పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక | They selected for Power lifting competitions | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

Published Sun, Jan 8 2017 8:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

మంగళగిరి : తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ నెల 21 నుంచి జరిగే జాతీయస్థాయి జూనియర్, మాస్టర్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ – 2017 పోటీలకు రాష్ట్రం నుంచి లిఫ్టర్లను ఎంపిక చేసినట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 53 కేజీల విభాగంలో షేక్‌ మహ్మద్‌ గౌస్, 120 కేజీల విభాగంలో జన్నాదుల ఈశ్వర్, మాస్టర్స్‌ కేటగిరీ 93 కేజీల విభాగంలో పసుపులేటి సురేష్, 105 కేజీల విభాగంలో ఆర్‌.నటరాజ్, గడ్డం రమేష్‌, 74 కేజీల విభాగంలో కరిముల్లా, డి. పార్థసారథిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదుగురు లిఫ్టర్లు జిల్లా నుంచి ఎంపిక కావడంపై అసోసియేషన్‌ ప్రతినిధులు మహ్మద్‌ రఫీ, ఎండీ సంధాని, ఎన్‌.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్‌ హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement