మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు | maddi anjannaku poojalu | Sakshi
Sakshi News home page

మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు

Published Sun, Nov 13 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు

మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పర్యవేక్షణలో అర్చకుల బృందం ఈ పూజా కార్యక్రమాలు జరిపింది. టి.నర్సాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన బాలభక్త భజన సమాజం సభ్యులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒక్కరోజు ఆదాయం  రూ.1,62,465 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. రావికంపాడుకు చెందిన కనుమూరి భవ్య రూ.10,116 విరాళాన్ని  ఆలయానికి అందజేశారు. ఆలయ చైర్మన్‌ ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మద్దిక్షేత్రంలో సువర్చలా హనుమత్‌ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement