France president
-
ఫ్రాన్స్ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్ గుబులు
పారిస్: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయిదేళ్ళ అగ్నిపరీక్ష!
వ్యక్తిగతంగా చరిత్రాత్మక విజయం సాధించినా, ఒక్కోసారి అది వ్యవస్థను నడపడానికి చాలక పోవచ్చు. గెలిచామన్న ఆనందం కళ్ళ ముందు కొద్ది రోజులకే ఆవిరి అయిపోనూ వచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పరిస్థితి ఇప్పుడు అదే! రెండునెలల క్రితం ఏప్రిల్‌లో దేశానికి వరుసగా రెండో సారి అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన ఆయన తీరా తాజా పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో తమ పార్టీ కూటమికి 289 సీట్ల మెజారిటీని కూడగట్టుకోలేకపోయారు. అనుమానిస్తున్నట్టే ఆదివారం నాటి ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెక్రాన్‌కు చేదు అనుభవమయ్యాయి. 577 సీట్ల సభలో ఆయన కూటమి 245 స్థానాలకే పరిమితమైంది. మునుపటి 350 స్థానాల స్థాయి నుంచి ఏకంగా 100కు పైగా సీట్లను తమ కూటమి కోల్పోవడంతో మెక్రాన్‌కు నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి. ఎగువ సభ ‘సెనేట్’, దిగువ సభ ‘నేషనల్ అసెంబ్లీ’ – ఇలా సభాద్వయ విధానమున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఫలితాలు పలురకాలుగా దిగ్భ్రాంతి కలిగించాయి. అనేక సంక్షోభా లున్న వేళ పార్లమెంట్లో తమ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుంటే, ఫ్రాన్స్‌లో, తద్వారా ప్రపంచంలో అస్తవ్యస్తత తప్పదంటూ మెక్రాన్ ఈ ఎన్నికల వేళ ఓటర్లను అభ్యర్థించారు. కానీ, ఓటర్లు ఆ మాటను నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది స్పష్టం. కూటమిలోని హేమాహేమీలు ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. పార్లమెంట్లో ప్రధాన బలం ఇప్పటికీ మెక్రాన్ సారథ్యంలోని మధ్యేవాద ‘ఎన్సెంబుల్’ కూటమిదే. కానీ సభలో మెజారిటీయే దక్కలేదు. 1988 తర్వాత అధ్యక్షు డిగా గెలిచినా, ఫ్రాన్స్ పార్లమెంట్లో మెజారిటీ సాధించలేకపోయిన తొలి ప్రెసిడెంట్ మెక్రానే. అతి తక్కువగా 46.23 శాతమే ఓటింగ్ నమోదైన ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రాన్స్ ఛాందస మితవాద పార్టీలు మునుపెన్నడూ లేనంతటి విజయం సాధించడం మరో విశేషం. రెండు నెలల క్రితమే అధ్యక్ష ఎన్నికల్లో మెక్రాన్ చేతిలో ఓడిపోయిన మహిళా నేత మెరైన్ లీ పెన్ సారథ్యంలోని ఆ కూటమి 8 నుంచి 89 స్థానాలకు ఎగబాకింది. అలాగే, ఫ్రాన్స్‌లో చీలికలు పేలికలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి అగ్గిబరాటా లాంటి సీనియర్ వామపక్షీయుడు జీన్ లుచ్ మెలెన్ఛాన్ నేతృత్వంలో ‘న్యూప్స్’ పేరిట కొత్త కూటమిగా ఏర్పడి, సత్తా చాటాయి. 2017లో ఈ పార్టీలన్నీ విడివిడిగా గెలి చినవాటికి రెట్టింపు పైనే సీట్లు సాధించి, 131 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం కావడం అనూహ్యం. తాజా ఎన్నికల ఓటమిలో మెక్రాన్ పక్షం తప్పులూ చాలా ఉన్నాయి. ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహం మీదే ప్రధానంగా ఆ కూటమి ఆధారపడింది. ఈసారీ గెలుస్తాం లెమ్మనే అర్థంపర్థం లేని భరోసా పెట్టుకుంది. నిస్తేజంగా ప్రచారం నడిపింది. దాని పర్యవసానమే తాజా ఫలితాలు. అలాగే, ఒక్కతాటి మీదకు వచ్చిన వామపక్షాలను పెద్ద బూచిగా చూపిస్తూ, మెక్రాన్ తెలివితక్కువగా వ్యవహరించారు. అది సంప్రదాయవాదుల పట్ల వ్యతిరేకతకు గండికొట్టింది. చివరకు అటుపోయి, ఇటుపోయి సంప్రదాయవాద కూటమికే కలిసొచ్చింది. సభలో మెజారిటీ మెక్రాన్‌కు అందని మ్రానిపండయింది. ఈ రెండోసారి అధ్యక్ష పదవీకాలంలో ఆయన మునుపటి కన్నా భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చిపడింది. 2017లో తొలిసారి ఫ్రాన్స్ అధ్యక్ష పీఠమెక్కిన మెక్రాన్ కొన్నిసార్లు సర్వం సహాధిపతిలా వ్యవహరించారు. రాజకీయంగా అంతా తానే అన్నట్టు ప్రవర్తించారు. ఫలితంగా, ఆయనకు దూరమైన ఓటర్లు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రెక్కలు కత్తిరించారనుకోవాలి. ఇప్పుడిక రానున్న అయిదేళ్ళ అధ్యక్ష పదవీ కాలంలో మెక్రాన్ తాను అనుకున్నట్టు పాలన సాగించాలంటే, కొత్త మిత్రపక్షాలను కూడదీసుకోక తప్పదు. ఆ క్రమంగా అనేక అంశాలపై రాజీలూ పడక తప్పదు. పదవీ విరమణ వయస్సును పెంచడం, సంక్షేమ సంస్కరణల్ని ప్రవేశపెట్టడం లాంటి మెక్రాన్ ఆలోచనలు ఏమవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఆ ప్రతిపాదనలకు ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఏ మేరకు ఆకర్షించగలుగుతారన్నది చూడాలి. నిన్నటి దాకా రబ్బరు స్టాంపు అనుకున్న నేషనల్ అసెంబ్లీ రాత్రికి రాత్రి కీలకంగా మారడం ఫ్రెంచ్ ప్రజాస్వామ్యానికి మంచిదే. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం, పర్యావరణ ఆత్యయిక పరిస్థితుల లాంటి అనేక సవాళ్ళపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన తరుణంలో పార్లమెంటులో మెజారిటీ లేక పాలన కుంటుపడితే కష్టమే. మొత్తానికి, నేషనల్ అసెంబ్లీ ఫలితాలతో ఫ్రాన్స్‌లో కొత్త కథ మొదలైంది. మరో వారంలో కొత్త పార్లమెంట్ తొలిసారి కొలువు తీరగానే జీవన వ్యయానికి సంబంధించిన బిల్లుతో ఆట ఆరంభమవు తుంది. పార్లమెంట్లో అవసరమైన మెజారిటీ కన్నా కనీసం 44 సీట్లు తక్కువున్న మెక్రాన్ సర్కార్ ఏ బిల్లుకు ఆమోదముద్ర వేయించాలన్నా ప్రతిపక్షాలపై ఆధారపడక తప్పదు. ఇలా పార్లమెంట్లో ఆయనకు ప్రతిరోజూ అగ్నిపరీక్షే! ఫ్రాన్స్‌లో విదేశాంగ విధానమంతా అధ్యక్షుడి వ్యవహారమే కానీ, ఖండాంతర దౌత్యవేత్తగా పేరు తెచ్చుకున్న మెక్రాన్ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ విధానం పక్కనబెట్టి, తన పదవీ కాలమంతా దేశీయ అజెండా పైనే దృష్టి సారించక తప్పదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, కనీసం ఐరోపా స్థాయిలోనూ ఆయన మునుపటిలా రాజకీయ విన్యాసాలు చేయలేకపోవచ్చు. ఇదంతా ఐరోపా రాజకీయ వ్యవహారాలపై ప్రభావం చూపవచ్చు. వెరసి, ఇటు మెక్రాన్‌కూ, అటు ఫ్రాన్స్ పార్లమెంట్‌కూ గతుకుల బాటలో పయనం తప్పదు. అయితే, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఆ ప్రయాణం సాగితే ప్రజాస్వామ్యానికి మంచిది. -
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. వీడియో
ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల రోజునే ఆయన గెలుపును జీర్ణించుకోలేని వ్యతిరేకవాదులు మాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాక్రాన్ ఫ్రెంచ్ పట్టణంలోని ఓ ఫుడ్ మార్కెట్లో కొంత మందితో మాట్లాడుతుండగా ఆయనపై నిరసనకారులు టమాటాలతో విసిరారు. వెంటనే మాక్రాన్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ‘ప్రొజెక్టల్’ అంటూ గట్టిగా అరుస్తూ ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో మాక్రాన్‌కు ఈ పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. Emmanuel Macron made his first appearance since his election, he received tomato from the French crowd. pic.twitter.com/s6AnNM75TI — 🍁En el barrio de Cortes viven residentes (@VecBarrioCortes) April 27, 2022 కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న మొదటి పబ్లిక్ మీట్లోనే ఇలా జరగడంతో మాక్రాన్ ఖంగుతిన్నారు. ఈ ఘటన అనంతరం మాక్రాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్! -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష
పారిస్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్ న్యాయస్థానం సోమవారం అతన్ని దోషిగా తేల్చింది. సర్కోజీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఆ దేశ నిబంధనల ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, ఈ తీర్పుపై అపీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీ ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు అప్పట్లో సంచలనం రేపాయి. (చదవండి: 2024లో మళ్లీ వస్తా: ట్రంప్) -
పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ షాక్
పారిస్: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీరును తప్పుపడుతూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్ పక్కనపెడుతోంది. -
అమెజాన్ తగులబడుతోంటే ఆటలేంటి అధ్యక్షా..!
పోర్టో వెల్హో: ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటేనే జీ–7 నుంచి అమెజాన్ కార్చిచ్చు ఆపే సాయం తీసుకునే విషయం ఆలోచిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా తెలిపారు. అడవుల్లో మంటల్ని ఆర్పడానికి యుద్ధ విమానాలను పంపేందుకు బ్రెజిల్‌కు 2 కోట్ల అమెరికా డాలర్ల సాయాన్ని అందిస్తామని ఫ్రాన్సు అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులు తగలబడిపోతూ ఉంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోకూడదని మాక్రాన్ జీ7 సదస్సులో చర్చకు పట్టుబట్టి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనిపై బ్రెజిల్ అధ్యక్ష ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫ్రాన్స్ అధ్యక్షుడి కృషిని ప్రశంసిస్తున్నాం. అయితే అదంతా యూరప్‌లో అటవీ పునరుద్ధరణకు వాడితే బెటర్’ అని అన్నారు. ఫ్రాన్స్‌లో నోట్రే డామ్ చర్చి తగలబడటాన్ని ప్రస్తావిస్తూ ‘ఒక చర్చిలో మంటలు చెలరేగితే ఆర్పలేని వాళ్లు.. మా దేశానికి పాఠాలు చెబుతారా? అని వ్యంగ్యంగా అన్నారు. అనంతరం బోల్సనారో మాట్లాడుతూ..‘ఫ్రాన్సు సాయాన్ని అంగీకరించాలన్నా ఆ దేశంతో చర్చలు జరపాలన్నా ముందుగా మేక్రాన్ నాపై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలి’ అంటూ డిమాండ్ చేశారు. తన భార్య బ్రిగెట్టెపై బోల్సనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరుషంగా ఉన్నాయని మేక్రాన్ పేర్కొన్నారు. దీనిపై బోల్సనారో స్పందిస్తూ బ్రెజిలేమీ ఫ్రాన్సు కాలనీ కాదు, మనుషులు లేని దీవి అంతకంటే కాదు’ అంటూ ప్రతి దాడికి దిగారు. తీవ్రంగా వ్యాపిస్తున్న పొగలు అమెజాన్ కార్చిచ్చు ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పొగ అడ్డంకిగా మారింది. అమెజాన్ అటవీ ప్రాంతంలోని రోన్‌డోనియాలో జకాండా జాతీయ అటవీ ప్రాంతంలో మంటలు విస్తృతంగా వ్యాపిస్తుండడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. అయితే, దట్టంగా పొగలు కమ్మేయడంతో ఏమీ కనిపించక మంటల్ని ఆర్పడం కష్టమైంది. పశు పోషణ కోసం అటవీ ప్రాంతాన్ని చదును చెయ్యడానికి ఆ మంటల్ని పెట్టారని అధికారుల పరిశీలనలో తేలింది. -
నోటర్ డామ్‌కు రూ.7 వేల కోట్ల విరాళాలు
ప్యారిస్: అగ్నికి ఆహుతైన ప్యారిస్‌లోని ప్రఖ్యాత చర్చి నోటర్ డామ్ కెథడ్రల్ పునర్నిర్మాణ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గానూ సుమారు రూ.7 వేల కోట్ల విరాళాలు వసూలయ్యాయి. అయితే ఈ కట్టడంపునర్నిర్మాణానికి గానూ ఐదేళ్లు పడుతుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ ప్రకటించారు. బుధవారం ఉదయం నిర్మాణ బృందాలు భారీ క్రేన్‌తో పాటు అవసరమైన చెక్క సామగ్రితో నోటర్ డామ్‌కు చేరుకున్నాయి. సోమవారం నోటర్ డామ్‌కు మంటలు అంటుకొని పైకప్పు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదు. -
మోదీకి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం పొందారు. పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పారిస్ ఒప్పందం కుదరడంలో మాక్రన్ పాత్ర, 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ వాగ్దానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు దక్కింది. -
నేనప్పుడు పదవిలోకి రాలేదు
ఐక్యరాజ్య సమితి: భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే సమయానికి తాను పదవిలోకి రాలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిందని, ఇది కేవలం వాణిజ్య సంబంధమే కాదని, వ్యూహాత్మకమైనది అని అన్నారు. ‘ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు నేను అధికారంలో లేను. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారో నేనూ అదే చెప్పాలనుకునుకుంటున్నా’ అని మాక్రన్ అస్పష్ట సమాధానం ఇచ్చారు. ప్రతిదానిలో లాగుతున్నారు: వాద్రా నాలుగేళ్లుగా బీజేపీ నిరాధార ఆరోపణలతో తనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదల, రాఫెల్ వివాదం..ఇలా ఎప్పుడు ఇరకాటంలో పడినా ప్రతిసారి అధికార పార్టీ తన పేరును తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. -
రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి స్పందన
న్యూయార్క్ : రోజుకో మలుపు తిరుగుతున్న రాఫెల్ డీల్ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ స్పందించారు. రాఫెల్ డీల్ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్ జరిగేటప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. యునిటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న సమయంలో ప్రెస్‌తో సమావేశమైన సమయంలో ఈ మేరకు స్పందించారు. మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పిన మాదిరి మోదీ ప్రభుత్వమే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను భారత భాగస్వామిగా చేర్చుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వానికి లేదా రాఫెల్ తయారీదారి డసో ఏవియేషన్ సంస్థకు ప్రతిపాదించిందా? అని అధ్యక్షుడు మాక్రోన్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. వీరి ప్రశ్నపై స్పందించిన మాక్రోన్.. ‘ఏ ఆరోపణలను నేను ప్రత్యక్షంగా తిప్పికొట్టలేను. ఆ సమయంలో నేను ఇన్‌ఛార్జ్‌గా లేను. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని తెలిపారు. కాగా, గతేడాది మేలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రోన్ ఎన్నికయ్యారు. రాఫెల్ డీల్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రకటించారు. ఆ సమయంలో ఫ్రాంకోయిస్ హోలాండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ గత వారం పేల్చిన బాంబుతో, భారత్‌లో రాఫెల్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాగా, రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలాండ్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్ ప్రభుత్వం, డసో కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి, ఒక ప్రైవేట్ సంస్థను ఎలా ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది కూడా. -
మోదీ–మాక్రాన్ పడవ విహారం
-
మోదీ–మాక్రాన్ పడవ విహారం
వారణాసి/దాదర్ కలాన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. ఇక్కడి కళాకారుల హస్తకళలు, భాదోహి కార్పెట్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బనారసీ చీరల ప్రత్యేకత గురించి మాక్రాన్‌కు మోదీ వివరించారు. అనంతరం డీడీయూ ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన చిత్రకూట్ నాటకాన్ని (రాముడి 14ఏళ్ల వనవాసాన్ని ప్రతిబింబించే) తిలకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పడవలో మోదీ, మాక్రాన్, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు (అస్సీ ఘాట్, దశాశ్వమేథ్ ఘాట్ల మధ్య) విహరించారు. అనంతరం వారణాసి–పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్ ప్లాండ్‌ను రూ.500కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే దృష్టితో ఢిల్లీలో మార్చి 16నుంచి జరగనున్న ‘కృషి ఉన్నతి మేళా’ను మోదీ ప్రారంభించనున్నారు. కాగా, మాక్రాన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ కలసి అసత్య వార్తలు, ఉదార ప్రజాస్వామ్యాలను ప్రభావితం చేస్తున్న అంశాలపై చర్చించారు. -
సౌర విప్లవం సాధించాలి
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాలకు చవకైన సౌరవిద్యుత్ సులువుగా అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో సోలార్ ఉత్పత్తి వాటాను పెంచాలని, అందుకోసం సోలార్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) వ్యవస్థాపక సదస్సులో ఆదివారం మోదీ ప్రసంగిస్తూ.. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్ 175 గిగావాట్స్ విద్యుదుత్పత్తిని సాధించగలదని, ప్రస్తుత సామర్థ్యానికి అది రెండింతలని పేర్కొన్నారు. సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో 121 దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న మోదీ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్ఏ(ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్). ఆదివారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన తొలి సదస్సులో ఆరుదేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతో పాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు పాల్గొన్నాయి. సోలార్ లక్ష్యాల్ని సాధించేందుకు 10 కార్యాచరణ సూత్రాల్ని ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. చవకైన సోలార్ ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం, కూటమి సమర్థంగా పనిచేసేలా నిబంధనలు, ప్రామాణికాల రూపకల్పన తదితర అంశాల్ని ఆయన ప్రస్తావించారు. ‘వివిధ అవసరాల్ని తీర్చేందుకు సోలార్ రంగంలో ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లాభదాయకమైన సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సలహాలిచ్చే సౌలభ్యాన్ని కల్పించాలి. ఐఎస్ఏ శాశ్వత కార్యాలయాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు సమర్ధంగా పనిచేసేలా తీర్చిదిద్దాలి’ అని సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 175 గిగావాట్స్ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని ప్రధాని వెల్లడించారు. సోలార్ నుంచి 100గిగావాట్లు, పవన శక్తి నుంచి 60 గిగావాట్లు విద్యుత్ అందుబాటులో వస్తుందని, 20 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించేలా ఇప్పటికే సోలార్ పవర్ యూనిట్లు నెలకొల్పామని ఆయన తెలిపారు. నేడు వారణాసికి మోదీ, మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సోమవారం ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం చేయనున్నారు. ఐఎస్ఏలో చేరేందుకు అమెరికా, చైనా ఆసక్తి అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ)లో చేరేందుకు అమెరికా, చైనా కూడా ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఐఎస్ఏ వైపు మొగ్గు చూపుతున్న మొత్తం 121 దేశాల్లో అమెరికా, చైనా కూడా ఉన్నాయని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి కె.నాగరాజ్ నాయుడు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో మిగతా దేశాలతోపాటు చైనా, అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారని మరో కార్యదర్శి టి.ఎస్.తిరుమూర్తి చెప్పారు. ఐక్యంగా సాగితేనే లక్ష్యం సాధ్యం: మాక్రాన్ ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ.. 2030 నాటికి ఒక టెరావాట్ సౌర విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే 1 ట్రిలియన్ డాలర్లు(సుమారు రూ.65 లక్షల కోట్లు) అవసరమవుతాయని తెలిపారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడుల కోసం, అవరోధాల్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, సామాజిక సంస్థలు ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇందులో తమ వంతుగా 1 బిలియన్ యూరోలు (దాదాపు రూ.8000 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్న అమెరికా తదితర దేశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వారి గురించి పట్టించుకోకుండా ఐఎస్ఏ ఏర్పాటుపై దృష్టి పెట్టి విజయం సాధించారన్నారు. ‘మోదీ రెండేళ్ల క్రితం పారిస్ వచ్చినప్పుడు ఐఎస్ఏ ఏర్పాటు ఆలోచనను చెప్పారు. ఆయన అప్పటి ఆలోచనను ఇప్పుడు మేమంతా కలిసి నిజం చేశాం’ అని పేర్కొన్నారు. -
భారత్–ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్–ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విస్తృతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్–ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే దీని విలువ తక్కువే ఉంటుందని ఆరోపించింది. మరోవైపు సాయుధ దళాల పరస్పర సహకార ఒప్పందం ప్రకారం ఒకరి మిలిటరీ బేస్‌లను మరొకరు వాడొచ్చు. అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్ అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, మాక్రాన్ మాట్లాడారు. ‘మా రక్షణ సహకారం పటిష్టమైనది. భారత్‌కు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్’ అని మోదీ అన్నారు. ఇరు దేశాల సాయుధ దళాల మధ్యా పరస్పర లాజిస్టిక్ సహకారం రక్షణ సంబంధాల్లో కొత్త శకమన్నారు. ప్రాంతీయ సుస్థిరత, శాంతికి హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. రక్షణ సంబంధాల్లో నూతన శకం.. స్కార్పీన్ జలాంతర్గాముల ప్రాజెక్టు, ఫైటర్ జెట్ల ఒప్పందం నేపథ్యంలో ఇరుదేశాల మధ్యా రక్షణ సంబంధాల్లో నూతన శకం ఆరంభమైందని మాక్రాన్ అన్నారు. యుద్ధ విమానాల ఒప్పంద పురోగతిని తాము స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ ప్రాజెక్టు కొనసాగాలని తాము భావిస్తున్నామని, ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే దీర్ఘాకాలిక ఒప్పందం ఇదని చెప్పారు. భారత్ తమ మొదటి వ్యూహాత్మక భాగస్వామి కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. సముద్ర తీరాలు ఆధిపత్యపోరాటానికి వేదికలు కాదని, పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏటా రక్షణ రంగానికి సంబంధించి మంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ మంత్రి సీతారామన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి పార్లే చర్చించారు -
ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన
-
ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన
శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌కు స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్న మోదీ. మాక్రన్ వెంట ఆయన భార్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు. శనివారం మోదీ, మాక్రన్ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. -
'మమ్మల్ని భయపెట్టలేరు'
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే మంగళవారం వేడుకల అనంతరం ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో భారత్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. విమానం ఎక్కేముందు విలేకరులతో మాట్లాడిన హోలాండే.. ఫ్రాన్స్, భారత్ లు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో వెనకడుగువేయబోమని తేల్చిచెప్పారు.'మేం దేనికీ భయపడం, మమ్మల్నెవ్వరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు' అని హోలాండే ఉద్ఘాటించారు. ఉదయం రాజ్ పథ్ లో జరిగిన గణతంత్రవేడుకల్లో విశిష్టఅతిథిగా పాల్గొన్న హోలాండే.. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పలువురితో కరచాలనం చేస్తూ హుషారుగా గడిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ ఎట్ హోమ్ కు హాజరయ్యారు. తన మూడు రోజుల భారత పర్యటనలో హోలాండే.. చండీగఢ్ లో నిర్వహించిన వాణిజ్య సదస్సు భారత ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఉభయదేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థల అధిపతులు హాజరయ్యారు. చండీగఢ్‌లోని రాక్‌గార్డెన్, క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలను కూడా హోలాండే సందర్శించారు. రెండో రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.