చెన్నై: ఓ మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందిని వివాహం చేసుకుని మోసం చేసింది. ఈ ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది.. కడలూరు జిల్లా బన్‌రూటి సమీపంలోని వాణియంపాళయం గ్రామానికి చెందిన అరుల్‌రాజ్ (25) చెరుకు కార్మికుడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం సాఫీగా సాగింది.
అరుల్‌రాజ్ చెరుకు చెట్లు నరికే పనుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు.. ఆ సమయంలో ఆ మహిళ తన బంధువుల వద్దకు వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిపోయేది. ఈక్రమంలో 3 నెలల క్రితం అరుల్‌రాజ్ తన చెల్లెలు పెళ్లి కోసం 7 సవర్ల నగలు, రూ.90 వేల నగదు ఇంట్లో ఉంచాడు. ఈ డబ్బును తీసుకుని అరుల్‌రాజ్ భార్య వెళ్లిపోయింది.
ఎన్ని రోజులకూ రాకపోవడంతో గతంలో ఆమె చిరునామాకు వెళ్లి ఆరాతీశాడు. అయితే అది నకిలీ అడ్రస్ అని తేలింది. ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ కూడా వేరొకరిదని తేలింది. దీంతో అరుల్‌రాజ్ బన్‌రూటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అరుల్‌రాజ్‌ను వివాహం చేసుకున్న మహిళ వేలూరు, కోయంబత్తూరు, తిరువణ్ణామలై, ఈరోడ్‌కు చెందిన 15మంది యువకులను వివాహం చేసుకుని మోసగించినట్లు తేలింది.
సోషల్ మీడియా ద్వారా యువకులతో పరిచయం పెంచుకోవడం, ఆ తరువాత పెళ్లి చేసుకుని వారి నగదు, నగలతో ఉడాయించడం ఆమెకు అలవాటని స్పష్టమైంది. ఆమెను వివాహం చేసుకున్న వారు కూడా గతంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ మహిళ కోసంగాలిస్తున్నారు.
చదవండి: పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో
Comments
Please login to add a commentAdd a comment