ITC Limited
-
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
ఐటీసీ ఇన్ఫోటెక్ చేతికి బ్లేజ్‌క్లాన్
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా క్లౌడ్ సేవల్లో ఉన్న బ్లేజ్‌క్లాన్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.485 కోట్లు. గురువారం ఈ మేరకు ఇరు సంస్థలు వాటా కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి. 6–8 వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఐటీసీ లిమిటెడ్ వెల్లడించింది. మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో తమ క్లయింట్లకు సేవలకై సంస్థ సామర్థ్యం పెంపొందించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని తెలిపింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. కాగా.. నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్‌గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్‌ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది. విభాగాలవారీగా..: తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది. ‘హోటల్’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్‌లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్‌కానున్నాయి. ఐటీసీ హోటల్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది. -
రుణ రహితంగా ఐటీసీ హోటల్స్!
కోల్‌కత: హోటల్స్ వ్యాపారం బలమైన బ్యాలెన్స్ షీట్‌తోపాటు రుణ రహితంగా ఉంటుందని ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పురి గురువారం తెలిపారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చినప్పుడు అవసరమైన రుణం, ఈక్విటీ లేదా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సమీకరించగలదని అన్నారు. అటువంటి మూలధనం ఎప్పుడు అవసరమో నిర్ణయించడం కొత్త సంస్థ బోర్డుకి సంబంధించినదని కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విశ్లేషకులతో ఆయన ఈ విషయాలను చెప్పారు. నూతన కంపెనీ ద్వారా హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులను కొనసాగిస్తామని వెల్లడించారు. అపార అవకాశాలతో ఇది సరైన సమయం. కొత్త కంపెనీ వృద్ధి బాట పట్టడంలో సహాయపడటానికి ఐటీసీ సంస్థాగత బలాల మద్దతు ఉంటుందని సంజీవ్ పురి వివరించారు. హోటల్స్ వ్యాపారాన్ని ఒక కొత్త సంస్థగా విడదీయడానికి జూలై 24న ఐటీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత నూతన కంపెనీలో ఐటీసీ నేరుగా 40 శాతం ఈక్విటీని కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం కంపెనీ వాటాదారుల సొంతం అవుతుంది. -
ఐటీసీ చేతికి యోగా బార్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) బ్రాండ్ యోగా బార్‌ను సొంతం చేసుకోనుంది. బ్రాండ్ మాతృ సంస్థ స్ప్రవుట్‌లైఫ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్ఎఫ్పీఎల్)లో 100 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీసీ వెల్లడించింది. మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో వాటాను చేజిక్కించు కో నున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా తొలుత 47.5 శాతం వాటాను దశలవారీగా 2025 మార్చి 31కల్లా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. కొనుగోలు తీరిలా తొలుత 2023 ఫిబ్రవరి 15కల్లా ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 39.4 శాతం వాటాకుగాను రూ. 175 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఐటీసీ తెలియజేసింది. తదుపరి మరో రూ. 80 కోట్లు వెచ్చించడం ద్వారా 47.5 శాతానికి వాటాను పెంచుకోనున్నట్లు వివరించింది. మిగిలిన 52.5 శాతం వాటాను సైతం తదుపరి దశలలో కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఎస్ఎఫ్పీఎల్.. కొత్తతరం డిజిటల్ ఫస్ట్ బ్రాండ్ యోగా బార్ పేరున న్యూట్రిషన్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. వేగవంత వృద్ధిలో ఉన్న పౌష్టికాహార విభాగంలో ఏర్పాటైన స్టార్టప్ ఎస్ఎఫ్పీఎల్.. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 68 కోట్ల టర్నోవర్ సాధించింది. -
లైఫ్‌స్టైల్ రిటైలింగ్‌కు ఐటీసీ టాటా
న్యూఢిల్లీ: లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్ నుంచి వైదొలగినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బిజినెస్ పోర్ట్‌ఫోలియోపై వ్యూహాత్మక సమీక్ష తదుపరి ఇందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం విల్స్ లైఫ్‌స్టైల్ బ్రాండుతో ఐటీసీ ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఫార్మల్, క్యాజువల్, డిజైనర్ వేర్సహా పలు దుస్తులను విక్రయించడంతోపాటు.. జాన్ ప్లేయర్స్ బ్రాండుతో పురుషుల క్యాజువల్స్, డెనిమ్స్, ఫార్మల్స్ తదితరాలను సైతం మార్కెటింగ్ చేసింది. అయితే 2019లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్‌ను తగ్గించుకుంది. జాన్ ప్లేయర్స్ బ్రాండును రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. కొన్ని పాత స్టోర్స్లోగల విల్స్ బ్రాండు నిల్వలను విక్రయిస్తున్నట్లు గత నెలలో కంపెనీ చైర్మన్ సంజీవ్ పురి వెల్లడించిన విషయం విదితమే. -
ఐటీసీ డివిడెండ్ రూ. 6.25
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 12% వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3,817 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15% పైగా బలపడి రూ. 17,754 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15% పెరిగి రూ. 12,632 కోట్లను దాటాయి. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. జులై 22–26 మధ్య డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. కంపెనీ ఫిబ్రవరిలోనూ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం తెలిసిందే. విభాగాల వారీగా: ఐటీసీ క్యూ4 ఆదాయంలో సిగరెట్ల విభాగం నుంచి 10 శాతం అధికంగా రూ. 7,177 కోట్లు లభించగా.. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,149 కోట్లు సమకూరింది. ఇది 12 శాతం వృద్ధి. ఇక వ్యవసాయ సంబంధ బిజినెస్ మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 4,375 కోట్లను తాకింది. ఈ బాటలో హోటళ్ల ఆదాయం రూ. 105 కోట్లు జమ చేసుకుని రూ. 407 కోట్లను అధిగమించింది. పేపర్ బోర్డ్ అమ్మకాలు రూ. 1,656 కోట్ల నుంచి రూ. 2,183 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఐటీసీ నికర లాభం 16 శాతం పురోగమించి రూ. 15,243 కోట్లయ్యింది. 2020–21లో రూ. 13,161 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 65,205 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు ఎన్ఎస్ఈలో 0.75 శాతం బలపడి రూ. 267 వద్ద ముగిసింది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
దేశంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద కూడా కనిపిస్తుంది. సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఐటీసీ లిమిటెడ్ పేర్కొన్నాయి. దేశంలోని రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు తెలిపాయి. హెచ్‌యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం(రూ.2) పెంచింది. అలాగే, వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం(రూ.25) పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచినట్లు" పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?) -
ఐటీసీ కొనుగోళ్ల వేట
న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్ భవిష్యత్తు వృద్ధి మార్గాలపై దృష్టి పెట్టింది. ఆకర్షణీయమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతోపాటు.. ‘ఐటీసీ నెక్ట్స్’ వ్యూహంలో భాగంగా సామర్థ్య విస్తరణకు రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొనుగోళ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే కొనుగోళ్లకు చేసే ఖర్చు ప్రతిపాదిత పెట్టుబడులకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. డిమాండ్‌ను చేరుకునేందుకు, పోటీతత్వంతో కొనసాగేందుకు, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకునేందుకు అదనపు పెట్టుబడుల అవసరాన్ని ప్రస్తావించారు. వృద్ధికి మార్గాలను గుర్తించినట్టు చెప్పారు. కొత్త మార్గాలు..: ‘భవిష్యత్తు వినియోగ ధోరణులను గుర్తించాం. ఈ దిశగా ఏదైనా అవకాశం కనిపిస్తే.. అది మాకు విలువను తెచ్చిపెడుతుందని భావిస్తే ముందుకు వెళతాం (కొనుగోళ్లు). మధ్య కాలానికి దృష్టి సారిస్తూ.. అందులో భాగంగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాం. ఒక విభాగంలో సామర్థ్య వినియోగం గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చే స్తాం. ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకోవ డ మూ అవసరమే. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం (పేపర్), సూపర్ యాప్, ఐటీసీ మార్స్ (చిన్న రైతుల సామర్థ్య పెంపునకు సంబంధించి) అన్నవి కొత్త వృద్ధి విభా గాలు అవుతాయి’ అని సంజీవ్‌పురి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పైస్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మసాలా దినుసుల ప్లాంట్‌ను ఐటీసీ ఏర్పాటు చేయనుంది. దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాంట్‌ను వినియోగించనున్నట్టు పురి ప్రకటించారు. ఐపీఎం సర్టిఫైడ్ ఆహార, మసాల ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కఠినమైన నిబంధనలను అందుకునేలా ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు. -
పచ్చదనంపై పంచాయితీలు దృష్టిపెట్టాలి
-
భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ ఐటీసీ లిమిటెడ్‌ను కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్ధాలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్ సింగ్, ఉషారాణి ప్రగతి భవన్లో శనివారం సీఎంతో సమావేశమయ్యారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటీసీ చేపట్టి న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సంజీవ్ పురి వివరించారు. రాష్ట్రంలో అతిపెద్ద ఆహారశుద్ధి యూనిట్‌ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు సీఎం వారిని అభినందించారు. ‘వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఈ రంగంలో అనుభవమున్న ఐటీసీ కలిసి రావాలి. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయి. ముడి సరుకు సేకరణలో, ఇతర త్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి’అని సీఎం కోరారు. ములుగు జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటీసీ చొరవ చూపాలన్నారు. దీనికి ఐటీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 500 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు సిద్ధమవుతున్నాయి. వాటి చుట్టూ అందమైన ప్రకృతి ఆకృతి దాలుస్తోంది. రాష్ట్రంలో సహజ సిద్ధమైన అడవులున్నాయి. చారిత్రక ప్రదేశాలున్నా యి. ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభు త్వం ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ఐటీసీ కూడా కలిసి రావాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎంఓముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు పాల్గొన్నారు. -
క్యూ2లో 10 శాతం పెరిగిన ఐటీసీ లాభం
• క్యూ2లో రూ.2,500 కోట్లు • కలసివచ్చిన సిగరెట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: సిగరెట్ల అమ్మకాలు అధిక స్థాయిలో ఉండడంతో ఐటీసీ లిమిటెడ్ స్టాండలోన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 10% వృద్ధి చెంది రూ.2,500 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.2,262 కోట్లుగా ఉంది. ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.13,616 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.12,611 కోట్లు. ఈ మేరకు ఐటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. కేవలం సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ ద్వారా ఆదాయం 8.51 శాతం వృద్ది చెంది రూ.11,200గా నమోదైంది. కేవలం సిగరెట్ల విక్రయాల ద్వారా ఆదాయం 7 శాతం పెరిగి రూ.8,528 కోట్లుగా నమోదైంది. ఇన్పుట్ వ్యయం పెరిగిపోవడం, అమ్మకాలపై ఒత్తిళ్లు, ఎఫ్ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగించడం వంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్టు ఐటీసీ తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇబిటా 7.3 శాతం వృద్ధి చెందింది. మార్జిన్ల శాతం 26.8 శాతం నుంచి 26.7 శాతానికి తగ్గింది. ఐటీసీ హోటల్స్ వ్యాపారం 2.50 శాతం వృద్ధి సాధించింది. హోటల్స్ ద్వారా రూ.297 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అగ్రి వ్యాపారం ద్వారా ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.1,880కోట్లుగా నమోదైంది. పేపర్ బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా వచ్చిన ఆదాయం పెద్దగా మార్పు ఏమీ లేకుండా రూ.1,331 కోట్లుగా నమోదైంది.