మద్ది ఆదాయం రూ.23.33 లక్షలు
Published Wed, Nov 30 2016 6:46 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్‌చార్జి తనిఖీదారు ఆర్.బాలాజీ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. 30 రోజులకు గాను రూ.23,33,731 ఆదాయం వచ్చిందని, దీనిలో నోట్లు రూ.21,34,916, నాణాలు రూ.1,98,815, 3 విదేశీ కరెన్సీ నోట్లు, ఒక అమెరికన్ డాలర్ లభించాయని చెప్పారు. గతేడాది కార్తీకమాసంలో వచ్చిన ఆదాయానికి ఈసారి రూ.11,96,165 అధికంగా ఉందన్నారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement