consolidated
-
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
ఆర్టీసీలో కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల కింద పనిచేసే ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం సర్వీసులో కొనసాగే వారి వేతనాల(కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్)ను ఆర్టీసీ పెంచింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించిన విషయం తెలిసిందే. 2017 వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలులోకి తెచ్చింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కన్సాలిడేటెడ్ చెల్లింపులనూ సవరిస్తూ ఆర్టీసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీం పేరుతో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయి. సర్వీసులో ఉండి చనిపోయే ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. వారి అర్హతల ఆధారంగా ఈ కేటాయింపులుంటాయి. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను సరిగా చేపట్టలేదు. దీంతో దాదాపు 1800 కుటుంబాలు ఎదురుచూస్తూ వచ్చాయి. ఆయా కుటుంబాల ఒత్తిడి పెరగటంతో దశలవారీగా వారికి ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పూర్తిస్థాయి ఉద్యోగం కాకుండా, తాత్కాలిక పద్ధతిలో ఇవ్వనుంది. మూడేళ్లపాటు వారి పనితీరు పరిశీలించి తదనుగుణంగా పర్మినెంట్ చేసే విషయంపై నిర్ణయం తీసుకునేలా అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లించనుంది. డ్రైవర్ గ్రేడ్–2, కండక్టర్ గ్రేడ్–2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టుల్లో నియామకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న వారి రెమ్యునరేషన్‌ను పెంచింది. అలాగే, ఆర్టీసీలో వివిధ పోస్టుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారు తిరిగి వారి సేవలు కొనసాగించే పద్ధతి కూడా అమలులో ఉంది. ఆయా స్థాయిల్లో ఖాళీగా ఉండే పోస్టుల ఆధారంగా వారి సర్వీసులను ఆర్టీసీ కొనసాగిస్తుంది. వారికి కూడా ఆయా పోస్టుల ఆధారంగా కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఇప్పుడు వాటిని కూడా పెంచింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. కాగా.. నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్‌గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్‌ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
అదానీ పవర్ ఆకర్షణీయం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం అప్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది. -
కోరమాండల్ లాభం రూ.755 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది. ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. -
లాభాల్లోకి ఏసీసీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్లో నష్టాలను వీడి రూ. 388 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం, ఇంధన వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్, నిర్వహణా సామర్థ్యం తోడ్పాటునిచ్చాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా పుంజుకుని రూ. 4,435 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,987 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో సిమెంట్, క్లింకర్ అమ్మకాలు 17 శాతంపైగా ఎగసి 8.1 మిలియన్ టన్నులను తాకాయి. మొత్తం వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 4,127 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 1,913 వద్ద ముగిసింది. -
క్షీణించిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 2,022 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,061 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటు తదుపరి నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 2,345 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 10,764 కోట్ల నుంచి రూ. 12,145 కోట్లకు ఎగసింది. అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలూ వృద్ధి బాటలో సాగుతున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 12 శాతం బలపడి 47.1 కోట్ల డాలర్లను తాకాయి. ఇవి ఆదాయంలో 33 శాతంకాగా.. దేశీ విక్రయాలు మొత్తం ఆదాయంలో 30 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు దిలీప్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 0.4 శాతం లాభంతో రూ. 1,141 వద్ద ముగిసింది -
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 44 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 677 కోట్లను తాకింది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 469 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 41,066 కోట్ల నుంచి రూ. 25,810 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 40,434 కోట్ల నుంచి రూ. 24,731 కోట్లకు వెనకడుగు వేశాయి. ఈ కాలంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్ 2.13 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేసింది. 27 శాతం వృద్ధి ఇది. అదానీ న్యూ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ నుంచి మాడ్యూల్స్ విక్రయాలు 87 శాతం జంప్‌చేసి 614 మెగావాట్లకు చేరాయి. డేటా సెంటర్ పనులు.. విభిన్న బిజినెస్‌లు పటిష్ట వృద్ధిని సాధించడంతోపాటు కొత్త విభాగాలు సైతం పురోగతిలో ఉన్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. అదానీ కానెక్స్(చెన్నై డేటా సెంటర్ రెండో దశ) పనులు 74 శాతం పూర్తికాగా.. నోయిడా సెంటర్లో 51 శాతం, హైదరాబాద్‌లో 46 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. కచ్ కాపర్, నవీ ముంబై ఎయిర్పోర్ట్, 5 మెగావాట్ల ఆన్‌షోర్ విండ్ టర్బయిన్ సరి్టఫికేషన్ తదితర భారీస్థాయి ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా మౌలిక రంగంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్, న్యూ ఇండస్ట్రీస్, డేటా సెంటర్, రోడ్స్ తదితర కొత్త బిజినెస్‌లను పటిష్టరీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 2.4 శాతం ఎగసి రూ. 2,532 వద్ద ముగిసింది. -
గోద్రేజ్ ప్రాపర్టిస్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రాపర్టిస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.125 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లతో పోల్చి చూసినప్పుడు మూడు రెట్లు వృద్ధి చెందింది. కొత్త బుకింగ్‌లు (ఇళ్లు/ఫ్లాట్లు) 11 శాతం తగ్గి జూన్ త్రైమాసికంలో రూ.2,254 కోట్లుగా ఉన్నాయి. బుకింగ్‌ల పరిమాణం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పడు 20 శాతం తగ్గి 2.25 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.426 కోట్ల నుంచి రూ1,266 కోట్లకు దూసుకుపోయింది. ఎన్సీడీలు, బాండ్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. జూన్ త్రైమాసికంలో 4.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో ఇళ్లను కస్టమర్లకు అందించింది. లక్ష్యం దిశగానే.. ‘‘బుకింగ్‌ల పరంగా ఇది స్తబ్దతతో కూడిన త్రైమాసికం. డెలివరీలు, వ్యాపార అభివృద్ధి, నగదు వసూళ్లు అన్నీ కూడా జూన్ క్వార్టర్లో మంచి వృద్ధిని చూశాయి. బలమైన కొత్త ప్రాజెక్టుల ఆరంభ ప్రణాళికలు, బలమైన బ్యాలన్స్ షీట్, చెక్కుచెదరని డిమాండ్ ఇవన్నీ కలసి 2023–24 సంవత్సరంలో రూ.14,000 కోట్ల బుకింగ్‌ల లక్ష్యాన్ని చేరుకునే దిశలోనే ఉన్నాం’’అని గోద్రేజ్ ప్రాపర్టిస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పిరోజ్షా గోద్రేజ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.12,232 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించడం గమనార్హం. జూన్‌లో నమోదైన తాజా బుకింగ్‌లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ.656 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో రూ.548 కోట్లు, బెంగళూరు మార్కెట్లో రూ.509 కోట్లు, పుణె మార్కెట్లో రూ.446 కోట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు మార్కెట్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. జయశ్రీ వైద్యనాథన్‌ను అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 954 కోట్ల నికర లాభం ఆర్జించింది. 62 శాతం ఎగసింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికం కాగా.. ఇందుకు పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదపడినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 61 శాతం ఎగసి రూ. 3,165 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) రూ. 1,970 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 25 శాతం పుంజుకుని రూ. 1,909 కోట్లను అధిగమించింది. ఇతర ఆదాయం 58 శాతం ఎగసి రూ. 734 కోట్లను తాకింది. దీంతో రికార్డ్ లాభం ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్‌చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్ ప్రైమ్ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. అకౌంటింగ్ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్ కారణంగా క్యాపిటల్ మార్కెట్ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్ మేనేజ్మెంట్ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది. -
జ్యోతి ల్యాబ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 547 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండు ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి జ్యోతి ల్యాబ్స్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 159 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 191 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 15 శాతంపైగా వృద్ధితో రూ. 2,196 కోట్లను అధిగమించాయి. ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేరు బీఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 150 వద్ద ముగిసింది. -
సెయిల్ డివిడెండ్ రూ. 2.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 2,479 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,450 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 23,533 కోట్ల నుంచి రూ. 31,175 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 18,829 కోట్ల నుంచి రూ. 28,005 కోట్లకు భారీగా పెరిగాయి. మార్చికల్లా రుణ భారం రూ. 13,400 కోట్లుగా నమోదైనట్లు సెయిల్ వెల్లడించింది. తాజా సమీక్షా కాలంలో 4.6 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగా.. 4.71 ఎంటీ అమ్మకాలను సాధించింది. 2020–21 క్యూ4లో స్టీల్ ఉత్పత్తి 4.56 ఎంటీకాగా.. 3.43 ఎంటీ విక్రయాలు నమోదయ్యాయి. కోకింగ్ కోల్ తదితర ముడివ్యయాల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో వ్యయాల అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 74 వద్ద ముగిసింది. -
ఇన్ఫీ లాభం రూ.5,686 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. త్రైమాసికంగా తగ్గుదల... 2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి ఇలా... 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నికర లాభం రూ.22,110 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతం ఎగసి రూ.1,00,472 కోట్ల నుంచి రూ.1,21,641 కోట్లకు పెరిగింది. కాగా, ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 13–15 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. పటిష్టమైన డిమాండ్ పరిస్థితులు, భారీ స్థాయిలో దక్కించుకుంటున్న డీల్స్ ఇందుకు దోహదం చేస్తాయని కంపెనీ వెల్లడించింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను 12–14 శాతంగా పేర్కొన్న ఇన్ఫీ, 2022 జనవరిలో దీన్ని 19.5–20 శాతానికి పెంచడం గమనార్హం. పటిష్టమైన డిమాండ్ నేపథ్యంలో అమ్మకాలు, డెలివరీ ఇంకా నవకల్పనల్లో సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తగిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నిరంజన్ రాయ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యంశాలు... ► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇన్ఫీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ (టీసీవీ) 2.3 బిలియన్ డాలర్లు. పూర్తి ఏడాదికి టీసీవీ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4లో స్థూలంగా 110 కొత్త క్లయింట్లు జతయ్యారు. ► క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 3 శాతం మేర దిగజారి 21.5 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి కూడా 3 శాతం తగ్గుదలతో 23 శాతంగా నమోదైంది. ► ఇన్ఫీ డైరెక్టర్ల బోర్డు 2021–22 ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. తద్వారా పూర్తి ఏడాదికి ఇన్వెస్టర్లకు మొత్తం రూ.31 డివిడెండ్ (రూ.13,000 కోట్లు) లభించినట్లవుతుంది. 2020–21తో పోలిస్తే డివిడెండ్ 14.8 శాతం పెరిగినట్లు లెక్క. ► ప్రస్తుతం రష్యాకు చెందిన క్లయింట్లతో ఎలాంటి కాంట్రాక్టులు లేవని, రాబోయే కాలంలో కూడా సంబంధిత ప్రణాళికలు ఏవీ ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. రష్యాలో ఉన్న నామమాత్ర వ్యాపారాన్ని తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ► ఈ ఏడాది కనీసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది అంచనాలను మించి 85,000 మంది ఫ్రెషర్లకు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, 2022 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరింది. వెరసి 2021 మార్చి చివరి నాటితో పోలిస్తే నికరంగా 54,396 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఇన్ఫీలో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 2021–22 క్యూ4లో 27.7 శాతానికి ఎగబాకింది, క్యూ3లో ఇది 25.5 శాతంగా ఉంది. 2020–21 క్యూ4లో అట్రిషన్ రేటు 10.9 శాతం మాత్రమే కావడం గమనార్హం. ► ఆర్థిక ఫలితాలు మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ఇన్ఫోసిస్ షేరు బుధవారం స్వల్పంగా 0.5 శాతం మేర లాభంతో రూ.1,749 వద్ద స్థిరపడింది. కాగా, విశ్లేషకుల అంచనాల మేరకు క్యూ4 ఫలితాలు లేకపోవడం, మార్జిన్లు దిగజారడం, అట్రిషన్ భారీగా ఎగబాకవడంతో ఇన్ఫీ ఏడీఆర్ బుధవారం నాస్డాక్లో ఒక దశలో 5 శాతం పైగా నష్టపోయింది. భారీ డీల్స్ దన్ను... 2021–22లో సుస్థిర వ్యాపార జోరు, భారీ స్థాయి డీల్స్‌ను చేజిక్కించుకోవడం, మరిన్ని పెద్ద డీల్స్ కూడా వరుసలో ఉండటం మాకు కలిసొచ్చింది. డిజిటల్ రంగంలో విజయవంతంగా నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని మా క్లయింట్లలో కల్పించడం ద్వారా మా మార్కెట్ వాటా వృద్ధి కొనసాగనుంది. 2022–23లో 13–15 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాం. గతేడాది కంపెనీ అన్ని వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ -
మార్కెట్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారం పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ.., స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. అలాగే స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని వారంటున్నారు. ప్రపంచ పరిణామాలు, ఎఫ్ఐఐల వైఖరి కీలకం ‘‘ప్రపంచ మార్కెట్ల మిశ్రమ వైఖరితో దేశీయ స్టాక్ సూచీల గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోవచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. సాంకేతికంగా నిఫ్టీ తన 50 రోజుల సగటు తక్షణ మద్దతు 17,674 స్థాయిని నిలుపుకోగలిగింది. అప్‌సైడ్‌లో 18,000–18,200 శ్రేణి మధ్య బలమైన నిరోధాన్ని ఎదుర్కోనుంది’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. గత వారంలో సెన్సెక్స్ 761 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్లు లాభపడ్డాయి. కార్పొరేట్ల క్వార్టర్ ఫలితాలపై దృష్టి... కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఈ వారంలో 2,100 పైగా కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. బ్రిటానియా, అరబిందో, భాష్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జొమాటో, టాటా స్టీల్, కోల్ ఇండియా, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో, ఓఎన్జీసీ లు సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలను వెల్లడించే కంపెనీల జాబితాలో ఉన్నాయి. బేరీష్‌గా విదేశీ ఇన్వెస్టర్లు... వరుసగా మూడోవారంలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీలను అమ్మేందుకే మొగ్గు చూపారు. గత నెల ఆక్టోబర్‌లో రూ.13550 కోట్ల షేర్లను షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా ఈ నవంబర్ ఇప్పటి వరకు రూ.4,583 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రానున్న రోజుల్లో ఇదే వైఖరి కొనసాగితే మార్కెట్లో కరెక్షన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు కీలకం.... అమెరికా, చైనాలు బుధవారం(10న) ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఆర్థికంగా అగ్ర రాజ్యాలైన ఈ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మక, కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. అలాగే పలు దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు, పెంపు అంశాలను సైతం ఈ గణాంకాలు ప్రభావితం చేయగలవు. ఇక దేశీయంగా శుక్రవారం(నవంబర్ 12న) దేశీయ సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. -
క్యూ2 లో సెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్‌ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్‌ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్‌కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 30 శాతం అప్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 992 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. మరోవైపు, ఆదాయం రూ. 4,897 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, అన్ని మార్కెట్లలో విక్రయాలు భారీగా పెరగడం తదితర అంశాలు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర నిర్వహణ ఆదాయం రూ. 15 కోట్లు ఉండగా.. తాజా క్యూ2లో రూ. 170 కోట్లకు పెరిగింది. -
తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ(అప్డేటెడ్)
ముంబై, సాక్షి: వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 47,782కు చేరగా.. నిఫ్టీ 9 పాయింట్లు పుంజుకుని 13,991 వద్ద ట్రేడవుతోంది. గత 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు నేడు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,801-47,602 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 13998-13936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్‌సెషన్‌కంటే ముందుగానే నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. 28 పాయింట్లు బలపడటం ద్వారా ఇంట్రాడేలో 14,010ను తాకింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ ఈ ఫీట్‌ను సాధించింది. పీఎస్‌యూ బ్యాంక్స్ ప్లస్ ఎన్ఎస్ఈలో ఐటీ, ఎఫ్ఎంసీజీ 0.4-0.2 శాతం చొప్పున నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్1-0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, దివీస్, ఆర్ఐఎల్ 1.4-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, గెయిల్, యూపీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐషర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అరబిందో జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో అరబిందో, ఐడియా, పీవీఆర్, బీఈఎల్, గ్లెన్‌మార్క్, అశోక్ లేలాండ్, లుపిన్, పెట్రోనెట్ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు బంధన్ బ్యాంక్, రామ్‌కో సిమెంట్, అంబుజా, ఏసీసీ, జీఎంఆర్, అదానీ ఎంటర్, టొరంట్ పవర్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,488 లాభపడగా.. 703 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 22% అప్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.2,947 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,407 కోట్లతో పోలిస్తే 22% వృద్ధి చెందింది. మొత్తం ఆదా యం రూ.12,543 కోట్ల నుంచి రూ.13,591 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌గా చూస్తే... కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలపై (స్టాండెలోన్) క్యూ2లో కోటక్ బ్యాంక్ రూ.2,184 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,724 కోట్లతో పోలిస్తే 27 శాతం ఎగబాకింది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.7,986 కోట్ల నుంచి రూ.8,288 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,913 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.6 శాతం నుంచి 4.53 శాతానికి క్షీణించింది. ‘గడిచిన కొద్ది త్రైమాసికాలుగా బ్యాంక్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, వాణిజ్య బాండ్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు వంటి రుణేతర సాధనాలపై అధికంగా ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మేం అనుసరిస్తున్న అప్రమత్త ధోరణికి గత ఆరు నెలల రుణ వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి ఇది మరింత భద్రమైన మార్గంగా మేం భావిస్తున్నాం‘ అని కోటక్ బ్యాంక్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. మొండిబాకీలు ఇలా... మొత్తం రుణాల్లో నికర మొండిబకాయిలు (ఎన్పీఏ) గతేడాది క్యూ2లో 0.85 శాతం (రూ.1,811 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ2లో 0.64 శాతానికి (రూ.1,304 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్పీఏలు మాత్రం 2.32 శాతం (రూ.5,034 కోట్లు) నుంచి 2.55 శాతానికి (రూ.5,336 కోట్లు) పెరిగాయి. మొండిబాకీలు, కంటింజెన్సీలకు మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.408 కోట్ల నుంచి రూ.369 కోట్లకు దిగొచ్చాయి. -
కన్సాలిడేషన్- స్వల్ప నష్టాలతో సరి
కొద్ది రోజులుగా ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు క్షీణించి 37,871 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. దాదాపు 5 రోజులపాటు మార్కెట్లు లాభపడటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టడం ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,199 వద్ద గరిష్టాన్ని, 37,602 దిగువన కనిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ 11,238- 11,057 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కరోనా వైరస్ అమెరికాసహా పలు దేశాలలో వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లు పసిడివైపు దృష్టిసారించడం కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు. ప్రయివేట్ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.6-0.7 శాతం మధ్య బలహీనపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్ 7 శాతం, టైటన్ 5 శాతం చొప్పున జంప్‌చేయగా.. పవర్‌గ్రిడ్, జీ, ఐటీసీ, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, యూపీఎల్, వేదాంతా, ఇన్ఫ్రాటెల్ 3.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో హీరో మోటో, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, శ్రీ సిమెంట్, బ్రిటానియా, ఇన్ఫోసిస్ 3.5-2 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎంఅండ్ఎం ఫైనాన్స్ జూమ్ డెరివేటివ్స్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్ 10 శాతం దూసుకెళ్లగా.. ముత్తూట్, పీవీఆర్, చోళమండలం, ఫెడరల్ బ్యాంక్, మణప్పురం, జీఎంఆర్ ఇన్ఫ్రా 7-4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు పిరమల్, జిందాల్ స్టీల్, ఎస్బీఐ లైఫ్, జూబిలెంట్ ఫుడ్, హెచ్‌పీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 4.5-2.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1172 లాభపడితే.. 1471 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐలు భళా.. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఇండస్ఇండ్ లాభం రూ.1,401 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 52 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.920 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,401 కోట్లకు పెరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం స్వల్పంగా తగ్గిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్ తక్కువ వృద్ధిని నమోదు చేయడం దీనికి కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,755 కోట్ల నుంచి రూ.8,878 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.1 శాతం నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.2,909 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడి 4.1 శాతానికి ఎగసిందని వివరించారు. 21 శాతం రుణ వృద్ధి సాధించామని, ఇది బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి అని, మందగమనం ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండగలదని అంచనా వేస్తున్నామన్నారు. ఎగబాకిన మొండిబకాయిలు... నికర లాభం, ఆదాయాలతో పాటు బ్యాంక్ మొండి బకాయిలు కూడా పెరిగాయి. రుణ నాణ్యత వార్షికంగా, సీక్వెన్షియల్‌గా చూసినా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 1.09 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 2.19 శాతానికి పెరిగాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అలాగే నికర మొండి బకాయిలు 0.48 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.725 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,102 కోట్లకు పెరిగాయని తెలిపారు. దీంట్లో కంపెనీల తాజా మొండి బకాయిలు 174 శాతం, రిటైల్ రుణాలకు సంబంధించిన తాజా మొండి బకాయిలు 13 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు రూ.590 కోట్ల నుంచి 71 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరాయని వివరించారు. ఈ క్యూ1లో 43 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ క్యూ2లో 50 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నికర లాభం, ఆదాయం పెరిగినా, మొండి బకాయిలు రెట్టింపై రుణనాణ్యత క్షీణించడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 6.1 శాతం నష్టంతో రూ. 1,229 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ లాభం 6 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–.జూన్ క్వార్టర్(2019–20, క్యూ1)లో 6 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.160 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ. 151కోట్లకు చేరిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,626 కోట్ల నుంచి రూ.5,026 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,386 కోట్ల నుంచి రూ.4,793 కోట్లకు చేరాయని తెలిపింది. గత క్యూ1లో 8.93 లక్షలుగా ఉన్న మొత్తం టూ, త్రీ వీలర్ల అమ్మకాలు (ఎగుమతులతో కలుపుకొని) ఈ క్యూ1లో 8.84 లక్షలకు తగ్గాయని తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 8 శాతం పెరిగి 4.17 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2.95 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 11 శాతం వృద్ధితో 40,000కు పెరిగాయని పేర్కొంది. ఎగుమతులు మాత్రం భారీగా తగ్గాయని, అందుకనే మొత్తం అమ్మకాలు క్షీణించాయని వివరించింది. నికర లాభం 6 శాతం తగ్గడంతో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ షేర్ 4% నష్టంతో రూ.380 వద్ద ముగిసింది.