చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు | allu sirish visited maddi | Sakshi
Sakshi News home page

చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు

Published Sun, Aug 21 2016 3:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు

చిరు కోసం అల్లు హీరో ప్రత్యేక పూజలు

► మద్దిలో అల్లు శిరీష్‌ సందడి
► చిరు సినిమా విజయం సాధించాలని పూజలు
జంగారెడ్డిగూడెం : సినీ నటుడు అల్లు శిరీష్‌ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. మెగాస్టార్‌ చిరంజీవి నవ జన్మదిన మహోత్సవాలను జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా అల్లు శిరీష్‌ విచ్చేసి ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులపూజ, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం శిరీ ష్‌ మాట్లాడుతూ చిరంజీవి 150వ సినిమా ఘన విజయం సాధించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తూ మద్ది అంజన్నకు పూజలు చేసినట్టు చెప్పారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు,  గౌరవ అధ్యక్షుడు మద్దాల ప్రసాద్, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement