
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభుత్వం చేపట్టనున్న వాటా విక్రయ ప్రణాళికలు నిధుల సమీకరణకు జోష్‌నిచ్చే వీలున్నట్లు ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఇటీవల మార్కెట్ దిద్దుబాటు కారణంగా డీల్ యాక్టివిటీ మందగించినట్లు తెలియజేసింది. ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంశాలపై ఏర్పాటైన వెబినార్‌లో ప్రసంగిస్తూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సీఈవో యతిన్ సింగ్ ఈ అంశాలను పేర్కొన్నారు.
వచ్చే ఏడాదికి వాటా విక్రయాల ద్వారా రూ. 47,000 కోట్ల లక్ష్యాన్ని ‘దీపమ్’ నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. దీంతో దేశీయంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు ప్రభుత్వం మెటీరియల్ క్లయింట్‌గా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి వచ్చే ఏడాదితోపాటు ఆపై కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు ఇది భారీ అవకాశంగా నిలవనున్నట్లు అంచనా వేశారు. గత మూడేళ్లుగా పీఎస్‌యూ దిగ్గజాలు ఎల్‌ఐసీ, ఇరెడా ఐపీవోలతోపాటు.. ఓఎన్‌జీసీ, ఐఆర్‌సీటీసీ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్), కోల్ ఇండియా, ఆర్‌వీఎన్‌ఎల్, ఎన్‌హెచ్‌పీసీ, హడ్కో, ఇర్కాన్, కొచిన్ షిప్‌యార్డ్ తదితర ఓఎఫ్‌ఎస్‌ల కారణంగా డీల్ స్ట్రీట్ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: రూ.21.57 లక్షల కోట్లకు ఐటీ సర్వీసులు
భవిష్యత్‌లోనూ భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్(సీఎంపీడీఐ), మహారాష్ట్ర నేచురల్ గ్యాస్(ఎంఎన్‌జీఎల్) పబ్లిక్ ఇష్యూలుసహా.. ఇరెడా, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, వీడల్, సెంట్రల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐవోబీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ క్విప్, ఓఎఫ్‌ఎస్ తదితరాలు భారీ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment