న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్‌లో నష్టాలను వీడి రూ. 388 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం, ఇంధన వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్, నిర్వహణా సామర్థ్యం తోడ్పాటునిచ్చాయి.
గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా పుంజుకుని రూ. 4,435 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,987 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో సిమెంట్, క్లింకర్ అమ్మకాలు 17 శాతంపైగా ఎగసి 8.1 మిలియన్ టన్నులను తాకాయి. మొత్తం వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 4,127 కోట్లకు పరిమితమయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 1,913 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment