ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..
న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో.
ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది.
12 పండ్లే ఎందుకంటే..
ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి.
ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం.
(చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!)
Comments
Please login to add a commentAdd a comment