మద్ది క్షేత్రంలో వైఎస్సార్ సీపీ హోమాలు
మద్ది క్షేత్రంలో వైఎస్సార్ సీపీ హోమాలు
Published Fri, Dec 30 2016 11:22 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
జంగారెడ్డిగూడెం రూరల్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆయుష్షు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని దీవెన్ హోమ్ హాస్టల్‌లో100 మంది చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు, పెన్నులు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. శ్రీనివాసపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తగరం వెంకటేష్‌కు నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు.
Advertisement
Advertisement