భూపాలపల్లి/మేడిపల్లి(కరీంనగర్), న్యూస్‌లైన్ : షిర్డీలో పసిపాప పుట్టువెంట్రుకలు తీరుుంచుకుని వస్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. తిరుగు ప్రయూణంలో అదుపుతప్పిన జైలో వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి నలుగురు మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా మేడి పల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనతో భూపాలపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నారుు.
పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసముండే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గోనె వీరయ్య(65)కు సరోజన(60) దంపతులకు కుమారులు సంజీవ్, సురేష్, మహేందర్ ఉన్నారు. సంజీవ్, మహేందర్ పట్టణ ప్రధాన రహదారిపై సాయిశ్రీ రెడిమేడ్ డ్రెస్సెస్, సురేష్ సాయిమణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంజీవ్‌కు భార్య సువర్ణ, కుమారుడు సాయిచరణ్, కుమార్తె సాయిశ్రీ ఉండగా, సురేష్‌కు భార్య అనూష(26), కుమార్తెలు సాత్విక, శిరీక, మహేందర్‌కు భార్య రేణుక, కుమార్తెలు సంధ్య, నిషిత(8 నెలలు) ఉన్నారు. వీరంతా సాయిబాబా దర్శనానికి ప్రతి ఏటా షిర్డీకి వెళ్లి వస్తుంటారు.
ఈ ఏడాది మహేందర్ కుమార్తె నిషితకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకుని ఆదివారం షిర్డీకి బయల్దేరారు. నాలుగు కుటుంబాలకు చెందిన 14 మంది తమ షాపులో పనిచేసే ఎర్రగట్ల వెంకటేశ్వర్లును వెంటబెట్టుకుని తమ జైలో వాహనంలో షిర్డీకి వెళ్లారు. బాబాను దర్శించుకున్న తర్వాత సోమవారం మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు. అదేరోజు రాత్రి కరీంనగర్ జిల్లా కోరుట్ల సాయిబాబా ఆలయంలో నిద్రించి మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకు భూపాలపల్లికి బయల్దేరారు.
అయితే సరిగ్గా 15 నిమిషాలు కూడా గడవకముందే మేడిపల్లి మండల కేంద్రం మీదుగా వెళ్లే 63వ జాతీయ రహదారిలోని పెట్రోల్‌బంక్ సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంటి పెద్దలు వీరయ్య, సరోజన అక్కడికక్కడే మృతి చెందా రు. మిగిలినవారికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అనూష, నిషిత చికి త్స పొందుతూ మృతిచెందారు.
మిగతా వారందరికీ తీవ్ర గాయాలయ్యా యి. చిన్నపిల్లలకు దెబ్బలు పైకి కనిపించకపోయినా వారికి చికిత్స చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడం, వణుకుతుండ డంతో అంతర్గతంగా దెబ్బలు తగిలి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలు కాగా, మహేందర్, సురేష్, సంజీవ్ తల, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రేణుకకు ముఖంపై తీవ్ర గాయమైం ది. సువర్ణకు కంటిపై గాయమైంది. క్షతగాత్రులను కరీంనగర్‌లోని మూడు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మహేం దర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భారీగా తరలిన భూపాలపల్లివాసులు..
వీరయ్య కుమారులు సంజీవ్, సురేష్, మహేందర్ ఎలక్ట్రానిక్స్, డ్రెస్సెస్ షాపులు నడుపుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవారు. సమాచారం అందుకున్న వెంటనే వ్యాపారులు, స్నేహితులు కరీంనగర్‌కు భారీగా తరలివెళ్లారు. ఈ ఘట నతో పట్టణం ఒక్కసారిగా మూగబోయింది. ఎవరి నోట విన్నా ఇదే ప్రమాదంపై చర్చిస్తూ బాధను వెలిబుచ్చారు.
ఇంటికి చేరిన మృతదేహాలు.. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు..
ప్రమాదంలో మృతిచెందిన నలుగురి మృతదేహాలను బంధువులు మంగళవారం రాత్రి 6.30 గంటలకు భూపాలపల్లికి తీసుకొచ్చారు. మృతులు వీరయ్య, సరోజన, అనూష, నిష్‌కు కనీసం దహన సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులంతా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో ఉండడంతో పట్టణవాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలు భూపాలపల్లికి చేరుకున్నాయన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి కంటతడి పెట్టారు.
భగవంతుడి సన్నిధికి...
Published Wed, Jan 29 2014 3:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement