Russian
-
రష్యాలో 9/11 తరహా దాడి!
కజాన్: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ జంట ఆకాశహర్మ్యాలను విమానాలు ఢీకొట్టిన దాడి ఘటన వీడియో విశ్వవ్యాప్తంగా నాడు వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి దాడి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తమ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రతికార దాడులతో ప్రతిఘటిస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగా శనివారం రష్యాలోని టటారస్థాన్ పరిధిలోని కజాన్ నగరంలో జనావాస ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది.అందులో చూడ్డానికి అచ్చం చిన్నపాటి విమానంలా ఉన్న ఒక డ్రోన్ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో చివరి అంతస్తును ఢీకొనడం ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ వీడియోలోఉంది. ఆరు డ్రోన్లు జనావాసాలపై, రెండు పారిశ్రామికవాడలపై పడ్డాయని టటారస్తాన్ గవర్నర్ రుస్తమ్ మిన్నీకన్నోవ్ ప్రకటించారు. అయితే ఈ దాడిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని రష్యా చెబుతోంది. అయితే దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కజాన్ విమానాశ్రయాన్ని మూసేశారు.ఈ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం సైతం కజాన్ నగర ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండొద్దని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లొద్దని గవర్నర్ రుస్తమ్ జాగ్రత్తలు చెప్పారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పైకి రష్యా 113 డ్రోన్ల దాడులు చేసింది. అయితే వీటిల్లో 57 డ్రోన్లను నేలమట్టంచేశామని ఉక్రెయిన్ తెలిపింది. 56 డ్రోన్లను నిరీ్వర్యం చేశామని తెలిపింది. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్‌లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాలోకి ఉక్రెయిన్ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో పుతిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు. Ukraine has launched a major attack with Ukrainian troops into Russia in what appears to be its biggest and most serious incursion into the country since Moscow's full-scale invasion began in February 2022. https://t.co/2o5E3RAcIM— ABC News (@ABC) August 7, 2024 -
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. 17 మంది మృతి!
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంపై పడ్డాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నిహివ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించించింది. ఈ యుద్ధంలో రష్యా తన సత్తా చాటుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సామగ్రిని అందించకపోవడంతో అది రష్యాతో తలపడలేకపోతోంది. ఇంతలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్‌కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్‌ను పంపిణీ చేయనున్నమని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు తమ దేశానికి వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థించారు. తమకు తగిన వాయు రక్షణ పరికరాలు ఇప్పటికే అందివుంటే, రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న వాయు రక్షణ క్షిపణులు అయిపోయాయని జెలెన్స్కీ తెలిపారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లలో ఒకదానిని ధ్వంసం చేసింది. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
దశకుంచెల చిత్రకారుడు! ఏకాకాలంలో ఎడాపెడా..
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్‌గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి. (చదవండి: ముక్కుతో 'ఈల' పాట విన్నారా? ఈ విలక్షణమే ఆమెను..) -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి: పుతిన్
మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగించారు. "మన పూర్వికులు చాలా మంది పిల్లలను కలిగి ఉండేవారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పెద్ద కుటుంబాలను ఏర్పరచడం మనకు ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆద్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం" అని పుతిన్ అన్నారు. రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే మృతి చెందారు. ఈ వివరాలను పుతిన్ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం జనాభా ఆవశ్యకతకు ఇది కూడా ముడిపడి ఉంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్‌ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్‌లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
సెంట్రో గ్రూప్ చేతికి రష్యా బ్యాంక్ - 50 శాతం వాటా కొనుగోలు
ముంబై: ఒక రష్యన్ బ్యాంకులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ సంస్థ సెంట్రో గ్రూప్ తాజాగా పేర్కొంది. సోవియట్ శకం ముగిసిన తదుపరి ఏర్పాటైన బ్యాంక్‌లో 50.001 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. 29ఏళ్ల బ్యాంకును దక్కించుకోవడం ద్వారా రుపీ–రూబుల్ వాణిజ్యానికి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. భారత్‌తో వాణిజ్యం, లావాదేవీలు పుంజుకుంటున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ పేర్కొంది. రష్యాకు ప్రాధాన్యతగల భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తున్నట్లు తెలియజేసింది. పరస్పర నోస్ట్రో, వోస్త్రో ఖాతాలకు వీలుగా భారత బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలతో జత కట్టే యోచనలో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నవీన్ రావు వివరించారు. బ్రోకర్ లైసెన్స్, రష్యన్ రిటైల్ ఇన్వెస్టర్ లక్ష్యంగా ఎఫ్‌పీఐ లైసెన్స్ ద్వారా భారత్‌లో పెట్టుబడులకు వీలు కల్పించడం తదితర చట్టబద్ధ విధానాల ద్వారా బ్యాంకు సర్వీసులను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. రూబుల్, రూపాయి చెల్లింపులకు మద్దతివ్వడం ద్వారా రెండు దేశాల వ్యక్తులు పరస్పర సందర్శనకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా యూపీఐ, రూపే కార్డ్ తదితర చెల్లింపుల విధానాలకు వీలు కల్పించనున్నట్లు వివరించారు. -
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ!
ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. నేరం, అరెస్టు, జైలు.. ఇదే దశాబ్దాలుగా నేరస్తులకు ఎదురవుతున్న క్రమం. అయితే కాలం గడిచేకొద్దీ దీనిలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. తద్వారా వారు వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. అయితే ఒక నేరస్తుడు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే.. ఏం జరుగుతున్నదనేది ఊహించడం కష్టం. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటుఅతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగం అధికారులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ ఖైదీ కమోల్జోన్ కలోనోవ్.. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరవాసి అని, పలు నేరాలలో ప్రమేయం ఉండటంతో జైలుకు తరలించారని తెలిపారు. 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే 2001లో అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్ను కూలీ పనులకు పంపనున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు! -
పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!
ఇటీవల "వేగన్" అంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం అవుతోంది. శాఖాహారమే తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలు వెల్లువెత్తున్నాయి కూడా. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. గానీ ఏదైనా మనం మోతాదుకు మించి ఉపయోగించటమే సముచితం. ఎందుకంటే శాకాహారి అయినా, మాంసహారి అయిన దేన్నైనా లిమిట్‌గా తీసకుంటూ శరీర తత్వాన్న బట్టి వారికి అనువైన రీతిలో డైట్ ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఈ రష్యన్ మహిళే ఉదహారణ. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది అంటే.. అసలేం జరిగిందంటే..39 ఏళ్ల శానా శామ్సోనోవా అనే రష్యన్ మహిళ గత కొన్నేళ్లు వేగన్ రాఫుడ్ కోసం ప్రచారం చేస్తోంది. ఎప్పటి కప్పుడూ తాను ఏవిధంగా పూర్తి స్థాయిలో రా శాకాహారం తింటుందో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. ఒక దశాబ్దంపాటు ఆ డైటే ఫాలో అయ్యింది. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి వేగన్‌గా మారడం అంటే వాళ్లు కనీసం ఆవు లేదా గెదే పాలు తాగారు, సోయాబీన్స్ వంటి వాటికి సంబంధించిన పాలే తాగుతారు. ఐతే శానా శామ్సోనోవా శాకాహారం అంటే మరీ ఘోరంగా ఆయిల్ లేనివి, కేవలం పచ్చి కూరగాయాలు, వాటితో చేసిన వంటకాలు అంతే తీసుకునేది. అది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతలా అంటే అస్థిపంజరం మాదిరిగా అయ్యేంత దారుణ స్థితికి తీసుకొచ్చింది. పోనీ అప్పుడైన కాస్త డైట్ మార్చి కొవ్వులతో కూడిన ఫుడ్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఆరోగ్యం కుదుటపడేంత వరకు ప్రోటీన్లతో కూడిన అన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా బావుండేది. అలా చేయకపోవడంతో కాళ్లు వాపుకి గురై లేచి నడవలేనంత స్థితికి వెళ్లిపోయింది. చివరికి ఆస్పత్రి పాలై ప్రాణాల కోసం పోరాడుతూ చనిపోయింది. పాపం ఆమె తల్లి కూడా తన కూతురు పూర్తి స్థాయిలో శాకాహారం తీసుకుని చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. చివరి స్టేజ్‌లో ఆకలివేసినా.. తినలేని దయనీయ స్థితికి చేరుకుని చనిపోయినట్లు వెల్లడించింది. ఏ డైట్ అయినా ఆరోగ్యకరమైన రీతిలో మన శరీరీం యాక్స్‌ప్ట్ చేసేంత మోతాదులో తీసుకోవాలి. తీసుకుంటుంది శాఖాహార అయినప్పుడూ కొవ్వులు లభించే నట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే కాస్త శరీరానికి బలం చేకూర్చేలా కూరల్లో ఆయిల్ చేర్చాలి. అంతేగాని 'వేగన్' పేరుతో ఇలా పూర్తిగా కూరగాయాలు అంటూ పిచ్చిపిచ్చిగా ఫాలో అయితే ఇలానే చెయిచేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవుతారు. దయచేసి శాకాహారం లేదా మాంసహారి అయినా సరైన రీతిలో డైట్ ఫాలో అవ్వండి లావు అవుతామనో లేదా ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం అనో మరింతగా నోరు కట్టేసుకునేలా డైట్లు చేసి ప్రాణాలను కోల్పోవద్దు. (చదవండి: పీచే కదా అని తీసిపడేయకండి!) -
మహిళలూ.. ఇది సరైన పద్ధతి కాదు.. రష్యా మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహిళలు పిల్లలను కనడం కంటే విద్య, భవిష్యత్తుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇది సరైన పద్దతి కాదంటూ రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో మృతుల సంఖ్య కంటే జననాల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ దేశ దిగువ సభలోని ప్లీనరీ సమావేశంలో మురాష్కో మాట్లాడారు. మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి, ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం సమాజంలో బాగా నాటుకుపోయిందన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మహిళలు పిల్లల్ని కనడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆలస్యంగా పిల్లలను కనడం అనేక అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. చదవండి: పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు లేటుగా సంతానం కోసం ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న మంత్రి.. ఈ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్రావాల కోసం వాడే ఔషధాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. -
అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
మోదీ అమెరికా పర్యటన వేళ.. రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ పెదవి విప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. 'ఇండియాను తటస్థం అంటారు.. కానీ మా స్థితి అది కాదు.. మేము శాంతి పక్షాన నిలబడతామని' ప్రధాని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి సరిగాలేదనే వాదనలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని సూచించారు. ప్రతీ దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ తగిన ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో అమెరికాతో భారత్ బంధం మరింత బలోపేతమైంది. 2022 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డ్ స్థాయిలో 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియాకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. అటు.. రష్యాతోనూ భారత్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. ఇండియా రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: PM Modi US Visit: అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. బిజీ బిజీ షెడ్యూల్ ఇలా -
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. మృతులు పెరగొచ్చు.. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్. దారుణమైన దృష్యాలు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రష్యా తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. -
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం
-
విషాదం.. ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రష్యా పాప్ సింగర్ సింగర్ దిమా నోవా(34) ప్రమాదంలో మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తన గాత్రంతో ఎంతో ఆదరణ పొందిన దిమా నోవా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొనుగోలు.. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి విర్గినోవ్. చిన్ననాటి నుంచే తన గానంతో అలరిస్తున్న దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న తన సోదరుడు, స్నేహితులతో ఫ్రోజన్ వోల్గా నది దాడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దిమా నోవా, అతడి స్నేహితులు, సోదరుడు మంచు కురుకుపోయారు. చదవండి: అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి ఈ క్రమంలో ఊపరి ఆడక ఆయన చనిపోయినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంగా గాయపడిన తన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మిగిలిన వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కాగా దిమా నోవా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తన సంగీతం, పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. ఈ క్రమంలోనే అక్వా డిస్కో అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ పాట పెద్ద వివాదం కూడా అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు. -
రష్యా క్రూడాయిల్‌పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముడి చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడే కొనుగోలు చేసేందుకు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అందుకే రష్యా నుంచి చౌక క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అదే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా కొనుగోలు చేసి ఉంటే ధరలు భారీగా పెరిగిపోయి ఉండేవని మంత్రి చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో ’అసంతృప్తి’ ఏమీ లేదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. (ఇదీ చదవండి: Techlayoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారడిమాండ్) పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారీ వినియోగదారుగా భారత్ అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగిస్తుంది. మనం రష్యా చమురును కొనుగోలు చేస్తుండటం వల్ల పాశ్చాత్య దేశాలేమీ అసంతృప్తిగా లేవు. ఎందుకంటే మనం రష్యా ఆయిల్‌ను కొనకపోతే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు క్రూడాయిల్ రేట్లు మరింతగా పెరిగిపోయేవి‘ అని ఆయన తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) గతేడాది మార్చి వరకూ భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు 0.2 శాతంగానే ఉండేవి. పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మారి పోయాయి. రష్యా తమ క్రూడాయిల్‌ను మార్కెట్ రేటుకన్నా తక్కువకే భారత్‌కు విక్రయిస్తోంది. దీంతో ఇతర దేశాల ఒత్తిళ్లను పక్కన పెట్టి భారత్.. రష్యన్ ముడిచమురు వైపు మొగ్గు చూపుతోంది. -
India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్‌ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్‌ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్‌లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్‌లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్‌గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్‌కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..
రష్యాలో గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వెళ్లిపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారట. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది దాక రష్యన్ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు అర్జెంటీనాకు వచ్చినట్లు తెలిపారు. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లు సమాచారం. అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదీగాక ఒక రష్యాన్ వెబ్సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ తాము కచ్చితంగా ఉక్రెయిన్‌పై విజయం సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమాగా చెప్పారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ రష్యా దళాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చెప్పారు. లెనిన్గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అక్కడ ఒక కర్మాగంలో కార్మికులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా కచ్చితంగా తమకు గెలుపును తెచ్చిపడతాయని విశ్వాసంగా చెప్పారు. అంతేగాదు పుతిన్ క్షిపణి తయారుదారు అల్మాజ్ ఆంటెలో భాగమైన ప్లాంట్‌లో ప్రసంగిస్తూ రష్యా రక్షణ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే ఉక్రెయిన్‌లో రష్యా టాప్ కమాండర్‌ని నియమించిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదీగాక రష్యా ప్రత్యేక 'సైనిక ఆపరేషన్' పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ దాడికి దిగి సరిగ్గా ఏడాది కావస్తున్న తరుణంలో రష్యాలో ఒకింత భయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సమర్థింపు చర్యగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఉక్రెయిన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. మంత్రితో సహా 16 మంది దుర్మరణం)