kadalur
-
కి‘లేడి’.. సోషల్ మీడియాలో గాలం.. 15 మందిని పెళ్లి చేసుకొని..
చెన్నై: ఓ మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందిని వివాహం చేసుకుని మోసం చేసింది. ఈ ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది.. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని వాణియంపాళయం గ్రామానికి చెందిన అరుల్‌రాజ్ (25) చెరుకు కార్మికుడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం సాఫీగా సాగింది. అరుల్‌రాజ్ చెరుకు చెట్లు నరికే పనుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు.. ఆ సమయంలో ఆ మహిళ తన బంధువుల వద్దకు వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిపోయేది. ఈక్రమంలో 3 నెలల క్రితం అరుల్‌రాజ్ తన చెల్లెలు పెళ్లి కోసం 7 సవర్ల నగలు, రూ.90 వేల నగదు ఇంట్లో ఉంచాడు. ఈ డబ్బును తీసుకుని అరుల్‌రాజ్ భార్య వెళ్లిపోయింది. ఎన్ని రోజులకూ రాకపోవడంతో గతంలో ఆమె చిరునామాకు వెళ్లి ఆరాతీశాడు. అయితే అది నకిలీ అడ్రస్ అని తేలింది. ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ కూడా వేరొకరిదని తేలింది. దీంతో అరుల్‌రాజ్ బన్రూటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అరుల్‌రాజ్‌ను వివాహం చేసుకున్న మహిళ వేలూరు, కోయంబత్తూరు, తిరువణ్ణామలై, ఈరోడ్‌కు చెందిన 15మంది యువకులను వివాహం చేసుకుని మోసగించినట్లు తేలింది. సోషల్ మీడియా ద్వారా యువకులతో పరిచయం పెంచుకోవడం, ఆ తరువాత పెళ్లి చేసుకుని వారి నగదు, నగలతో ఉడాయించడం ఆమెకు అలవాటని స్పష్టమైంది. ఆమెను వివాహం చేసుకున్న వారు కూడా గతంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ మహిళ కోసంగాలిస్తున్నారు. చదవండి: పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో -
ఇంజిన్ లేని బైక్‌కు జరిమానా
సాక్షి, చెన్నై: ఇంజిన్ లేని మోటార్ బైక్‌ను తోసుకుంటూ వచ్చిన యువకుడికి ఓ ఎస్ఐ రూ.వెయ్యి జరిమానా విధించి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆ ఎస్ఐకి డీఎస్పీ మెమో ఇచ్చారు. తమిళనాడు, కడలూరు జిల్లా భువనగిరి తాలుకా సేత్తియాతోపు గ్రామానికి చెందిన శక్తివేల్ తన మోటార్ సైకిల్‌ను మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం మెకానిక్ షాపునకు తరలించారు. అక్కడ ఇంజిన్ భాగాన్ని మెకానిక్ విప్పేయగా, సమీపంలోని వాగులో తన మోటార్ సైకిల్‌ను శుభ్రం చేయడానికి శక్తి వేల్ నిర్ణయించాడు. ఇంజిన్ లేని ఆ మోటార్ సైకిల్‌ను తోసుకుంటూ వాగు వద్దకు వెళ్తున్న శక్తివేల్‌ను ఎస్ఐ రత్నవేల్ అడ్డుకున్నాడు. పేపర్లు చూపించాలని, హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించాడు. అయితే, తాను మరమ్మతులకు గురైన ఇంజిన్ లేని మోటార్ సైకిల్‌ను తోసుకొచ్చానని, జరిమానా చెల్లించబోనని చెప్పాడు. అయితే, ఎస్ఐ దూకుడు ప్రదర్శించడంతో చివరకు ఆ దృశ్యాలను తన మొబైల్ కెమెరాలో శక్తివేల్ చిత్రీకరించాడు. తనకు ఎలక్ట్రానిక్ మెషిన్ రశీదు ఇస్తే వెయ్యి చెల్లిస్తానని చెప్పేశాడు. ఆ ఎస్ఐ మరీ దూకుడుగా వ్యవహరించడంతో ఆ వీడియో దృశ్యాల్ని వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లోకి శక్తివేల్ ఎక్కించాడు. ఇది మరింత హల్చల్ కావడంతో ఎస్ఐ తీరుపై డీఎస్పీ జవహర్లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీంతో మెమో జారీ చేశారు. కాగా, వీరంగం ప్రదర్శించిన ఆ ఎస్ఐ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. -
తమిళనాడులో మరో బస్సు ప్రమాదం
కడలూరు: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు- సిమెంట్ లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. తిరుచ్చి-చెన్నై రాష్ట్ర రహదారిపై ఈ సంఘటన జరిగింది. బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు డ్రైవర్ దాటించేందుకు ప్రయత్నించినపుడు లారీని ఢీకొంది. గాయపడిన వారిని పెరాంబలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అందంగా లేడని.. రుబ్బు రోలుతో..
-
అందంగా లేడని.. రుబ్బు రోలుతో..
కడలూరు: భర్త అందంగా లేడని తీవ్ర అసంతృప్తి చెందిన ఓ నవ వధువు పెళ్లయిన వారం రోజులకే అతడిని దారుణంగా చంపేసింది. తమిళనాడు రాష్ట్రం కడలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకుడు(25)తో వారం రోజుల క్రితం యువతి(22)కు వివాహమయింది. పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఆమె చాలా అసంతృప్తితో ఉంటోంది. భర్త ఆమెకు సరైన జోడు కాడని ఆమె స్నేహితులు, బంధువులు అంటుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్తతో గొడవ పడింది. తీవ్ర కోపంతో ఉన్న ఆమె భర్త తలపై రుబ్బు రోలుతో కొట్టి చంపేసింది. మంగళవారం ఉదయం తన భర్తను ఎవరో చంపేశారంటూ పెద్ద పెట్టున రోదించ సాగింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు విచారించి.. నవ వధువే నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
ఫేస్బుక్లో మహిళకు అశ్లీల ఫొటోలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్బుక్లో మహిళకు అశ్లీల ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నెల్లికుప్పానికి చెందిన ఓ యువతి బన్రుట్టి పట్టణంలోని ఒక ప్రైవేటు దుకాణంలో పనిచేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా చాటింగ్ చేయడం ఆమెకు అలవాటు. తూత్తుకూడికి చెందిన హరిహరన్, ప్రభాకరన్ ఆమెకు ఫేస్బుక్ స్నేహితులు. అలాగే సెల్‌ఫోన్ ద్వారా కూడా వీరికి ఆమెతో స్నేహం ఉంది. కొన్ని నెలలుగా ఈ ఇద్దరి స్నేహానికి ఆమె దూరంగా ఉంటోంది. దీంతో ఆమె ఫేస్‌బుక్‌కు ఈ ఇద్దరు యువకులు ఇటీవల అశ్లీల చిత్రాలను పంపుతూ బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకులను గురువారం అరెస్ట్ చేశారు.