దూట కిరణ్‌కుమార్
జైపూర్(చెన్నూర్): జైపూర్ మండలం ఆయాగ్రామాలకు చెందిన యువతీయువకులు పంచా యతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మంగళవారం అర్హత జాబితా వెల్లడించారు. జైపూర్ మండలం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. నర్వ గ్రామానికి చెందిన కోట రాం బా యి–భీమయ్యల కుమార్తె కోట శ్యామల, ముది గుంటకు చెందిన దూట శాంత–లింగయ్యల కుమారుడు దూట క్రాంతి, ఇదే ముదిగుంటకు చెందిన మాజీ సర్పంచ్ దూట కిరణ్‌కుమార్ అనే 43 వయసులో ఉద్యోగం సాధించాడు. రామారావుపేట గ్రామానికి చెందిన రౌతు రమాదేవి–మల్లేశ్ కుమార్తె రౌతు సృజన, టేకుమట్లకు చెందిన కామేర లక్ష్మిగట్టయ్య కుమార్తె కామేర స్రవంతి అర్హత సాధించారు.
సత్తాచాటిన మాజీ సర్పంచ్
ముదిగుంటకు చెందిన దూట కిరణ్‌కుమార్ మాజీ సర్పంచ్ 43 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధిం చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2001–2006వరకు టీడీపీ హయాంలో సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం రాజకీయాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. పట్టుదలకు వయసు అడ్డుకాదని తాజాగా వెలువడిన పంచాయితీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై నిరూపించాడు. 43 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు అభినందనలు తెలియజేశారు.
20, 21వ తేదీల్లో సెక్రటరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన 232 మందిని ఎంపికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై.సురేందర్‌రావు తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా పౌరసరఫరాల సంబంధాల అధికారి వై.సంపత్‌కుమార్‌తో కలిసి ఫలితాల జాబితా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ 232 మంది కార్యదర్శులను తాత్కాలిక ప్రాతిపదికన రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ఈనెల 20,21వ తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, జాబితాలోని హాల్‌టికెట్ల నంబర్లు గల అభ్యర్థులు పుట్టినతేదీ, కులం, విద్యార్హత పత్రాలు, పి.డబ్ల్యూ, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment