SAIL
-
3 డిమాండ్లపైనా మౌనమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్‌ను కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.భారీగా బకాయిలు..విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్‌లు అవసరం. నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్‌ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్పం..విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.తాత్కాలిక ఉపశనమం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ సొంత గనులు కేటాయిస్తేనే..ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ అంతా బూటకం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్‌కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందే
సీతంపేట (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాలివైఎస్సార్సీపీ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. ప్లాంట్ ఉద్యోగుల జీతాల తగ్గింపుతో గాజువాకలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయన్నారు. రూ.200 కోట్ల టర్నోవర్ తగ్గిపోయిందన్నారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జనసేన పార్టీ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, సీపీఎ (ఎంల్) నేత గణేష్ పాండా, ఏఐటీయూసీ నేత కె.శంకరరావు, ఎస్‌యూసీఐ నేత సీహెచ్ ప్రమీల, ఆప్ నేత శీతల్, బీఎస్పీ నేత శివప్రసాద్, ఆర్పీఐ నేత బొడ్డు కల్యాణరావు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్లో జన్మించిన దిల్నా 2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్ నేవీలో చేరారు. (చదవండి: భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..) -
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
సెయిల్ ఈ ఏడాది పెట్టుబడి రూ. 6,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. 2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తొలి దశలో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు చేరుస్తాం. తదుపరి దశలో వార్షిక సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుతాం. స్టీల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 0.5% వృద్ధి చెందుతోంది. గతేడాది భారత్ ఏకంగా 13 శాతం వృద్ధి నమోదు చేసింది. వచ్చే పదేళ్లు భారత్‌లో స్టీల్ రంగం ఏటా సగటు వృద్ధి 8%గా ఉంటుంది’ అని వివరించారు. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్‌లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్‌కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్‌గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్‌గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
ఎవరీ సోమా మండల్? ఉక్కు పరిశ్రమకే క్వీన్‌గా..!
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా...ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు.అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం...‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది...ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు..అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి’ అంటుంది సోమా మండల్. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
సెయిల్ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 542 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,529 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25,398 కోట్ల నుంచి రూ. 25,140 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 23,210 కోట్ల నుంచి రూ. 24,825 కోట్లకు ఎగశాయి. ముడిస్టీల్ ఉత్పత్తి 4.531 మిలియన్ టన్నుల నుంచి 4.708 ఎంటీకి పుంజుకుంది. అమ్మకాలు సైతం 3.84 ఎంటీ నుంచి 4.15 ఎంటీకి బలపడ్డాయి. కంపెనీ వార్షికంగా 21 ఎంటీ స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
సెయిల్‌కు రూ. 329 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్‌ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది. -
భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది. తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటు (వీఐఎస్‌పీ)లో సెయిల్‌కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది. -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
సెయిల్ డివిడెండ్ రూ. 2.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 2,479 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,450 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 23,533 కోట్ల నుంచి రూ. 31,175 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 18,829 కోట్ల నుంచి రూ. 28,005 కోట్లకు భారీగా పెరిగాయి. మార్చికల్లా రుణ భారం రూ. 13,400 కోట్లుగా నమోదైనట్లు సెయిల్ వెల్లడించింది. తాజా సమీక్షా కాలంలో 4.6 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగా.. 4.71 ఎంటీ అమ్మకాలను సాధించింది. 2020–21 క్యూ4లో స్టీల్ ఉత్పత్తి 4.56 ఎంటీకాగా.. 3.43 ఎంటీ విక్రయాలు నమోదయ్యాయి. కోకింగ్ కోల్ తదితర ముడివ్యయాల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో వ్యయాల అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 74 వద్ద ముగిసింది. -
క్యూ2 లో సెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్‌ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్‌ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్‌కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది. -
మనసున్న బాస్
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిల్లో చాలా కంపెనీలకు మహిళలే కొత్త బాస్‌గా వస్తున్నారు. సోమా మండల్నే చూడండి. జనవరి 1 ఆమె భారత ప్రభుత్వసంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 19కి 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సెయిల్ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్ సోమ. మొన్నటి వరకు సెయిల్‌కు డైరెక్టర్–కమర్షియల్‌గా ఉన్న సోమ.. చైర్పర్సన్ కాగానే భారత పారిశ్రామిక రంగంలోని దిగ్గజాల కళ్లన్నీ ఆమె ముళ్ల కీరీటం వైపు మళ్లాయి తప్ప, ‘ఐ కెన్’ అని ధీమాగా చెబుతున్నట్లున్న ఆమె చిరునవ్వుకు ఎవ్వరూ పెద్దగా గుర్తింపునివ్వడం లేదు! చైర్‌పర్సన్‌గా ఇప్పుడిక ఆమె చాలా చెయ్యాలి. యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న సెయిల్ అప్పుల్ని తగ్గించాలి. వచ్చే పదేళ్లలోపు ఏడాదికి కనీసం ఐదు కోట్ల టన్నుల ఉక్కు ఉత్పతిస్థాయికి సంస్థ సామర్థ్యాన్ని పెంచాలి. స్టాక్ మార్కెట్లో సెయిల్ సూచీని శిఖరం వైపు మళ్లించాలి. తక్షణం అయితే ఒకటి చేయాలి. ఏళ్లుగా కదలిక లేకుండా ఉన్న వేతనాలను సవరించి, స్థిరీకరించి సిబ్బందిలోని అసంతృప్తిని పోగొట్టాలి. ఇవన్నీ చేయగలరా? ‘చెయ్యగలను’ అని ఆమె అంటున్నారు. ‘ఆమె చెయ్యగలరు’ అని ప్రభుత్వం నమ్ముతోంది. స్టీల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత దశలో చైర్‌పర్సన్‌గా వచ్చిన సోమా మండల్ సెయిల్‌ను లాభాల్లో నడిపిస్తారనే సెయిల్ ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు ఆశిస్తున్నారు. అందుకు కారణం ఉంది. ∙∙ యాభై ఏడేళ్ల సోమ వ్యాపార వ్యూహాల నిపుణురాలు మాత్రమే కాదు. సోషల్ వర్కర్ కూడా కనుక సెయిల్ కింది స్థాయి సిబ్బందికి అన్నివిధాలా భరోసా లభించినట్లే. పైన మన కష్టం గుర్తెరిగే వారున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగులు సంస్థ కోసం పాటు పడేలా చేస్తుంది. కంపెనీకి అది వెలకట్టలేని ఆస్తి. 2017 నుంచి సెయిల్‌లో ఉన్నారు సోమా. ఆ క్రితం వరకు ‘నాల్కో’లో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) చేశారు. రూర్కెలా నిట్‌లో బీటెక్ చేశాక 1984లో నాల్కోలోనే మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. సోమా భువనేశ్వర్‌లో జన్మించారు. ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. తన ముగ్గురు సంతానాన్ని డాక్టర్లను చేయాలని ఆశ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు, ఒక కూతురు డాక్టర్లు అయ్యారు కానీ, సోమ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. సోమకు ముగ్గురు పిల్లలు. భర్త కూడా ఇంజినీరే. యు.టి.ఐ.లో పని చేసేవారు. 2005లో చనిపోయారు. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. -
సెయిల్ చైర్మన్‌గా సోమ మండల్
ముంబై: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్‌గా శుక్రవారం సోమ మండల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. అంతకు ముందు ఆమె ఇదే కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–రూర్కెలా నుంచి 1984లో పట్టభద్రురాలైన మండల్ నాల్కో సంస్థలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నాల్కో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి 2017లో సెయిల్ కంపెనీలో చేరారు. తాజాగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. గురువారం పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరీ స్థానంలో మండల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ... కంపెనీ లాభాదాయకతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరచడంతో పాటు సంస్థను నిర్మాణాత్మకంగా మరింత బలోపేతం చేస్తామనున్నారు. -
నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ..
చీరాల టౌన్ : నడిసంద్రం.. ఇంజిన్ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్ రిగ్ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి ) ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు. -
సెయిల్‌కు రూ.554 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్ కంపెనీ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.553.69 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా నమోదైంది. సామర్థ్యం మేరకు నిర్వహణ, రైల్వే అవసరాలైన చక్రాలు, యాక్సిల్స్‌ను సమకూర్చడం తమ ప్రాధాన్యతలని సెయిల్ చైర్మన్ అనిల్‌కుమార్ చౌదరి తెలిపారు. కొత్త ఉత్పత్తులతో కస్టమర్లను చేరుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ నిర్వహణ పనితీరు, లాభాల్లో వేగవంతమైన రికవరీ, విస్తరణ, ఆధునికీకరణ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చేసిన సమష్టి కృషి ఫలితమే ఇదని కంపెనీ పేర్కొంది. -
డబ్బుల్లేవ్.. డివిడెండ్ ఇవ్వలేం..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్ .. గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెల్లించలేమంటూ కేంద్రానికి స్పష్టం చేసింది. నగదు గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. మిగతా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రానికి సెయిల్ రూ. 2,171 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘మా దగ్గర నగదు గానీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేదు. డివిడెండ్ చెల్లించాలంటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రుణ సమీకరణ అనేది చాలా కష్టతరం. ఉక్కు పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరిన్ని రుణాలివ్వడానికి సుముఖంగా లేవు‘ అని కేంద్రానికి రాసిన వివరణ లేఖలో సెయిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాల్లో వాటాల రూపంలో రూ.1.06 లక్షల కోట్లు సమీకరిం చాలని బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కేంద్రానికి కష్టతరంగా మారనుంది. 2017–18లో కంపెనీ నష్టాల నేపథ్యంలో డివిడెండ్ చెల్లించే పరిస్థితులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రూ. 5 వేల కోట్లతో సెయిల్ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ దాదాపు రూ. 5,000 కోట్లతో తలపెట్టిన ఆటోగ్రేడ్ ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం స్థలాన్ని అన్వేషిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి మూడు రాష్ట్రాల్లో అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. ‘ఆర్సెలర్ మిట్టల్‌తో కలిసి ఏర్పాటు చేసే ప్లాంటు కోసం మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సెయిల్ వర్గాలు తెలిపాయి. ఒకటి మహారాష్ట్ర, రెండోది గుజరాత్ కాగా మూడోది ఆంధ్రప్రదేశ్‘ అని ఆయన వెల్లడించారు. ముందుగా వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఈ ప్లాంటును నిర్మిస్తారని.. ఆ తర్వాత 2.5 మిలియన్ టన్నులకు విస్తరిస్తారని ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి చెప్పారు. జాయింట్ వెంచర్ విధివిధానాలపై చర్చించేందుకు నెల రోజుల క్రితం ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మినివాస్ మిట్టల్, సెయిల్ అధికారులు సమావేశమైనట్లు ఆయన తెలిపారు. సాంకేతిక ఒప్పందాలకు సంబంధించి చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. -
సెయిల్ లాభం రూ.540 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద ఉక్కు కంపెనీ, సెయిల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.540 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.801 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటం, ధరలు పెరగడంతో ఈ క్యూ1లో భారీ స్థాయిలో నికర లాభం సాధించామని సెయిల్ చైర్మన్ సరస్వతీ ప్రసాద్ తెలిపారు. గత క్యూ1లో రూ.13,073 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.16,005 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యయాలు రూ.14,350 కోట్ల నుంచి రూ.14,900 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఈ క్యూ1లో విక్రయించదగ్గ ఉక్కు ఉత్పత్తి 13 శాతం పెరిగి 3.61 మిలియన్ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 3.271 మిలియన్ టన్నులకు పెరిగాయని వివరించారు. ఇబిటా 23 శాతం వృద్ధితో రూ.2,685 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో టన్నుకు ఇబిటా ఈ క్యూ1లో రూ.8,211గా నమోదైందని వివరించారు. కంపెనీ నిర్వహణ పనితీరు రికార్డ్ స్థాయిలో మెరుగుపడిందని సరస్వతీ ప్రసాద్ తెలిపారు. ఇదే జోరు కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తాము తీసుకున్న పలు కొత్త చర్యలు కంపెనీ పనితీరు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కారణమయ్యాయని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో సెయిల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.79 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్అలోన్) వచ్చాయని సెయిల్ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెయిల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లోకి సెయిల్
న్యూఢిల్లీ: వరుసగా 10 త్రైమాసికాలపాటు నష్టాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 43.16 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సెయిల్ రూ.795 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజా క్యూ3లో ఆదాయం రూ. 12,688 కోట్ల నుంచి రూ. 15,443 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో పన్నులకు ముందు లాభాలు రూ.82 కోట్లుగా నమోదైనట్లు సంస్థ చైర్మన్ పి.కె. సింగ్ తెలిపారు. సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, లాభాల్లోకి మళ్లేందుకు కంపెనీ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోందని ఆయన పేర్కొన్నారు. తాజా లాభాలు... సంస్థ టర్న్‌ఎరౌండ్ అవుతోందనడానికి నిదర్శనమన్నారు. అధిక ఉత్పత్తి, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయ నియంత్రణ చర్యలు, మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి సారించడం తదితర అంశాలు సెయిల్ మళ్లీ లాభాల్లోకి మళ్లేందుకు దోహదపడ్డాయని సింగ్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. వ్యాపార వృద్ధి వ్యూహాల్లో భాగంగా దేశ, విదేశాల్లో కొంగొత్త మార్కెట్లపై దృష్టి పెడుతున్నట్లు సింగ్ చెప్పారు.