భవనాలను డ్రోన్లతో ఢీకొట్టించిన ఉక్రెయిన్
కజాన్: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ జంట ఆకాశహర్మ్యాలను విమానాలు ఢీకొట్టిన దాడి ఘటన వీడియో విశ్వవ్యాప్తంగా నాడు వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి దాడి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తమ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రతికార దాడులతో ప్రతిఘటిస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగా శనివారం రష్యాలోని టటారస్థాన్ పరిధిలోని కజాన్ నగరంలో జనావాస ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది.
అందులో చూడ్డానికి అచ్చం చిన్నపాటి విమానంలా ఉన్న ఒక డ్రోన్ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో చివరి అంతస్తును ఢీకొనడం ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ వీడియోలోఉంది. ఆరు డ్రోన్లు జనావాసాలపై, రెండు పారిశ్రామికవాడలపై పడ్డాయని టటారస్తాన్ గవర్నర్ రుస్తమ్ మిన్నీకన్నోవ్ ప్రకటించారు. అయితే ఈ దాడిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని రష్యా చెబుతోంది. అయితే దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కజాన్ విమానాశ్రయాన్ని మూసేశారు.
ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం సైతం కజాన్ నగర ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండొద్దని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లొద్దని గవర్నర్ రుస్తమ్ జాగ్రత్తలు చెప్పారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌పైకి రష్యా 113 డ్రోన్ల దాడులు చేసింది. అయితే వీటిల్లో 57 డ్రోన్లను నేలమట్టంచేశామని ఉక్రెయిన్ తెలిపింది. 56 డ్రోన్లను నిరీ్వర్యం చేశామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment