
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 992 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. మరోవైపు, ఆదాయం రూ. 4,897 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, అన్ని మార్కెట్లలో విక్రయాలు భారీగా పెరగడం తదితర అంశాలు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర నిర్వహణ ఆదాయం రూ. 15 కోట్లు ఉండగా.. తాజా క్యూ2లో రూ. 170 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment