jng
-
’గోళ్లు’మాల్
వివాదాస్పదంగా చిరుతపులి చర్మం కేసు పులిగోళ్లను కొన్న టీడీపీ నేతలు కేసు మాఫీకి యత్నాలు రంగంలోకి జిల్లా ఎంపీ నోరుమెదపని అటవీ అధికారులు జంగారెడ్డిగూడెం : ఇటీవల జంగారెడ్డిగూడెంలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న చిరుతపులి చర్మం కేసు వివాదాస్పదమైంది. ఈ కేసులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో చిరుత పులి గోళ్లు ఏమయ్యాయో అటవీశాఖాధికారులు వెల్లడించలేదు. దీనికి కారణం ఆ గోళ్లను స్థానిక టీడీపీ నాయకులు కొనుగోలు చేయడమే. దీనిని అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. విషయం బయటకు పొక్కకుండా జిల్లాకు చెందిన ఓ ఎంపీ రంగప్రవేశం చేశారు. అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చి విషయం బయటకు రాకుండా చేశారు. స్థానిక టీడీపీ నాయకులు చిరుతపులి గోళ్లను కొని పైస్థాయి నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాక చిరుతపులి గోళ్లను ఎవరి నుంచి కొన్నారో ఆ వ్యక్తిని బయటకు రాకుండా ఏలూరు ఆసుపత్రిలో చేర్చి వైద్యం నెపంతో దాచారు. అసలు జరిగిందేమిటంటే..! దొరమామిడికి చెందిన బవిరిశెట్టి పవన్‌కుమార్ తన వద్ద చిరుత చర్మం ఉందని, అమ్మతానని ఫేస్బుక్లో పెట్టడంతో అటవీశాఖాధికారులు వలపన్ని చర్మం కొనుగోలుదారులుగా మారి ఈనెల 1న స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టుకున్నారు. అతని వద్ద చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించగా బుట్టాయగూడెం మండలం మోతుగూడెం అటవీ ప్రాంతంలో గిరిజనుల నుంచి రూ. 50వేలకు కొన్నట్టు చెప్పాడు. దీంతో అధికారులు మోతుగూడెంకు చెందిన కెచ్చెల రాంబాబు, గోగుల సోమిరెడ్డి, కెచ్చెల సోమిరెడ్డి, గూగుంట్ల పండయ్య, గూగుండ్ల చిన్నారెడ్డి, గోగుల శ్రీను, కోర్సావారిగూడెంకు చెందిన పూనెం నాగేశ్వరరావులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన గిరిజనులు గత ఏడాది ఆగస్టులో పాతమోతుగూడెం అడవిలో పశువుల పాక వద్ద ఆవుపై చిరుతపులి దాడి చేయడంతో బాణాలతో చిరుతను కొట్టి చంపి చర్మాన్ని , గోళ్లను వేరుచేసి మృతదేహాన్ని మరికొయ్యబాట వద్ద ఖననం చేసినట్లు వెల్లడించారు. చిరుతపులి చర్మం బవిరిశెట్టి పవన్‌కుమార్ కొనగా, గోళ్లను మరొక వ్యక్తి కొన్నారని వివరించారు. గోళ్లను కొన్న వ్యక్తి మధ్యవర్తుల ద్వారా జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులకు 18 గోళ్లను రూ.2లక్షలకు అమ్మినట్టు సమాచారం. స్థానిక నాయకులు ఆ గోళ్లను పైస్థాయి టీడీపీ నాయకులకు బహుమతిగా పంపారని తెలిసింది. వాస్తవానికి పులిగోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో వేసి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను వాడరు. స్థానిక నాయకులు పులిగోళ్లు అని పైస్థాయి నాయకులకు బహుమతి ఇచ్చి బురిడీ కొట్టించారని సమాచారం. అధికారుల మౌనం ఇదిలా ఉంటే అటవీశాఖాధికారులు మాత్రం చిరుతపులి గోళ్లు వివరాలపై నోరు మెదపడం లేదు. చిరుతపులి గోళ్లను అమ్మిన వ్యక్తిని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స నెపంతో చేర్చి రహస్యంగా దాచారు. గోళ్లు కొన్న విషయం బయటకు పొక్కకుండా జిల్లా ఎంపీ రంగప్రవేశం చేసి అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1972 వన్య ప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం ఘటనలో కారకులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలి. అయితే ఆవుపై దాడిచేసిన చిరుతను చంపిన ఏడుగురు గిరిజనులు, చర్మం అమ్మేందుకు యత్నించిన వ్యక్తిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. గోళ్లు ఏమయ్యాయి. ఎవరు కొని ఎవరికి అమ్మారు అనేది అధికారులు చెప్పడం లేదు. అయితే గిరిజనులు మాత్రం గోళ్లను ఎవరికి అమ్మింది అధికారులకు చెప్పినా ఆ వ్యక్తి వివరాలు వెల్లడించడం లేదు. ఆ వ్యక్తినే టీడీపీ నాయకులు దాచిపెట్టి కేసు మాఫీకి పెద్ద ఎత్తున యత్నిస్తున్నారని తెలుస్తోంది. విచారిస్తున్నాం: చిరుతపులి గోళ్లు ఏమయ్యాయనేది విచారిస్తున్నాం. గోళ్లను గిరిజనులు ఏం చేశారనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి పులి గోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో పెట్టి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను ధరించరు. ఒకవేళ ఆ గోళ్లను ఎవరైనా కొంటే వాళ్లు పిచ్చివాళ్లే. రవికుమార్, కన్జర్వేటర్, అటవీశాఖ -
మద్ది క్షేత్రంలో వైఎస్సార్ సీపీ హోమాలు
జంగారెడ్డిగూడెం రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆయుష్షు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని దీవెన్ హోమ్ హాస్టల్లో100 మంది చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు, పెన్నులు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. శ్రీనివాసపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తగరం వెంకటేష్‌కు నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు. -
జలక్రీడలకు కేంద్రంగా ఎర్రకాలువ జలాశయం
జలక్రీడలకు అనువుగా జలాశయం గుర్తింపు కార్యరూపం దాల్చితే జలాశయానికి మహర్ధశ ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తింపు జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర క్రీడల అభివృద్ధికి ప్రతిపాదనలు జంగారెడ్డిగూడెంః జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలక్రీడలకు కేకేఎం ఎర్రకాలువ జలాశయం అనువుగా ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఎర్రకాలువ జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలకు నిర్వహణ చర్యలు తీసుకుంటుంది. అక్టోబర్‌లో కేరళకు చెందిన రోయింగ్ శిక్షకుడు ద్రోణాచార్యఅవార్డు గ్రహీత జోస్జాకబ్, కనోయింగ్ కయాకింగ్ శిక్షకుడు అర్జునఅవార్డు గ్రహీత ఎస్సీజీ కుమార్‌తో కూడిన నిపుణుల బృందం, రాష్ట్రంలో కృష్ణాగోదావరి నదుల్లో జలక్రీడలు నిర్వహించేందుకు వాటిని అభివృద్ధి చేసేందుకు అవకాశాలపైన, సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజయవాడ కృష్ణనది పున్నమిఘాట్, నాగాయలంక కృష్ణాతీరం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం వీటికి అనువుగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీనిఇకి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్దం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జలక్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తుంది. జలక్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, క్రీడాపరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కల్పించేందుకు త్వరలో ప్రాజెక్టు నివేదికను తయారుచేయనున్నట్లు తెలిసింది. పర్యాటక కేంద్రంగా ఎర్రకాలువ జలాశయంః కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని ప్రభుత్వం 2013లో పర్యాటక కేంద్రంగా గుర్తించింది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 3.20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో జలాశయం వద్ద రెస్టారెంట్, వసతిగృహాలు, జలాశయం లో బోటింగ్ కోసం వెచ్చించనుంది. అయితే నిధులు లేమి కారణంగా పనులు సజావుగా సాగడం లేదు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తించి పనులు నిర్వహిస్తుండగా , తాజాగా ఈ జలాశయాన్ని జలక్రీడల అభివృద్దికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడలు ఇవేః ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్దిలో భాగంగా సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలు నిర్వహించనున్నారు. వీటిలో క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తారు. జలక్రీడలకు అనువైన ప్రాంతంగా జలాశయాన్ని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే ఎర్రకాలువ జలాశయాన్కి మహర్ధశ పట్టినట్లే ఈ జలక్రీడల అభివృద్ధికి న్యూజిలాండ్‌నుంచి సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం న్యూజిలాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. -
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ’ -
బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు
జంగారెడ్డిగూడెం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్లో ఇటీవల ఎన్కౌంటర్ జరగడం, మావోయిస్టులు ఈనెల3న బంద్‌కు పిలుపునివ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. బాంబ్ స్క్వాడ్‌తో ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాలుగు రోజలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది ఏఆర్ ఎస్ఐ ఎబినేజర్, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, అఖిల్, బాలకృష్ణ ఈ తనిఖీలు నిర్వహించారు. శనివారం జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్, పారిజాతగిరి దేవాలయం, గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం, చింతలపూడి బస్టాండ్లలో బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతికార చర్యకు పాల్పడే ఆస్కారం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ల పరిధిలోని ప్రధానమైన, జనసమ్మర్ధం ఉండే సుమారు 75 ప్రాంతాలను గుర్తించి అణువణువూ తనిఖీలు చేశారు. -
శివ శివా
జంగారెడ్డిగూడెం రూరల్/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
శివ శివా
జంగారెడ్డిగూడెం రూరల్/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు