న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది.
సిగరెట్లుసహా ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. కాగా.. నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్‌గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఆదాయం అప్
ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్‌ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్‌ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది.
ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment