
న్యూఢిల్లీ: పీఎస్‌యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్‌ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్‌ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్‌కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.
ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment