మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్‌స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత!
తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్‌స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్‌స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు.
(చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!)
Comments
Please login to add a commentAdd a comment