bussiness
-
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం
ప్రస్తుతమున్న రోజుల్లో అందరూ అధిక ఆదాయాన్ని సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకు తగిన ప్రయాత్నాలు కూడా చేస్తుంటారు. దీనిలో కొందరు సఫలమవుతుంటారు. మరికొందరు విఫలమవుతుంటారు. అయితే ప్రస్తుత శీతాకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయమిచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం.ఇటీవలి కాలంలో చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి ప్రభుత్వసాయం కూడా అందుతుంది. అందుకే అధిక లాభాలనిచ్చే అల్లంసాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం అనేది టీలో వినియోగించడం మొదలుకొని కూరలలో వేసేవరకూ అన్నింటా ఉపయుక్తమవుతుంది. అందునా చలికాలంలో అల్లాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో కూరలు వండేటప్పుడు అల్లాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు.అల్లాన్ని నీటి ఆధారితంగా సాగు చేస్తుంటారు. హెక్టారు భూమిలో అల్లం సాగుచేయాలనుకుంటే రెండు క్వింటాళ్ల నుండి మూడు క్వింటాళ్ల వరకూ విత్తనాలు అవసరమవుతాయి. సాగు సమయంలో సరైన గట్లను సిద్ధం చేసుకోవాలి. సరైన కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అల్లం సాగుకు నీరు సక్రమంగా అందుతుంది. నీరు నిలిచిపోయే పొలాల్లో అల్లం సాగు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అల్లం సాగుకు పీహెచ్(పొండస్ హైడ్రోజెని) 6 నుండి పీహెచ్ 7 వరకు ఉన్న భూమి మెరుగైనదిగా పరిగణిస్తారు.అల్లం మొక్కల మధ్య దూరం 25 నుండి 25 సెం.మీ మధ్య ఉండాలి. విత్తనాల మధ్య దూరం 30 నుండి 40 సెం.మీ మధ్య ఉండాలి. సమయానుసారంగా ఆవు పేడను ఎరువు మాదిరిగా వేయాలి. అల్లం పంట చేతికి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అల్లం మంచి ధరలకు అమ్ముడవుతోంది. ఒక హెక్టారుకు అల్లం దిగుబడి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు ఉంటుంది. దీనిని విక్రయించడం ద్వారా లక్షల రూపాయాల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇది కూడా చదవండి: 10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే! -
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
వుయ్‌వర్క్ దివాలా!
న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి. అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ .. గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు. సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రభావం ఉండదు.. వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..
ప్రస్తుతం కుబేరులుగా.. సక్సెస్ పీపుల్స్‌గా చెప్పుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త 'రాజా నాయక్'. ఈయనెవరో, ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్ ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాడు. తండ్రికి సంపాదన లేదు, తల్లి బ్రతకడానికి చాలా కష్టపడింది. కష్టాలు భరించలేక 17 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాజా ముంబై చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయం ఉన్నత చదువు లేని కారణంగా ఎలాంటి ఉద్యోగం లభించలేదు. కానీ అతనికి.. అతనిమీద ఉన్న దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలని సంకల్పించుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో, డబ్బు కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించాడు. జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. తన కృషి, అంకితభావం వల్ల ఫుట్‌పాత్‌లోని తన చిన్న దుకాణం బాగా నడిచే స్థాయికి చేరింది. వ్యాపార రంగంలో మరిన్ని అడుగులు వేయడానికి కంకణం కట్టుకున్న రాజా నాయక్ అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కొత్త వ్యాపారాలు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, ఇది కాకుండా బాటిల్ డ్రింకింగ్ వాటర్ వెంచర్ జల బేవరేజెస్ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఈయన తన వ్యాపారాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! ప్రస్తుతం ఈయన రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన సమాజంలోని అణగారిన వర్గాల కోసం విద్యా సంస్థలను నడుపుతున్నాడు. ప్రస్తుతం రాజా నాయక్ కర్ణాటకలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
ఉత్పాదకతకు ఊపు
కంచర్ల యాదగిరిరెడ్డి : అదండీ విషయం...ఈ రోజుల్లో మీకు ఏం కావాలన్నా క్షణంలో సమాచారంతో పాటు మీకు కావాల్సింది ఇచ్చే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు పుట్టుకొచ్చేశాయి. ఏడాది క్రితం చాట్ జీపీటీ విడుదలతో మొదలైన కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు ఇప్పుడు ఓ ప్రభంజనంలా మారిపోయాయి. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అమ్మకాలు ఎక్కువవుతాయని, సాధారణ వినియోగదారులకూ లాభమని అంటున్నారు. బాగానే ఉంది కానీ, ఇది ఎంతవరకూ నిజం? వాటికంటూ విలువ కట్టగలమా? అవును అంటోంది .అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే! భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి ఏటా కనీసం 2.6 లక్షల కోట్ల నుంచి 4.4 లక్షల కోట్ల డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుందని తెలిపింది. చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా.. జనరేటివ్ ఏఐ మొదలై ఏడాది కూడా కాలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం ఎలా చూపగలదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మెకిన్సే అంచనా ప్రకారం ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటినుంచే వేగం పుంజుకుంటుందని 2030– 2060 మధ్యకాలంలో చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయని చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న పనుల్లో సగం 2030 నాటికల్లా ఆటోమేటిక్ అవుతాయని తెలిపింది. మునుపటి అంచనాల కంటే ఇది పదేళ్లు తక్కువ కావడం గమనార్హం. కార్మికుల ఉత్పాదకత విషయానికి వస్తే 2040 నాటికి ఇది ఏటా 0.1 –0.6 శాతం పెరుగుతుందని కాకపోతే చేసే పనులు మారిపోతాయి కాబట్టి ఆ మార్పునకు అనుగుణంగా కారి్మకులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సాయం అందించాల్సి ఉంటుందని మెకిన్సే తెలిపింది. ఒకవేళ అన్ని రంగాల్లోనూ జనరేటివ్ ఏఐ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మాత్రం పనుల ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత 0.2 –3.3 శాతం వరకు పెరుగుతుంది. బ్యాంకింగ్, జీవశాస్త్రంలో ఎక్కువ ప్రభావం! లక్షల కోట్ల మాట కాసేపు పక్కనపెడితే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు అన్ని రంగాల్లోనూ చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే బ్యాంకింగ్, జీవశాస్త్రంలో కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందని మెకిన్సే అంచనా వేసింది. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఈ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరిగి ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ లాభం చేకూరుతుందని తేలింది. ఇక రిటైల్, కన్సూ్యమర్ ప్యాకేజ్డ్ గూడ్స్లలో జనరేటివ్ ఏఐని పూర్తిస్థాయిలో వాడితే కలిగే లాభం రూ.60 వేల కోట్లకు పైమాటే. ఇక ఈ కృత్రిమ మేధ వాడకం కేవలం లాభాలకు మాత్రమే పరిమితం కాదు. చేసే పని తీరుతెన్నులు కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి చాలా సాధారణంగా చేసే పనులన్నింటినీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ వారి ఉత్పాదకతను పెంచుతుంది. మెకిన్సే లెక్కల ప్రకారం మనుషులు చేసే వాటిల్లో 60 నుంచి 70 శాతం పనులను ఏఐలు ఆటోమేటిక్‌గా చేయగలవు. చాట్ జీపీటీ లాంటి వాటికి భాషను అర్థం చేసుకోగల సామర్థ్యం కూడా ఉండటం వల్ల బోధన వంటి పనులకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఈ రంగాల్లో లాభాలెక్కువ జనరేటివ్ ఏఐతో అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా లాభాలూ పెరుగుతాయి. కానీ.. వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్, సేల్స్ రంగాలతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జీవశా్రస్తాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మెకిన్సే జరిపిన సర్వే ప్రకారం ఐదు వేల మంది సేల్స్ సరీ్వస్ ఉద్యోగులున్న కంపెనీలో జనరేటివ్ ఏఐ వాడకంతో ఒక్కో వినియోగదారుడి సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయం దాదాపుగా 10 శాతం తగ్గింది. కంపెనీ మొత్తమ్మీద చూస్తే గంటకు 14 శాతం ఎక్కువగా వినియోగదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే ‘మీ మేనేజర్‌ను పిలవండి..’అన్న ఫిర్యాదులు 25 శాతం వరకూ తగ్గిపోయాయి. వినియోగదారుల డిమాండ్లు, పనిఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు మానేయడం కూడా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇక మార్కెటింగ్, సేల్స్ రంగాల విషయానికి వస్తే జనరేటివ్ ఏఐ వినియోగంతో ఖర్చులు సగానికి సగం తగ్గడం మాత్రమే కాకుండా అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయి. మార్కెటింగ్‌కు అవసరమైన సమాచారాన్ని వేగంగా సృష్టించడం, ప్రాంతాలకు, ఒక్కో వినియోగదారుడికి తగి న విధంగా మార్చడం కూడా ఈ జనరేటివ్ ఏఐతో సాధ్యమవుతుందని, భాషల అంతరం తొలగిపోయి ఎవరికి కావల్సిన భాష లో సమాచారం ఈమెయిళ్ల రూపంలో ఠకీమని పంపవచ్చునని మెకిన్సే చెబుతోంది. జనరేటివ్ ఏఐకి ఉన్న మరో సామర్థ్యం సాఫ్ట్వేర్ కోడ్ రాయగలగడం. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే చిన్నచిన్న పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ, బగ్స్ ను తొలగించడం వంటివి సులువైపోతాయి. చివరగా పరిశోధనలకు ఫార్మా వైద్యం వంటి రంగాలకు జనరేటివ్ ఏఐ ఎంతో ఉపయోగకరం. ఈ రంగానికి ఏటా రూ.25 వేల కోట్ల విలువను జోడించగల సామర్థ్యం దీనికి ఉంది. అమెరికాలో పెరుగుతున్న చాట్ జీపీటీ వాడకం అమెరికాలో చాట్ జీపీటీ వాడకం ఊపందుకుంటోంది. స్టాటిస్టా జరిపిన సర్వే ప్రకారం జనవరిలో సొంత అవసరాల కోసం ఈ జనరేటివ్ ఏఐని వాడామని 12 శాతం మంది చెప్పగా, ఇతరులు వాడటం చూశామని 38 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మహిళలు మాత్రం తాము చాట్ జీపీటీ గురించి అస్సలు వినలేదని చెప్పారు. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ నెక్స్ట్ మూవ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ మార్కెట్ విలువ దాదాపుగా రెండు లక్షల కోట్ల డాలర్లు. హాలీవుడ్లో రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానంలో ప్రొడక్షన్ కంపెనీలు జనరేటివ్ ఏఐలను వాడరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు అవసరమైన స్క్రిప్ట్ లు రాయడం మొదలుకొని, మనుషులను పోలిన గొంతులను కూడా సృష్టించగలదీ జనరేటివ్ ఏఐ. స్నాప్‌చాట్ ఇప్పటికే యానిమేషన్ల కోసం జనరేటివ్ ఏఐని వాడటం మొదలుపెట్టగా.. ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. ఓరియో బిస్కెట్లు తయారు చేసే సంస్థ సినీ నటుడు ఫర్హాన్ అక్తర్, జనరేటివ్ ఏఐల సాయంతో సరికొత్త వాణిజ్య ప్రకటనను సృష్టించింది. -
రోజుకి 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగి.. డాక్టర్ చెప్పింది విని షాక్
-
ఐదేళ్లల్లో 5వేల కోట్ల లాభం..
-
కొత్తరంగంలోకి రిలయన్స్ ఐస్‌క్రీమ్
-
హీరో కాకపోయుంటే ఆ పని చేసేవాడిని: ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇందుకు రీసెంట్గా ఆయన ఇచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేనే నిదర్శనం. ఈ యంగ్ రెబల్ స్టార్ ఎపిసోడ్‌ను చూసేందుకు ఒకేసారి అంతా ఎగబడంతో ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇక అమ్మాయిల కలల రాకూమారుడైన ఈ డార్లింగ్ నాలుగు పదులు వయసులో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నాడు. ఆయన పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్ని కలిసి దాదాపు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత చలన చిత్ర రంగంలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయింటే ఎలా ఉండేది. ఆ ఊహే ఇబ్బంది పెడుతుంది కదా! మరి తను హీరో కాకపోయింటే ఏం చేయాలనుకున్నాడో ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు ప్రభాస్. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకపోయింటే వ్యాపారం రంగంలోకి అడుగుపెట్లేవాడిని అని చెప్పాడు. చదవండి: అవికా గోర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్ తాను అసలు హీరో అవుతానని అనుకోలేదన్నాడు. చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలని కలలు కనేవాడినని, అయితే అందులో హోటల్ బిజినెస్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేదన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ఏదైన వ్యాపారం చేయాలని చాలా ఆసక్తిగా ఉండేది. నేను మంచి ఫుడ్డి కాబట్టి హోటల్ బిజినెస్ చేయాలని అనుకున్నా. కానీ అప్పుడు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందువల్ల నేను అనుకున్న వ్యాపారం చేయాలేకపోయాను. ఆ తర్వాత చూస్తే ఇలా సినిమా రంగంలోకి వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభాస్ మంచి ఫుడ్డి అనే విషయం తెలిసిందే. అతడు చేపల పులుసు చాలా ఇష్టం తింటాడని ఆయన పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఓ ఇంటర్య్వూలో తెలిపింది. -
వ్యాపార రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా
బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన ఉనికి చాటుకుంది. బి-టౌన్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటుల్లో దీపికా ఒకరు. ఇకా ఆమె వెండితెర ఎంట్రీకి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా చాటింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా మెప్పించిన ఆమె.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్‌ను లాంచ్ చేసింది. చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్ 82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఆమె వీడియో విడుదల చేసింది. ‘రెండేళ్ల క్రితమే సెల్ప్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. ప్రస్తుతం దీన్ని మన దేశంలోనే లాంచ్ చేశాం. ఇక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తాం. ఇదే మా 82 ఈస్ట్’ అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దీపికా నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా షారుక్ ఖాన్‌తో పఠాన్ చిత్రంతో పాటు పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్-కెలో హీరోయిన్గా చేస్తోంది. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీంతో మహేశ్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటోంది. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఈ నేపథ్యంలో మహేశ్ SSMB 28 షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. మహేశ్ నటుడిగా, మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఆయన మరో సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఎషియన్ సినిమాస్‌తో కలిసి ఎఎమ్బీ సినిమాస్‌తో(AMB Cinemas) భాగస్వామిగా మారాడు. అలాగే టెక్స్టైల్స్ బిజినెస్‌లోనూ మహేశ్ అడుగుపెట్టారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ త్వరలో ఓ హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పేరు మీద ఈ హోటల్ ప్రారంభిచనున్నాడట. ఈ హోటల్‌కు మినర్వా ఎ.ఎన్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అతి త్వరలోనే హోటల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే మహేశ్ హోటల్ ప్రారంభించే యోచనలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వినిపించాయి. -
యూట్యూబ్‌తో లాభాలెన్నో.. ఇది తెలుసుకోండి
ఒకప్పుడు యూట్యూబ్ అంటే.. కేవలం వినోదం మాత్రమే!. మరి ఇప్పుడు.. వార్తలు.. వ్యాపారం.. విహారం అన్నీ అందులోనే. కానీ కొందరు కంటెంట్ క్రియేటర్లు.. ఇటు డబ్బు సంపాదనతోపాటు అటు సామాజిక సేవకూ తోడ్పడుతున్నారు. యూట్యూబ్ ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. దక్షిణ భారతంలో సమాజంపై తమ ప్రభావాన్ని చూపిన చానెళ్లలో కొన్ని ఇవీ.. సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో యూట్యూబ్ 2007లో మొదలుపెట్టిన పార్టనర్ షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. తమలోని కళ, నైపుణ్యాలను ప్రపంచానికి చూపేందుకు క్రియేటర్లు చానళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో క్రియేటర్లు ఎంతో కొంత ఉపాధి పొందడం మొదలైంది. కొందరు వంటలు చేయడం ద్వారా లక్షల మందిని ఆకర్షించి డబ్బులు వెనకేస్తుంటే.. మరికొందరు ఇంగ్లిషు పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ రెండేళ్ల క్రితం ఒక అధ్యయనం చేపట్టింది. యూట్యూబ్ క్రియేటర్ల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు చేకూరుతున్న మేలు ఏమిటనేదానిపై ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ విభాగంతో కలిసి అధ్యయనం చేసి.. ఇంపాక్ట్ రిపోర్ట్ రూపొందించింది. దాని ప్రకారం.. మన దేశంలో 6.83 లక్షల మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి లభించడానికి యూట్యూబ్ క్రియేటర్లు కారణమయ్యారు. వీరిద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 కోట్లు సమకూరినట్టు అంచనా వేశారు. యూట్యూబ్‌లోని 40 వేలకుపైగా చానళ్ల నిర్వాహకులు నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అలాంటి క్రియేటర్లు, చానళ్లలో కొన్ని ఇవి.. స్పోకెన్ ఇంగ్లిష్‌కు ‘కైజెన్ ఇంగ్లిష్’ తమిళనాడుకు చెందిన మలర్ సృష్టించిన చానల్ ఇది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీకి కూడా వెళ్లలేని మలర్.. దూరవిద్య కోర్సుల ద్వారానే డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత టీచర్‌గా ఉపాధి పొందారు కూడా. ఆ సమయంలో ఇంగ్లిష్ రాకపోవడం వల్ల తాను పడ్డ కష్టాలు ఇతరులకు రావొద్దన్న సంకల్పంతో ‘కైజెన్ ఇంగ్లిష్’ పేరిట యూట్యూబ్ చానల్ మొదలుపెట్టారు. తమిళంలో మాట్లాడుతూ ఇంగ్లిష్ భాషను బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ చానెల్‌కు 9.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానల్ ద్వారా కోచింగ్ పొందిన తాము ఉద్యోగ ఇంటర్వ్యూలను విజయవంతంగా ఎదుర్కొన్నామని, ఇతరులతో ఇంగ్లిషులో ధీమాగా మాట్లాడటం అలవాటు చేసుకున్నామని సబ్స్క్రైబర్లు చెప్తుండటం గమనార్హం. స్ఫూర్తినిచ్చే.. తెలుగు గీక్స్ ఆయన పేరు పోతుల ఫణిదీప్.. వైద్యుడు.. కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిలో పనిచేస్తుండగా వేళ్లు వణుకుతున్నట్టు గుర్తిం చారు. ‘అమయోట్రోపిక్ లాటెరల్ స్కెలరోసిస్ (ఏఎల్ఎస్)’ఉన్నట్టు తేలడంతో ఉద్యో గం వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఫణిదీప్ తన నిరాశ, నిస్పృహలను దూరం చేసుకునేందుకు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. వ్యక్తిత్వవికాసానికి దోహదపడే వీడి యోలు రూపొందించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాల విషయాలను తెలుసుకోండి ఉచితంగా.. అని తెలుగులో రాసిన కవర్‌పేజీతో వచ్చే తెలుగు గీక్స్‌కు దాదాపు 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫణిదీప్ నెలసరి ఆదాయం రూ.1.5లక్షలు. www.youtube.com/c/ TeluguGeeks/ featured ఎం4టెక్.. సైన్స్ పాఠాలతో.. పిల్లలకు ఆసక్తికర రీతిలో సైన్స్ పాఠాలు అందించే లక్ష్యంతో కేరళకు చెందిన జియోజోసెఫ్ మొదలుపెట్టిన చానల్ ఇది. సొంతంగా చేసుకోగల శాస్త్రీయ పరిశోధనలే ఈ చానల్ కంటెంట్. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో జోసెఫ్ తన మిత్రుడు ప్రవీణ్‌తో కలిసి మరింత కంటెంట్‌ను రెగ్యులర్‌గా అందించడం మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 74 లక్షలకు చేరుకుంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయమూ తెచ్చిపెడుతోంది. ఎం4టెక్ చానల్‌లోని వీడియోల స్ఫూర్తితో ఇప్పుడు విద్యార్థులు సైన్స్ పోటీలకు సిద్ధమవుతున్నారంటే దాని ప్రభావం ఏమిటన్నది అర్థమైపోతుంది. https://www.youtube.com/c/M4Techofficial అనాథలకు అన్నం పెడుతున్న నవాబ్స్ కిచెన్ తెలంగాణకు చెందిన ఖ్వాజా మొయినుద్దీన్ స్థాపించిన యూట్యూబ్ చానల్.. కేవలం వంటల గురించి చెప్పేది మాత్రమే కాదు, ఈ క్రమంలోనే అనాథల కడుపులూ నింపుతోంది. తమ చానల్లో ప్రసారం చేయడం కోసం.. పెద్ద మొత్తాల్లో బిరియానీ, పలావ్ వంటి వంటలు వండటం, తర్వాత ఆ వంటను అనాథ పిల్లలకు పంచి పెట్టడం.. ఇదీ నవాబ్స్ కిచెన్ పనిచేసే తీరు. ఖ్వాజా మొయినుద్దీన్ తన మిత్రులతో కలిసి ఈ చానల్ మొదలుపెట్టారు. ఉద్యోగం మానేయడంతోపాటు మరెన్నో సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగిన ఖ్వాజాకు ఇప్పుడు తన చానల్ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. అటు అనాథలకూ ఆహారం అందివ్వగలుగుతున్నాడు. ఇదీ చానల్ లింకు.. https://www.youtube.com/c/ NawabsKitchenFoodForAllOrphans - సాక్షి, హైదరాబాద్ -
మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా?
Samantha Announce Her New Bussiness: ఎంతో మంది సినీ తారలు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, మంచు ఫ్యామిలీ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి తదితర స్టార్ హీరోహీరోయిన్లు వ్యాపారంలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్య కూడా బిజినెస్‌లోకి దిగి రెస్టారెంట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. షోయు అనే పేరుతో హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. అంతేకాదు తన బిజినెస్ ప్రమోషన్లో చేస్తూ యాడ్ ద్వారా ప్రకటన ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టింది సమంత. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే ఇప్పటికే సాఖి అనే క్లాత్ బ్రాండ్‌తో పాటు ఎడ్యూకేషన్, రెస్టారెంట్ బిజినెస్‌లో రాణిస్తున్నా సామ్ తాజాగా మరో వ్యాపారంలో పెట్టుబుడులు పెట్టింది. ఉమెన్స్ డే సందర్భంగా తన కొత్త బిజినెస్‌ను అందరికి పరిచయం చేసింది. ఫ్లిప్ కార్ట్ తరహాలో సస్టైన్ కార్ట్ అనే ఓ ఈ కామర్స్ సంస్థను సమంత లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..‘సస్టైన్ కార్ట్‌లో ఇన్వెస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవల భారతదేశంలో కొనుగోలుదారులు నేచర్ ఫ్రెండ్లి ప్రొడక్ట్స్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ప్రొడక్ట్స్‌ని వారి అభిరుచికి తగ్గట్టుగా అందచేయడానికే ఈ సస్టైన్ కార్ట్’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. ఇటీవల నాగ చైతన్య తన కొత్త బిజినెస్ ప్రకటించిన కొద్ది రోజులకే సమంత కూడా తన కొత్త వ్యాపారాన్ని ప్రకటించడంతో ఆసక్తి నెలకొంది. దీంతో సామ్ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ భర్తకు పోటీగా సమంత తన కొత్త బిజినెస్‌ను ప్రకటించందూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటూ హీరోయిన్గా వరస సినిమాలు చేస్తూనే పలు వ్యాపారంలో కూడా సమంత యాక్టివ్‌గా ఉంటూ క్షణం తీరిక లేకుండ ఉన్న సామ్ కొత్త బిజినెస్‌ను అనౌన్స్ చేయడంతో ఇది చైతూకు పోటీగానే ఆమె ప్రకటించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ తర్వాత అరియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఆమె చేసిన వార్తల్లో నిలుస్తోంది. ఇక ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. యాంకర్‌గా కేరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే స్టార్డమ్తో బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టేంట్గా ఛాన్స్ కొట్టేసింది. హౌజ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో పాల్గోంటూ మిగతా కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక అరియానా కేరీర్‌పై దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జాగ్రత్త పడుతోంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ నానుడిని ఈ అమ్మడు చక్కగా వినియోగించుకుంటుంది. ఇటూ ఇంటర్వ్యూలు చేస్తూనే సెలబ్రేటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న అరియాన తాజాగా కొత్త బిజినేస్లోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ‘ఆర్య ఈవెంట్ ప్లానింగ్’ పేరుతో కొత్త బిజినెస్‌ను ప్రారంభించినట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
టీవీలన్నింటిల్లో ఇది స్పెషల్ టీవీ.. కింద నుంచి పైకి
ఇప్పటివరకూ చాలా టీవీలను చూసుంటారు.. మరి ఇలాంటిది.. అబ్బే చాన్సే లేదు.. ఫొటోలు చూస్తున్నారుగా.. అలా బటన్ నొక్కగానే.. అండర్‌గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది పైకి వస్తుంది.. నెమ్మదిగా అది ఐదు 4కే మైక్రో ఎల్ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ మీ హాల్లో ఠీవిగా ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ తయారుచేసిన ఈ టీవీ పేరు ఎం1. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్ టీవీ. హాల్లో అలా ఫ్లోర్‌లోంచి టీవీ పైకి రావడం వంటివి చూసి.. మీ ఇంటికి వచ్చినోళ్లు నోరెళ్లబెట్టడం ఖాయమని ‘సీ సీడ్’ కంపెనీ చెబుతోంది. పైగా.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే.. ఈ మైక్రో ఎల్ఈడీల్లో క్లారిటీ అదిరిపోవడం ఖాయమంటోంది. ఇంతకీ రేటెంతో చెప్పలేదు.. రూ.2.91 కోట్లే!!.. టీవీ కొనకముందే.. నోరెళ్లబెట్టేశారా.. ఇది జస్ట్ టీవీ రేటే.. ఆ అండర్‌గ్రౌండ్ సెట్టింగ్.. వాటన్నిటికీ అయ్యే ఇన్స్టలేషన్ చార్జీలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ చెబుతోంది.. ఓసారి ట్రై చేస్తారా ఏమిటి?? -
ఆన్లైన్లో జోంబీ వేషంతో..
బ్యాంకాక్: ఆన్లైన్లో బట్టల వ్యాపారం క్లిక్ అయ్యేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆమె భయంకరమైన వేషధారణతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన కనిట్టా థాంగ్నాక్(32) అనే మహిళ మరణించిన వారికి అవసరమైన వస్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించేది. అందుకోసం ఆమె భయానకంగా జోంబీ వేషం వేసింది. ఈ జోంబీ మేకప్‌తో అర్థరాత్రి ఆన్లైన్ ద్వారా వివిధ రకాలుగా మరణించిన వారు ఎలా చనిపోయోరో ఆమె వద్ద ఉన్న దుస్తులతో వివరింస్తుంది. దీంతో ఆమెకు ఆన్లైన్ ప్రేక్షకులు పెరగడమే కాకుండా.. కస్టమర్ల సంఖ్య కూడా వేలకు చేరింది. దీంతో ఆమె వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. (చదవండి: జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్) దీనిపై థాంగ్నాక్ మాట్లాడుతూ.. నా దగ్గర ఉన్న బట్టలు మరణించిన వారికి ఎలా ఉపయోగిపడతాయో... వాటిని నేను జోంబో మేకప్‌తో ధరించి ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులకు వివరించడం ప్రారంభించాను. వాటిని నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేదాన్ని. దీంతో అప్పటి నుంచి కస్టమర్లు కొంచంగా కొంచంగా ఆసక్తి చూపారు. అంతేగాక ఆన్లైన్ ప్రేక్షకులు కూడా పెరిగారు. ఈ జోంబీ మేకప్ వేసుకునేందుకు తనకు మూడు గంటల సమయం పెట్టేదని కూడా తెలిపింది.తన ఆదాయంలో కొంత భాగాన్నిబౌద్ధ దేవాలయాలకు విరాళంగా ఇస్తానని ఆమె పేర్కొంది. (చదవండి: వాలిబాల్ ఆడుతున్న పక్షులు.. గెలిచేదెవరు?) -
ప్రణాళిక అనుగుణంగా కోవిడ్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఫార్మా సంస్థ అరబిందో వెల్లడించింది. యూఎస్‌లోని సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తయారీలో భాగంగా ప్రీక్లినికల్ టెస్ట్, పరీక్ష, విశ్లేషణకై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టెస్ట్ లైసెన్స్‌ను అరబిందోకు జారీ చేసింది. వైరస్ల చికిత్సలో ఉపయోగించే వ్యాక్సిన్ల తయారీకై అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్లాంటును అరబిందో నెలకొల్పుతోంది. ఈ కేంద్రాన్ని కోవిడ్–19 వ్యాక్సిన్ తయారీకి సైతం ఉపయోగించనున్నారు. మద్దతుగా బీఐఆర్ఏసీ..: నేషనల్ బయోఫార్మా మిషన్‌లో భాగంగా బయోటెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి అరబిందోకు మద్దతుగా నిలిచింది. భారత్‌లో తొలిసారిగా ఆర్–వీఎస్వీ వ్యాక్సిన్ తయారీ ప్లాట్‌ఫాం ఏర్పాటును సులభతరం చేసింది. దేశ అవసరాల కోసం మహమ్మారితో పోరాటంలో భాగంగా వ్యాక్సిన్‌కై అరబిందో ఫార్మాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు బయోటెక్నాలజీ శాఖ సెక్రటరీ రేణు స్వరూప్ పేర్కొన్నారు. సంస్థ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యంపై బీఐఆర్ఏసీ నమ్మకం ఉంచిందని, ఇది తమకు అపార గౌరవంగా ఉందని అరబిందో ఎండీ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, వాణిజ్యీకరణకై అరబిందో, ఆరో వ్యాక్సి న్స్ నాయకత్వానికి విస్తృత అనుభవం ఉందన్నారు. చదవండి: 15 సెకన్లలోనే వైరస్ అంతం -
చిరు వ్యాపారులపై ఫేస్బుక్ సర్వే
వాషింగ్టన్ : కంటికి కనిపించిన కరోనా వైరస్..ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికాలో మూడింట రెండు వంతుల చిరు వ్యాపారులను మహమ్మారి ఆర్థికంగా కుదిపేసింది. ఇప్పటికే వైరస్ కారణంగా 31 శాతం చిరుద్యోగులకు పని లేకుండా పోయింది. మరో మూడు నెలలపాటు ఇలాగే కొనసాగితే వారి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఇటీవల ఫేస్బుక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. స్మాల్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌తో కలిసి అమెరికాలోని 86 వేల మంది చిరు వ్యాపారులపై ఫేస్బుక్ ఈ సర్వే నిర్వహించింది. దుకాణాలు మూతపడటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో తిరిగి దుకాణాలు తెరిచేందుకు అవసరమైన డబ్బు కూడా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త వారిని విధుల్లో తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదని సర్వేలో తేలిందని ఫేస్బుక్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్ వెల్లడించారు. ( భారీ డీల్ : ఫేస్బుక్ చేతికి ‘జిఫీ’ ) ఇక ఎక్కువమంది చిరు వ్యాపారులు తమ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లు రాకపోవడంతో స్టాక్ అలానే ఉండిపోయింది. దీంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నట్లు ఓ దుకాణదారుడు వెల్లడించారు. అంతేకాకుండా హెయిర్ స్టైలిస్టులు వీడియా చాట్ ద్వారా ఇంటి నుంచే హెయిర్ కట్‌కి సంబంధించిన చిట్కాలను అందిస్తూ తమ సేవలకు పని కల్పిస్తున్నారు. వ్యాపారులు ఎక్కువగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కస్టమర్లతో కమ్యునికేట్ చేస్తున్నారు. దీంతో వారికి మరింత ప్రోత్సాహం అందివ్వడానికి ఫేస్బుక్ ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డులు, ఫుడ్ డెలివరీ బటన్లు వంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. (తీవ్ర సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ: గోల్డ్‌మెన్ సంస్థ ) -
హైదరాబాద్‌లో క్లీన్ హార్బర్స్ కొత్త కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్విరాన్మెంటల్ సేవల్లో ఉన్న యూఎస్ కంపెనీ క్లీన్ హార్బర్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) నెలకొల్పారు. ఉత్తర అమెరికా తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద జీసీసీ. 650 మంది కూర్చునే వీలుగా ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఉన్నారు. 12–18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని క్లీన్ హార్బర్స్ చైర్మన్ అలెన్ మెక్‌కిమ్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వివరించారు. క్లీన్ హార్బర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్ ఈ క్లయింట్లకు సేవలు అందిస్తుందన్నారు. కంపెనీ ఉత్పత్తులు, సేవలను భారత్‌లో పరిచయం చేసే విషయమై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. నూతన కార్యాలయం కోసం రూ.30 కోట్లు వెచ్చించామని కంపెనీ కంట్రీ మేనేజర్ అవినాశ్ సామృత్ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు క్లీన్ హార్బర్స్ రూ.50 కోట్లు ఖర్చు చేసిందన్నారు. -
ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలు
దేశ విదేశాల్లో కొంగొత్త ఆవిష్కరణలు... కార్పొరేట్ దిగ్గజాల అస్తమయం... దివాలా కోరల్లో చిక్కుకున్న కంపెనీలు... కొత్త బాధ్యతలతో తళుకులు... ఇలా ఆద్యంతం వ్యాపార రంగంలో ఊపిరిసలపని పరిణామాలతో పయనం సాగించిన 2019 మరికొద్ది గంటల్లో మనకు గుడ్‌బై చెప్పేస్తోంది. ఎన్నో మలుపులు.. మరెన్నో ఊహించని సంఘటనలను తన మదిలో నింపుకున్న సంవత్సరం ఇది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకునే ‘బిజినెస్ రివైండ్’ సాక్షి పాఠకులకు ప్రత్యేకం... జనవరి... ► బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. ► బంధన్ బ్యాంక్ చేతికి గృహ్ ఫైనాన్స్. ► వీడియోకాన్ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు. ఫిబ్రవరి ► ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడం తో, తాత్కాలిక బాధ్యతల్లో మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన పీయూష్ గోయెల్. ఆదాయాలపై రూ. 5 లక్షల వరకూ పన్ను రిబేట్ కీలక నిర్ణయం. మార్చి ► ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించకపోతే... జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు హెచ్చరిక. నెల గడువు. ఆదుకున్న అన్నయ్య ముకేశ్. గడువుకు ఒకరోజు ముందు మార్చి 18న మొత్తం డబ్బు చెల్లించిన ఆర్ఐఎల్. ఏప్రిల్ ► ఇండియా బుల్స్ చేతికి లక్ష్మీ విలాస్ బ్యాంక్. షేర్ బదలాయింపు ద్వారా ఆర్థిక లావాదేవీ. ► దాదాపు రూ.8,000 కోట్ల రుణ భారంతో జెట్ ఎయిర్వేస్ క్రాష్ ల్యాండింగ్. మే ► జాగరణ్ ప్రకాశన్ చేతికి అనిల్ అంబానీ రేడియో బిగ్ఎఫ్ఎం. డీల్ విలువ రూ.1,050 కోట్లు. అడాగ్ కంపెనీల రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం. జూన్ ► మూడేళ్ల పదవీకాలంలో ఆరు నెలల ముందుగానే వ్యక్తిగత అంశాలను కారణంగా చూపుతూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ విరాల్ ఆచార్య రాజీనామా. వ్యక్తిగత కారణాలే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ తర్వాత, ఆర్బీఐ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా విరాల్ ఆచార్య. జూలై ► 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.27,86,349 కోట్ల పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ► బ్యాంకుల జాతీయీకరణకు 50 సంవత్సరాలు పూర్తి ఆగస్టు ► హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం ► ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. మొత్తం 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు. సెప్టెంబర్ ► దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో జియో హైస్పీడ్– ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం. ► కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. ► బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా. అక్టోబర్ ► బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపో రేటుకు, ఇతర ఎక్న్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం. ఆర్బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించేలా చూడటమే దీని లక్ష్యం. నవంబర్ ► తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రద్దు. దివాలా చర్యలు షురూ. డిసెంబర్ ► ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ ప్రక్రియతో రూ.42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రపంచ స్టీల్ దిగ్గజం– ఆర్సిలార్మిట్టల్. కొత్త బాధ్యతలు ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. బలమైన కంపెనీగా ఐటీసీని మలచిన శిల్పి, పద్మ భూషన్ అవార్డు గ్రహీత యోగేష్ చందన్ దేవేశ్వర్ (72) కన్నుమూత. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్. విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ పదవీ విరమణ. కుమారుడు రిషద్‌కు బాధ్యతలు. దిగ్గజాల అస్తమయం... బిర్లా మూల పురుషుడు బీకే బిర్లా (98) మరణం. మాజీ ఆర్థిక మంత్రి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అస్తమయం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయి... ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే అధినేత సిద్ధార్థ. రెండు రోజుల అదృశ్యం తర్వాత కర్ణాటకలోని నేత్రావతి నది ఒడ్డున మృతదేహం గుర్తింపు. ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్లు వేధించారంటూ వెలువడిన ఆయన లేఖ సంచలనం. ఆటో ‘మొబైల్’... దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా ‘మేడిన్ ఆంధ్రా’ సెల్టోస్ విడుదల. అనంతపురం ప్లాంట్‌లో తొలి కారు ఆవిష్కరణ. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ .. కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ హారియర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన అత్యాధునిక ఐఫోన్లు 11, 11 ప్రోలను ఆవిష్కరించిన యాపిల్. ధరల స్పీడ్ ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అక్టోబర్ (4.62 శాతం), నవంబర్ (5.54 శాతం) ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఇక నవంబర్ టోకు ద్రవ్యోల్బణం వ్యవస్థలో మందగమన స్థితికి (0.58 శాతం) అద్దం పట్టింది. చిక్కుల్లో కార్వీ క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలతో స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ తీవ్ర సంక్షోభంలోకి జారింది. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న సెబీ నిషేధం విధించింది. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించినందుకు అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. ‘మిస్త్రీ’కి ఊరట... 2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని, అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుందని కూడా జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్ చైర్మన్, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400), పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక దివీస్ ల్యాబ్స్– దివి సత్చంద్ర కిరణ్ (రూ.10,200 కోట్లు) , నీలిమ మోటపర్తి (రూ.9,800 కోట్లు) 83, 89 స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజైన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. పీపీ రెడ్డితో సంస్థ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ‘మేఘా బిల్డర్’ పేరుతో ప్రచురించిన ఈ వ్యాసంలో సంస్థ పురోగతిని వివరించింది. పరిశ్రమలు నిరాశ... పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా మూడవనెల– అక్టోబర్‌లోనూ వృద్ధిలేకపోగా ‘క్షీణత’లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ రంగంలో అసలు వృద్ధిలేదు. ఇన్ఫీకి విజిల్‌బ్లోయర్స్ షాక్ భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగుల(విజిల్‌బ్లోయర్స్) ఫిర్యాదులతో ఇన్ఫోసిస్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. -
పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు
న్యూఢిల్లీ / శ్రీనగర్: భారత్–పాకిస్తాన్ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. -
‘గుజరాత్ మోడల్’ అభివృద్ధి అంటే ఇదిగో!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో తన చిన్న కార్ల ఉత్పత్తి ఫ్యాక్టరీ ప్రతిపాదనను విరమించుకుంటున్నానని రతన్ టాటా 2008, ఆగస్టు నెలలో ప్రకటన చేశారు. ఫ్యాక్టరీ కోసం తమ భూములను గుంజుకోరాదంటూ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వాన పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించడంతో నాడు రతన్ టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి రతన్ టాటాకు ఏకపద సందేశం పంపించారు. అదే ‘సుస్వాగతం’. అప్పుడు మోదీతోపాటు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో చిన్న కార్ల ఫ్యాక్టరీని పెట్టాల్సిందిగా కోరుతూ ఆహ్వానాలు పంపాయి. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో టాటా సంప్రతింపులు జరిపారు. అందరికన్నా వేగంగా స్పందించిన నరేంద్ర మోదీ నానో కార్ల తయారీ కోసం టాటా మోటార్స్‌కు ఎన్ని ఎకరాల భూమి కావాలో అన్ని ఎకరాల భూమిని అతి తక్కువ రేటుకు ఇవ్వడానికి, అనేక రాయితీలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. మోదీ ప్రతిపాదనే అందరికన్నా లాభదాయకంగా ఉండడంతో గుజరాత్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు రతన్ టాటా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నింటిని వెల్లడించిన టాటా, మోదీని అధికార దర్పంలేని సాదాసీదా వ్యక్తి అని, మర్యాదస్థుడు, మధుస్వభావి, అన్నింటికన్నా సమర్థుడు అని పొగిడారు. 1,110 ఎకరాల అప్పగింత గుజరాత్లో 1,110 ఎకరాల భూమిని టాటా మోటార్స్‌కు చదరపు కిలోమీటరుకు 900 రూపాయల చొప్పున అప్పగించారు. అప్పుడు మార్కెట్ రేటు చదరపు మీటరుకు పది వేల రూపాయలు ఉండింది. ఆ భూమిపైన 20 కోట్ల రూపాయల స్టాంపు పన్నును పూర్తిగా ఎత్తి వేశారు. 20 ఏళ్లపాటు వ్యాట్‌ను వాయిదా వేశారు. ప్రాజెక్టు పెట్టుబడి మొత్తం 2,900 కోట్ల రూపాయలుకాగా, అందులో మూడో వంతకుపైగా, అంటే 9,570 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 0.1 శాతం వడ్డీరేటుపై రుణం మంజూరు చేసింది. 85 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిబంధన నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఎల్ అండ్ టీ కూడా ఇలాగే సూరత్‌లోని హజీరా పారిశ్రామిక జోన్లో ఎనిమిది లక్షల చదరపు మీటర్ల ప్రైమ్ ల్యాండ్‌ను రూపాయికి చదరపు మీటరు చొప్పున ఎల్ అండ్ టీ సంస్థకు ఇచ్చారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపైన కొన్ని వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది. అలాగే సీఆర్‌జెడ్, అటవి ప్రాంతంలో 2.08 లక్షల చదరపు మీటర్ల వివాదాస్పద భూమిని గౌతమ్ అదాని నాయకత్వంలోని ఎస్సార్ గ్రూపునకు కేటాయించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ భూమిని ఎవరికి కేటాయించరాదు. అలాగే 2012లో అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీకి 21 రూపాయి నుంచి 390 రూపాయల వరకు హెక్టార్ చొప్పున పలు హెక్టార్ల భూమిని అప్పగించారు. పారిశ్రామిక మార్గదర్శకాలన్నింటినీ తుంగలో తొక్కి రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్, ఎల్ అండ్ టీ కంపెనీలకే కాకుండా ఫోర్డ్ సహా పలు కంపెనీలన్నింటికి అనవసర లబ్ధిని చేకూర్చారంటూ మోదీ ప్రభుత్వంపై కాగ్ అక్షింతలు చల్లింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు 5,287.48 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కూడా కాగ్ పేర్కొంది. కాగ్ 15,100 అభ్యంతరాలు వివిధ కంపెనీలకు స్థలాలు, ఇతర రూపాల్లో ఇచ్చిన రాయితీలపై కాగ్ 15,100 అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 2002 నుంచి 2012 మధ్య అదానీ గ్రూపు మార్కెట్ విలువ 8,615 శాతం పెరగ్గా, అందులో ఒక్క ఎస్సార్ గ్రూపు విలువనే 4,507 శాతం పెరిగింది. ఇక రిలయెన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 1,357 శాతం పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో ‘వైబ్రంట్ గుజరాత్’ అని పేరు వచ్చింది. దాంతో వేల కంపెనీలు గుజరాత్లో కంపెనీలు పెట్టేందుకు క్యూలు కట్టాయి. 2009 నాటికి 12,39,562 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, 2011 నాటికి అవి 20,83,047 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయితే ఈ స్థాయిలో రాష్ట్రం అభివద్ధి చెందలేదు. నిరుద్యోగ సమస్య తీరలేదు. నామ మాత్రం రేట్లపై భూములు ఇవ్వడం, వాటిపై స్టాంపు డ్యూటీలను రద్దు చేయడం, భారీగా పన్ను మినహాయింపు ఇవ్వడం, అతితక్కువ వడ్డీపై వాటికి రాష్ట్ర ఖజానా నుంచే రుణాలు మంజూరు చేయడం, 85 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల గుజరాత్ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో అభివద్ధి చెందలేకపోయింది. అయితే ఆ కంపెనీల నుంచి నరేంద్ర మోదీపై ప్రసంశల వర్షం కురిసింది. ‘గొప్పు దక్పథం ఉన్న నాయకుడు మోదీ. అద్భుతమైన లక్ష్యం, అందుకు కావాల్సిన నిబంధత కలిగిన వారు’ 2007లో ముకేశ్ అంబానీ పొగిడారు. కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోదీ అని 2013లో అనిల్ అంబానీ పొగిడారు. అంతేకాకుండా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, ధీరూభాయ్ అంబానీలతోపాటు మహాభారతంలోని అర్జునితో కూడా పోల్చారు. ‘రాజులకే రాజు’ అని కీర్తించారు. మోదీ ప్రధాన మంత్రి అయితే దేశమంతా ‘గుజరాత్ మోడల్’ అభివద్ధి జరుగుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఊదరగొట్టగా ప్రజలు కళలుగన్నారు. మోదీ దక్పథమే వేరవడం వల్ల ఆయన భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఆయన ఏంచేయలేక పోయారు కాబోలు! (గమనిక: క్రిష్టఫె జాఫ్రెలాట్ రాసిన ‘బిజినెస్ ఫ్రెండ్లీ గుజరాత్ అండర్ నరేంద్ర మోదీ: ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఏ న్యూ పొలిటికల్ ఎకానమీ, క్రిష్టఫె జాఫ్రెలాట్, అతుల్ కోహ్లీ, కాంటా మురళీ రాసిన ‘బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
సిరిసిల్ల: ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా రియల్ దందా..!
వ్యవసాయ భూములను కొందరు లేఅవుట్లుగా మార్చుతున్నారు.. అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే విక్రయిస్తున్నారు.. ఒకటికాదు.. రెండుకాదు.. నెలలో ఏకంగా నాలుగు సార్లు ఒకేప్లాటు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు.. అయినా వీరి ఆగడాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఎల్లారెడ్డిపేటతోపాటు సమీప గ్రామాల్లో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై ప్రత్యేక కథనం.. సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమ లే అవుట్లతో అమ్మిన భూముల్లో స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది హద్దురాళ్లు తొలగిస్తున్నారు. అయినా, రియల్ వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, కిష్టంపల్లి పరిధిలో ఈదందా ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా సాగుతోంది. అనుమతులు లేకుండానే లే అవుట్లు గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందకుండానే కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎకరాల కొద్దిభూములను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా విభజించి అమ్మడంతో రూ.లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అమాయకులను నమ్మిస్తూ లేఅవుట్లు లేకుండానే వారికి ప్లాట్లను అంటగడుతున్నారు. అనుమతులు లేవని గ్రామపంచాయతీ సిబ్బంది దాడులు చేస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే అక్రమ లేఅవుట్లతో రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఆదాయానికి గండి గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్లు పొందడానికి రూ.వేలల్లో రుసుం చెల్లించాల్సి ఉంది. కానీ, రియల్ వ్యాపారులు రుసుం చెల్లించకుండానే తమ ఇష్టానుసారంగా లేఅవుట్లను తయారుచేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఫలితంగా గ్రామపంచాయతీల నిర్వాహణ భారంగా మారుతోంది. ఒకవ్యక్తి ప్లాట్లను తీసుకున్న వారం రోజుల్లోనే మరోవ్యక్తికి రూ.లక్షల్లో ధర ఎక్కువచేసి ఇంకొకరికి అమ్ముతున్నారు. ఇలా నెలరోజుల్లో ఒక్కో భూమి నలుగురి చేతులు మారుతున్నాయి. ఫోర్లేన్తో రూ.కోట్లకు చేరిన ప్లాట్ల ధరలు ఎల్లారెడ్డిపేట– డాక్టర్ కేవీఆర్ పాఠశాల నుంచి రాచర్ల గొల్లపల్లి – పెట్రోల్ బంకు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీం తో ఈరోడ్డువెంట ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు రూ.లక్షల్లో ధర పలుకగా రోడ్డు నిర్మాణంతో అ మాంతం ఆ ధరలు రూ.కోట్లకు చేరాయి. రోడ్డు నిర్మాణం జ రుగుతున్న మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు రో డ్డుకిరువైపులా ఉన్న ప్లాట్ల కొనుగోలుకు చేయడానికి రియల్టర్లు పోటీ పడుతున్నారు. రాత్రి చూసిన ప్లాట్లు తెల్లవారేసరికి అ మ్ముడు పోతున్నాయి. ఒకరకంగా ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం రి యల్టర్లకు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాటు ఏర్పాటుకు నిబంధనలు ఇవీ.. వ్యవసాయేతర భూమిగా మార్చడానికి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి దరఖాస్తు చేయాలి. దీంతోపాటు ఆర్డీవో ప్రొసీడింగ్ ముఖ్యం. 67 జీవో ప్రకారం..వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి వారు ఇచ్చే అనుమతి కాపీని గ్రామపంచాయతీకి అప్పగించాలి. గ్రామపంచాయతీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం ప్లాట్ల మధ్య 30 అడుగుల రోడ్డు కోసం స్థలం వదిలిపెట్టాలి. గ్రామపంచాయతీ అనుమతి కోసం కనీస రుసుం చెల్లించాలి. ప్లాటు మధ్య 12 అడుగులకు మించి స్థలం లేకుండానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో నిబంధనల మేరకు వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండా, కనీసం ముప్ఫయి అడుగుల మధ్య రోడ్లు లేనందున జీవో 67ను అనుసరించి అనుమతిలేని లేఅవుట్ల హద్దురాళ్లను అధికారులు తొలగించారు. ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్లగొల్లపల్లి వరకు చేపట్టిన అనుమతిలేని సుమారు 300 ప్లాట్ల హద్దురాళ్లను గ్రామపంచాయతీ అధికారులు గత మే, జూన్‌లో తొలగించారు. పంచాయతీలకు ఆదాయం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీకి ఏడాదికి రూ.9.80 లక్షలు, రాచర్లగొల్లపల్లికి రూ.4.85 లక్షల ఆదాయం సమకూరింది. దీంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాటు ధరలో 4శాతం వరకు స్టాంప్ డ్యూటీ పేరిట ఏడాదికి రూ.10 లక్షల – రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ నిబంధనల మేరకు ఈ ఆదాయం చాలా తక్కువ. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దు గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు చేసిన భూములకు సంబంధించి నోటీసులు జారీచేశాం. వ్యాపారులు చదును చేసిన భూములలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్ముకోవడం వ్యాపారులు మానుకోవాలి. -బాబు, ఇన్చార్జి ఈవో, ఎల్లారెడ్డిపేట -
ఎన్నికల వేళ.. చేతినిండా ‘పని’
ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇది కొందరికి ఉపాధిమార్గంలా మారింది. మరో పదిరోజుల పాటు చేతినిండా దొరుకుతుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని వ్యాపారులు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల జేబు ఖాళీ అవుతుండగా.. కొందరు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నాలుగు రాళ్లు’ పోగేసుకుంటున్నారు సాక్షి,శంషాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం అడ్డాకూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. భవన నిర్మాణ కార్మికులుగా పనిచే సే వీరు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోతున్నారు. పొద్దంతా చేమటోడిస్తే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట కొన్ని గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ముతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుండగా ఎన్నికల ప్రచారానికే ‘జై’ కొడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు తమ ప్రచారానికి వీరిని ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. వీరు నేరుగా ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచారానికి వెళ్తున్నారు. ప్రతిరోజు వీరికి రూ. 500 వందల నుంచి 700 వందల వరకు నేతలు చెల్లిస్తున్నారు. కళాకారులు ధూంధాం ఎన్నికల ప్రచారంలో కళాకారులది కీలక పాత్ర. గొంతెత్తి వీరు పాడే పాటలకు ప్రచారానికి వన్నె తెస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తక్కువ సంఖ్యలో ఉండే కళాకారులు అభ్యర్థులకు దొరకడమే కష్టంగా మారింది. వారిని వెతికి పట్టుకునే పనిలో ఆయా పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం వీరికి మంచి డిమాండ్ ఉంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండే కళాకారుల బృందాలు ఇప్పుడు బీజీబీజీగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పరిమళిస్తున్న పూల దుకాణాలు బరిలో నిలిచిన అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరకవడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది. యాభై రూపాయల దండ కాస్త డెబ్బై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో వ్యాపారి కనీసం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు పూల విక్రయాలు జరుపుతున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అనిమార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలకభూమిక పోషిస్తున్న సామాజిక మాధ్యమాలవైపు చూస్తున్నారు. మంచి కంటెంట్‌తో ఫేస్బుక్, ట్విట్టర్లలో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్ మార్కెటింగ్ చేసే వారికి చేతినిండా పనిదొరుకుతోంది. ట్రావెల్స్‌కు డిమాండ్ ట్యాక్సీలు.. ట్రావెల్స్ అన్ని కూడా ఇప్పుడు బిజీగా మారిపోయాయి. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతల బహిరంగ సభలు నియోజకవర్గ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ ఏర్పాటు చేసిన సమయాల్లో వాహనాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పవచ్చు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ‘స్టీరింగ్’ నిండా పని దొరికింది. -
వ్యాపార రంగంలోకి దర్శకుడి భార్య
సినీ రంగంలో ఉన్న వారు ఇప్పుడు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పబ్‌లు, రెస్టారెంట్ ల లాంటి వ్యాపారాల్లో అడుగుపెట్టారు. తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూపా వైట్ల కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వేదిక్ పేరుతో వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించిన హీరోయిన్ కాజల్, వేదిక్ బ్రాండ్ ను లాంచ్ చేయటం ఆనందంగా ఉందన్నారు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాకు రూపావైట్ల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. తాజాగా ఆమె వేదిక్ ఉత్పత్తులను లాంచ్ చేపినందుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. Happy to launch @Vedic_Way by @roopavaitla pure, organic and pristine! Thank you for my wholesomeness 😊🤗 pic.twitter.com/qHDFAupnuV — Kajal Aggarwal (@MsKajalAggarwal) 23 March 2018 -
క్లారిటీ ఇచ్చిన ‘ఆఫీసర్’ టీం
రాజుగారి గది 2 తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను అందించిన కాంబినేషన్ కావటంతో ఆఫీసర్ పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా కొద్ది రోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫీసర్ చిత్రం నిర్మాణదశలోనే ఉందని.. ఇంకా బిజినెస్ జరగలేదంటూ క్లారిటీ ఇచ్చింది. రామ్ గోపాల్‌వర్మ కు చెందిన నిర్మాణ సంస్థ ‘కంపెనీ’ సీఈఓ సుధీర్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. @iamnagarjuna and @RGVzoomin #OFFICER releasing on May 25th. #NAGRGV4 #Officeron25thMay pic.twitter.com/EP25u7qhSV — R-Company (@RGV_COMPANY) 11 March 2018 -
పొట్టకూటికి రాళ్లు రువ్వుతున్నారు
న్యూఢిల్లీ: కశ్మీర్ యువతకు టూరిజం కావాలో, టెర్రరిజం కావాలో తేల్చుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కశ్మీర్‌ను సందర్శించినప్పుడు కామెంట్ చేశారు. యతి, ప్రాసలతో కూడిన కామెంట్లు చేయడం, మీడియాను ఆకట్టుకోవడం ఆయనకు ఆది నుంచి అలవాటు. టూరిజాన్ని వదిలేసి టెర్రరిజమ్ వైపు వెళ్లడం కశ్మీర్ యువతకు ప్యాషన్ కాదు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం మీద ద్వేషం వారికి. ఆక్రోశంతో రాళ్లు రువ్వడం ప్రారంభించినా అది వారి బతుకుతెరువుగా మారుతోంది. రాళ్లు రువ్వినందుకు నెలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వారికి మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్న వారి నుంచి అందుతున్న విషయం తెల్సిందే. జమ్మూ కశ్మీర్లో చదువుకున్న ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. స్వరాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల్లో వారికి ఉద్యోగాలు లేవు. వారంతా నిరాశ, నిస్పహలతో రగిలిపోతున్నారు. నిపుణులైన జర్నలిస్టులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో పనిచేసే వారికి చేతికందే ఆదాయం పొట్టకూటికే సరిపోదు. దేశంలో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు 13.2 శాతం ఉండగా, జమ్మూ కశ్మీర్లో దాదాపు రెండింతలు, అంటే 24.6 శాతం ఉన్నట్లు 2016లో నిర్వహించిన ఆర్థిక సర్వేనే తెలియజేస్తోంది. ఒక్క ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ వద్దనే తమ పేర్లను నమోదు చేసుకున్న యువకులు లక్ష మందికిపైగా ఉన్నారు. వారికి ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగానీ, కంపెనీలుగానీ లేనందున వారంతా ప్రభుత్వం ఉద్యోగాల కోసం నిరీక్షించాల్సిందే. ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్పించి ఇతర ఉద్యోగాలు వారికి అందుబాటులో లేవు. (చదవండి...అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు) ల్యాప్ టాప్‌లు పట్టుకోవాల్సిన చేతులు రాళ్లు పట్టుకుంటున్నాయని కూడా నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. నెలల తరబడి ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేస్తుంటే వారు ల్యాప్ టాప్‌లను పట్టుకొని మాత్రం ఏం చేస్తారు. రాళ్లు విసిరితే నాలుగు డబ్బులైన వస్తాయి. గతేడాది మిలిటెంట్ బుర్హాని ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్లో రెండు నెలలు కూడా ఇంటర్నెట్ పనిచేయలేదు. రాళ్లు రువ్వడంలో మరణిస్తున్నదీ, మిలిటెంట్లుగా మారుతున్న వారు కూడా బాగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ఎంతో మంది ఇంజనీరింగ్ చదవిన విద్యార్థులు ఉద్యోగాలు రాక, టెర్రరిజమ్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెల్సిందే. వారందరు కూడా రాళ్లను పేర్చి ప్రాజెక్టులు కట్టాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏం ప్రాజెక్టులు కడుతున్నారు? రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివద్ధి చేసినా కశ్మీర్లో సగం నిరుద్యోగ సమస్య తీరిపోయేది. అబ్బురపరిచే కశ్మీర్ అందాలు బాలివుడ్ సినిమాల్లో కనిపిస్తాయితప్ప నిజ జీవితంలో కనిపించవు. అందంగా కనిపించే దాల్ లేక్‌ను దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికెళితే కంపు భరించలేం. పర్యాటక ప్రాంతాలను అభివద్ధికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కేంద్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేవీ లేవు. మిలిటñ న్సీ కారణంగా పర్యాటక ప్రాంతాలను అభివద్ధి చేయలేక పోతున్నామని ప్రభుత్వం సాకులు చెబుతోంది. అభివద్ధికి, మిలిటెన్సీకి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని గ్రహించి పనులు చేపడితే ఫలితం రావచ్చు. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు
కశ్మీర్: జమ్మూ కశ్మీర్లో అల్లర్లు చెలరేగినప్పుడల్లా మెరికల్లాంటి కుర్రవాళ్లు వీధుల్లోకి రావడం, పోలీసులు, సైనికులు, ప్రభుత్వ అధికారులపైకి రాళ్లు రువ్వడం, వాహనాలను దగ్ధం చేయడం, దుకాణాలను తగులబెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పెట్రోలు బాంబులు విసురుతూ బీభత్సం సష్టించడం కూడా తెల్సిందే. కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కుర్రవాళ్లు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు ముసుగులు ధరించడం లేదా కళ్ల కిందుగా ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకోవడం, పరుగెత్తడానికి అనువుగా కాళ్లుకు తెల్లటి స్పోర్ట్స్ షూలను ధరించడం కనిపిస్తుంది. నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఇలా పెడదారి పట్టి పోతోందని సామాజిక శాస్త్రవేత్తలు ఇంతకాలం సూత్రీకరిస్తూ వచ్చారు. అదే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తన కశ్మీర్ పర్యటన సందర్భంగా కశ్మీర్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యాటకాన్ని ఎంచుకుంటారా, ఉగ్రవాదాన్ని ఎంచుకుంటారా? అని కూడా ప్రశ్నించారు. రాళ్లు రువ్వుతున్నది నిరుద్యోగ యువతేగానీ ప్రభుత్వం మీద ఆగ్రహంతోనే ఆక్రోశంతోనో వాళ్లు రాళ్లు రువ్వడంలేదు. కేవలం డబ్బుల కోసం వారు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్లు రువ్వినందుకు వారికి నెలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు జీతంగా వస్తాయట. పెట్రోలు బాంబులు తయారు చేయడానికి, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు అందుతాయట. ఈ విషయాలను రాళ్లు రువ్వుతున్న కుర్రవాళ్లు జకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వసీం అహ్మద్ ఖాన్, ముస్తాక్ వీరి, ఇబ్రహీం ఖాన్ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో వెల్లడించారు. 2008, 2010 సంవత్సరాల్లో కశ్మీర్లో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి బీభత్సం సష్టించిన సంఘటల్లో తాను పొల్గొన్నానని, గతేడాది బుర్హాన్ వాణి మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కూడా తాను రాళ్లు రువ్వానని జకీర్ అహ్మద్ భట్ తెలిపారు. రాళ్లు రువ్వినందుకు తనకు నెలకు ఎనిమిది వేల రూపాయల వరకు అందుతాయని, తాను పెట్రోలు బాంబులు కూడా తయారు చేస్తానని, అందుకు ఒక్కోదానికి 700 రూపాయలు అందుతాయని, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు ఇస్తారని భట్ చెప్పారు. ‘మీకు డబ్బు ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా మీకు ఆ డబ్బు అందుతుందీ, ఎలా అందుతుందీ?’ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భట్ నిరాకరించారు. ‘ఇది మా బతుకుతెరువుకు సంబంధించిన అంశం. మా ప్రాణం పోతుందన్నా మా వెనకనున్న వ్యక్తుల గురించి మీము చెప్పం’ అని భట్ చెప్పారు. ‘కశ్మీరు పోలీసులు, సైనికులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులపై మేము ఎన్నోసార్లు రాళ్లు రువ్వాం. ఇక ముందు కూడా అదే చేస్తాం. ఇది మాకు తిండి పెడుతోంది. బారముల్లా, సొపోర్, పటాన్లలో కూడా నేను రాళ్లు విసిరాను. ఇప్పుడు రాళ్లు రువ్వేందుకు ప్రతి శుక్రవారం బారముల్లా పోతున్నాను. శుక్రవారం నాడు రాళ్లు రువ్వినందుకు మాకు అదనపు డబ్బులు ముట్టుతాయి’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్ తెలిపారు. ఇంతవరకు 50, 60 పెట్రోలు బాంబులు విసిరానని చెప్పారు. రాళ్లు రువ్వినందుకు ఒక్కో రోజు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అందుకున్న సందర్భాలు ఉన్నాయని వసీం అహ్మద్ ఖాన్ తెలిపారు. మీకు డబ్బులిచ్చే వ్యక్తితో మీకు పరిచయం ఉందా? అన్న ప్రశ్నకు తన స్నేహితుడి ద్వారా తనకు పరిచయం అయ్యాడని లోన్ తెలిపారు. డబ్బులిచ్చే వ్యక్తి మిలిటెంటా లేదా టెర్రరిస్టా ? అని ప్రశ్నించగా, వారి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేనని చెప్పారు. ఎక్కడ రాళ్లు రువ్వాలో, ఎప్పుడు రాళ్లు రువ్వాలో ముందస్తు ప్రణాళిక ఉంటుందా అన్న ప్రశ్నకు లోన్ సమాధానమిస్తూ ముందుగానే పక్కా వ్యూహంతో తమకు కబురు అందుతుందని చెప్పారు. రాళ్లు రువ్వే కుర్రవాళ్లలో పది, పన్నేండేళ్ల బాలలు కూడా ఉన్నారని, వారికి నెలకు ఐదువేల రూపాయల వరకు పేమెంట్లు ఉంటాయని వారు తెలిపారు. కండపుష్టి కలిగిన బలమైన యువకులకు గ్రూపులో పేమెంట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తమలో ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూపులున్నాయని, అత్యవసర సమయాల్లో గ్రూపు సందేశాలు పంపిస్తారని అహ్మద్ ఖాన్ తెలిపారు. వీరిలో ఒకరిద్దరు రాళ్లు రువ్విన సంఘటనల్లో అరెసై్ట ఆరు నెలలు జైలుకెళ్లిరాగా మరొకరి ఏడాది జైలు శిక్ష అనుభవించి వచ్చారు. జైలుకెళ్లి వచ్చినా మారలేదా ? అన్న ప్రశ్నకు ఇది తమ బతుకుతెరవని, మరోపని చేస్తూ బతకడం కష్టమని వారు చెప్పారు. గతేడాది జూలై నెల నుంచి అక్టోబర్ నెల వరకు రాళ్లు రువ్విన సంఘటనల్లో 92 మంది మరణించగా, 19 వేల మంది ప్రజలు గాయపడ్డారు. నాలుగువేల మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు మరణించారు. కశ్మీర్లో ఒక్క ఏడాదిలోనే రాళ్లు రువ్విన సంఘటనలు కొన్ని వేలుంటాయి. -
సదా చిల్లర స్మరామి
= చిల్లర కొరతతో ‘వెయ్యి’పాట్లు = రూ. వంద కోసం గంటల పాటు పెట్రోలు బంకులో ఎదురుచూపులు = 40 శాతం తగ్గిన హోటళ్ల వ్యాపారం = టోల్గేట్ల వద్ద కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు = కలబుర్గిలో రూ.500 తీసుకుని రూ.400 ఇచ్చిన వైనం = సొమ్మును బంగారంలోకి మార్చుకోవడానికి పరుగులు సాక్షి, బెంగళూరు: పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారి పనులను వదులుకుని చిల్లర నోట్ల కోసం పెట్రోలు బంకులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్స్ వద్ద క్యూలు కట్టారు. మరికొంతమంది అవసరం లేకపోయినా బంగారు నాణేలు, ఆభరణాలను కొనడానికి ఎగబడ్డారు. మరోవైపు కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారం లేకపోవడంతో బీఎంటీసీ ప్రయాణికులతో గొడవలకు దిగిన సంఘటనలు కూడా బెంగళూరు, మంగళూరుతో సహా పాటు కర్ణాటక వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించినా తాత్కాలిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆందోâýæన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా డిపాజిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా మరికొంతమంది రోజువారి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు. మంగళూరు వద్ద చాలా మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్ముతో బంగారు నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జ్యువెలరీ షాపుల వద్దకు పరిగెత్తారు. కొంతమంది సొమ్మును అడ్వాన్స్ గా ఇచ్చి బంగారాన్ని బుధ, గురు లేదా మరోవారం తర్వాతనైనా అందించాల్సిందిగా దుకాణం యజమానులకు చెప్పడం కనిపించింది. ఇక బుధవారం ఉదయం నుంచే బెంగళూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలకు, పట్టణాలకు కాయగూరలు, పూలు, పండ్లను రవాణా చేసే కే.ఆర్.మార్కెట్, రస్సెల్మార్కెట్, మల్లేశ్వరం, మడివాల మార్కెట్లో గందరగోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. అటు వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్మును మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నించగా వ్యాపారస్తులు తీసుకోలేదు. అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి సరుకును తీసుకుని ఆయా మార్కెట్లకు చేరుకున్న రైతులు, దళారులు కూడా మార్కెట్లోని వ్యాపారస్తుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం కనిపించింది. వందకోసం రెండు గంటలు... చాలా మంది తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెయ్యి నోట్లను మార్చుకోవడం కోసం పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. నగరంలోని ఓ బంకు సిబ్బంది బెత్లహాం అనే వ్యక్తి వద్ద రూ.ఐదు వందలు తీసుకుని రూ.వందకు పెట్రోలు పోసి మిగిలిన రూ. నాలుగు వందల కోసం క్యూలో నిలబెట్టారు. వినియోగదారుల నుంచి నాలుగు వంద నోట్లు వచ్చిన తర్వాత సదరు నోట్లను తనకు ఇస్తామని చెప్పినట్లు బెత్లహాం సాక్షితో పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలు ఇలా నిలబడ్డానని సదరు నోట్లు మరో రెండు రోజులు కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతాయని అందవల్ల విధిలేక ఇలా నిలబడాల్సి వచ్చిందని వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు చాలా చోట్ల కనిపించాయి. = కొన్ని హోటల్స్‌లలో రూ.500, రూ.1000లకు చిల్లరు లేదు అని బోర్డు పెట్టడంతో వినియోగదాలు వెనక్కు వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ వ్యాపారం 30 నుంచి 40 శాతం తగ్గిపోయిందని రాష్ట్ర హోటల్ యామజామాన్య సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. = కలబుర్గిలో కొంతమంది బృందంగా ఏర్పడి ఐదు వందలు తీసుకుని నాలుగు వందల రుపాయాలు ఇచ్చారు. వంద తక్కువైనా పర్వాలేదు రెండు రోజులు ఖర్చులకు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంది సదురు నోట్లను తీసుకోవడం కోసం ఎగబడ్డారు. = రైల్వే, బస్స్టేషన్లలో నోట్ల వినిమయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఈ నోట్ల వినిమయం ఎలా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కండక్టర్ రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో చాలా చోట్ల ప్రయాణికులకు, బస్సు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి విధిలేక చాలా మంది ప్రయాణికులు బస్సుల నుంచి మధ్యలోనే దిగిపోయారు. = మంగళూరుకు చెందిన సత్యనారాయణ హీరేమఠ్ అనే వ్యక్తి వారం రోజుల్లో తన కుమార్తె పెళ్లి కోసం రూ. రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఈ నోట్లు బుధవారం నుంచి చలామణిలో లేవు. పోనీ ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి నూతన నోట్లను తీసుకుందామంటే.. రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు మాత్రమే విత్‌డ్రాయల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే పెళ్లికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియడంల లేదని సత్యనారాయణ హీరేమఠ్ వాపోతున్నారు. = అత్తిబెలే, నైస్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, తుమకూరు రోడ్డు వద్ద టోల్గేట్ వద్ద వాహనదారులు ఇచ్చిన రూ.500, రూ.1,000 నోట్లను సిబ్బంది తీసుకోకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. = కొంతమంది తమ వద్ద ఉన్న ఐదు వందలకు చిల్లర కోసం యాచకుల వెంట పడ్డారు. ఈ ఘటనలు ఎక్కువగా బెంగళూరులోని ఎంజీరోడ్, కోరమంగ వద్ద కనిపించాయి. సిగ్నల్స్ వద్ద యాచించే హిజ్రాల వద్ద కూడా రూ. ఐదు వందలు ఇచ్చి రూ. నాలుగు వందలు తీసుకోవడం కనిపించింది. = మరోవైపు బీదర్‌లో కొంతమంది ఐదు వందల నోటును గాడిదకు తినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. మొదట బ్యాంకులో డిపాజిట్ చేయండి ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనానికి అడ్డుకట్టుపడుతుందనడంలో సందేహం లేదు. అయితే దీని వల్ల గరిష్టంగా రెండు నెలల పాటు అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా అవగాహన చేసుకుని గరిష్టంగా రూ. రెండు కోట్ల నగదు (లిక్విడ్ అమౌంట్) ఉన్నవారికి ఒక సూచన. వంశపార్యంపర్యం కాని స్థిరాస్తుల అమ్మడం వల్ల వచ్చిన నగదు ఇంట్లో ఉంటే బ్యాంకులో డిపాజింట్ చేయడం మంచి నిర్ణయం. ఇందుకు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉంది. అటు పై సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని అవసరమైన పన్నులు చెల్లిస్తే డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత వరకూ అయినా దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. -రాజేష్భట్, ఛార్టెడ్అకౌంట్ -
సిండికేట్‌గా రేషన్ మాఫియా
రేషన్ బియ్యం అక్రమంగా తరలించి అమ్ముకోవడం కొత్తేమీ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే.. రెండేళ్ల కిందటి వరకు ఇలా పేదల బియ్యాన్ని బొక్కే దొంగలంతా విడివిడిగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుడొకరు వీరినందరినీ ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ విధంగా రేషన్ డీలర్ల మాఫియా తయారైంది. అధికారులు వారికి జీ హుజూర్ అంటున్నారు. ఇక రేషన్ దోపిడీ పట్టపగ్గాలు లేకుండా సాగుతోంది. మాచర్ల: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు సిండికేట్‌గా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులకు అమ్మేస్తున్నారు. తాజాగా శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రామాంజనేయలు స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే బియ్యం లారీని పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడవకముందే మరోసారి రేషన్ బియ్యం దొరికాయి. దీనినిబట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థమవుతోంది. దందా నడిపిస్తున్న నామినేటెడ్ నాయకుడు.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాలుగా వున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులందరినీ తన కనుసన్నలలో ఉంచుకుని ఓ నామినేటెడ్ నాయకుడు దందాను నడిపిస్తున్నాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే పీఆర్కే పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వారం కిందట దుర్గి మండలంలోని అడిగొప్పల ప్రాంతంలో 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులకు పట్టించారు. అయినప్పటికీ పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి దొరికిన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసి అసలు సూత్రధారులను గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే అక్రమ రేషన్ బియ్యం లారీని పట్టుకున్న సమయంలో దొరికిన ఐదుగురు మినహా మిగతా వారు ఎవరనేది పోలీసులు తేల్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దుర్గి మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి పేర్లను నమోదు చేశామని చెబుతున్నా, వారిని అరెస్టు చేశారా లే దా అనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా శుక్రవారం మాచర్ల శివారులో గుంటూరు రోడ్డులోని రాయవరం జంక్షన్ వద్ద 52 బస్తాల బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఈసారీ డ్రైవర్ ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు. అసలు నిందితులను తేల్చకుండా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పథకం ప్రకారం డంపింగ్.. అధికార పార్టీ నాయకులు ముందుగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి ఒక చోట డంప్ చేస్తారు. అక్కడ నుంచి వివిధ చోట్లకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుంది. పోలీసు పెట్రోలింగ్ చేసే సమయంలోనే లోడ్లను తీసుకెళ్తున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రూరల్ æపరిధిలోని ఓ పోలీసు అ«ధికారి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు బియ్యం పట్టుకున్న ప్రతిసారీ దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. కీలక సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదు. -
కలప దందా.. కాసుల వరద..!
ఇక్కడ దుంగకు రూ.వెయ్యి.. అక్కడ ఫీట్‌కు రూ.1,200 ఈ అక్రమ బిజినెస్‌తో స్మగ్లర్లకు పైసలే పైసలు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు జన్నారం : అడవిలో ఉంటున్న కొందరు గిరిజనులను మచ్చిక చేసుకుని.. ఆ ప్రాంతం అటవీ సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పుతూ ఇక్కడి నుంచి తీసుకుపోయే కలప దుంగలకు మూడంతలు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. ఇలా తమ బిజినెస్‌ను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డివిజన్లోని జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్‌లలో ఈ బిజినెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయట పడిన విషయాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల సహకారం స్మగ్లర్లకు వరంగా మారింది. స్మగ్లింగ్ జరుగుతోందిలా... జన్నారం, తాళ్లపేట్, ఇంధన్పల్లి రేంజ్‌ల పరిధిలోని పలు అటవీ ప్రాంతాల నుంచి కొందరు గిరిజనులు దుంగలు కొట్టి, వాటిని జన్నారం మండలానికి చెందిన కొందరు జట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. వారు గిరిజనుల వద్ద నుంచి రూ.1000 కి ఒక టేకు దుంగ(సైజు 10–6, సుమారుగా 3 ఫీట్లు) కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా గోదావరి వరకు ఎడ్లబండి లేదా, సైకిళ్లపై తరలిస్తారు. అక్కడ మరో వ్యక్తి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి కలపను ఆ వ్యక్తి ఫీటుకు రూ.1,200 నుంచి రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తారు. అంటే రూ.వెయ్యితో కొనుగోలు చేసిన దుంగకు రూ.3 వేల నుంచి రూ.5,400 వరకు వస్తున్నాయి. ఇలాంటి వ్యాపారం ఏదీ ఉండదని, స్మగ్లర్లు ఈ రూటును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో సంబంధిత ప్రాంత బీట్ అధికారికి నెలకు కొంత చొప్పున మాట్లాడుకుని నెలనెలా చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇటీవల ఓ అధికారి నిర్మించుకున్న ఇంటికి కూడా కలప ఇక్కడి నుంచే స్మగ్లర్లు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ జోక్యం కలప పట్టుకున్న రెండో రోజు నుంచి రాజకీయ జోక్యం కల్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఆయన మా పార్టీకి చెందినవాడు. స్మగ్లర్ కాదు.. కేసులు లేకుండా చేయాలని అటవి అధికారులకు ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుకున్న వారిని వదిలేస్తే ఇక పట్టుకోవడం ఎందుకని కూడా అటవీ శాఖ అధికారులంటున్నారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా సహకరించాలని కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తాం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇటీవల కలప పట్టుకున్న ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశాం. మాకు పోలీసుల సహకారం ఉన్నందున స్మగ్లర్లు తప్పించుకునే అవకాశం లేదు. ఎంతటివారైన చర్యలు తప్పవు. పెట్రోలింగ్ ద్వారా రాత్రి అడవిలో తిరుగుతున్నాం. – షౌకత్‌హుస్సేన్, రేంజ్ అధికారి -
పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని చింతల్, ఇంద్రజిత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందరు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..ఇంద్రజిత్ నగర్‌కు చెందిన నాలా కేశవరావు(40), వనజ(36) భార్యాభర్తలు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతకముందు పిల్లలు నందిని(4), దీపక్(11)లకు విషమిచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డినట్టు తెలుస్తోంది. తమ మృతికి సుబ్బారెడ్డి అనే వ్యక్తే కారణమని, ఆయన వల్ల తాము వ్యాపారంలో నష్టపోయామని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం కలకత్తా నుంచి నగరానికి వచ్చి చింతల్ లో స్థిరపడ్డారు. వారితో పాటు కేశవరావు తల్లి చంద్రమ్మ కూడా ఉంటోంది. అయితే ఆమెకు కళ్లు కనిపించవని రాత్రి ఏం జరిగిందో తెలియదని చెబుతోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిరు వ్యాపారుల ధర్నా
అనంతపురం: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు. శుక్రవారం ముదిగుబ్బ వైఎస్సార్సీపీ ఎంపీపీ మాలతి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చిరు వ్యాపారులు కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ముదిగుబ్బ గ్రామపంచాయతీ అధికారులు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు వెంటనే తొలగించాలని నోటీసులు జారీ చేసింది. శనివారంతో నోటీసుల గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. -
వెడ్డింగ్ప్లానర్ అవతారమెత్తిన తాప్సీ
-
మంత్రి కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అధికారులు బళ్లను తొలగించారని వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు. -
‘ఇండియా ఏవియేషన్-2014’
-
కాసుల వేట
‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అన్నది పద్యం...‘తివిరి ఇసుమున పైకంబు తీయవచ్చు’ అన్నది నేటి వ్యాపారుల సూత్రం. జిల్లాలో ఇసుక వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న ఇసుక మాఫియా అదను చూసి జడలు విప్పుతోంది. అడ్డగోలుగా వచ్చే ఆదాయానికి రుచిమరిగిన ఇసుకాసురులు ‘అధికార’ అండదండలతో భూగర్భానికి గుంతలు చేస్తూ ఇసుకను కొల్లగొడుతున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం గురించి తెలిసినప్పటికీ రెవెన్యూ, గనుల శాఖలు గుడ్లప్పగించి చూస్తున్నాయే తప్ప పట్టించుకున్న పాపాన పోవటం లేదు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకు చెందిన దళారులే కాకుండా పక్క ప్రాంతాలకు చెందిన మాఫియా ఇసుక వ్యాపారంలో నిమగ్నమై కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో 20కిపైగా కేంద్రాల నుంచి ఇసుక దందా సాగుతోం ది. బోధన్, బాన్సువాడ, జుక్కల్, బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. బాన్సువాడ, పిట్లం, బీర్కూర్, బిచ్కుంద, కోటగిరి మండలాల పరిధిలోని మంజీరా నది సమీప ప్రాంతా ల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఈ ప్రాంతాల నుంచే 10 కేంద్రాల ద్వారా రోజుకు 150 నుంచి 200 టిప్పర్ల ఇసుకను ఇతర ప్రాం తాలకు తరలిస్తున్నారు. టిప్పర్ ఇసుక ఇక్కడ రూ. 6500 నుంచి రూ.7 వేలకు లభిస్తుండగా, ఇతర ప్రాంతాలలో ధర రూ. 10వేలకు పైగా పలుకుతోంది. బోధన్, రెంజల్ మండలాల పరిధిలోనూ ఇసుక దందా అధికంగా ఉంది. ‘మహా’ వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులు మన ప్రాంతంలోకి చొరబడి ఈ దందాను యథేచ్చగా సాగిస్తున్నారు. భీంగల్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, మోర్తాడ్, కమ్మర్పల్లి ప్రాంతాలలోని పెద్ద వాగు నుంచి కూడా ఇసుకను తరలిస్తున్నారు. ఈ మండలాల పరిధిలో ని పెద్దవాగు సమీప గ్రామాల నుంచి రోజూ 75 నుంచి 150 టిప్పర్ల ఇసుక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆర్మూ ర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ దందాతో ఇందిరమ్మ ఇళ్లతో పాటు, కొత్త నిర్మాణా లు చేపడుతున్న గృహ యజ మా నులు, నిర్మాణ సంస్థలు అధిక ధరతో ఇసుకను ఖరీదు చేయలేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈ దందాతో బోధన్, బాన్సువాడ, జుక్కల్ , ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో భూగర్భ జలా లు అడుగంటి పోతున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రైతులు పంటసాగులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తోంది. జిల్లా కలెక్టర్ ముఖ్యంగా రెవెన్యూ, మైనింగ్ అధికారులు దృష్టిసారించి ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జోరుగా డంపింగ్ వినాయక్‌నగర్ : నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న వసంత్‌నగర్, ఆర్మూర్ రోడ్డులోని గంగస్థాన్ ఫేస్-2లో రోడ్డు పక్కనే ఇసుకను డంప్ చేశారు. ఈ ఇసుకను జన్నేపల్లి వాగులో నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు. గతంలో అధికారులు అక్రమ ఇసుక మాఫియాను అరికట్టేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అపుడు ఇసుక రవాణా తగ్గింది. దసరా, దీపావ ళి తరువాత నూతన గృహాల నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. నగర శివారులో రోడ్డు పక్కనే వందల కొద్దీ లారీల ఇసుకను డంపు చేసి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. -
వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీలతో నోట్‌బుక్ పీసీల అమ్మకాలు పడిపోలేదని ఏసూస్ ఇండి యా తెలిపింది. మార్కెట్ పుంజు కోవడానికి ట్యాబ్లెట్లు దోహదం చేస్తున్నాయ ని ఏసూస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్ సేల్స్ డెరైక్టర్ యునేజ్ ఖురేషి అన్నారు. దేశవ్యాప్తంగా 50-60 లక్షల నోట్‌బుక్, నెట్‌బుక్ పీసీలు అమ్ముడవుతున్నాయి. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య 50 లక్షల దాకా ఉంది. వచ్చే ఏడాది ట్యాబ్లెట్ల మార్కెట్ అనూహ్యంగా ఉండబోతోందని చెప్పారు. నాలుగు రకాల ట్యాబ్లెట్ల విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని మోడళ్లను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడి ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్లో ఏర్పాటు చేసిన ఏసూ స్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించి న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకేచోట 10 బ్రాండ్లు ఐటీ మాల్లో సోని, ఇంటెల్, ఏఎండీ, డెల్, తోషిబా, లెనోవో, ఏసూస్, ఏసర్, హెచ్‌పీ, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు ఏర్పాటయ్యాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నెలకొల్పామని ఐటీ మాల్ డెరైక్టర్ మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. -
విశాఖలో ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమ్మిట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పోర్టుల ద్వారా జరిగే సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల వ్యాపారంలో భవిష్యత్తంతా తూర్పుతీరానిదేనని ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమ్మిట్ స్పష్టంచేసింది. ఎరువులు, బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతుల్లో తూర్పుతీరం పోర్టులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విశ్లేషించింది. తూర్పు తీరంలో మేజర్ పోర్టుల సంఖ్య పెరుగుతుండడం, అదే సమయంలో పశ్చిమతీరంలోని కీలక రేవుల్లో కార్గో హ్యాండ్లింగ్ క్షీణిస్తుండడం ఈ ప్రాంతానికి కలిసిరానుందని గురువారం విశాఖలో జరిగిన సమ్మిట్‌లో షిప్పింగ్ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర ప్రసంగిస్తూ, రాష్ట్రంలో సముద్ర అధారిత వ్యాపార రంగం పుంజుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియలో భాగంగా విశాఖ, హైదరాబాద్ సమీపంలో కంటైనర్ రవాణా యార్డులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ అధారిత ఎగుమతుల ప్రోత్సాహానికి కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.75 కోట్లతో గోదాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాయుడుపేట, కృష్ణపట్నం, శ్రీసీటి సెజ్‌ల ప్రగతికి దోహదపడేలా వెంకటాచలం వద్ద అయిదో నంబర్ జాతీయ రహదారి సమీపంలో లాజిస్టిక్ పార్క్ నిర్మిస్తున్నట్లు వివరించారు. రూ.2.96 లక్షల కోట్ల వ్యాపారానికి అవకాశం సముద్ర అధారిత ఎగుమతి, దిగుమతుల్లో వ్యత్యాసం తీవ్రంగా ఉందని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అనిల్ కె.గుప్తా చెప్పారు. దేశీయ కంటైనర్ కార్గో వ్యాపారం సరాసరి 65 శాతానికి బదులు 52శాతం మాత్రమే ఉందన్నారు. అయిదేళ్లలో తాము తూర్పు తీరంలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. కోల్‌కతా పోర్టుట్రస్ట్ చైర్మన్ (విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఇన్చార్జ్ చైర్మన్) ఆర్పీఎస్ కేహ్లాన్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.