మోదీకి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ | Narendra Modi, Emmanuel Macron selected for UN's highest environmental award | Sakshi
Sakshi News home page

మోదీకి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’

Published Thu, Sep 27 2018 4:21 AM | Last Updated on Thu, Sep 27 2018 4:21 AM

Narendra Modi, Emmanuel Macron selected for UN's highest environmental award - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డు లభించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం పొందారు. పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పారిస్‌ ఒప్పందం కుదరడంలో మాక్రన్‌ పాత్ర, 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ వాగ్దానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డు దక్కింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement