raise funds
-
2026లో నిధుల సమీకరణకు జోష్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభుత్వం చేపట్టనున్న వాటా విక్రయ ప్రణాళికలు నిధుల సమీకరణకు జోష్‌నిచ్చే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఇటీవల మార్కెట్ దిద్దుబాటు కారణంగా డీల్ యాక్టివిటీ మందగించినట్లు తెలియజేసింది. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంశాలపై ఏర్పాటైన వెబినార్‌లో ప్రసంగిస్తూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సీఈవో యతిన్ సింగ్ ఈ అంశాలను పేర్కొన్నారు.వచ్చే ఏడాదికి వాటా విక్రయాల ద్వారా రూ. 47,000 కోట్ల లక్ష్యాన్ని ‘దీపమ్’ నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. దీంతో దేశీయంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు ప్రభుత్వం మెటీరియల్ క్లయింట్‌గా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి వచ్చే ఏడాదితోపాటు ఆపై కాలంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు ఇది భారీ అవకాశంగా నిలవనున్నట్లు అంచనా వేశారు. గత మూడేళ్లుగా పీఎస్‌యూ దిగ్గజాలు ఎల్ఐసీ, ఇరెడా ఐపీవోలతోపాటు.. ఓఎన్జీసీ, ఐఆర్సీటీసీ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్), కోల్ ఇండియా, ఆర్వీఎన్ఎల్, ఎన్‌హెచ్‌పీసీ, హడ్కో, ఇర్కాన్, కొచిన్ షిప్‌యార్డ్ తదితర ఓఎఫ్ఎస్ల కారణంగా డీల్ స్ట్రీట్ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: రూ.21.57 లక్షల కోట్లకు ఐటీ సర్వీసులుభవిష్యత్లోనూ భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ), మహారాష్ట్ర నేచురల్ గ్యాస్(ఎంఎన్‌జీఎల్) పబ్లిక్ ఇష్యూలుసహా.. ఇరెడా, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, వీడల్, సెంట్రల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐవోబీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ క్విప్, ఓఎఫ్ఎస్ తదితరాలు భారీ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. -
క్యాపిటల్ మార్కెట్లకు రోడ్డు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఈ నెలలో ప్రభుత్వం క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభదాయకం కావడంతో దేశీయంగా రహదారి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. రానున్న మూడేళ్లలో జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్హెచ్ఏఐ) టోల్ ఆదాయం రూ. 1.4 లక్షల కోట్లకు జంప్ చేయనున్నట్లు ఒక సదస్సుకు హాజరైన రోడ్ రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షికంగా రూ. 40,000 కోట్ల టోల్ ఆదాయం లభిస్తోంది. పటిష్ట టోల్ ఆదాయం ఆర్జిస్తున్న ఎన్హెచ్ఏఐకు ఏఏఏ రేటింగ్ ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీ స్పందన లభించనున్నట్లు గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల(ఇన్విట్స్) ద్వారా నిధులను సమీకరించనున్నట్లు గడ్కరీ గత నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 10 లక్షల పెట్టుబడుల పరిమితిని ప్రకటించారు. త్వరలో ఇన్విట్స్‌ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్విట్ యూనిట్లలో లావాదేవీలు చేపట్టవచ్చని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన పెట్టుబడులకు ఇన్విట్స్లోనూ యూనిట్లను జారీ చేస్తారు. -
‘అసైన్డ్’ వేట కాసుల బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాసుల వేట సాగిస్తోంది. ఆర్థికమాంద్యంతో ఆదాయార్జన శాఖలు లక్ష్యసాధనలో చతికిలపడటంతో లోటు సర్దుబాటుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భూముల వేలంతో నిధులను సమకూర్చుకునే దిశగా యోచిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు నింగినంటడంతో అసైన్డ్ భూముల అమ్మకం లేదా బడా సంస్థలకు కట్టబెట్టడం ద్వారా నిధులను సమీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, గండిపేట మండలాల పరిధిలో ఉన్న ఆరు గ్రామాల్లోని అసైన్డ్/ప్రభుత్వ భూముల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆయా గ్రామాల పరిధిలో సర్వే నిర్వహించిన రెవెన్యూ యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పొజిషన్లో ఉన్న లబ్ధిదారుల జాబితా/పరాధీనమైన అసైన్డ్ భూముల లెక్క తీసింది. ఆయా ప్రాంతాల్లోని భూముల ప్రభుత్వ విలువ, బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధర, భూమి సేకరిస్తే చెల్లించాల్సిన మొత్తం, ప్రభుత్వానికి చేకూరే లబ్ధిపై అంచనాలను కూడా సేకరించింది. తద్వారా ఈ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. ఖజానాకు కాసుల పంట! సర్వే నిర్వహించిన ఆరు గ్రామాల్లోగుర్తించిన 1,636 ఎకరాలను విక్రయిస్తే రాష్ట్ర ఖజానాకు రూ.5,745 కోట్ల ఆదాయం రానుంది. మహేశ్వరం మండలం కొంగరఖర్దు, తుమ్మలూరు, రావిర్యాల, కందుకూరు మండలం మాదాపూర్, శంషాబాద్ మండలం రాయన్నగూడ పరిధిలో భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ చేసిన 1,448 ఎకరాలను స్వాధీనం చేసుకొని వేలం వేస్తే ఈ మేరకు రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిర్దేశిత భూమి విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ) రూ.276.93 కోట్లు మాత్రమే ఉండగా.. గుర్తించిన ఈ భూములను సేకరిస్తే నష్టపరిహారం రూపంలో అసైన్డ్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,222.93 కోట్లుగా రెవెన్యూ శాఖ లెక్కగట్టింది. ఈ ఐదు గ్రామాల్లో ఈ భూములకు బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధర ఎంతో తెలుసా.. రూ.3,584.30 కోట్లు. అంటే ప్రభుత్వ ఖజానాకు లభించే ఆదాయం రూ.2,361.51 కోట్లన్న మాట. ఇలా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నందున.. చేతులు మారిన, అసైన్డ్‌దారుల కబ్జాలో ఉన్న భూములను సేకరించడం ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా.. ఇటీవల హైదరాబాద్‌కు బహుళ జాతి సంస్థలు, ఐటీ కంపెనీల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ బ్యాంక్‌పై కసరత్తు చేస్తున్న సర్కార్.. నగరానికి చేరువలో ఉన్న ప్రభుత్వ భూ లభ్యతపై లెక్క తీస్తోంది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములను సేకరించాలని యోచిస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం అసైన్డ్, ప్రభుత్వ, ప్రైవేటు భూముల లెక్క తేలింది. పరాధీనమైన అసైన్డ్ భూములు, ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించే దిశగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం.. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. పట్టా భూముల సేకరణ వ్యయంతో కూడుకున్నదే గాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తుండటంతో అసైన్డ్ భూములపై ప్రభుత్వం కన్నేసింది. ఈ భూములను వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను బడా సంస్థలకు కేటాయించడం లేదా వేలం వేయడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకోవడమో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ భూముల లెక్క తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 188 ఎకరాలు.. రూ.3,384 కోట్లు గండిపేట మండలం పుప్పాల్‌గూడ. ఇది ఐటీ హబ్‌కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామం. బడా సంస్థల రాకతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ గ్రామంలో 188 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ తాజా సర్వేలో తేల్చింది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.3,384 కోట్ల మేర ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాల్లో 1,636 ఎకరాలను అమ్మడం ద్వారా రూ.5,745 కోట్ల మేర రాబట్టవచ్చని ఆశిస్తోంది. -
బాలల కోసం నటి విరాళాల సేకరణ
ముంబై: ఒకప్పటి సినిమా తారలు కేవలం నటనకే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత తరంవారిలో కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో సినిమా తారలు పాల్గొనడం చాలా అరుదు. కానీ ఇప్పటి తరం తారలు మాత్రం నటనతోపాటు సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇటువంటివారిలో ముందుంటుంది దియా మీర్జా. తారగా, అందాల పోటీల్లో విజేతగా నిలిచిన దియా సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటోంది. నిరుపేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా దియా మాట్లాడుతూ.. ‘కెట్టో అనే ఆన్ లైన్ వెబ్సైట్ ద్వారా పేదల పిల్లల కోసం నిధుల సేకరించాలని జెనెసిస్ ఫౌండేషన్ నిర్ణయించింది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం అవసరం. అందుకు ఎవరైనా సెలబ్రిటీలు కావాలని అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నా. ఇవ్వడం, పంచుకోవడం, ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం వంటి పదాలంటే నాకెంతో ఇష్టమ’ని పేర్కొంది. -
నేపాల్ మృతులకు నివాళి