sensational statement
-
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్ ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. #BJP MP and former minister #MenakaGandhi telling what #ISKCON is doing at #Gaushalas #Bhakts and @IskconInc should react on this.. pic.twitter.com/RdpLMBsZP1 — manishbpl (@manishbpl1) September 26, 2023 అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా అనే సంగతి తెలిసిందే. Response to the unsubstantiated and false statements of Smt Maneka Gandhi. ISKCON has been at the forefront of cow and bull protection and care not just in India but globally. The cows and bulls are served for their life not sold to butchers as alleged. pic.twitter.com/GRLAe5B2n6 — Yudhistir Govinda Das (@yudhistirGD) September 26, 2023 -
Amnesia Pub Case: అమ్నిషియా పబ్ రేప్ కేసులో సంచలనాలు
-
భారత్-పాక్ మ్యాచ్‌పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
Baba Ramdev Sensational Statement Over India, Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఇవాళ జరగనున్న ఫై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పక్క దేశంలో ఉగ్ర క్రీడ పేట్రేగిపోతుంటే.. క్రికెట్ ఆడడమేంటని ప్రశ్నించాడు. క్రికెట్, ఉగ్రక్రీడ రెండూ ఒకేసారి ఆడలేరని.. ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు, రాజ ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నాడు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు క్రికెట్ ఆడడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. India-Pakistan match against ‘Rashtradharma,’ says @yogrishiramdev | #T20WorldCup #Cricket #WorldCupT20 #IndiaVsPakistan Read full story - https://t.co/vSzFrHTraV pic.twitter.com/ZzWtsKvpsm — IndiaToday (@IndiaToday) October 24, 2021 కాగా, దేశంలో ఉగ్రదాడులు అను నిత్యం ఏదో ఒక చోట జరుగుతూ ఉంటే భారత్-పాక్‌లు క్రికెట్ మ్యాచ్ ఆడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రుల దగ్గరి నుంచి సామాన్యుల వరకు మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చదవండి: Virat Kohli: ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన... -
ప్రతీ భారతీయ పౌరుడు హిందువే: RSS చీఫ్ మోహన్ భగవత్
-
అర్ధభాగాలకూ పూర్తి జీతాలు! అమ్మానాన్నలకూ పింఛన్లు!!
ప్రస్తుత సమాజంలో నీతులు చెప్పేవారు బోలెడు మంది. ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలిచేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే డాక్టర్ సోహన్ రాయ్. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వడమేకాకుండా.. వారి భార్యలకు వేతనాలు, ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తానని సంచలన ప్రకటన చేశారు రాయ్. ప్రపంచానికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా ధాటికి బడా కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకోవడం కోసం వేతనాల్లో కోత, ఉద్యోగాల తొలగింపు వంటి చర్యలు చేపట్టాయి. రాయ్ మాత్రం ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకపోగా ఉద్యోగి కుటుంబ బాగోగులను చూస్తున్నారు. సోహన్ రాయ్ కేరళకు చెందిన వ్యక్తి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో స్థిరపడిన ఆయన షార్జా కేంద్రంగా ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు. తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఆయన 2017లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచారు. మహమ్మారి విజృంభణ సమయంలో నిబద్ధత, వర్క్ ఎథిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని అహర్నిశలూ కంపెనీ వృద్ధికి పాటుపడిన ఉద్యోగుల.. భార్యలకు రెగ్యులర్ ప్రాతిపదికన నెలవారి జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం ఎరిస్ గ్రూప్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా బేస్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఉద్యోగి ఎన్ని ఏళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తున్నారో దాని ఆధారంగా .. వాళ్ల భార్యలకు నెలకు ఎంత జీతం ఇవ్వాలో నిర్ణయిస్తారు. ‘ఒక ఉద్యోగి కంపెనీలో పనిచేస్తున్నారంటే ఇంట్లో ఉండే భార్య తోడ్పాటు ఎంతో ఉంటుంది. ప్రతిమగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న మాటను నేను బలంగా నమ్ముతాను అని రాయ్ చెప్పారు. వారు అన్ని విధాలా తన భర్తకు సపోర్టు చేయడంవల్లే.. ఆ ఉద్యోగి కంపెనీని వృద్ధిపథంలో నడిపించగలుగుతాడు. కానీ భార్యల శ్రమను ఎవరూ గుర్తించడంలేదు. హౌస్‌వైఫే కదా అని చులకనగా చూస్తుంటారు. కరోనా సమయంలో ఉద్యోగులు ఆఫీసులకు రాకపోయినా..ఇంట్లోనుంచి సక్రమంగా పనిచేయడానికి ఇంటి ఇల్లాలు ఎంతో సాయం చేసింది. అందువల్ల వారికి జీతం ఇవ్వాలనుకున్నానని రాయ్ చెబుతున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక యాక్సిడెంట్ కేసు విషయంలో తీర్పునిస్తూ.. గృహిణి చేసే పని విలువ సంపాదించే భర్తకంటే తక్కువ ఏం కాదని తేల్చిచెప్పింది. సంపాదించే భర్తతో సమానంగా భార్యకు అన్ని రకాల మర్యాదలు ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశ్యం. ఈ తీర్పే నా ఆలోచనకు నాంది అని రాయ్ అన్నారు. గృహిణులకే కాకుండా ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్ కూడా ఇవ్వనున్నట్లు రాయ్ తెలిపారు. కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసేవారందరికీ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
భారత విభజన సారథి.. మోదీ
న్యూయార్క్ / న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేళ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారంది. ఈ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కొడుకు అతీశ్ తసీర్ రాశారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖచిత్రంతో టైమ్ మ్యాగజీన్ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనమున్న ప్రతి 2019, మే 20న ప్రజలకు అందుబాటులోకి రానుంది. హామీల అమలులో విఫలం.. భారత్ మరో ఐదేళ్ల పాటు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా? అని తసీర్ తన కథనంలో ప్రశ్నించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ సమాజంలోని విభేదాలను సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో అవే పరిస్థితులను భరిస్తూ తనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఓవైపు హిందువులకు పూర్వవైభవం, మరోవైపు దక్షిణకొరియా అభివృద్ధి మోడల్‌తో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్న హామీతో మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. 2014లో ప్రజల సాంస్కృతిక ఆగ్రహాన్ని ఆర్థికరంగంవైపు మళ్లించగలగడంలో మోదీ విజయవంతం అయ్యారు. అప్పుడు ఉద్యోగాలు, అభివృద్ధి గురించే ఆయన మాట్లాడేవారు. వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని చెప్పేవారు. కానీ మోదీ ఆర్థిక ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలో విఫలమయ్యాయి. ఆయన చర్యలు దేశంలో విద్వేషపూరిత మత జాతీయవాదానికి బీజం వేశాయి’ అని మండిపడ్డారు. ‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు. మోదీకి ప్రత్యామ్నాయం లేదు.. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు కొనసాగాలంటే మోదీనే సరైన వ్యక్తి అని యూరేసియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియాలో ఇంకా సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇతర నేతలతో పోలిస్తే మోదీనే ఈ సంస్కరణలను సమర్థవంతంగా చేపట్టగలరు. ఆయన హయాంలోనే చైనా, అమెరికా, జపాన్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. మోదీ విధానాల కారణంగా భారత్‌లో కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తగ్గింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే తత్వం మోదీది. అదే సమయంలో భారత్ లో అవసరమైన సంస్కరణలు చేపడ్డటంలో మోదీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం మోదీ పాలిట వరంగా మారింది’ అని బ్రెమ్మర్ విశ్లేషించారు. -
చంద్రబాబుపై జేసీ సంచలన వాఖ్యలు
-
స్టాలినే నా వారసుడు: కరుణ
టీనగర్,(చెన్నై): తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి సంచలన ప్రకటన చేశారు. అయితే, తన మరో కుమారుడు అళగిరిని తాను ఏమాత్రం మిస్కానని వ్యాఖ్యానించారు. ఓ తమిళ వారపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కరుణ మాట్లాడారు. పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు స్టాలిన్, అళగిరి ఇద్దరూ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనకూడదని కరుణానిధి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, తన రిటైర్మెంట్పై వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. కరుణానిధిని రిటెర్మైంట్ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పుడే రాజకీయ రిటైర్మెంట్ తీసుకుని పార్టీ పగ్గాలు వెంటనే స్టాలిన్‌కు ఇచ్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టంచేశారు. పార్టీ వ్యవహారాల్లో స్టాలిన్ సహాయపడుతున్నారని, ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలా విషయాలు ఆయనే చూసుకుంటున్నారని చెప్పారు. ‘63 ఏళ్ల స్టాలిన్ యువకుడిగా ఉన్నప్పటి నుంచే పార్టీ కోసం చాలా కష్టపతున్నాడు. యవ్వనంలో ఉన్నపుడే గోపాలపురంలో యువజన సంఘాన్ని స్థాపించి పాటుపడ్డాడు. పార్టీ కోసం జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో విధాలుగా చిత్ర హింసలకు గురయ్యాడు. పార్టీలో ఈ స్థానాన్ని తన కష్టంతోనే సంపాదించుకున్నాడు. అందుకే తన రాజకీయ వారసుడయ్యాడు’ అని కరుణానిధి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్టాలిన్ డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా ఉన్నారు. స్టాలిన్ గతంలో ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పదవులు చేపట్టారు.