
జెలెన్‌స్కీ సంచలన ప్రకటన
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మద్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్‌లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్‌తో బుధవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా లాగుతోందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి.
ఆయన ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరలైంది. ఆయన పార్కిన్సన్, కేన్సర్‌తో పోరా డుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది.