ఫేస్‌బుక్‌లో మహిళకు అశ్లీల ఫొటోలు | 2 held for indecent Facebook posts on woman in tamil nadu | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మహిళకు అశ్లీల ఫొటోలు

Published Fri, Jul 8 2016 6:42 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో మహిళకు అశ్లీల ఫొటోలు - Sakshi

ఫేస్‌బుక్‌లో మహిళకు అశ్లీల ఫొటోలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్‌బుక్‌లో మహిళకు అశ్లీల ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నెల్లికుప్పానికి చెందిన ఓ యువతి బన్రుట్టి పట్టణంలోని ఒక ప్రైవేటు దుకాణంలో పనిచేస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా చాటింగ్ చేయడం ఆమెకు అలవాటు. తూత్తుకూడికి చెందిన హరిహరన్, ప్రభాకరన్ ఆమెకు ఫేస్‌బుక్ స్నేహితులు.

అలాగే సెల్‌ఫోన్ ద్వారా కూడా వీరికి ఆమెతో స్నేహం ఉంది. కొన్ని నెలలుగా ఈ ఇద్దరి స్నేహానికి ఆమె దూరంగా ఉంటోంది. దీంతో ఆమె ఫేస్‌బుక్‌కు ఈ ఇద్దరు యువకులు ఇటీవల అశ్లీల చిత్రాలను పంపుతూ బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకులను గురువారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement