
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీంతో మహేశ్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటోంది.
చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?
ఈ నేపథ్యంలో మహేశ్ SSMB 28 షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. మహేశ్ నటుడిగా, మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఆయన మరో సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఎషియన్ సినిమాస్‌తో కలిసి ఎఎమ్‌బీ సినిమాస్‌తో(AMB Cinemas) భాగస్వామిగా మారాడు. అలాగే టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోనూ మహేశ్ అడుగుపెట్టారు.
చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్
త్వరలో ఓ హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పేరు మీద ఈ హోటల్ ప్రారంభిచనున్నాడట. ఈ హోటల్‌కు మినర్వా ఎ.ఎన్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అతి త్వరలోనే హోటల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే మహేశ్ హోటల్ ప్రారంభించే యోచనలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment