ చట్టాల ప్రకారం పదేళ్లు నిండిన పిల్లలే శిక్షార్హులవుతారు. అంతే కాకుండా వారి భవిష్యత్తును పరిరక్షించడంలో భాగంగా 30 మంది పిల్లలపైనే చార్జిషీటు దాఖలు చేసి మిగతా పిల్లలందరిని హెచ్చరికలతో వదిలేశామని పోలీసు అధికారులు తెలిపారు. చార్జిషీటు దాఖలయిన పిల్లలను కూడా కోర్టు హెచ్చరికల ద్వారాగానీ, కౌన్సిలింగ్ ద్వారాగానీ విడుదల చేయవచ్చని వారు చెప్పారు. నగ్న చిత్రాలు పరస్పర ఆమోదంతో షేర్ చేసుకున్నట్లయితే కూడా తాము జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పైగా ఈ పిల్లల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల్లో ఏ వర్గం నుంచి కూడా తమకు ఒత్తిడి లేదని నార్ఫోక్ కానిస్టేబుల్ చీఫ్ సైమన్ బైలే తెలిపారు. -
ఫేస్బుక్లో మహిళకు అశ్లీల ఫొటోలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్బుక్లో మహిళకు అశ్లీల ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నెల్లికుప్పానికి చెందిన ఓ యువతి బన్రుట్టి పట్టణంలోని ఒక ప్రైవేటు దుకాణంలో పనిచేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా చాటింగ్ చేయడం ఆమెకు అలవాటు. తూత్తుకూడికి చెందిన హరిహరన్, ప్రభాకరన్ ఆమెకు ఫేస్బుక్ స్నేహితులు. అలాగే సెల్‌ఫోన్ ద్వారా కూడా వీరికి ఆమెతో స్నేహం ఉంది. కొన్ని నెలలుగా ఈ ఇద్దరి స్నేహానికి ఆమె దూరంగా ఉంటోంది. దీంతో ఆమె ఫేస్‌బుక్‌కు ఈ ఇద్దరు యువకులు ఇటీవల అశ్లీల చిత్రాలను పంపుతూ బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకులను గురువారం అరెస్ట్ చేశారు. -
ప్రియాంకను 'ఆ' దృష్టితో చూడలేదు..
అసెంబ్లీలో ప్రియాంక గాంధీ ఫొటోను చూసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ సెల్‌ఫోన్‌ను సభలోకి తీసుకెళ్లడం తప్పేనని క్షమాపణలు ప్రియాంకను ‘..ఆ’ దృష్టితో చూడలేదంటూ మీడియాకు వివరణ చర్చ సమయంలో మొబైల్ గేమ్ ఆడుతూ మీడియాకు చిక్కిన బణకార్ శాసనసభల్లో అమ్మాయిల ఫొటోలుచూడటం వారి సంస్కృతి : సిద్ధు బెంగళూరు: ప్రజాసమస్యల చర్చకు వేదికైన శాసనసభలో మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూ బీజేపీ శాసనసభ్యులు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో ఒకరు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ ఫొటోను అసభ్య రీతిలో తాకుతూ (టచ్) కెమరా కంట పడ్డారు. వివరాలు... బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో బీదర్ జిల్లా ఔరాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రభూచౌహాన్, బెంగళూరులోని బసవనగుడి ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్య ఒకరి పక్కన మరొకరు కుర్చొని ఉన్నారు. జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి చెరుకు రైతుల సమస్య పై మాట్లాడుతున్న సమయంలో ప్రభుచౌహాన్ తన సెల్‌ఫోన్‌ను తీసి అందులోని కొన్ని ఫొటోలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సహచర ఎమ్మెల్యే అయిన రవిసుబ్రహ్మణ్యకు తన ఫోన్లోని కొన్ని ఫొటోలను చూపించడం మొదలు పెట్టారు. అయితే సభలో కెమెరాలు ఉన్నాయని ఫోన్‌ను పక్కన పెట్టాలని సూచించిన రవిసుబ్రహ్మణ్య ఫోన్ చూడకుండా పక్కకు తప్పుకున్నారు. అయినా ప్రభు చౌహాన్ మాత్రం సెల్‌ఫోన్‌లోని ఫొటోలను చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుచౌహాన్ తన సెల్ఫోన్లో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, యోగా గురువు బాబారామ్దేవ్ల ఫొటోలను చూసి ఆ తర్వాత ప్రియాంకాగాంధీ ఫొటోను తాకుతూ జూమ్ చేయడం మీడియా కంటపడింది. ఈ విషయం ప్రసారం అవుతున్న విషయం తెలుసుకున్న రవిసుబ్రహ్మణ్య మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ‘ప్రభు చౌహాన్ కూతురి పెళ్లికి నేను హాజరుకాలేక పోయాను. అందుకే ఆయన తన సెల్ఫోన్లో ఉన్న కూతురు, అల్లుడు ఫొటోలను చూపిస్తున్నారు. నేను ఇది సమయం కాదని చెప్పడంతో మిన్నకుండి పోయారు. ఆయన ఏ ఫొటోను చూశారో నాకు తెలియదు.’ అని వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత కొద్ది సేపటికి ప్రభుచౌహాన్ కూడా మీడియాతో మాట్లాడుతూ... ‘శాసనసభలోకి సెల్‌ఫోన్‌ను తీసుకువెళ్లకూడదన్న నియమాన్ని పాటించకపోవడం నేను చేసిన తప్పు. ఇందుకు క్షమాపణ కోరుతున్నా. జామర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు అనిపించి, మెసేజ్‌ను చదువుదామని అనుకుంటూ ఫోన్‌ను చేతిలోకి తీసుకున్నా. వివిధ ప్రముఖుల ఫొటోలతో పాటు వారు వివిధ సందర్భాల్లో చెప్పిన ప్రముఖ వాఖ్యలు కూడా అందులో ఉన్నాయి. అందులో ప్రియాంకా గాంధీ ఫొటో కూడా ఒకటి. ఆ ఫొటో పక్కనే ఉన్న వాఖ్యలు చదవడం కోసం నేను జూమ్ చేయాల్సి వచ్చింది. అంతేతప్ప నాకు మరే ఇతర ఉద్దేశం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు.’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బుధవారం రోజే బీజేపీకు చెందిన మరో శాసనసభ్యుడు యూబీ బణకార్ (హిరేకెరూర్) తన సెల్ఫోన్లో చట్టసభలోనే క్యాండీక్రాష్ (ఓ మొబైల్ గేమ్) ఆడుతూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కంటబడ్డారు. దీంతో మార్షల్ వచ్చి ఇది సరికాదని చెప్పడంతో సర్దుకున్నారు. అయితే ఈ విషయం అప్పటికే మీడియాలో ప్రసారం అయిపోయింది. కాగా, గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడిన విషయం తెలిసిందే. అమ్మాయిల ఫొటోలు చూడటం వారి సంసృతి : సీఎం సిద్ధు శాసనసభ సమావేశంలో చౌహాన్ ప్రవర్తనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టసభల్లో అమ్మాయిల ఫొటోలను చూడటం వారి సంసృతి. ప్రియాంకాగాంధీతో సహా ఏ అమ్మాయిని కూడా అలా చూడటం సరికాదు. శాసనసభలోకి సెల్ఫోన్లను అనుమతించడం, అనుమతించకపోవడం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.’ అని పేర్కొన్నారు. కాగా, చట్టసభల్లోకి సెల్ఫోన్లను తీసుకురాకుండా కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాల్సి ఉందని టీబీ జయచంద్ర ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. వినూత్న నిరసన... : బుధవారం ఉదయం శాసనసభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభుచౌహాన్ తన నియోజక వర్గంలో అనర్హత పేరుతో పేదల బీపీఎల్ కార్డులనూ రద్దు చేస్తోందని ఆరోపిస్తూ గంపలో కొన్ని బీపీఎల్ కార్డులను వేసుకుని సభలోకి ప్రవేశించారు. విషయం గమనించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇలా చేయడం తగదని హితవు పలికారు. అప్పటికి మిన్నకుండిపోయిన ప్రభుచౌహాన్ కొంత సమయం తర్వాత రద్దయిన బీపీఎల్ కార్డులను తన దుస్తులపై పిన్నీలు, ప్లాస్టర్ సహాయంతో అతికించుకుని నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ శాసనసభలో సమస్యల ప్రస్తావన హుందాగా ఉండాలి. ఇలాగే ప్రవర్తించాలి అనుకుంటే బయటికి వెళ్లిపోండి’ అని హెచ్చరించారు.