Selected
-
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్‌పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
‘టెట్’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ పేర్కొన్నారు. కేటాయింపు ఇలా.. మ్యాథ్స్, సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406 మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్ వివరించారు. ► సోషల్ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు. ► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. ► ఇంగ్లిష్ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు. ► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు. -
‘గురుకుల’కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో సంక్షేమ గురకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అదేవిధంగా గురువారం రాత్రి గురుకుల పాఠశాలల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్, పోçస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.... వాటిని బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల బోర్డు ఫోన్లలో సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) ద్వారా సమాచారంఇచ్చింది. సాంకేతిక కారణాలతో టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్ మొరాయించడంతో అభ్యర్థులు జాబితాలను పరిశీలించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం తర్వాత వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు అధిగమించడంతో వెబ్సైట్ తిరిగి తెరుచుకుంది. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన... ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీ 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన ఉదయం 9గంటల నుంచి చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(ఉమెన్)లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సుపత్రాలు, సెల్ఫ్ అటెస్టేషన్ పత్రంతో హాజరు కావాల్సి ఉంటుంది. చెక్‌లిస్టును బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని గురుకుల బోర్డు కన్వినర్ అభ్యర్థులకు సూచించారు. 10 నుంచి డెమో పరీక్షలు... ప్రస్తుతం విడుదల చేసిన 1:2 జాబితాల్లో ఎంపికైన అభ్యర్థులకు డెమో పరీక్షలను గురుకుల బోర్డు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు అదేవిధంగా పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుంచి డెమో పరీక్షలు నిర్వహిస్తారు. తుది జాబితాలో అర్హత సాధించిన వారికి ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు సంక్షేమ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికా చదువులకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన సాయం అందించడమే కాకుండా వాళ్లు తిరిగి వచ్చాక కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ (కేఎల్–వైఈఎస్)’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది దేశంలో 30 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం దక్కింది.వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లనున్న విద్యార్థులు.. డి.నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్.ఆకాంక్షలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంను కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు.. కె.అక్ష, సి.తేజ కూడా ఉన్నారు. విద్యార్థులను సీఎం జగన్ అభినందించి కుటుంబ నేపథ్యం, విద్యా సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి జయలక్షి్మ, ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులున్నారు. కేఎల్–వైఈఎస్ ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్‌ను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ సాంస్కృతిక మారి్పడి కోసం నిర్వహిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలో నమోదు చేస్తారు. ఎంపికైన విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు ఆతిథ్యం ఇస్తాయి. ఒక్కో విద్యార్థికి దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.16,500) నెలవారీ స్టైఫండ్‌ను అందిస్తారు. ఈ ఏడాది ఎంపికైన ఐదుగురు విద్యార్థులు సెపె్టంబర్ మొదటివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, ఈ ఏడాది దేశం మొత్తం మీద 30 మంది ఎంపికైతే మన ఒక్క రాష్ట్రం నుంచే ఐదుగురు గురుకుల విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. పేద కుటుంబం నుంచి అమెరికా మాది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ. అమ్మానాన్న.. సుకాంతి, ప్రవీణ్‌రాజ్. నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పేద కుటుంబానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే అది ప్రభుత్వ ప్రోత్సాహమే. – రోడా ఇవాంజిలి, ఇంటర్ సెకండ్ ఇయర్ మధురవాడ అంబేడ్కర్ గురుకులం, విశాఖ కలలో కూడా ఊహించలేదు.. మాది అనకాపల్లి జిల్లా జి.కొత్తూరు. నాన్న కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నేను అమెరికా చదువుకు ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాను. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా సీఎం సార్ ప్రోత్సాహమే.. మాది సత్యసాయి జిల్లా మల్లెనిపల్లి. నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్. తల్లి నాగమణి గృహిణి. నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే దానికి సీఎం సార్ ప్రోత్సాహమే కారణం. – బలిగా హాసిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈడ్పుగల్లు ఐఐటీ–నీట్ అకాడమీ,ఎస్సీ గురుకులం, కృష్ణా జిల్లా విద్యాలయాలను తీర్చిదిద్దారు.. మాది ప్రకాశం జిల్లా పుచ్చకాయలపల్లి. నాన్న కేశయ్య రైతు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ ఎంతో బాగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. – డి.నవీన, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని, మార్కాపురం గురుకులం, ప్రకాశం జిల్లా ఎప్పటికీ మర్చిపోలేను.. మాది విజయవాడ. నాన్న సురేశ్.. అటెండర్. అమ్మ వనజ గృహిణి. ప్రభుత్వ గురుకులంలో చదివిన నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. – ఆకాంక్ష, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈడ్పుగల్లు ఐఐటీ–ఎన్ఐటీ అకాడమీ, కృష్ణా జిల్లా -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
హైదరాబాద్ మూలాలున్న రియాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాజధాని మూలాలున్న రియా ఉప్పలపాటి అనే 17 ఏళ్ల యువతి ‘అట్లాంటా ఇన్నోవేటర్స్’టాలెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. పాతికేళ్లలోపు విభాగంలో ఆమె ఈ అవార్డు సాధించారు. వాల్టన్ హైస్కూల్లో సీనియర్ గ్రేడ్ చదువుతున్న రియా సొంతంగా అట్లాంటా సిటీలో ‘ఫరెవర్ ఎర్త్’అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతో పాటు వ్యర్థాలను వీలైనంత మేర తగ్గిస్తూ ప్రజలు సుస్థిర జీవితాన్ని నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. ఆమె రచించిన ‘ఇన్మై బ్యాక్ యార్డ్–ఎ పర్సనల్ స్టోరీ ఆఫ్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెట్రోలియం ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ’పుస్తకం ఇటీవలే అట్లాంటాలో విడుదలైంది. పెట్రోలియం, చమురు పరిశ్రమల కారణంగా ఎదురవుతున్న సమస్యల గురించి ఈ పుస్తకంలో చర్చించారు. హైదరాబాద్, అట్లాంటాలో ఒక్కో విద్యార్థికి పూర్తి ట్యూషన్ ఫీజును భరించేలా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ను ఫరెవర్ ఎర్త్ సంస్థ స్పాన్సర్ చేస్తుంది. రియా తాత ఉప్పలపాటి సుబ్బారావు బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ కాగా.. ఆమె తండ్రి ఇంజనీర్‌గా, తల్లి డాక్టర్‌గా అట్లాంటాలో పనిచేస్తున్నారు. -
పదోన్నతి...జీతానికి కోతే గతి
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్, ఎస్సైలుగా ఎంపికైన వారికి కొత్తగా వేతన కష్టాలు చుట్టుముట్టాయి. పదోన్నతి దక్కినందుకు సంబరపడాలో వేతనం తగ్గుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎస్పీఆర్బీ) ఆధ్వర్యంలో ఒకేసారి దాదాపు 18 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించింది. వీరిలో 1,200 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభమైంది. త్వరలోనే 16 వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది. అయితే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్సైలకు ఎంపికైన కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల టీఎస్ఎస్పీఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) బలగాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరిలో 2016 అంతకుముందు ఎంపికైనవారున్నారు. ఆ లెక్కన వీరందరి జీతం రూ.30 వేలకు కాస్తా అటుఇటుగా ఉంది. పాత కొలువులకు రాజీనామా చేసి.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో దాదాపు 1,500 మంది ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యారు. వీరంతా సివిల్‌కు రావాలంటే వీరంతా తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి, సంబంధిత విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకురావాలి. అప్పుడు వీరంతా తిరిగి కానిస్టేబుల్, ఎస్సై శిక్షణకు వెళతారు. శిక్షణకాలంలో వీరందరినీ ట్రైనీ కేడెట్లుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.9,000 స్టైపెండ్ కింద ఇస్తారు. వీరిలో చాలామంది వివాహితులు. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. శిక్షణకాలంలో ఇంత తక్కువ వేతనంతో ఎలా మనగలగాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఎస్సైకి ఎంపికైన అభ్యర్థులు ర్యాంకు పెరిగింది కాబట్టి.. ఎలాగోలా సర్దుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ, సివిల్‌కానిస్టేబుల్‌కు ఎంపికైన ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు మాత్రం కుటుంబపోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. తామందరం ఇప్పటికే శిక్షణ తీసుకుని, కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కారణంగా తిరిగి 9 నెలల సుదీర్ఘ శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో నూ ఇలాంటి సమస్యే ఎదురైనపుడు ఏఆర్, టీఎస్ఎస్పీ, కానిస్టేబుళ్లకు కేవలం 3 నెలల తరగతులు బోధించి వెంటనే సివిల్ కానిస్టేబుళ్లుగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తమకు తిరిగి అదే వెసులుబాటు కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పలువురు కానిస్టేబుళ్లు డీజీపీ కార్యాలయానికి వస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. -
ఇండియా ‘ఎ’ జట్టులో శిఖర్ ధావన్
వెస్టిండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో చివరి రెండు అనధికారిక వన్డేలలో తలపడే భారత ‘ఎ’ జట్టులోకి ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం శిఖర్ విండీస్ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు. కుడి చేతి బొటన వేలి గాయంతో విజయ్ శంకర్ ‘ఎ’ సిరీస్‌కు దూరమయ్యాడు. -
కార్యదర్శి ఉద్యోగాల్లో సత్తాచాటిన మాజీ సర్పంచ్
జైపూర్(చెన్నూర్): జైపూర్ మండలం ఆయాగ్రామాలకు చెందిన యువతీయువకులు పంచా యతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మంగళవారం అర్హత జాబితా వెల్లడించారు. జైపూర్ మండలం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. నర్వ గ్రామానికి చెందిన కోట రాం బా యి–భీమయ్యల కుమార్తె కోట శ్యామల, ముది గుంటకు చెందిన దూట శాంత–లింగయ్యల కుమారుడు దూట క్రాంతి, ఇదే ముదిగుంటకు చెందిన మాజీ సర్పంచ్ దూట కిరణ్‌కుమార్ అనే 43 వయసులో ఉద్యోగం సాధించాడు. రామారావుపేట గ్రామానికి చెందిన రౌతు రమాదేవి–మల్లేశ్ కుమార్తె రౌతు సృజన, టేకుమట్లకు చెందిన కామేర లక్ష్మిగట్టయ్య కుమార్తె కామేర స్రవంతి అర్హత సాధించారు. సత్తాచాటిన మాజీ సర్పంచ్ ముదిగుంటకు చెందిన దూట కిరణ్‌కుమార్ మాజీ సర్పంచ్ 43 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధిం చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2001–2006వరకు టీడీపీ హయాంలో సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం రాజకీయాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. పట్టుదలకు వయసు అడ్డుకాదని తాజాగా వెలువడిన పంచాయితీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై నిరూపించాడు. 43 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు అభినందనలు తెలియజేశారు. 20, 21వ తేదీల్లో సెక్రటరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన 232 మందిని ఎంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై.సురేందర్‌రావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా పౌరసరఫరాల సంబంధాల అధికారి వై.సంపత్‌కుమార్‌తో కలిసి ఫలితాల జాబితా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ 232 మంది కార్యదర్శులను తాత్కాలిక ప్రాతిపదికన రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 20,21వ తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, జాబితాలోని హాల్‌టికెట్ల నంబర్లు గల అభ్యర్థులు పుట్టినతేదీ, కులం, విద్యార్హత పత్రాలు, పి.డబ్ల్యూ, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మోదీకి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం పొందారు. పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పారిస్ ఒప్పందం కుదరడంలో మాక్రన్ పాత్ర, 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ వాగ్దానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు దక్కింది. -
ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టోక్స్
లండన్: సొంతగడ్డపై భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కింది. పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. జూలై 12 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మందితో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించారు. వన్డేలకు ముందు జరిగే మూడు టి20ల సిరీస్‌కు మాత్రం అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సిరీస్‌లో తొలి వన్డే జూలై 12న ట్రెంట్ బ్రిడ్జ్‌లో, రెండో వన్డే జూలై 14న లార్డ్స్‌లో, మూడో వన్డే జూలై 17న హెడింగ్లేలో జరుగనున్నాయి. ఇంగ్లండ్ వన్డే జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జాక్ బాల్, బట్లర్, కరన్, హేల్స్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, రూట్, రాయ్, స్టోక్స్, విల్లీ, మార్క్ వుడ్. -
పాక్ తాలిబన్‌కు కొత్త చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ నూతన చీఫ్‌గా ముఫ్తీ నూర్ వలీ మెహసూద్ నియమితుడయ్యాడు. ఇటీవలే అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మృతిచెందిన ముల్లా ఫజలుల్లా స్థానంలో నూర్ ఎంపికయ్యాడు. తాలిబన్ మండలి నూర్‌ను ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపిక చేసిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఖురాసాని చెప్పారు. దక్షిణ వజీరిస్తాన్కు చెందిన నూర్ పలు పాకిస్తాన్ మదరసాల్లో విద్యాభ్యాసం చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వెనక తాలిబన్లు ఉన్నారని ఉర్దూలో తాను రాసిన ఓ పుస్తకంలో ప్రకటించాడు. ఆర్థిక అవసరాల కోసం తాలిబన్లు బలవంతపు వసూళ్లు, అపహరణలకు పాల్పడినట్లు ఓ సందర్భంలో నూర్ అంగీకరించాడు. -
ఆడి కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దారు ఆడి తన కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. తన పాపులర్ మోడల్ కార్లపై మూడునుంచి పదిలక్షల దాకా తగ్గింపును అందిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించేందుకు భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై పరిమిత కాలానికి కస్టమర్ బెనిఫిట్ స్కీంను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆడి క్యూ3 తో పాటు, ప్రముఖ మోడల్స్ ఏ3, ఏ4, ఏ6 సెడాన్ల కార్ల కొనుగోళ్లపై రూ.2.7 లక్షల నుంచి రూ .10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. జూన్ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దిగుమతి సుంకాలు , ప్రతికూలమైన పన్నులు తదితర కారణాలు కారును సొంతంచేసుకోవాలని కలలు కనే కస్టమర్‌కు ప్రతిబంధకం కాకూడదని తాము భావిస్తున్నామని ఆడి ఇండియా ప్రెసిడెంట్ రాహిల్ అన్సారీ చెప్పారు. ఈ పథకం కింద 2018లో కొనుగోలు చేసి 2019లో వినియోగదారులు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహంలో భాగంగాగానే ఆ ఆఫర్ అని చెప్పింది. అంతేకాదు ఎంపిక చేసిన మోడల్‌కార్లపై ఆడి ఛాయిస్ పథకం కింద 57శాతం బై బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది. 2016లో 7,720 యూనిట్లు విక్రయించగా, 2017 నాటికి 2 శాతం వృద్ధితో 7,876 యూనిట్లు విక్రయించామని ఆదివారం ప్రకటించింది. అయితే గత సంవత్సరం మే, జూన్ అమ్మకాలు మందగించడం, జీఎస్టీ సందర్భంగా విలాసవంతమైన కార్లపై భారీగా డిస్కౌంట్ల ఫలితంగా పుంజుకున్న అమ్మకాల నేపథ్యంలో ఆడి ఇండియా ఈ ఏడాది కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2018-19 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చే దిశగా దిగుమతి సుంకాన్నిపెంచారు. సీకేడీ కార్లపై 10నుంచి 15 శాతం సుంకం పెంచగా మోటారు వాహనాలు, మోటారు కార్లు, మోటారు సైకిల్స్‌కు చెందిన విడిభాగాలపై 7.5నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే. -
రాఘవేంద్రుడి డైరెక్షన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావును ఈసారి ఎస్వీబీసీకి చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్వీబీసీకి చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి. తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి తత్వాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, హిందూ ధార్మికతను పెంచేందుకు 2008లో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించింది. ఏడాదికి రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి ఎస్వీబీసీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఈఓలుగా కేఎస్ శర్మ, జయదేవరెడ్డి, ఎస్.రామానుజం, మధుసూదనరావు, నరసింహారావులు పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిముక్తేశ్వరరావు ఎస్వీబీసీకి ఇన్చార్జి సీఈఓగా కొనసాగుతున్నారు. ఆరోపణలు ఉన్నప్పటికీ ఇటీవల ఎస్వీబీసీ ఉద్యోగులు, సీఈఓ నరసింహా రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎస్వీబీసీ నిధులను కొల్లగొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు సీఈఓపై ఈఓకు ఫిర్యాదు చేశారు. సీఈఓ నరసింహారావు నిధుల వాడకంపై విజిలెన్సు విచారణ కూడా జరిగింది. ఇందులో రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్ప టి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కోసం కోట్లలో నిధులు ఖర్చు పెట్టారని, యాంకర్ పార్టులు మార్చి పాత వాటినే కొత్త ఎపిసోడ్లుగా చూ పారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. చానల్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో ఉన్న టీటీడీ తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ నియామకాన్ని జరి పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావుకు చైర్మన్ పదవిని ఎలా ఇస్తారన్నది కొందరు ఉద్యోగుల ప్రశ్న. మొదటి నుంచీ ఎస్వీబీసీ వ్యవహారంలో పోరాటం చేస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకాన్ని తప్పుబడుతున్నారు. -
వీడు మాములోడు కాదు...
విదేశాల్లో చదువుకోవాలనుకుంటే చాలా కష్టపడాలి. అక్కడి యూనివర్సిటీల్లో చేరాలంటే ఎన్నో ప్రవేశ పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. అయితే పరీక్షల గోల మనకెందుకులే కొందరు వదిలేస్తారు. మరికొంతమంది పట్టుదలతో సాధిస్తారు. అయితే హూస్టన్‌కు చెందిన మైఖేల్ బ్రౌన్ మాత్రం అమెరికాలోని దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా అన్నింటికి అర్హత సాధించాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదలుకొని యేల్, ప్రిన్స్టన్, టెక్సాస్ ఇలా ప్రఖ్యాత యూనివర్సిటీలన్నింటికి ఎంపికై అవి అందించే స్కాలర్‌షిప్‌లకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ్వరూ కూడా రిజెక్ట్ చేయలేరు ఈ యూనివర్సిటీల్లో చేరడానికి. మరీ ముఖ్యంగా స్టాన్ఫోర్డ్లాంటి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం వస్తే వదులుకోలేరు కదా అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కొడుకు సాధించిన విజయానికి అతని తల్లి ఉప్పొంగుతూ...‘బ్రౌన్ చిన్నప్పటి నుంచీ చురుగ్గానే ఉండేవాడు. ఏ పని మొదలుపెట్టినా...మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు’ అంటూ తెలిపింది. -
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నాతాల రాంరెడ్డి
సూర్యాపేటరూరల్ : టీడీపీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్గా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన నాతాల రాంరెడ్డి నియామకమైనట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా వెల్లడించారు. బుధవారం అంజనాపురి కాలనీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు నాతాల రాంరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇప్పటికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో సూర్యాపేట నియోజకర్గంలోనూ మొదలు పెడతామన్నారు. ఈ నెల 29న నిర్వహించే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం చౌడోజు వీరాచారి ఆధ్వర్యంలో గజమాలతో రాంరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాల అధ్యక్షుడు కుంచం అంజయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, పగడాల లింగయ్య, శంకర్‌నాయక్, వంశీ, జానిమియా, జితేందర్, మోహన్, రామాచారి తదితరులు పాల్గొన్నారు. -
రైనా పునరాగమనం
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20ల సిరీస్ కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా దాదాపు ఏడాది తర్వాత తిరిగి ఎంపిక కావడం విశేషం. గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో ఆఖరి టి20 ఆడిన రైనా... ఫిట్నెస్ సమస్యలతో పాటు ఫామ్ కోల్పోయి టీమ్‌కు దూరమయ్యాడు. అనంతరం ‘యోయో టెస్టు’లో కూడా సఫలమైన అతను ముస్తాక్ అలీ టి20 టోర్నీలో చెలరేగాడు. ఈ టోర్నమెంట్లో రైనా ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లి సారథ్యంలో 16 మంది సభ్యుల టీమ్‌లో అక్షర్ పటేల్, పేసర్ శార్దుల్ ఠాకూర్లకు కూడా అవకాశం లభించింది. భారత్ తరఫున 2 వన్డేలు ఆడిన శార్దుల్‌కు టి20 పిలుపు లభించడం ఇదే తొలిసారి. శ్రేయస్ అయ్యర్‌పైనా వేటు...: ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి సహా పలువురు కీలక ఆటగాళ్లకు భారత్ విశ్రాంతినిచ్చింది. వారందరూ ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చారు. ఫలితంగా బాసిల్ థంపి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ చోటు కోల్పోయారు. లంకతో ఒక మ్యాచ్ ఆడిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌పై కూడా వేటు పడింది. మరోవైపు ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. శ్రీలంకతో మూడు వన్డేల్లో రెండు అర్ధ సెంచరీలు చేసి ఆకట్టుకున్న అయ్యర్... ఆ తర్వాత మూడు టి20ల్లో కలిపి 54 పరుగులే చేయగలిగాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచ్‌లో 44 బంతుల్లో 79 చేసినా...సెలక్టర్లు దీనిని పరిగణలోకి తీసుకోకుండా అయ్యర్‌ను తప్పించారు. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత టి20 జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, రైనా, ధోని, దినేశ్ కార్తీక్, పాండ్యా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, జైదేవ్ ఉనాద్కట్, శార్దుల్ ఠాకూర్. -
జాగృతి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక
కమిటీని ప్రకటించిన ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శులుగా టి.పూర్ణచందర్రావు, జి.సంతోష్, టి. రోహిత్, ఎన్. సాయికృష్ణ, ఎ.సోనియా, నల్లవెల్లి కపిల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా టి.రమేశ్, పీఆర్ఓగా ఎం. వంశీకృష్ణ ఎంపికయ్యారు. ఈ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా కె. విజయ్ కుమార్, రాష్ట్ర కో–కన్వీనర్లుగా జలంధర్‌యాదవ్, వంగల శ్రీనివాస్, బక్కతట్ల వెంకట్, ఎజాజ్ హైదర్ ఇప్పటికే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో యువకులను భాగస్వాములు చేసే విధంగా ఈ సమాఖ్య పని చేయాలని కవిత వారికి సూచించారు. -
నెల్లూరు జిల్లా ప్లీనరీ పరిశీలకుల నియామకం
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ప్లీనరీకి జిల్లాకు చెందిన ఇద్దరిని పరిశీలకులుగా నియమించారు. ఈ నెల 30న నెల్లూరులో ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ ప్లీనరీకి తూర్పుగోదావరికి చెందిన పార్టీ సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ జడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణులను రాష్ట్ర పార్టీ నియమించింది. తూర్పుగోదావరి జిల్లాకు ఆహ్వానితులుగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు. -
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 1000జీబీ డేటా ఫ్రీ
ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్ టెల్ బ్రాండ్ బ్యాండ్ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్ గా ఉంది ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది. వెబ్సైట్ ప్రకారం రూ.899 ప్లాన్ తరవాతిప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్ అన్నింటిలోనే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితం. కాగా గత వారం, కంపెనీ తన బ్రాడ్ బ్యాండ్ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది. కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురి ఎంపిక
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపికయినట్లు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్‌నాయక్ తెలిపారు. వీరిలో అనంతపురం నుంచి సయ్యద్ నూరుల్ హుదా, రోశిరెడ్డి ఎంపికయ్యారన్నారు. వీరితోపాటు క్రాంతి (వైఎస్సార్ కడప), విజయ్(ప్రకాశం), సుబ్బారావు (ప్రకాశం)లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు జిల్లాకు చెందిన సయ్యద్ నూరుల్ హుదా కెప్టెన్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు అనంతపురంలో జరిగిన సౌత్ ఇండియా క్రికెట్ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్‌జోన్ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ముంబయ్‌లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపిక పట్ల రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, మధుసుధన్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
నిరుపేద విద్యార్ధినికి అరుదైన అవకాశం
-
సత్తా చాటుతూ..
ఇన్నోవేషన్ ఫెలోస్‌కు జేఎన్టీయూకే, గైట్ కళాశాల విద్యార్థులు బాలాజీచెరువు(కాకినాడ) : సాంకేతిక యూనివర్సిటీలో అగ్రగామిగా నిలుస్తున్న జేఎన్టీయూకే ఇప్పుడు తన వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో పోటీపడి ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఒక బ్యాచ్ అర్హత సాధించి సిలికాన్ వ్యాలీ సదస్సులో పాల్గొనగా.. మరో నలుగురు విద్యార్థులు నవంబర్‌లో జరిగే సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హస్పోప్లాటర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(డీస్కూల్) కల్పించే యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్‌కు(యూఐఎఫ్) జేఎన్టీయూకే విద్యార్థులు ఎంపికయ్యారు. సీఎస్ఈ విభాగం నుంచి చైతన్య, ప్రతిభాంకిత, ఈసీఈ నుంచి సౌమ్య,తేజస్వినీలు ఎంపికైన వారిలో ఉన్నారు. గైట్ విద్యార్థులు కూడా.. వెలుగుబంద (రాజానగరం) : యూఎస్ఏలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమానికి స్థానిక గైట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గూగల్, స్టా¯ŒS ఫోర్టు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపికైన వారిలో బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులు రచన పారుపూడి, మెండ్రోటి వెంకటసత్యసాయిసిద్దార్థ (ఈసీఈ), గ్నషాకేర్ సహాని (సీఎస్ఈ), బీటెక్ సెకండియర్ విద్యార్థి సుందరిజాహ్నవి మావూరి (సీఎస్ఈ) ఉన్నారు. దేశవ్యాప్తంగా 224 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారిలో గైట్ నుంచి నలుగురు ఉండడం హర్షణీయమన్నారు. మార్చి 9 నుంచి 12 వరకు జరిగే సిలికాన్ వాలీ మీటప్‌లో పాల్గొని, వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం మన దేశంలోని ఉన్నత విద్యలో మార్పును తీసుకువచ్చేలా విద్యార్థి నాయకులను తయారు చేయడానికి, విద్యార్థుల శక్తిని మార్పునకు అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్షీ్మశశికిరణ్ అన్నారు. సమావేశంలో సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రామ్మూర్తి, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు, ఏపీఎస్ఎస్డీసీ ఎకనామిక్ కన్సల్టెంట్ టీవీ రావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక సోమవారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించినట్లు గుజోరియో డూ రె¯ŒSమయ్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 18, 19 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హరిహర పట్టణంలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కరాటే పోటీలు ఇండో–శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపిౖకెన క్రీడాకారులు : 30 కేజీల విభాగం కుషీధర్ రెడ్డి(అనంతపురం), 38 కేజీల విభాగం మౌర్య(ధర్మవరం), 45 కేజీల విభాగం బాలికలు త్రివేణి(అనంతపురం), బాలురు రామకృష్ణ, శశీ ప్రీతమ్(అనంతపురం), 48 కేజీల విభాగం బాలికలు శిల్పా(అనంతపురం), బాలురు మహేష్(అనంతపురం), 68 కేజీల విభాగం బాబాషాహుల్, చంద్రశేఖర్ రెడ్డి(అనంతపురం) . -
అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంత క్రీడాకారులు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన నరేష్, ముదస్సర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. స్టాండ్‌బైగా దాదా ఖలందర్‌ను ఎంపిక చేశారన్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన ప్రాబబుల్స్‌లో నరేష్ 7 వికెట్లు, ముదస్సర్ 6 వికెట్లు తీశాడు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సెంచరీతో అలరించాడు. దీంతో సెలక్టర్లు వారిని ఆంధ్రా జట్టుకు ఎంపిక చేశారు. దాదా ఖలందర్ 7 వికెట్లు తీశాడు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 16 వరకు గుంటూరు జిల్లా పేరిచెర్లలో జరిగే అండర్–25 బీసీసీఐ సౌత్ ఇండియా రామ్మోహన్రావు ట్రోఫీలో పాల్గొంటారు. జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర జట్టులో చోటు దక్కడంపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. -
పరిపూర్ణత సాధించలేం..
ద్వితీయ భాష విషయంలో పట్టుసాధించేది కొందరే.. మాతృభాషకు అనువుగానే మెదడు స్పందన ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన అమలాపురం వాసి నక్కా సత్యప్రకాష్ ‘‘మనిషి మెదడులోని ఐక్యూ మాతృభాషకు అనువుగా స్పందిస్తుంది. అందుకే ద్వితీయ భాషను మెదడు స్వీకరించేటప్పుడు మాతృభాష ప్రభావం పడుతోంది. ఈ కారణంగా ద్వితీయ భాష విషయంలో మనం పరిపూర్ణత సాధించలేం. చాలా కొద్దిమంది మాత్రమే ఇతర భాషలపై పట్టు సాధిస్తారు తప్ప, పరిపూర్ణతను సాధించలేరు’ అని చెబుతున్నారు అమలాపురానికి చెందిన నక్కా సత్యప్రకాష్. జర్మనీలో ప్రతిష్టాత్మకమైన గీస¯ŒS యూనివర్సిటీలో మార్చి 23 నుంచి 25 వరకు నిర్వహించే ప్రపంచ స్థాయి భాషా సదస్సుకు ఆయన ఎంపికయ్యారు. అక్కడ పేపర్ ప్రజంటేష¯ŒS చేయడంతోపాటు వర్క్‌షాపులో వక్తగా మాట్లాడనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో న్యూరో లింగిస్టిక్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆయన దక్షణాది ప్రధాన భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలు, వారు రెండో భాషగా ఎంపిక చేసుకునే ఇంగ్లిష్‌పై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. జర్మనీలో జరిగే ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన ఆయన ‘సాక్షి’తో తన పరిశోధనా అనుభవాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... – అమలాపురం ‘‘నా పరిశోధనలో కీలకాంశం మొదడు ఐక్యూపై మాతృభాష ప్రభావం ఎక్కువని గురించడమే. న్యూరో లింగిస్టిక్స్ రెండు రకాలు ఒకటి కాంప్రె¯Œ్స (ఎలా అర్థం చేసుకుంటున్నారు?) రెండు ప్రొడక్ష¯ŒS (ఎలా మాట్లాడతారు?) అనేవి రెండు విభాగాలు. వీటిలో బ్రోకాస్ ఏరియా, లెనికేస్ ఏరియా అని ఉంటుంది. దీని మీద పరిశోధనలు చాలా తక్కువ జరిగాయి. ఈ సబ్జెక్ట్ మీద నాకున్న ఆసక్తి నన్ను దీనిపై పీహెచ్డీ చేసేలా చేసింది. ∙నా పరిశోధన పూర్తి భిన్నం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనాలకు నా పరిశోధన వ్యతిరేక దశలో సాగుతుంది. గతంలో చాలా మంది మాతృభాష పదాలను ఎక్కువగా వాడేవారు. ద్వితీయ భాష ఇంగ్లిష్ పదాల వాడుక తక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మాతృభాషలో ఇంగ్లిష్ పదాలు ఎక్కువయ్యాయి. దీని వల్ల మాతృభాషపై ఇంగ్లిష్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై పరిశోధన చేస్తున్నా. ∙భాషకీ భాషకీ మధ్య వైవిధ్యంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు ‘వచ్చాడు’ అని మనం తెలుగులో అంటాం. కాని ఇంగ్లిష్‌లో అయితే ‘హీ కమ్’ అని అనాలి. అంటే ఇంగ్లిష్ మాటల్లో కర్త, క్రియలను వాడితేకాని పదం సంపూర్ణం కాదు. కాని తెలుగులో వచ్చాడు అని క్రియతో చెప్పేయవచ్చు. ఈ కారణంగానే మాతృ భాష తెలుగైన వారు ద్వితీయ భాష ఇంగ్లిష్ మాట్లాడేటప్పుడు తడబడతారు. మన తెలుగువారే కాదు. మాతృభాష ఒకటి, ద్వితీయ భాష మరొకటి అయినప్పుడు తడబాటు తప్పదు. ∙అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చదివా. 2014 ఆగస్టులో ఐఎస్ఎల్యూ ఇంగ్లిష్‌లో టాపర్‌గా నిలిచి, కాకినాడ ఆదిత్య విద్యాసంస్థల్లో సాఫ్ట్‌స్కిల్ హెడ్‌గా పనిచేశా. న్యూరో లింగిస్టిక్స్పై ఆసక్తితో ఉద్యోగం నుంచి తప్పుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. స్వతహాగా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఆసక్తి. వివిధ భాషల్లో నిష్ణాతులైన స్పీకర్లను కలవడం, వారి అనుభవాలను, హావభావాలను పరిశీలించడం ద్వారా న్యూరో లింగిస్టిక్స్ పరిశోధనలు సాగిస్తున్నాను. ∙మాతృభాషే కాదు.. ఇతర భాషలపై పట్టు సాధించాలంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ విధానంలో కష్టపడాలి. ఎల్–లిజనింగ్ (వినడం), ఎస్–స్పీకింగ్ (మాట్లాడడం), ఆర్ –రీడింగ్ (చదవడం), డబ్ల్యూ–రైటింగ్ (రాయడం). ఎవరైతే ఈ విషయాల్లో కఠోరంగా కృషి చేస్తారో వారే భాషపై çపట్టు సాధిస్తారు. 30 ఏళ్లు పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లిష్ బోధించిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు వేగంగా ఇంగ్లిష్ మాట్లాడలేరంటే అందుకు వినడం, మాట్లాడకపోవడంలో శ్రద్ధ చూపకపోవడమే కారణం. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి : తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ నెల 21 నుంచి జరిగే జాతీయస్థాయి జూనియర్, మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ – 2017 పోటీలకు రాష్ట్రం నుంచి లిఫ్టర్లను ఎంపిక చేసినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 53 కేజీల విభాగంలో షేక్ మహ్మద్ గౌస్, 120 కేజీల విభాగంలో జన్నాదుల ఈశ్వర్, మాస్టర్స్ కేటగిరీ 93 కేజీల విభాగంలో పసుపులేటి సురేష్, 105 కేజీల విభాగంలో ఆర్.నటరాజ్, గడ్డం రమేష్, 74 కేజీల విభాగంలో కరిముల్లా, డి. పార్థసారథిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదుగురు లిఫ్టర్లు జిల్లా నుంచి ఎంపిక కావడంపై అసోసియేషన్ ప్రతినిధులు మహ్మద్ రఫీ, ఎండీ సంధాని, ఎన్.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. -
అంతర్ రాష్ట్ర పోటీలకు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం టౌన్ : కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే అంతర్ రాష్ట్ర సౌత్‌జోన్ వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బాలుర విభాగంలో రాము, మణిదీప్, కుషిధర్రెడ్డి, బాలికల విభాగంలో శ్రేయ, నియతి, నాగవైష్ణవి, శ్రీహర్షిత ఎంపికయ్యారు. వీరు ఇటీవల కాకినాడలో జరిగిన అంతర్ జిల్లా వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి సౌత్‌జోన్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు. -
క్యాంపస్ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక
గుత్తి : పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్నోకు చెందిన సీ – కోర్ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్వేర్ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ ప్రదీప్వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్‌రెడ్డి, పీడీ జోయెల్ అభినందించారు. -
జాతీయస్థాయి పోటీలకు భార్గవ్
అమలాపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే సపక్‌తక్రా అండర్–14 పోటీలకు అమలాపురం రవీంద్రభారతి స్కూల్‌కు చెందిన జి.భార్గవ్ ఎంపికయ్యాడు. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోన్న భార్గవ్ ఈనెల 23, 24 తేదీల్లో నెల్లూరులో రాష్ట్రస్థాయి సపక్‌తక్రా పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ పోటీల రాష్ట్రజట్టుకు ఎంపికైనట్టు కోచ్ యాండ్ర గౌతమ్ సోమవారం తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ఆరోతేదీ వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
అల్లూరు (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అల్లూరు మంతెన సత్యనారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అండర్ 17 వాలీబాల్ బాలికల విబాగంలో ఎ జీవననాగజ్యోతి, పి.భవాని (స్టాండ్‌బై ), వాలీబాల్ అండర్ 14 బాలికల విబాగంలో పి సదా,ఎ లీలా మాధవి , ఎస్కె ఫాతిమా (స్టాండ్‌బై )లు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 14 బాలుర విబాగంలో ఎన్హర్షవర్దన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు (స్టాండ్‌బైగా ) ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈనెల 8వ తేదీన నరసరావుపేటలో జరిగిన ఖేల్‌ఇండియా జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైయ్యారని తెలిపారు. -
జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఒంగోలు: జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన రాష్ర్టస్థాయి సైకిల్ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు 6-2తేడాతో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. స్థానిక ఆర్ఐవో కార్యాలయానికి ఆర్ఐవో ఉదయగిరి రమేష్‌బాబు క్రీడాకారులను ప్రశంసించారు. జాతీయ జట్టుకు ఎంపికైన పఠాన్షార్జాన్, కట్టా శివకృష్ణ, కుంచాల విజయ్, పోట్లూరి నరేష్‌లు జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అండర్-19 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.హరనాథబాబు, ఏబీఎం కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జూడోకు గైట్ విద్యార్థుల ఎంపిక
వెలుగుబంద (రాజానగరం) : హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో నవంబరు మొదటి వారంలో జరగనున్న జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల జూడో పోటీల్లో పాల్గొనే జట్టుకు గైట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న ఈ ఇద్దరూ జేఎ¯ŒSటీయూకే తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు తెలిపారు. 60 కిలోల విభాగంలో పీవీ తేజ వరుసగా నాలుగో సంవత్సరం వర్సిటీ తరఫున పాల్గొంటుండగా.. 80 కిలోల విభాగంలో పి.అజయ్‌కుమార్ రెండోసారి పాల్గొంటున్నారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంíపికైన విద్యార్థులు కూడా వీరిద్దరేనన్నారు. విద్యార్థులకు, పీడీ రమణబాబుకు, హెచ్ఓడీ కేఎల్ఎ¯ŒS మూర్తిలకు అభినందనలు తెలిపారు. -
జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు హాసిని
రామచంద్రపురం : పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సత్తి కృష్ణ చైతన్యరెడ్డి కుమార్తె కృష్ణ హాసిని స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్ 14 జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు ఎంపికయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం జరిగిన 62వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో హాసిని ఉత్తమమైన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా ఏజీఎఫ్ రైఫిల్ అసోసియేష¯ŒS కార్యదర్శి సమీర్ విలేకరులకు తెలిపారు. -
అంతర్జాతీయ టార్గెట్బాల్ పోటీలకు రేవంత్
తుని : అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన ఎల్.రేవంత్ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ వీవీఎస్ భానుమూర్తి శనివారం తెలిపారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టులో ఉత్తమ ప్రతిభ చూపిన రేవంత్ అంతర్జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడని, డిసెంబరులో భూటా¯ŒSలో జరిగే పోటీల అండర్–19 విభాగంలో భారతజట్టు సభ్యుడుగా ఆడతాడని చెప్పారు. ప్రతిభ చూపిన రేవంత్‌ను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్ , ఉపాధ్యాయులు అభినందించారు. -
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
అట్టహాసంగా ఎంపిక పోటీలు చంద్రమాంపల్లి (పెద్దాపురం) : ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలకు బాలబాలిక జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎస్ఎం జిలాని స్మారక మెమోరియల్ ఖోఖో చాంపియన్ షిప్ పేరిట ఆజాద్ నేషనల్ ఆర్మీ, జెడ్పీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పది బాలుర జట్లు, సుమారు 60 మంది బాలికలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే బాలికల జట్టుకు 17 మందిని ఎంపిక చేశారు. హాజరైన వంద మందిలో 17 మందిని బాలుర జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) అ«««దl్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావడానికి క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఎంపికైన జట్లను అభినందించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నలమాటి జానకి రామయ్య, పట్టాభిరామ్, మాజీ ఎంపీపీలు గోపు అచ్యుతరామయ్య, ఇంధన జయకృష్ణ, శృంగార వల్లభ స్వామి ఆలయ చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పాగా సురేష్, యండ్రు సత్తిబాబు, బుజ్జి, తుమ్మల రాజా, పచ్చిపాల ప్రసాదరావు, వేమల పండు, తుమ్మల వీరస్వామి నాయుడు, ఎంఈఓ బాబురావు, హెచ్ఎం కె.గాయత్రి, పీఈటీలు మట్టా సుబ్బారావు, మట్టా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, పీఎస్ఎన్ మూర్తి, కేఎస్ఎన్ మూర్తి, టీఎస్ఎన్ మూర్తి, ఎన్.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జట్ల వివరాలు బాలికల జట్టు : ఓ.నాగదేవి, డి.అమృత, డి.లక్ష్మీసౌందర్య, సీహెచ్.దివ్య, పి.చంద్రఅనూష, ఎన్.అంజలి శ్రీదేవి, ఎన్.మౌనిక, కె.శ్యామల, పి.సదా, కె.రాజేశ్వరి, ఎల్.వీరలక్ష్మి, ఎస్.లీలా సత్యవేణి, వి.అక్షయ, ఎ.సుగుణ, ఎ.వెంకటదుర్గ, ఎ.రమ్యభారతి, పి.లక్ష్మి. బాలుర జట్టు : వి.వెంకటేష్, జి.నాగేంద్ర, ఎం.సాయి, వెంకట్, రాజీవ్, వై.మహేష్, జి.సూర్య మణికంఠ, ఎస్వీ ప్రసాద్, జి.సత్యేంద్ర, మణికంఠ, పి.చందు, ఎం.వెంకటరమణ, వీర ఆదిశివ, వై.అప్పాజీ. -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
గుంతకల్లు టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆ««దl్వర్యంలో ఖోఖో అండర్–18 జిల్లా బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా 12 మందితో కూడిన బాలుర జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.పుల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులు, ఏడీసీసీఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ ప్రకటించారు. అలాగే ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న బాలికల జట్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మందితోపాటు రాష్ట్రస్థాయి క్రీడాకారిణులైన గుంతకల్లుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాలికల జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జట్లు ఈ నెల 26–28 వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. సెలెక్షన్ కమిటీ సభ్యులు, పీఈటీలు శ్రీనివాసులు, ప్రభాకర్, మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపికైన బాలుర జట్టు : రామాంజినేయులు, వంశీకృష్ణ, సురేష్, భాస్కర్, మనోజ్‌కుమార్(గుంతకల్లు), ఎర్?రస్వామి, రాజశేఖర్, పురుషోత్తం(ఆమిద్యాల), నాగార్జున(అనంతపురం), వేణు, కానప్ప(చిన్నహోతూరు), శశి(ఉరవకొండ). బాలికల జట్టు : మునీషా, ఆశాబీ, రుబేనా(గుంతకల్లు), వినీత, జ్యోతి, గాయత్రి, హరిత(చిన్నహోతూరు), కవిత, వరలక్షి్మ, శిరీష(నింబగల్లు), ధనలక్షి్మ, శిల్ప(ఆమిద్యాల). -
జిల్లా జూనియర్ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు 70 మంది హాజరయ్యారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఆదర్శకుమార్, సీనియర్ క్రీడాకారులు చందర్‌కుమార్, సతీష్, కిషోర్, రవి పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 5 నుంచి 8 వరకు మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి కె.ఆదర్శకుమార్ తెలిపారు. జట్టు: జి.వెంకట్శివ, బి.వికాస్‌నాయక్, టి.బాలగంగాధర్‌తిలక్, ఐ.కృష్ణసాయి, సీహెచ్. శివకుమార్, బి.సాయిదిలీప్, జి.గోపి, బి.శరత్, డి.శ్రీపతి, బి.వంశీనాయక్, బి.పవన్‌కుమార్, పి.ఏసుపాదం, కె.బాలరాజు, ఎన్.వినయ్‌కుమార్, ఎండీ సాజిద్, ఆర్.అమర్, జె.పవన్‌కుమార్, ఐ.నోయల్జాక్సన్. కాగా, జట్టు మేనేజర్‌గా ఎండీ ఇమ్రాన్, కోచ్‌గా కల్యాణ్ వ్యవహరిస్తారని తెలిపారు. -
జాతీయ స్థాయి పోటీలకు ‘శ్రీప్రకాష్’ విద్యార్థి
పెద్దాపురం : జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల విద్యార్థి డి.సత్యనారాయణ ఎంపికైనట్టు పాఠశాల డీన్ రాజేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గత నెలలో తిరుపతి వేంకటేశ్వర విద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించాడన్నారు. సత్యనారాయణను పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్, అధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్ అభినందించారు. -
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
చిరుమామిళ్ళ (నాదెండ్ల): బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగాయి. జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి, విద్యాదాత నడికట్టు రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం.గణేష్ హాజరయ్యారు. ఎంపికైన జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఎంపికైన జట్ల వివరాలు ఇవీ.. అండర్ 14 బాలుర విభాగంలో.. ఎ.సంజయ్‌బాబు, ఎల్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, కె.ఆదిశేషు, ఎం.ప్రేమ్‌కుమార్, జి.భరత్, సీహెచ్ బాలాజీ(చిలకలూరిపేట) కె.హరినాథ్(చింతలపాలెం), జి.రాకేశ్(వినుకొండ), బి.కృష్ణబాబు, ఎస్.కౌస్తుబ్, ఎ. శరత్సత్య ప్రణీత్(గుంటూరు), స్టాండ్‌బైగా జి.ప్రవీణ్‌కుమార్, బి.వేణు(చిలకలూరిపేట) కె.కుశల్(గుంటూరు), ఎం.శరత్(గుంటూరు) కె. కౌషిక్(గుంటూరు). బాలికల విభాగంలో.. టి.త్రివేణి, అమూల్య, మౌనిక, ఎస్కే సల్మా, పి.కీర్తిశివ, సీహెచ్.అనూష, టి.సంపూర్ణ, వి.ఆశ్రిత(నరసరావుపేట), బి. త్రివేణి, కె.రూప, వి.నందిని(చిలకలూరిపేట), డి.ప్రియాంక(గుంటూరు), కె.స్వాతి(చింతలపాలెం). అండర్ 17 బాలుర విభాగంలో... ఎస్కే అమీర్, ఎ.బాలసైదులు, దుర్గారావు, పివి.ముసలయ్య, దుర్గాచౌదరి(చిలకలూరిపేట), టి.శ్రీవెంకటశ్రీరాం, జశ్వంత్, జి.వెంకటశశికుమార్, జి. అనిల్, వి.నరేంద్ర, సీహెచ్ వెంకటచంద్రశేఖర్, పి.భాస్కర్, ఎం.సంపత్, ఉపేంద్ర, ఎ.మనోజ్‌కుమార్, శ్యామ్‌కుమార్(గుంటూరు), కెఆర్ బాలశివదుర్గాప్రసాద్(పివిపాలెం), పి.శ్రీనాథ్కుమార్(చింతలపాలెం). బాలికల విభాగంలో.... షేక్ షహీరా, ఎం.ఎస్తేరురాణి, ఎం.నసీమా, ఐ.తిరుపతమ్మ, ఎం.మంజుల, సీహెచ్ ధరణి, అంజలి(నరసరావుపేట), సీహెచ్ వైష్ణవి, వి.వెంకటసుజాత, ఎం.రాజేశ్వరి, జి.శేషునాగలక్ష్మి, కె.గాయత్రి(గుంటూరు), పి.మానస(చింతలపాలెం) జె.జశీల, ఆర్ హారిక, కె.విజయలక్ష్మి (చిలకలూరిపేట). -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జయ్యారం విద్యార్థులు
మరిపెడ : మండలంలోని జయ్యా రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 18న హన్మకొం డలో జరిగిన ఎంపిక పోటీల్లో బానోతు శారద, ఆకుల మహేష్ ప్రతిభ చూపగా 32వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలకు ఎంపిక చేసినట్లు హెచ్ఎం అనుమాండ్ల రమేష్‌కుమార్ తెలిపారు. ఈనెల 30నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్ఎంతో పాటు పీఈటీ ఆవారి శ్రీనివాస్, గుడిçపూడి నవీ¯ŒS, ఖోఖో జిల్లా అసోసియేష¯ŒS ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రశాద్, ఎస్ఎంసీ చైర్మ¯ŒS నరిగె కృష్ణ, ఉపాధ్యాయులు తేజోన్నతరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరన్న, భాస్కర్, మురళి, సరేఖ, సునీత, మంజుల, పద్మలత అభినందించారు. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
చౌటుప్పల్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17నుంచి 19వరకు వికారాబాద్‌లో జరిగిన జోనల్ క్రీడా పోటీల్లో చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు 25మంది పాల్గొని పలు బహుమతులను సాధించారు. వీరిని మంగళవారం ప్రిన్సిపాల్ పి.విద్యాసాగర్ మంగళవారం అభినందించారు. ఇందులో 15మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్రోబాల్‌లో మొదటి బహుమతిని సాధించి ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు, షటిల్ బ్యాడ్మింటన్‌లో రెండో స్థానాన్ని సాధించి ఝాన్సీ, దీపికలు రాష్ట్ర స్థాయి పోటీలకు, కబడ్డీలో రాష్ట్ర జట్టుకు అరుణ, సునితలు, ఖోఖోలో రాష్ట్ర జట్టుకు ఇందు, శ్రావణిలు, వాలీబాల్ రాష్ట్ర జట్టుకు జి.కీర్తి, పరుగు పందెం పోటీలకు జి.శ్రావణిలు ఎంపికైనట్టు తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
అరట్లకట్ట (పాలకొల్లు అర్బన్): ఈ ఏడాది నవంబర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జరిగే రాష్ట్రస్థాయి సాప్్టబాల్ పోటీలకు ఇరువురు అరట్లకట్ట విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం కె శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. పెదవేగిలో నిర్వహించిన అండర్–17, అండర్–14 సాప్్టబాల్ పోటీల్లో పరసా రాజేష్, మల్లుల తేజేంద్రకుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ పాలా దుర్గారావును, విద్యార్థులను సర్పంచ్ చింతపల్లి లక్ష్మీకుమారి, ఎంపీటీసీ గుత్తుల స్వాతి, విద్యాకమిటీ చైర్మన్ చింతపల్లి వరప్రసాద్, హెచ్ఎం కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు మూర్తి, వేణు, చలపతిరావు, వరప్రసాద్, విద్య, గ్రామపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. -
కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కారంపూడి: జాతీయ స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లా తేలప్రోలులో నిÆృ‡్వహించిన స్కూల్ గేమ్స్ టోర్నమెంటులో వీరు గోల్డ్ మెడల్స్ సాధించి నేషనల్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఢిల్లీ, పూనే నగరాల్లో నిర్వహించే జాతీయ పోటీలకుృఅర్హత సాధించారు. అండర్14 బాలుర విభాగంలో పి.నరసింహారావు, అండర్17 విభాగంలో ఎ.సిద్ధార్థ, పి.నాగరాజు, సబ్ జూనియర్స్ విభాగంలో ఎ వెంకటేష్, డి.బాలకృష్ణ ఎంపికయ్యారు. ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, ఆర్.ఆంజనేయులునాయక్, రాజేష్ బ్రాంజ్ మెడల్స్, గ్రీకో రోమన్ విభాగంలో ఎం.వంశీ, ఎం.రత్నకుమార్ సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ భూషణం, పీఈటీ ఎం.శ్రీనివాసులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వెస్లీ అధ్యాపకులు అభినందించారు. -
జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థికి అభినందనలు
కరివిరాల(నడిగూడెం): మండల పరిధిలోని కరివిరాల మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొక్క సైదులు 62వ స్కూల్ గేమ్స్‌లో అండర్–19 విభాగంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్స్‌పాల్ పి.సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో జరగనున్న పోటీల్లో తెలంగాణా రాష్ట్రం నుంచి సైదులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారుణ్ణి పాఠశాల పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు క్రాంతి, వీరబాబు, జాని, షరీఫ్, రవీందర్‌రెడ్డి, సంపత్, లింగరాజు, జ్వోతి, తదితరులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య ఎంపిక
హాలియా : వర్థమాన కవయిత్రిలకు గురజాడ ఫౌండేషన్ అమెరికా సంస్థ ఇవ్వనున్న రాష్ట్ర స్థాయి తెలుగు కవితా పురస్కారం–2016 పురస్కారాలకు హాలియాకు చెందిన కాట్రాజు లావణ్యసైదీశ్వర్ ఎంపికయ్యారు. ఈనెల 18న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో జరగనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నేటి సమాజంలో నెలకొన్న సమస్యలపై తమ కవితల ద్వారా అక్షర రూపంలో స్పందించడం అలవాటన్నారు. ఇట్టి పురస్కారాలు పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తల సమక్షంలో అందించనున్నట్లు పేర్కొన్నారు. -
అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 స్విమ్మింగ్,బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక సోమవారం నిర్వహించినట్లు స్కూ ల్గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, లక్ష్మినారాయణ తెలిపారు. కొత్తూరు బాలుర పాఠశాలలో బాల్‌బ్యాడ్మింటన్ , రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలకు జిల్లాలోని జూనియర్ కళాశాలల బాల, బాలికలు హాజరయ్యారన్నారు. బాల్‌బ్యాడ్మింటన్ జటు ్టతూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొం టుందన్నారు. -
స్కూల్ గేమ్స్ ఖోఖో జిల్లా జట్ల ప్రకటన
కల్లూరు: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖోఖో జిల్లా బాలబాలికల జట్లను ఫెడరేషన్ కార్యదర్శి పవన్‌కుమార్ శనివారం ప్రకటించారు. అండ్ –14 బాలికల జట్టు : శారద, హైమావతి, మేరీ , శివలక్ష్మీ, అపర్ణ , మానస , శ్రావణి , శిరీష , సావిత్రి , ప్రియాంక , ఉషారాణి , శిరీష, స్టాండ్‌బైస్: బి మౌనిక, రేణుక , నందిని , సిందూ, శాంతి , భారతిని ఎంపిక చేశారు. బాలుర జట్టు : దుర్గప్రసాద్ , రామాంజనేయులు, ధరణి , నాగరాజు , మహేష్ , జగదీష్ , నవీన్, మహబూబ్‌బాషా, ఆదర్శ్, అబ్దుల్ కలాం, నాగరాజు , కిరణ్, స్టాండ్‌బై : శివ, అఫ్సార్, మధు , ఇస్మాయిల్ , శివకుమార్ , శ్రీనివాసులు ఎంపికయ్యారు. అండర్ 17 బాలికల జట్టు: దివ్య, అఖిల , కల్పన ,చాందినీ ,నాగేశ్వరమ్మ , శ్రావణి , ప్రత్యూష, అనంతలక్ష్మీ, దిల్షాద్ , దీపిక, లక్ష్మీప్రియ, వెన్నెల, స్టాండ్‌బై: సంధ్యారాణి , వినీత, అరీఫాబేగం , తస్లీమా, నాగవిజేత, సల్మాను ఎంపిక చేశారు. బాలుర జట్టు ః వై రవికుమార్, యు. రవికుమార్, వెంకటేష్ , శ్రీను, శరత్, మాలిక్ , రవినాథ్, రాజశేఖర్‌గౌడ్, తిక్కస్వామి, షణ్ముఖ, ఓబులేసు, ఉసేనయ్య, స్టాండ్‌బైగా రసూల్, శ్రీనివాసులు, ప్రతాప్ , గణేశ్వరుడు, యశ్వంత్,ఆంజనేయులు ఎంపికయ్యారు. -
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 29 మంది ఎంపిక
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): డీఆర్డీఏ ఆధ్వర్యంలో నంది టైర్స్, ట్యూబ్స్ కంపనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం గురువారం స్థానిక ఈజీ ఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో ఇంటర్వూ్యలు నిర్వహించారు. 124 మంది హాజ రుకాగా ఇందులో 29 మంది ఎంపికయ్యారు. వారికి కంపనీ ప్రతినిధులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ జేడీఎం దివాకర్, ఫయాజ్, బాల్‌రాజు, శిరీషా, జ్యోతి పాల్గొన్నారు. -
విలువలు పాటించిన వారినే ఎంపిక చేయాలి
ఆత్మకూరు(ఎం) : వత్తి ధర్మంలో విలువలు పాటించిన వారినే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలని మాతసేవా సంస్థ అధ్యక్షుడు కందారపు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి గజరాజు కాశీనాథ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అంతేగాని ఉపాధ్యాయ వత్తిని చేపట్టి ఇటు విద్యాబోధన అటు పైరవీలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం నడుపుతూ సరిగ్గా బడికి రాని వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయవద్దని ఉన్నతాధికారులకు విన్నవించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సభ్యులు యాస గోవర్ధన్ రెడ్డి, కల్వల నరేష్, రంగ మల్లేశం, నికిల్, రాజు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇంద్రపాలనగరం(రామన్నపేట) ఇబ్రహీంపట్నంలో ఈ నెల 9, 10తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఇంద్రపాలనగరం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీన జిల్లాకేంద్రంలోని విశ్వదీప్పాఠశాలలో జరిగిన సెలక్షన్స్‌లో అండర్–17 విభాగంలో ఏర్వ మౌనిక, మల్లల కార్తీక్‌లు ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైన విద్యార్థులను, కషిచేసిన పీఈటీ ఎస్.శీనయ్యను సర్పంచ్ పూస బాలనర్సింహ, ఎంపీటీసీ మంటి సరోజ, ఎస్ఎంసీచైర్మెన్ రవ్వ వెంకటేశం, ప్రధానోపాధ్యాయుడు తవుటం భిక్షపతి, సీనియర్ ఉపాధ్యాయుడు శివగల్ల నర్సింహ అభినందించారు. -
కరాటే జిల్లా జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మంది ఈపోటీల్లో పాల్గొనగా 15మందిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో సిహెచ్ హర్ష, కె.పృధ్వీ, కె.కళ్యాణ్, సిహెచ్ పవన్, టి.సంతోష్, బి.రామకోటి, తేజ, కె.కారుణ్య, బి.ఎన్.వి.శ్రీలక్ష్మీ, డి.హర్ష, కార్తీకేయ, బి.సాయిమోహన్, కె.ధనుజయ్, డి.తరుణ్, కె.సత్య ఉన్నారు. ఈమేరకు మంగళవారం స్థానిక రోటరీక్లబ్‌లో జిల్లా కరాటే అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపికైన వారిని అభినందించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు యర్రా నాగేశ్వరరావు, తిరుపతిరావు, రుద్రరాజు అంజిరాజు, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ సురేష్, ఇంటర్నేషనల్ కరాటే నిపుణులు కొండ్ర కీరన్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా విద్యార్థులు
మాదల (ముప్పాళ్ళ): మండలంలోని మాదల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్ రియాజ్ మంగళవారం తెలిపారు. గుంటూరులో ఆదివారం బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి (అండర్–19) విభాగంలో జరిగిన పోటీలలో ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. పాఠశాలలోని పదోతరగతికి చెందిన గోగుల మౌనిక, యనమదల మంజులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు చెప్పారు. వీరు ఈ నెల 23, 24, 25 తేదీలలో కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వీరిరువురిని పాఠశాల ప్రధానోపా«ధ్యాయుడు జె.లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ –19 క్రికెట్ ఎంపికలు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ నెట్స్‌లో జరిగాయి. జిల్లా జట్టుకు ఎంపికైన క్రికెటర్లు ఈ నెల 6వ తేదీ నుంచి సంగారెడ్డిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే అండర్ – 19 క్రికెట్ టోర్నీలో పాల్గొంటుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి వెంకట్, మెగా యూత్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి ఎండీ మసూద్‌లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రికెటర్లు హాజరు కాగా వారికి ఎంపికలు నిర్వహించి 14 మంది క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. జట్టుకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించారు. జట్టు వివరాలు: టీవీఎస్ నారాయణ, పి. భరత్, కె. సాయిసత్యతేజ, వి. విరించి, టి. నరేష్ సింగ్, పి. జయదేవ్, డి. సూర్య, పి. రాజేష్, జి, ధీరజ్, ఎం. ఠాగూర్, ఎస్. డి మహ్మద్‌హుస్సేన్, హేమంత్, కె. రవి, జి. వినోద్‌లు ఎంపికయ్యారు. -
రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కొండమల్లేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్రా గోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అండర్–14 విభాగంలో ఈనెల 27న నల్లగొండలో జరిగిన ఫుట్‌బాల్ క్రీడల్లో అయిదుగురు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 7,8,9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు పెద్దన్న, బక్కయ్య, లోక్యానాయక్ తదితరులు ఉన్నారు. -
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
బిక్కవోలు: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా అండర్– 20 బాలురు, బాలికల జట్ల ఎంపిక ఆదివారం జరిగింది. ప్రతిభ కనబరచిన క్రీడాకారుల జాబితాను అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు ప్రకటించారు. బాలుర జట్టుకు వైవీ శివకుమార్‌రెడ్డి, బండారు శేఖర్, డి.సల్లీ, సీహెచ్ కృష్ణ, డి.రమేష్, జి.ఈశ్వర్, ఎం.సాయిరాం, కేఎస్ఎస్ ప్రసాద్, ఆర్.సాయిరాం ఎంపికయ్యారు. బాలికల జట్టుకు శీలం కుసుమ, వై.మౌనిక, వి.పావని, బి.రేవతి, జ్యోతి, వీరలక్ష్మి, వీరలత, కె.వాణి, జేవీవీ వరలక్ష్మి, వై.కళ్యాణి, వి.భూలక్ష్మి, సుష్మ, మేరీ ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 17 నుంచి 22 వరకూ బిక్కవోలులో శిక్షణ ఇస్తారు. అనంతరం 23 నుంచి 25 వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ఆడతారు. కార్యక్రమంలో సెక్రటరీ వి.తంబి, మానుకొండ వీర్రాఘవరెడ్డి,సెలక్షన్ బోర్టు కమిటీ మెంబరు వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక
భువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న ప్రెసిడెన్సీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం. నిషిత జాతీయ భౌతిక రసాయన శాస్త్రనైపుణ్య పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పరీక్షల కమిటీ సమన్వయ కర్తలు భరణి, నరసింహాచారి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాల కరస్పాండెంట్ దిడ్డి బాలాజీ విద్యార్థిని నిషితకు రూ.వెయ్యి నగదును అందజేసి అభినందించారు. ఈ నెల 14న పట్టణ శివారులో ఉన్న వెన్నెల బీఈడీ కళాశాలలో అఖిల భారత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులచే నిర్వహించిన జిల్లా స్థాయిలో పరీక్షలో నిషిత ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వారు చెప్పారు. -
రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక
కారంపూడి: గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి బాలుర, బాలికల ఎంపికలు బుధవారం నిర్వహించారు. గ్రీకో రోమన్ సై్టల్ విభాగంలో గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బి.అబేజ్, ఎం. వాగ్యానాయక్, ఎ.వెంకటేష్, జి.అరవింద్, కె.రవికుమార్, కె.అజయ్, ఎం. విజయ్, డి.బాలకృష్ణ, చండ్రాజుపాలెంకు చెందిన కె.వెంకటరావు ఎంపికయ్యారు. ప్రీ స్టెయిల్ బాలుర విభాగంలో స్థానిక గురుకులానికి చెందిన వై.వీరబ్రహ్మనాయుడు, సీహెచ్ కోటేశ్వరరావు, ఎస్.ఫిలిప్‌రాజు, పి.నాగరాజు, అచ్చెంపేట గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఎం.శివనాగేంద్రప్రసాద్, పి.మరియబాబు, చుండూరు గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఇ. తరుణ, నరేంద్ర, నిజాంపట్నం గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన ఐ. కార్తీక్ ఎంపికయ్యారు. ఫ్రీ స్టెయిల్ బాలికల విభాగంలో వీపీ సౌత్ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన వై.కవిత, వై.శైలజ, ఎం.జీవిత, ఎన్.రూతురాణి, జి.శ్రావణి, వినుకొండ గురుకుల పాఠశాలకు చెందిన జి.మీనాకుమారి, ఎస్. రోషిత, పి.పార్వతి ఎంపికయ్యారని అమెచ్యూర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్ధానిక గురుకుల పీడీ గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 28, 29 తేదీలలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గురుకుల ప్రిన్సిపల్ సుధాకర్ పోటీలను ప్రారంభించారు. -
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామం కాట్రపాడు
కాట్రపాడు (దాచేపల్లి): మండలంలోని కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డ్వామా ఏపీడీ ఆర్. శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్‌ను సర్పంచ్ అందుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ రెడ్డిచర్ల నాగమ్మను ఆయన అభినందించారు. గ్రామంలో 133 ఇళ్లు ఉన్నాయన్నారు. ఇందులో పాతవి 34 మరుగుదొడ్లు ఉండగా, కొత్తగా 99 నిర్మించారన్నారు. ఏపీడీ వెంట ఏపీవో జి. వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి పి. విజయ్‌కుమార్, వీఆర్వో రాఘవేంద్ర, స్థానికులు రెడ్డిచర్ల బాబు తదితరులున్నారు. -
జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సబ్‌జైలు ఎదుట గల ఎస్ఆర్ఎన్ జిమ్‌కు చెందిన పసుపులేటి సురేష్, జి.రమేష్ ఎంపికైనట్లు ఎస్ఆర్ఎన్ జిమ్ నిర్వాహకుడు రాజు శుక్రవారం తెలిపారు. సురేష్, రమేష్‌లను సీనియర్లు పార్థ సారథి, ఆనంద్, తిరుపతి నాయుడులు అభినందించారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: విజయనగరంలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు భాష్యం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బోడేపూడి మహేష్ చంద్ర ఎంపికైనట్లు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న రేపల్లెలోని ఏవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలో క్యాడెట్ కేటగిరిలో మహేష్ చంద్ర బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మహేష్ చంద్రను, కోచ్ ఎస్కే రషీద్, జోనల్ ఇన్చార్జ్ తలశిల శివ, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కిషోర్ అభినందించారు. -
అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ‘ఆర్డీఎఫ్’ విద్యార్థులు
పర్వతగిరి : మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ వినితా అచ్యుతాపాయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్.అరవింద్, బి.ప్రవీణ్, జి.రాంబాబు, కె.రాములు అండర్ –19 అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాకయ్య తెలిపారు. ఆగస్టు 7,8,9 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి క్రికెట్ టోర్నమెం ట్లో ప్రతిభ కనబర్చినందుకుగానూ విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందన్నారు. అం తర్జాతీయ క్రికెట్ టోర్నీకి నేపాల్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ జనార్ధన్, అధ్యాపకSబృందం అభినందించారు. -
రాష్ట్రపతి పురస్కారానికి విశ్వనాథ గోపాలకృష్ణ ఎంపిక
రాజమహేంద్రవరం కల్చరల్ : సంస్కృత భాష వికాసానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన ఈ సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్ర : మీ తండ్రి విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దశాబ్దాల తరువాత మీరు కూడా రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. దీనిపై మీ స్పందన ఏమిటి? విశ్వనాథ : ఈ సత్కారాన్ని మా తండ్రి ఆశీస్సులు, గురుదేవుల దీవెనలుగా భావిస్తున్నాను. ప్ర : యువత చూపు పూర్తిగా సాంకేతిక విద్యపై ఉన్న ప్రస్తుత తరుణంలో సంస్కృత భాషపై ఆసక్తి కలిగించడానికి ప్రభుత్వపరంగా చేపట్టవలసిన చర్యలు వివరిస్తారా? విశ్వనాథ : పదో తరగతి వరకూ సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి. ఆర్షధర్మం, సనాతన సంప్రదాయాలు తెలియాలంటే సంస్కృత భాషా పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. సంస్కృతం నేర్వకుండా నైతిక విలువల పునరుద్ధరణ జరిగే పని కాదు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మూలబిందువు సంస్కృత భాషే. దీనిని పిన్నలు నేర్చుకునేలా పెద్దలు కూడా ప్రోత్సహించాలి. -
ఏఎస్సైకు ఇండియన్ పోలీస్ మెడల్
చాగల్లు: చాగల్లు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న మురుగుమువ్వల ధనరాజ్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్, న్యూఢిల్లీ తనను అవార్డుకు ఎంపికచేసినట్టు ఆదివారం సాయంత్రం సమాచారం వచ్చిందని ధనరాజ్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 14 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు మెడల్‌కు ఎంపికయ్యారని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి ఎదిగి.. 1984లో ధనరాజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి 2010లో హెచ్‌సీగా, 2013లో ఏఎస్సైగా పదోన్నతులు పొందారు. ఉత్తమ పనితీరులో 31సార్లు నగదు పురస్కారాలు, 207 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, జిల్లా పోలీస్ అధికారుల చేతులమీదుగా పురస్కారాలు పొందారు. ధనరాజ్ తండ్రి సూర్యప్రకాశరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన స్వగ్రామం పెంటపాడు. అవార్డుకు ఎంపికైన ధనరాజ్‌ను పలువురు అభినందించారు. -
పంద్రాగస్టు వేడుకల్లో జనగామ కళాకారులు
ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో ‘ఒగ్గు’ బృందం 220 మందిని గుర్తించిన రాష్ట్ర సాంస్కృతిక విభాగం జనగామ : ఢిల్లీ, హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శన నిర్వహించేందుకు జనగామ ఒగ్గు కళాకారులు ఎంపికయ్యారు. జనగామ, బచ్చన్నపేట, మద్దూరు, లింగాలఘనపురం మండలాలకు చెందిన 200 మంది కళాకారులను రాష్ట్ర సాంస్కృతిక విభాగం గుర్తించింది. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో వీరు వివిధ రూపాల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ఈ నెల16న ఢిల్లీలో నిర్వహించే ‘భారత్ పర్వు’ సాంస్కృతిక కార్యక్రమంలో నైపుణ్యాన్ని చాటేందుకు మరో 20 మంది కళాకారులు వెళ్లనున్నారు. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ఈ నెల14న జనగామ నుంచి కళాకారులు బయలుదేరనున్నట్లు సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. సాంస్కృతిక విభాగం రాష్ట్ర డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, టూరిజం, కల్చరర్ ఎండీ బుర్రా వెంకటేÔ¶ ం కృషితో జనగామ ఒగ్గుకళాకారులకు అరుదైన అవకాశం లభించిందన్నారు. -
ఏఐటీయూసీ మైనింగ్‌స్టాఫ్ ఫిట్ కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్ : ఏఐటీయూసీ ఆర్కే న్యూటెక్, ఆర్కే 8 గనుల మైనింగ్ స్టాఫ్ ఫిట్ కమిటీలను బుధవారం గనిపై నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. కార్యక్రమానికి కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి యోహాన్, దేవేందర్, రాజేందర్, నాయకులు సారేందర్, కొట్టె శంకరయ్య, నర్సయ్య పాల్గొన్నారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలపై పోరాడాలని వారు కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హక్కులు సాధించుకోచ్చన్నారు. ఎన్నికైన మైనింగ్ స్టాఫ్ కమిటీ ఫిట్ సెక్రెటరీగా డి.నర్సయ్య, షిఫ్ట్ ఇన్చార్జిలుగా గాజుల భూపతి, విష్ణువర్ధన్చారి, శ్రావణ్, విజయ్ను ఎన్నుకున్నారు. ఆర్కే 8 గని ఫిట్ సెక్రెటరీగా దార శ్రీనివాస్, ఇన్చార్జిలుగా నూనె లచ్చన్న, ఎస్.బలరాం, డి.సత్తయ్య, ఎండీ ఇసాక్‌ను ఎన్నుకున్నారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షకు 8,619 మంది
ఎస్పీ జోయల్‌డేవిస్ కరీంనగర్ క్రై : కానిస్టేబుల్ రాత పరీక్షకు జిల్లాలో 8,619 మంది అర్హత సాధించారని ఎస్పీ జోయల్‌డేవిస్ తెలిపారు. గత నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని డీపీటీసీలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 22,054 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 18,902 పురుషులు, 3,134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో 6,787 మంది పురుషులు, 1,832 మంది మహిళలు రాతపరీక్షకు అర్హత సాధించారని ఎస్పీ వివరించారు. మొక్కలను పరిరక్షించాలి... నగరంలోని రాంచంద్రపూర్ కాలనీలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో ఎస్పీ శనివారం మెుక్కలు నాటారు. ప్రతీ పౌరుడు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. పోలీస్‌శాఖ తరఫున జిల్లాలో 16 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మరో మూడు నెలలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. డీపీటీసీ జయశంకర్ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రొఫెసర్ చిత్రపటానికి ఎస్పీ జోయల్‌డేవిస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రభాకర్, రామారావు, రవీందర్‌రెడ్డి, సీఐ సీతారెడ్డి, ఆడ్మిన్ ఆర్ఐ గంగాధర్, శశిధర్ పాల్గొన్నారు. -
‘నవోదయ’కు ఇద్దరి విద్యార్థుల ఎంపిక
అర్వపల్లి : మండలంలోని తిమ్మాపురం ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన చామకూరి శ్రావణి, బాణోతు మహేష్‌లు 2016–17 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారని హెచ్ఎం వి.రవీందర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుడు, నవోదయ శిక్షకుడు డి.మహేష్ తెలిపారు. పాఠశాలలో నవోదయ విద్యాలయం కోసం ఐదేళ్ల నుంచి పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యారు. నవోదయ విద్యాలయానికి ఎంపిక కావడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు మహేష్‌ను హెచ్ఎం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు డి.సైదులు, వి. సైదులు, నాగరాజు, అనురాధ, అనితలు గురువారం పాఠశాలలో అభినందించారు. -
విద్యావలంటీర్ల ఎంపిక జాబితా వెల్లడి
విద్యారణ్యపురి : జిల్లాలో 48 మండలాల్లో పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియమాకం కోసం ఎంపిక జాబితాను సోమవారం డీఈఓ పి.రాజీవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో ఎంపిక జాబితా ప్రదర్శించారు. జిల్లాలో 493 మంది విద్యావలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 465 మందిని ఎంపిక చేసి జాబితాను వెల్లడించారు. మరో 26 మంది ఏజెన్సీ పాఠశాలలకు సంబంధించిన వా టిని పలు కారణాలతో పెండింగ్ పెట్టారు. మరో రెండు చోట్ల ఇద్దరు ఉర్దూ మీడియంలో విద్యావలంటీర్లు లభించలేదు. కాగా, ఎంపికైన విద్యావలంటీర్లు ఈనెల 26న తమకు కేటాయిం చిన పాఠశాలల్లో చేరాలని డీఈఓ కోరారు. -
‘ఏరియా’.. అదిరెనయా
♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ ఈనెల 11న హైదరాబాద్‌లో ప్రదానం ♦ హైరిస్క్’లో టార్గెట్‌కు మించి ప్రసవాలు మెదక్ : స్థానిక ఏరియా ఆస్పత్రి.. ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మెదక్ ఏరియా ఆస్పత్రితోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా ఆస్పత్రులుగా గుర్తించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్లు ఈ నెల 11న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఏడాదికి 1400 ప్రసవాలు చేయాలనే టార్గెట్ ఉండగా, 2,400 చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అలాగే నెలకు 10యూనిట్ల రక్తానికి గాను, ప్రస్తుతం నెలకు 60-70 యూనిట్ల రక్తాన్ని వినియోగిస్తున్నారు. హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో ప్రసవాలు రెట్టింపుస్థాయిలో అవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మెరుగైన సేవలే అందుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఆరు మాసాల క్రితం కొత్త బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ బెడ్‌షీట్స్ రోజుకో కలర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మెదక్‌లో ప్రథమంగా బెడ్షీట్ల మార్పిడిని పెలైట్‌గా ఏర్పాటు చేసి మంచి ఫలితాలను సాధించారు. మూడు నెలల క్రితం ఏరియా ఆస్పత్రిలో రూ.12లక్షలు వెచ్చించి అధునాతన ఎక్స్‌రేలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిరుపేదలకు మెరుగైన సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకు ఇప్పటికే డయాలసిస్‌తోపాటు ఐసీయూ మంజూరు చేయించాం. 100 నుంచి 250 పడకల ఆస్పత్రిగా, గర్భిణులకు అదనంగా 50 పడకల కోసం ప్రతిపాదనలు పంపాం. -డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఏడాదిగా మెదక్ ఏరియా ఆస్పత్రిలో నిరుపేదలకు అనేక రకాలుగా సేవలందిస్తున్నాం. ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా గుర్తించింది. ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. -పి.చంద్రశేఖర్, సూపరింటెండెంట్ -
భారత జట్టులో బౌలర్ బుమ్రా
టి20 జట్టులోకి ఎంపిక ముంబై: గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన మొహమ్మద్ షమీ స్థానంలో టి20 సిరీస్‌కు గుజరాత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న బుమ్రా... గత సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఆకట్టుకున్నాడు. జనవరి 26 నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది. యువరాజ్, నెహ్రా, రైనా, పాండ్యా, హర్భజన్లతో కలిసి బుమ్రా 22న ఆస్ట్రేలియా వెళతాడు. -
డిసెంబర్ 15 నాటికి తొలి ‘స్మార్ట్’ఎంపిక
త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకం: వెంకయ్య న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల పథకం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న అలాంటి 20 నగరాలను ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఎంపిక చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారమిక్కడ ఫిక్కీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీల అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎంపికైన నగరాల్లో జనవరి నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజలు మెరుగైన వసతులను కోరుకుంటున్నారని, ఆ మేరకు నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. త్వరలోనే స్మార్ట్ విలేజ్ పథకాన్ని తీసుకురావదానికి కసరత్తు చేస్తున్నామన్నారు. -
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు ఎంపిక
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్(ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ)కు ముగ్గురు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మొత్తం 57మంది, ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు 38 మందిని ఎంపికకాగా వీరిలో జిల్లాకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులు ఉండటం విశేషం. ఉత్తమ ఉపాధ్యాయల అవార్డులకు పెదవేగిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.సంజీవరావు, దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తెర్లి అప్పారావు, చింతలపూడిలోని సీఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బొకినాల ఝాన్సీశారదాబాయి, భీమవరం పీఎస్ఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రాఫ్ట్ టీచర్ జీవీ రాజ్యలక్ష్మి ఎంపికయ్యారు. ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్.వెంకటరమణ, ఇదే మండలం నందమూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని డి.కమలాబాయి, తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు కేవీ గణపతిరావు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో గురువారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఈ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తారు. రూ.3వేల నగదు, పసిడి పూత పూసిన రజత పతకం, ధ్రువీకరణపత్రం అందజేసి శాలువతో సత్కరిస్తారు.