hotel business
-
రుణ రహితంగా ఐటీసీ హోటల్స్!
కోల్‌కత: హోటల్స్ వ్యాపారం బలమైన బ్యాలెన్స్ షీట్‌తోపాటు రుణ రహితంగా ఉంటుందని ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పురి గురువారం తెలిపారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు అవసరమైన రుణం, ఈక్విటీ లేదా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సమీకరించగలదని అన్నారు. అటువంటి మూలధనం ఎప్పుడు అవసరమో నిర్ణయించడం కొత్త సంస్థ బోర్డుకి సంబంధించినదని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విశ్లేషకులతో ఆయన ఈ విషయాలను చెప్పారు. నూతన కంపెనీ ద్వారా హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులను కొనసాగిస్తామని వెల్లడించారు. అపార అవకాశాలతో ఇది సరైన సమయం. కొత్త కంపెనీ వృద్ధి బాట పట్టడంలో సహాయపడటానికి ఐటీసీ సంస్థాగత బలాల మద్దతు ఉంటుందని సంజీవ్ పురి వివరించారు. హోటల్స్ వ్యాపారాన్ని ఒక కొత్త సంస్థగా విడదీయడానికి జూలై 24న ఐటీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత నూతన కంపెనీలో ఐటీసీ నేరుగా 40 శాతం ఈక్విటీని కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం కంపెనీ వాటాదారుల సొంతం అవుతుంది. -
‘నా పొట్ట.. నా ఇష్టం’.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న రెస్టారెంట్
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ పేర్లు అయితే ఒక్కసారి చదివితే గుర్తుండేలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. వెరైటీ పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో రెస్టారెంట్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె ప్రారంభమన ఆ రెస్టారెంట్ పేరు వింటే నవ్వు ఆపుకోలేరు. లేటెస్ట్గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెస్టారెంట్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. ఇదే పేరుతో మరో రెస్టారెంట్ జగిత్యాలలో ఉంది. దానిపై సరదా కవిత్వాలు అల్లేస్తున్నారు. “నా పొట్ట నా ఇష్టం” 😂 చూడూ - చూడకపో నీ ఇష్టం తినడం నా అభీష్టం 😃 నే తినకపోతే హోటెల్ వాడికి నష్టం 😪 మధ్యలో నీకేమిటి కష్టం? 🤔 భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో రెస్టారెంట్ ఓనర్స్ తెగ ట్రై చేస్తున్నారు. మొదట్లో ఓ హోటల్ ప్రారంభిస్తే అక్కడి టేస్ట్, క్వాలిటీ బావుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే సై అంటున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ రెస్టారెంట్లకు డిఫరెంట్ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఇలా గతంలోనూ..తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్,రాజుగారి పులావ్, ఘుమఘుమలు,నిరుద్యోగి ఎంఏ, బీఈడి, కోడికూర చిల్లు వంటి వెరైటీ రెస్టారెంట్ల పేర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కనిపించే వెరైటీ టైటిల్స్ - హోటల్స్ తిన్నంత భోజనం - నాగోల్ మెట్రో ఉప్పు కారం - కొండాపూర్ కోడికూర, చిట్టిగారె - జూబ్లీ హిల్స్ రాజుగారి రుచులు - కొండాపూర్ వివాహ భోజనంబు - జూబ్లీ హిల్స్ దిబ్బ రొట్టి - మణికొండ అరిటాకు భోజనం - అమీర్ పేట వియ్యాలవారి విందు - ఎల్బీనగర్ తాలింపు - అమీర్ పేట తినేసి పో - కొంపల్లి బకాసుర - AS రావు నగర్ అద్భుతః - దిల్సుఖ్ నగర్ -
మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీంతో మహేశ్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటోంది. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఈ నేపథ్యంలో మహేశ్ SSMB 28 షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. మహేశ్ నటుడిగా, మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఆయన మరో సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఎషియన్ సినిమాస్‌తో కలిసి ఎఎమ్బీ సినిమాస్‌తో(AMB Cinemas) భాగస్వామిగా మారాడు. అలాగే టెక్స్టైల్స్ బిజినెస్‌లోనూ మహేశ్ అడుగుపెట్టారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ త్వరలో ఓ హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పేరు మీద ఈ హోటల్ ప్రారంభిచనున్నాడట. ఈ హోటల్‌కు మినర్వా ఎ.ఎన్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అతి త్వరలోనే హోటల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే మహేశ్ హోటల్ ప్రారంభించే యోచనలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వినిపించాయి. -
మునుగోడు: హోటల్ గిరాకీతో టీఆర్ఎస్ సర్పంచ్ అనురాధ బిజీ
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నాయకులంతా ప్రచారంలో బిజీగా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరోనిగూడెం సర్పంచ్ అనురాధ మాత్రం హోటల్లో తనపని తాను చేసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తన భర్త చూసుకుంటున్నారని అనురాధ పేర్కొంటున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనురాధ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయితే చండూరులో నామినేషన్ సందర్భంగా ఆమె నడిపిస్తున్న హోటల్‌కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ప్రచారంలో పాల్గొనకుండా హోటల్లో పనిచేసుకుంటున్నారు. -
ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.600 కోట్లు.. ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడంటే?
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వంద కోట్లు.ఈ మూవీ రిలీజ్ తర్వాత సినిమా అనుకున్నంతగా ఆడపోయినా సరే మళ్లీ మరో 20 కోట్లు రెమ్యూనరేషన్ పెంచేశాడు ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. (చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు) ప్రభాస్ సెట్ చేసుకున్న ఈ రెమ్యూనరేషన్ ఫిగర్ ఏ ప్రొడ్యూసర్ కు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తేనే వెయ్యి కోట్లు ఇట్టే వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ లెక్కన ఐదారు వందల కోట్ల రూపాయలు ప్రభాస్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. మరి ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేస్తున్నట్లు అంటే...బిజినెస్ మెన్ గా మారబోతున్నాడు అట.త్వరలోనే హోటెల్ చైన్ మార్కెట్ లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే తన హోటెల్ బిజినెస్ ను ఇండియాలో కాకుండా దుబాయ్, స్పెయిన్ దేశాల్లో విస్తరించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ బిజినెస్ ప్లానింగ్ లోనే ప్రభాస్ బిజీగా ఉన్నాడట. -
వంటకం చెబితే వండి తెచ్చిస్తారు..
మనకెన్నో వంటకాలు తెలిసి ఉండొచ్చు. అయితే అవి వండుకునేందుకు అవసరమైన కిచెన్ అనుబంధ వస్తువులు లేకపోవచ్చు. అలాగే పలు రెస్టారెంట్స్ తమ కిచెన్స్‌ను నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయా రెస్టారెంట్స్‌లో అందించే ప్రత్యేకమైన వంటకాలను అచ్చం అలాగే తయారు చేసి వినియోగదారులకు అందించే కొత్త తరహా ఫుడ్ డెలివరీ ట్రెండ్ నగరవాసుల్ని పలకరించనుంది.. డైన్ ఇన్ లేకుండా కేవలం డెలివరీకే పరిమితమైన క్లౌడ్ కిచెన్ పోకడలో ఇది మరో వినూత్న శైలి అంటున్నారు సంబంధిత రంగ నిపుణులు. క్లౌడ్..కొత్త ట్రెండ్.. ఫుడ్ బిజినెస్‌లో క్లౌడ్ కిచెన్...వేళ్లూనుకుంటున్న ట్రెండ్. డార్క్ కిచెన్, ఘోస్ట్ కిచెన్, వర్చ్యవల్ కిచెన్స్, శాటిలైట్ కిచెన్స్ ఇలా పేరేదైనా... ఎలాంటి డైన్ ఇన్ సదుపాయం లేకుండా కేవలం డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా ఉండేవే ఇవి. కరోనా కాలంలో ఖర్చులు తగ్గించుకుని కొంతకాలం పాటు మనుగడ సాగించాలంటే క్లౌడ్ కిచెన్ ఒక్కటే మార్గమంటున్నారు ఆతిథ్య రంగంలోని ఔత్సాహికులు. క్లౌడ్ కిచెన్...విన్.. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 30%కు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా. పేరొందిన రెస్టారెంట్ గ్రూప్స్ కూడా నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయి. ఇది క్లౌడ్ కిచెన్ల వెల్లువకు కారణంగా మారింది. గత 2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్ కిచెన్లు ఉండగా , ప్రస్తుతం అవి 50నుంచి 60% వృద్ధిని నమోదు చేస్తున్నాయని రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంటుంటే, గ్రాస్ మర్చండైజ్ విలువ పరంగా 2019లో 400 మిలియన్ డాలర్లు ఉంటే 2024 నాటికి 3బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఇది నిలువనుందనీ అంచనా వేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఈ నేపధ్యంలో ఇదే ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లి... Mవంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు వండి అందించేది మేము అంటూ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది డెలీ 360. వంట మీది...వడ్డనమాది.. మీ స్వంత వంటకాలను మీరు వినియోగడారులకు అందించవచ్చు.. అయితే వండే శ్రమ మాదే అంటూ ఆఫర్ చేస్తున్నారు డెలీ 360. అంతేకాదు వండిన ఫుడ్ డెలివరీ కోసం తమ డెలివరీ ప్లాట్‌ఫామ్‌నూ వినియోగించుకోవచ్చంటున్నారు. కాన్సెప్ట్ ఏదైనా అందుకనువైన కిచెన్ సేవలను తామందించగలమని చెబుతూ తమ క్లౌడ్ కిచెన్‌తో మార్కెటింగ్ అవకాశాలనూ అధికంగా అందిస్తున్నామంటున్నారు. రెస్టారెంట్ల సిగ్నేచర్ రెసిపీలను కూడా ఔట్ సోర్సింగ్ చేస్తున్నారు. ‘‘రెస్టారెంట్ల తరపున మేము వండినప్పటికీ రుచి పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మా చెఫ్‌లు పూర్తి సుశిక్షితులు. వంటకాలలో వాడే పదార్థాల సేకరణ, ఆ వంటకాల తయారీలో వాటిని వాడే విధానం అంతా అసలైన రెస్టారెంట్‌ను అచ్చంగా అనుసరించే ఉంటుండటం వల్ల రుచి, నాణ్యత పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదని కెలీ 360 వ్యవస్థాపకులు శివ తేజేశ్వర్‌రెడ్డి. భోజనప్రియులూ సూచించవ్చు.. మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ రెస్టారెంట్స్‌కు మాత్రమే కాక భోజనప్రియులకూ ఆఫర్ ఇస్తోంది డెలీ 360. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, దక్షిణ భారత, అరేబియన్, ఓరియెంటల్ రుచులను ఆఫర్ చేస్తున్న డెలీ, క్లౌడ్ కిచెన్‌లో సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు కోరుకున్న వంటకాన్ని కోరుకున్న శైలిలో.. కోరుకున్న సమయానికి డెలివరీ పొందేలా డెలీ 360 సేవలు అందిస్తోంది. -
అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’
న్యూఢిల్లీ: ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతాప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి గుర్తున్నారా? వారి కథ మళ్లీ మొదటికొచ్చింది. కరోనా ధాటికి మళ్లీ దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్లో రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. రూ.5 లక్షల పెట్టుబడితో వారు గతేడాది ప్రారంభించిన రెస్టారెంట్ ఆరు నెలలు బాగానే నడిచింది. క్రమంగా వినియోగదారుల ఆదరణ పడిపోయింది. నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. ఇప్పుడు మళ్లీ పాత హోటలే కొనసాగిస్తున్నారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాబాకా దాబాకు జనం పోటెత్తారు. రాత్రే సక్సెస్ఫుల్ దాబాగా మారింది. మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు. రూ.5 లక్షల దాకా పోగుచేశారు. ఈ డబ్బుతో అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచి ఫిబ్రవరిలో మూతపడింది. రెస్టారెంట్‌తో నష్టాలే మిగిలాయి లాక్డౌన్ కంటే ముందు నిత్యం రూ.3,500 దాకా అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు కనీసం రూ.1,000 రావడం లేదని కాంతాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంలో 8 మంది ఉన్నామని, ఈ ఆదాయంతో ఎలా బతకాలని వాపోయాడు. రెస్టారెంట్ ప్రారంభిస్తే నష్టాలే మిగిలాయన్నాడు. ముగ్గురిని పనిలో పెట్టుకున్నానని, నెలవారీ ఆదాయం ఎప్పుడూ రూ.40 వేలు దాటలేదన్నాడు. కొందరి తప్పుడు సలహా వల్లే రెస్టారెంట్ మొదలుపెట్టానని తెలిపాడు. అప్పట్లో వైరల్ అయిన 'బాబా కా దాబా' వీడియో చదవండి: బాబా కా ధాబా : యుట్యూబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు -
కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్న ఇలియానా!
నటీనటులు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు.. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. హీరోయిన్గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్ చేసినట్టే అనే కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్డౌన్ తర్వాతే వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. సో.. భవిష్యత్తులో ఇలియానా బేకరీ, ఇలియానా రెస్టారెంట్‌కి శ్రీకారం జరుగుతుందన్నమాట. -
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసిందంటూ.. మనం తరచుగా వింటుంటాం. ఇప్పుడు ఈ వార్త చదివితే అది నిజమేననిపిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటిని నడిపే యజమానులు మరో పని దొరక్క దిక్కులేనివారుగా మిగిలిపోయారు. అయితే జపాన్‌కు చెందిన 41 ఏళ్ల మసనోరి సుగిరా మాత్రం కుంగిపోలేదు. హోటల్ బిజినెస్ నిర్వహించే సుగిరా స్వతహాగా మంచి బాడీ బిల్డర్. జపాన్‌లో కరోనా సంక్షోభం కాస్త తగ్గిన తర్వాత తన బుర్రకు పదును పెట్టాడు. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయించే అంశమై పరిశీలించాడు. అనుకుందే తడవుగా సుగిరా బాడీ బిల్డింగ్ చేసే సమయంలో ఫిట్నెస్ సెంటర్లో తనకు పరిచయమైన స్నేహితులకు విషయం చెప్పాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని భావించిన వారు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆ ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. సుగిరా హోటల్ వ్యాపారాన్ని తిరిగి గాడిన పడేలా చేసింది. (చదవండి :నువ్వు నిజంగా దేవుడివి సామి) ఇంతటితో ఇది ఆగిపోలేదు. వ్యపారాన్ని విస్తరించి ఫుడ్ డెలవరీకి మరింత మంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు. ఫుడ్ ఆర్డర్ రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్ ధరించి ఆహారం తీసుకెళ్తారు. వినియోగదారుడికి ఫుడ్ ఇచ్చి, వెంటనే సూట్ విప్పి దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారు. 7వేల యెన్ల ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మాత్రమే దేహదారుడ్య ప్రదర్శన అవకాశం కల్పించాడు. ఇదేదో కొత్తగా ఉందని భావించిన కస్టమర్లు ఈ హోటల్ నుంచే ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్రస్తుత సుగిరా నెలకు 1.5 మిలియన్ యెన్స్ (మన కరెన్సీలో రూ. 10 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.(చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు) This sushi restaurant in Japan is using bodybuilders to deliver food to its customers https://t.co/sm7p9BVG5C pic.twitter.com/sIi5qLLSTj — Reuters (@Reuters) September 5, 2020 -
ఆతిథ్యానికి ఓకే- హోటల్ షేర్లు కళకళ
కరోనా వైరస్ కట్టడికి కొద్ది రోజులుగా అమలు చేస్తున్న లాక్‌డవున్ నిబంధనలను సడలిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆతిథ్య రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 8 నుంచీ హోటళ్లను తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే కోవిడ్-19 కట్టడికి వీలుగా సామాజిక దూరం తదితర నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అంతేకాకుండా తొలి దశలో భాగంగా హోటళ్ల సామర్థ్యంలో 33 శాతాన్ని మాత్రమే వినియోగించేందుకు అనుమతించింది. కంటెయిన్మెంట్ జోన్లలో ఇందుకు అనుమతి లేదు. ఈ నిబంధనలు లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లకు సైతం వర్తించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు హోటల్ స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కామత్, చాలెట్ జోరు మహారాష్ట్ర ప్రభుత్వనిర్ణయం నేపథ్యంలో పలు ఆతిథ్య రంగ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో కామత్ హోటల్స్ 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 34ను తాకగా.. చాలెట్ హోటల్స్ 6.5 శాతం జంప్‌చేసి రూ. 146కు చేరింది. తొలుత రూ. 150కు ఎగసింది. ఈ బాటలో లెమన్ ట్రీ హోటల్స్ 5 శాతం జంప్‌చేసి రూ. 25 వద్ద, తాజ్ జీవీకే 5 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద, ఇండియన్ హోటల్స్ 3 శాతం లాభపడి రూ. 84 వద్ద, ఈఐహెచ్ 3 శాతం పుంజుకుని రూ. 68 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఐటీడీసీ 2.5 శాతం బలపడి రూ. 217 వద్ద, ఓరియంటల్ హోటల్స్ 4 శాతం ఎగసి రూ. 21 వద్ద కదులుతున్నాయి. ఈఐహెచ్ అసోసియేటెడ్ 7.4 శాతం పెరిగి రూ. 262 వద్ద, జిందాల్ హోటల్స్ 2.6 శాతం లాభంతో రూ. 21 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా ఏషియన్ హోటల్స్ వెస్ట్ 3.6 శాతం లాభంతో రూ. 280 కు చేరగా.. ఏషియన్ హోటల్స్ నార్త్ 2.3 శాతం పుంజుకుని రూ. 56ను తాకింది. -
హోటల్ వ్యాపారం కుదేలు !
సాక్షి, గుంటూరు: కరోనా కాటుకు హోటల్ వ్యాపారం కుదేలైంది. లాక్డౌన్ నుంచి మినహాయింపుల అనంతరం కూడా భోజన ప్రియులు లేక హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. జిల్లాలోని గుంటూరు నగరం, నరసరావుపేట, తెనాలి, పిడుగురాళ్ల, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో బిజినెస్ డల్ గానే ఉంటోంది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రభుత్వం రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్, శానిటైజేషన్, సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు వంటి అన్ని నిబంధనలను నిర్వాహకులు పాటిస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందులా ప్రస్తుతం బిజినెస్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. వేలాది కుటుంబాల జీవనం... గుంటూరు నగరంలో ట్రేడ్, లేబర్, ఫుడ్ లైసెన్స్ పొందిన హోటళ్లు, రెస్టారెంట్లు 200లకు పైగా ఉన్నాయి. అనే జిల్లా వ్యాప్తంగా 500 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా నడిచే హోటళ్లు అనేకం. ఈ రంగంపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా 60 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో జరిగే బిజినెస్‌లో ప్రస్తుతం పది శాతం కూడా జరగడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. దీంతో సిబ్బంది జీతాలు, అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా సిబ్బందిని పనిలోకి ... హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారానికి పెద్దగా డిమాండ్ లేకపోతుండటంతో నిర్వాహకులు అదనపు భారాన్ని తగ్గించుకుంటున్నారు. ఉన్న సిబ్బందిలో కొందరు చొప్పున రోజు రోజు మార్చి విడతల వారీగా పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి చెందుతుందని... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా వరకూ ప్రజలు బయటి ఆహారానికి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. తప్పనిసరి అయితే తప్ప రెస్టారెంట్లు, హోటళ్లను ఆశ్రయించడం లేదు. ఒకటి రెండు సార్లు ఆలోచించి, ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు వంటివి గమనించే ఆహారం తినడం, పార్సిల్ తీసుకోవడం చేస్తున్నారు. కష్టంగాఉంది మునుపటి రోజుల్లో కౌంటర్ రోజుకు రూ.10–20 వేలు జరిగేది. ప్రస్తుతం అందులో సగం కూడా ఉండటం లేదు. మా మెస్‌లో 40 సీట్లు ఉంటే భౌతిక దూరం పాటిస్తూ ప్రస్తుతం 14 సీట్లు ఏర్పాటు చేశాం. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. బిజినెస్ జరగకపోతుండటంతో సిబ్బందిని పరిమితంగా పనిలో పెట్టుకోవాల్సి వస్తోంది. – శివాజి, మెస్ నిర్వాహకుడు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి లాక్డౌన్, కరోనా ప్రభావం కారణంగా హోటల్ రంగం పూర్తిగా కుదేలైంది. కరెంట్ బిల్లులు కూడా కట్టడం కష్టంగా మారుతోంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. కరెంట్ చార్జీల చెల్లింపుల్లో మినహాయింపులు ఇవ్వాలి. ప్రోత్సాహం అందించకపోతే మనుగడ కష్టంగా మారుతుంది. – కిషోర్, గుంటూరు నగరం హోటల్స్‌అసోషియేషన్ ప్రెసిడెంట్ -
రోజుకు రూ.25–30 కోట్ల వ్యాపారం నష్టం
సాక్షి, కృష్ణా: లాక్డౌన్ కారణంగా ఆతిథ్య రంగం ఆవిరయింది. వివిధ రంగాలకు చెందిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు వంటి వారు తమ పనుల నిమిత్తం నగరానికి వచ్చి హోటళ్లు, లాడ్జిలలో బస చేసేవారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో నెల రోజుల నుంచి విజయవాడ నగరంలోని హోటళ్లు, లాడ్జిలు పూర్తిగా మూతపడ్డాయి. అసలే ఆర్థికమాంద్యంతో అంతంత మాత్రంగా ఉన్న హోటల్ ఇండస్ట్రీ ఈ మధ్యనే కోలుకుంటోంది. బెజవాడలో వన్‌స్టార్ హోటళ్లు సుమారు 100, టూ స్టార్ 50, త్రీస్టార్ హోటళ్లు 10, రెస్టారెంట్లు 200, సరీ్వసు అపార్ట్మెంట్లు 100, లాడ్జిలు 250కి పైగా ఉన్నాయి. హోటళ్లలో 1900, లాడ్జిలు, సర్వీసు అపార్ట్మెంట్లలో మరో 5వేల వరకు గదులున్నాయి. విజయవాడలో రోజుకు సగటున 5 వేల మంది గెస్ట్‌లు (పర్యాటకులు, సందర్శకులు, వర్తకులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు) బస చేసేందుకు వస్తారని అంచనా. నగరంలోని హోటళ్లలో సగటున 65 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. రోజుకు హోటళ్ల ద్వారా రూ.25 నుంచి 30 కోట్ల వ్యాపారం జరిగేదని అంచనా. ఇప్పుడదంతా నష్టపోయినట్టేనని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడ హోటల్ పరిశ్రమపై 75 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు తెరచుకోలేదు. వాటిలో పనిచేసే సిబ్బందిలో కొందరు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరికి ఆయా హోటల్ యాజమాన్యాలే వసతి కల్పించాయి. ఇంకా హోటళ్లు, రెస్టారెంట్లకు చికెన్, మటన్, చేపలు, కూరగాయలు వంటివి సరఫరా చేసే వారికి కూడా ఉపాధి లేకుండా పోయింది. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.. కొన్నాళ్లలో లాక్డౌన్ ఎత్తివేసినా ఆతిథ్య రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక గెస్ట్‌లు వచ్చినా, రాకపోయినా హోటళ్లు తెరవాల్సిందే. ఏసీలు, జనరేటర్లు, విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం భరించాల్సిందే. లేనిపక్షంలో కంప్యూటర్లు, ఏసీలు, టీవీలు, వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవుతాయని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక కుదుటపడడానికి మరో ఆరేడు నెలలైనా పడుతుందని నగరంలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ అధినేత మురళి సాక్షితో చెప్పారు. ఉపశమన చర్యలతోనే ఊరట.. లాక్‌డౌన్‌తో హోటల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అద్దెల్లో నడుస్తున్న హోటళ్లకు వచ్చే 6నెలలకు సగం అద్దె తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మా పరిశ్రమకు ఇండస్ట్రీ స్టేటస్‌నిస్తే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయి తగ్గుతుంది. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలు, మార్చి నుంచి జూన్ వరకు డిమాండ్ చార్జీలను రద్దు చేయాలి. ఏడాదిపాటు నీటి పన్ను చెల్లింపు నుంచి మినహాయించాలి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలపై 6–12 నెలలపాటు మారటోరియం విధించాలి. పెండింగ్ జీఎస్టీ చెల్లింపునకు 6 నెలలు గడువివ్వాలి. ప్రస్తుతం ఆతిథ్య రంగం కోలుకోవాలంటే ఈ ఉపశమన చర్యలు చేపట్టి ఆదుకోవాలి. –పి.రవికుమార్, అధ్యక్షుడు, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ -
నంబర్–1పై ఓయో కన్ను
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్ హోటల్ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్ గదులను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్–1 హోటల్ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023కి మారియట్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. నాలుగున్నరేళ్లలోనే... ఓయో ఓ స్టార్టప్‌గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్ బ్రాండ్‌గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్, చైనా, బ్రిటన్ తదితర దేశాల్లో 3,30,000 హోటల్ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్‌గా (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది. ‘‘ప్రతి నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. దీన్ని బట్టి చూస్తే 2023 నాటికి అదనంగా 25 లక్షల గదుల స్థాయికి చేరతాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్ చెయిన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం’’ అని అగర్వాల్ తెలిపారు. ఓయో బడ్జెట్ హోటల్ చైన్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది. ప్రధానంగా ఓయోకు భారత్, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్ గదులుండగా, బ్రిటన్, యూఏఈ, ఇండోనేసియా, మలేసియా, నేపాల్‌కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన దుబాయ్, అబు ధాబి, షార్జా వంటి మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో విస్తరించేందుకు ఈ మార్కెట్లు దోహదపడగలవని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉందని తెలిపారు. చైనాలో ప్రతి నెలా సుమారు 40,000 పైచిలుకు గదులు ఫ్రాంచైజీ, లీజ్డ్ విధానంలో అందుబాటులోకి తెస్తున్నామని అగర్వాల్ వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో చేరిన తర్వాత ఆయా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేటు 25 శాతం నుంచి సుమారు 70 శాతం దాకా పెరిగిందని పేర్కొన్నారు. సాఫ్ట్‌బ్యాంకు దన్ను కాలేజీ స్థాయి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించారు. ఓయో వివిధ హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని, సిబ్బందికి తగిన శిక్షణనిస్తుంది. లినెన్ నుంచి బాత్రూమ్ ఫిటింగ్స్ దాకా అన్నింటినీ నిర్దిష్ట ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆయా హోటల్స్‌ను తమ వెబ్సైట్లో లిస్టింగ్ చేస్తుంది. తమ వెబ్సైట్ ద్వారా జరిగే బుకింగ్స్‌పై ఆయా హోటల్స్ నుంచి 25 శాతం కమీషన్ తీసుకుంటుంది. సాఫ్ట్‌బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్‌లో బిలియన్ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్ డాలర్లను భారత్, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్‌లో 180 నగరాల్లో ఓయో 1,43,000 గదులను నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్‌లో చైనాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రస్తుతం 265 నగరాలకు విస్తరించింది. 1,80,000 గదులను నిర్వహిస్తోంది. గదుల సంఖ్యా పరంగా టాప్ టెన్ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్ బ్రాండెడ్ హోటల్ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్‌లో అందుబాటులో ఉన్న అన్‌బ్రాండెడ్ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్ అయిన ఆదిత్యఘోష్ను భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్ దృష్టిసారించనున్నారు. -
ఫుల్లుగా తాగారు.. ఆపై..!
సాధరణంగా తాగి జీవితాలు నాశనం చేసుకునే వారి గురించే చదువుతుంటాం.. కానీ లైఫ్ సెట్ చేసుకున్న వారి గురించి ఎక్కడ చూడటం కాదు కదా కనీసం చదివి కూడా ఉండం. కానీ ఇలాంటి సంఘటనే ఒకటి శ్రీలంకలో జరిగింది. ఫుల్లుగా తాగిన ఓ కొత్త జంట ఏకంగా హనీమూన్ కోసం వెళ్లిన హోటల్‌నే కోనేశారు. వినడానికి కాస్తా విడ్డూరంగా అనిపించినా ఇది మాత్రం నిజం. కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన గినా లైయాన్స్, మార్క్ లీలు తమ హనీమూన్ ట్రిప్ కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగారు. ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తున్న వారికి ఓ వెరైటీ ఆలోచన వచ్చింది. రూమ్ రెంట్‌కు తీసుకోవడం కంటే ఏకంగా ఈ హోటల్‌నే కొంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. ఆలోచన రావడమే తడవుగా ఆ హోటల్ యాజమానుల దగ్గరకు వెళ్లారు. తమ ఆలోచన గురించి వారికి చెప్పారు. హోటల్ కూడా కాస్తా పాతబడటం.. త్వరలోనే దాని లీజ్ కూడా అయిపోతుండటంతో హోటల్ యజమానులు కూడా గినా, మార్క్ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తాగిన మైకంలోనే బేరసారాలు కానిచ్చేశారు. అలా దాదాపు 30 వేల పౌండ్లు పోసి ఆ హోటల్‌ను మూడేళ్లకు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 29 లక్షల రూపాయలు. ఇంకేముందు.. వాళ్ల హనీమూన్ ట్రిప్ కాస్త బిజినెస్ ట్రిప్‌గా మారిపోయింది. View this post on Instagram How #luckybeachtangalle was born! ❤️ A post shared by Lucky Beach (@luckybeachtangalle) on Oct 7, 2018 at 1:54am PDT అలా ఈ సంవత్సరం జులై 1 నుంచి ఆ హోటల్ని మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకొన్నారు.. దానికి ‘లక్కీ బీచ్ తంగళ్లె’ అనే పేరు పెట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక.. అప్పటి నుంచి టూరిస్టులు ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారట. బాగుంది కదా ఐడియా.. తాగితే తాగారు కానీ.. మంచి బిజినెస్ దొరికింది.. అంతే కాదు వాళ్లు ఆ ఏరియాలో చిన్నపాటి సెలబ్రిటీలు అయ్యారు. వీరి బిజెనేస్ కూడా సక్సెస్ ఫూల్‌గా దూసుకుపోతుందంట. -
ఆ భారీ ప్రమాదం బుకింగ్స్‌ను పడేసింది
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన కమలా హిల్స్ కాంపౌండ్‌లోని భారీ అగ్నిప్రమాదం, ముంబైలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ప్రభావం చూపింది. కమలాహిల్స్లోని అగ్నిప్రమాదంతో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మెగా కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్లను, పబ్‌లను కూల్చివేయడం చేపట్టింది. దీంతో ముంబై వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హాటల్స్పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో న్యూఇయర్‌లో హోటల్ బుకింగ్స్ 40 శాతం నుంచి 50 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారవేత్తలు చెప్పారు. రిజర్వు చేసుకున్న బుకింగ్స్‌ను కూడా ప్రజలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. ''గతేడాది కంటే ఈ ఏడాది చాలా రెస్టారెంట్లలో వ్యాపారం 40 శాతం క్షీణించింది. ముంబైలోని ఉత్తతమైన రెస్టారెంట్ హబ్‌గా కమలా హిల్స్ ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ కూల్చివేత కార్యక్రమంతో అక్కడ నీళ్లు కానీ, విద్యుత్ కానీ లభ్యమవడం లేదు'' నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు రియాజ్ ఆమ్లాని అన్నారు. పలు రెస్టారెంట్లకు నీటి, విద్యుత్ సరఫరాను కోత పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో ప్రజలు తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. గురువారం అర్థరాత్రి నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో చెలరేగిన మంటలతో, 15 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. -
అబ్బో.. పేరు మస్తుందే
కామసూత్ర.. ఈ పేరు వినగానే వాత్సాయనుడి కామసూత్ర గుర్తుకు రాకమానదు. అయితే ఇకపై కామసూత్ర పేరు చెప్పగానే చక్కటి రుచులతో లొట్టలేసుకుంటూ తిన్న వంటలు గుర్తుకొస్తాయి. ఆ అదృష్టం ప్రస్తుతం శ్రీలంకవాసులకు దక్కింది. అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇందులో కొత్తేం ఉంది. స్టార్ స్టేటస్ ఉన్నవారు వ్యాపారాల్లోకి వస్తుండటం కామనే అనుకుంటున్నారా? ఇక్కడే ఓ విశేషం ఉంది. ఫెర్నాండెజ్ తన హోటల్‌కి పెట్టుకున్న ‘కామసూత్ర’ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ జన్మభూమిలోనే వ్యాపారం మొదలెట్టారు. శ్రీలంక టాప్ సెలబ్రిటీ షెఫ్ దర్శన్ మునిదిసతో కలిసి ఆమె హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కామసూత్ర’ పేరుతో తన వ్యాపారం ప్రారంభించడం అటు శ్రీలంకలోనూ ఇటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. జనాలకు బాగా రీచ్ అవడానికి, పాపులారిటీ కోసమే జాక్వెలిన్ ఆ పేరు పెట్టారనే వారూ లేకపోలేదు. త్వరలో ఈ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో విస్తరించే ఆలోచనలో ఉన్న ఈ బ్యూటీ ఇండియాలోనూ ప్రారంభించాలనుకుంటున్నారని టాక్. -
హోటల్ ‘కామసూత్ర’
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల తారలు నటనతో పాటు వ్యాపారాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఎక్కువగా ఫ్యాషన్, హోటల్ రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు మన తారలు. అదే బాటలో బాలీవుడ్ అందాల భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో చైన్ హోటల్ బిజినెస్ ను మొదలు పెట్టింది ఈ భామ. అయితే హోటల్స్ కు జాక్వలిన్ ఎంచుకున్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ తన హోటల్స్ ను కామసూత్ర పేరుతో ప్రారంభించనుందట. జాక్వలిన్ ఈ పేరు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరగా భోజన ప్రియుల దృష్టిలో పడేందుకు అలాంటి పేరు పెట్టిందట. జుడ్వా 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న జాక్వలిన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రేస్ 3, సుశాంత్ తో డ్రైవ్ సినిమాల్లో నటిస్తోంది. -
అలాంటి అలవాటు నాకు లేదు
పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటు నాకు లేదు అంటోంది నటి ప్రణీత. ఈ బెంగళూరు బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ అన్ని భాషల్లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ ఇంకా ప్రముఖ కథానాయకి స్థాయికి చేరుకోలేదు. కోలీవుడ్‌లో ఉదయన్ చిత్రంతో నాయకిగా ఉదయించిన ఈ అమ్మడు ఆ తరువాత కార్తీకి జంటగా శకుని, సూర్యతో మాస్, జై సరసన ఎనకు వాయ్‌ంద అడిమైగళ్ వంటి చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించికపోవడంతో ప్రణీత మార్కెట్ వేడెక్కలేదు. అయినా ఏం పర్వాలేదు. నటన అన్నది నా ఫ్యాషన్ మాత్రమే అంటున్న ప్రణీతతో చిన్న చిట్‌చాట్ తమిళసినిమా: ⇒ కోలీవుడ్‌లో ఎక్కువగా నటించడం లేదే? ♦ అందుకు నా పాలసీ కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువ చిత్రాలు చేయాలన్న ఆసక్తి, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవా లన్న ఆశ నాకు లేవు. మా అమ్మానాన్న ఇద్దరు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. మరో విషయం ఏమిటంటే అన్ని భాషల్లోనూ ఒకేసారి నటించ డం సాధ్యం కాదు. తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ భాషల్లో నటించడానికే సమయం సరి పోతోంది. అయితే తమిళంలో నటించాలన్న ఆసక్తి ఉంది. మంచి అవకాశం అనిపిస్తే అంగీకరిస్తున్నాను. ఇటీవల అధర్వతో నటించిన‘ జెమినీగణేశనుమ్ సురళీరాజనుమ్’ చిత్రంలో నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ⇒ ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లుందే? ♦ పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉం టుంది. సినిమారంగంలో నూతన నటీమణులు చాలామందే వస్తున్నారు. అయితే ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుంది. ప్రతిభను బట్టే అవకాశాలు వస్తుంటాయి. అందుకని నేనెవరినీ పోటీగా భావించను. ఎవరు బాగా నటించినా భుజం తట్టి అభినందిస్తా. ⇒ మీరు గ్లామర్‌కు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే వారికి మీరిచ్చే సమాధానం? ♦ అని మీరంటున్నారు. ప్రేక్షకులెవరూ నా గ్లామర్ గురించి కామెంట్ చేయడం లేదు. తెలుగు చిత్రాల్లో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుందన్న విషయం గురించి నేనూ విన్నాను. అయితే నేను నటించిన చిత్రాలు చూస్తే అలాంటి కామెంట్లకు అవకాశం ఉండదు. నన్నెవరూ గ్లామరస్‌గా నటించమని ఒత్తిడి చేయలేదు కూడా. కథ, పాత్రలకు తగ్గట్టుగానే నా నటన ఉంటుంది. ⇒ బాలీవుడ్ ఆశ లేదా? ♦ కలలో కూడా అలాంటి ఆశ లేదు. అసలు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. జీవితంలో ఎక్కువగా ఆశించకూడదు. ఒక వేళ ఆశపడింది జరగకపోతే చాలా నిరాశ పడాల్సి వ స్తుంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన, నాకు నప్పే పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. నేను ఎన్నేళ్లు నటిస్తానో తెలియదు. అది నా చేతుల్లో లేదు. నటన నాకు ఫ్యాషన్. అందుకే నటిస్తున్నాను. ⇒ పబ్‌లకు పార్టీలకు వెళ్లే అలవాటు ఉందా? ♦ అసలు లేదు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమారంగంలో స్నేహితులంటూ ఎవరూ లేరు. కాలేజీ స్నేహితులతోనే ఖాళీ సమయాల్లో గడుపుతాను. ⇒ ప్రేమ, పెళ్లి గురించి? ♦ నేనెవరిని ప్రేమించలేదు. పెళ్లి కూడా అమ్మానాన్నలు కుదిర్చిన అబ్బాయినే చేసుకుంటాను. ⇒ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారట? ♦ హోటల్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అమ్మానాన్నలకు సొంతంగా బెంగళూరులో ఆస్పత్రి ఉంది. నటన చాలు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను చూసుకో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో! -
కొయ్యకుండానే కన్నీళ్లు
నెల్లూరు (కలెక్టరేట్) : ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మే నెలలో ఉల్లి కిలో రూ.20 ఉండగా జూలై ప్రారంభానికి ఏకంగా రూ.10 పెరిగింది. ఇప్పుడు కిలో రూ.35 పలుకుతున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన ఉల్లిని ప్రతిరోజూ వంటకాల్లో వినియోగించక తప్పదు. ఉల్లి కోయకనే సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఘాటెక్కిన ఉల్లి ధరల తో హోటల్ వ్యాపారులు అమాంతంగా వంటకాల ధరలు పెంచేస్తున్నారు. హోటల్‌కు వెళ్లి బిర్యాని, చపాతి, మాంసాహారాన్ని తీసుకుంటే ఉల్లి, నిమ్మకాయ ముక్కలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఉల్లిపాయలు ఇవ్వలేమని వినియోగదారులకు హోటల్ నిర్వాహకులు నిర్మొహమాటంగా చెబుతున్నారు. తగ్గిన పంటసాగు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి పంటసాగు తగ్గిందని స్టోన్‌హౌస్‌పేట హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పంటసాగు గణనీయంగా తగ్గడం వల్ల ఉల్లి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. ఉల్లిపాయలు ఎక్కువగా మహారాష్ర్టలోని పూణే, అహ్మద్‌నగర్, నాశిక్ ప్రాంతాల నుంచి జిల్లాకు ఎగుమతి అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాల జాడే లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటడం, బోరు బావులు ఎండిపోవడం, కరెంటు కోతలు అధికమవడం వల్ల రైతులు ఈ పంటపై ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. పైగా ఎండలు అధికంగా ఉండటంతో భూమిలో ఉల్లిపాయలు కుళ్లిపోతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని తెలుస్తోంది. రిటైల్ వ్యాపారుల ఇష్టారాజ్యం : బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరల పెరుగుదలను రిటైల్ వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. డిమాండ్‌ను బట్టి ఉల్లిపాయలను విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నిత్యావసర వ్యాపార రంగానికి కేంద్ర బిందువు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 40 టన్నుల వరకు నగరంలోని వివిధ వ్యాపార కేంద్రాలకు ఉల్లిపాయల విక్రయాలు జరుగుతుంటా యి. గత పదిరోజులుగా రోజుకు కనీసం 25 టన్నుల ఉల్లిపాయల విక్రయాలు జరగడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగే అవకాశం : ఇప్పటికే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉల్లి వైపు చూడటం లేదు. మరో రెండు రోజుల్లో ఉల్లి ధరలు మరింత ప్రియం కానున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే మహిళలు వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. మరింతగా ధరలు పెరిగితే మహిళలు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి.