maddi
-
మద్ది క్షేత్రంలో వైఎస్సార్ సీపీ హోమాలు
జంగారెడ్డిగూడెం రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆయుష్షు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని దీవెన్ హోమ్ హాస్టల్లో100 మంది చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు, పెన్నులు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. శ్రీనివాసపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తగరం వెంకటేష్‌కు నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు. -
మద్ది ఆదాయం రూ.23.33 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్చార్జి తనిఖీదారు ఆర్.బాలాజీ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 30 రోజులకు గాను రూ.23,33,731 ఆదాయం వచ్చిందని, దీనిలో నోట్లు రూ.21,34,916, నాణాలు రూ.1,98,815, 3 విదేశీ కరెన్సీ నోట్లు, ఒక అమెరికన్ డాలర్ లభించాయని చెప్పారు. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయానికి ఈసారి రూ.11,96,165 అధికంగా ఉందన్నారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. -
మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పర్యవేక్షణలో అర్చకుల బృందం ఈ పూజా కార్యక్రమాలు జరిపింది. టి.నర్సాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన బాలభక్త భజన సమాజం సభ్యులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒక్కరోజు ఆదాయం రూ.1,62,465 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. రావికంపాడుకు చెందిన కనుమూరి భవ్య రూ.10,116 విరాళాన్ని ఆలయానికి అందజేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మద్దిక్షేత్రంలో సువర్చలా హనుమత్ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. నోట్ల రూపంలో రూ.15,78,406, నాణేల రూపంలో రూ.1,27,862, 3 విదేశీ కరెన్సీలు లభించాయి. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ఈవో యాళ్ల శ్రీథర్ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, నోవా విద్యార్థులు, కరూర్ వైశ్యాబ్యాంక్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. -
చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు
► మద్దిలో అల్లు శిరీష్ సందడి ► చిరు సినిమా విజయం సాధించాలని పూజలు జంగారెడ్డిగూడెం : సినీ నటుడు అల్లు శిరీష్ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. మెగాస్టార్ చిరంజీవి నవ జన్మదిన మహోత్సవాలను జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అల్లు శిరీష్ విచ్చేసి ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులపూజ, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం శిరీ ష్ మాట్లాడుతూ చిరంజీవి 150వ సినిమా ఘన విజయం సాధించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తూ మద్ది అంజన్నకు పూజలు చేసినట్టు చెప్పారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, గౌరవ అధ్యక్షుడు మద్దాల ప్రసాద్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.