![Demerged hotels biz will have a strong balance sheet Says ITC chairman - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/28/ITC-HOTELS.jpg.webp?itok=BY1lc_tp)
కోల్‌కత: హోటల్స్ వ్యాపారం బలమైన బ్యాలెన్స్ షీట్‌తోపాటు రుణ రహితంగా ఉంటుందని ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పురి గురువారం తెలిపారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు అవసరమైన రుణం, ఈక్విటీ లేదా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సమీకరించగలదని అన్నారు. అటువంటి మూలధనం ఎప్పుడు అవసరమో నిర్ణయించడం కొత్త సంస్థ బోర్డుకి సంబంధించినదని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విశ్లేషకులతో ఆయన ఈ విషయాలను చెప్పారు.
నూతన కంపెనీ ద్వారా హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులను కొనసాగిస్తామని వెల్లడించారు. అపార అవకాశాలతో ఇది సరైన సమయం. కొత్త కంపెనీ వృద్ధి బాట పట్టడంలో సహాయపడటానికి ఐటీసీ సంస్థాగత బలాల మద్దతు ఉంటుందని సంజీవ్ పురి వివరించారు. హోటల్స్ వ్యాపారాన్ని ఒక కొత్త సంస్థగా విడదీయడానికి జూలై 24న ఐటీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత నూతన కంపెనీలో ఐటీసీ నేరుగా 40 శాతం ఈక్విటీని కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం కంపెనీ వాటాదారుల సొంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment