![Maha Kumbh Chaiwala earning 5,000 profit in a day by selling tea](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/mahakumbh-chaiwala.jpg.webp?itok=Fz_AlsK1)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?
మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్‌ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.
కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్)
స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు.
ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment