power lifting
-
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్‌లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్!
పుట్టుకతో అందరూ ఒకలా ఉండరు. అయితే తమలోని ప్రత్యేకను గుర్తించి, దాన్ని అద్భుతంగా మలుచుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. తమ ప్రత్యేకతను మరింత స్పెషల్‌గా మలుచుకుని పాపులర్ అవుతారు. రికార్డులకెక్కుతారు. అదీ నమ్మశక్యంగాని రీతిలో. అలాంటి వండర్ విమెన్ గురించి చూద్దాం! న్యాకిమ్ గట్వేచ : 1993 జనవరి 27న పుట్టింది ఈ బ్యూటీ దక్షిణ సూడానీస్ సంతతికి చెందిన ఇథియోపియన్-జన్మించిన అమెరికన్ మోడల్. భూమిపై అత్యంత ముదురు చర్మపు రంగును కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. తన ప్రత్యేకమైన అందంతో ఇన్‌స్టాలో చాలా పాపులర్ ఈ బ్యూటీ.మాకీ కర్రిన్ : ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న మహిళగా రికార్డు ఈమె సొంతం. నాలుగు సంవత్సరాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయడం లేదు. యుక్తవయసులోనే అంటే 17 ఏళ్ల వయసులోనే ఈరికార్డుసాధించింది. ఆరడుగులమంచిన ఈ అందగత్తె ఎడమ కాలు పొడవు 53.255 అంగుళాలు, కాగా కుడి కాలు 52.874అంగుళాలు.కాథీ జంగ్ ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న సన్నజాజి తీగ. 1999లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 5 అడుగుల 8 అంగుళాలు పొడవుండే ఈ సుందరి నడుము 38.1 సెంటీమీటర్లు (15.0 అంగుళాలు)యు జియాన్క్సియా: చైనాకు చెందిన యు జియాన్క్సియా కనురెప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 12.4 సెం.మీ. ఎడమకంటిరెప్పమీ ఉంటే వెంట్రుక పొడవుతో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కొట్టేసింది. 20.5 సెంటీమీటర్ల పొడవుతో తరువాత తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఆ సమయంలో, ఆమె కనురెప్ప ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై బుద్ధుడు ఇచ్చిన బహుమతి అని నమ్ముతుంది.బీ మెల్విన్ జాంబియన్ మోడల్. పుట్టుకతోనే వెండిలాంటి మెరిసి తెల్లటి జుట్టుతో పుట్టింది. ఈ ప్రత్యేకతే ఆమెను మోడల్‌గా నిలబెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదిగింది. వలేరియా వాలెరీవ్నా లుక్యానోవా (Valeria Valeryevna Lukyanova) అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే పాపులర్ రష్యన్ మోడల్. ఆమె ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తోంది. బార్బీలా మరింత సహజంగా ఆకుపచ్చ/బూడిద/నీలం కళ్లపై మేకప్ , కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంది.లిబర్టీ బారోస్: ఎటు కావాలంటే పాములా మెలికలు తిరిగే ప్రపంచంలోనే తొలి అమ్మాయి. బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యాయామం మొదలు పెట్టి అద్భుతంగా రాణించింది. 2024 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. అంతేకాదు ఫ్లెక్సిబుల్ బ్యాక్ బెండ్ లో మూడు ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అబ్బి అండ్ హెన్సెల్: వీరు అవిభక్త కవలలు. 1996లో ఓప్రా విన్ఫ్రే షో ద్వారా వెలుగులోకిచ్చింది. వీరికి గుండె, ఊపిరితిత్తులు, వెన్నుపాము ఒకటే. కానీ తినడానికి నోరు వేరుగా ఉన్నాయి. అలాగే చేతులు మూడు. ఆ తరువాత వీరికి 12 ఏళ్ల వయస్సున్నపుడు ఆపరేషన్ చేసి మూడో చేతిని తొలగించారు. వీరిద్దరూ కలిసి బైక్, కారు నడపడంలాంటి కలిసే చేస్తారు. 2021లో మాజీ సైనిక అధికారిని పెళ్లి కూడా చేసుకున్నారు.నటాలియా కుజ్నెత్సోవ్ : రష్యన్ పవర్‌లిఫ్టర్. 14 ఏళ్ల వయస్సులో బాడీబిల్డింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 33 ఏళ్ల కుజ్నెత్సోవ్ కండలు తిరిగిన దేహంతో తన సత్తా చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టైటిళ్లను కైవసం చేసుకుంది. బాడీబిల్డర్ వ్లాడిస్లావ్ కుజ్నెత్సోవ్ను వివాహం చేసుకుంది. -
అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
మహబూబాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్ లిఫ్టింగ్లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు. -
'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?
సాధారణంగా జలుబు మహా అయితే వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత అంతా నార్మల్‌గా ఉంటుంది. మన పెద్దలు ఈ జలుబు గురించి తమాషాగా.. అంటే మందులు వేసుకుంటే వారం రోజుల్ల తగ్గుతుంది లేదంటే నెల రోజులు పడుతుందని అంటుంటారు. నిజానికి జులుబు సాధారణమైన వ్యాధే గానీ వస్తే మాత్రం ఊపిరాడక దాంతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఇదంతా చెబుతున్నానంటే ఇలానే సాధారణ జలుబుగా తేలిగ్గా తీసుకుని ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాబోయ్ జలబు ఇంత సివియర్‌గా ఉంటుందా? అనిపించేలా అతడు చాలా అనారోగ్య సమస్యలనే ఫేస్ చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన కెనడాలోని అంటారియోలో చోటు చేసుకుంది. ఎంతో ఫిట్ణెస్గా ఉండే 33 ఏళ్ల పవర్‌లిఫ్టర్ జారెడ్ మేనార్ట్కి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. గతేడాది జారెడ్, అతని భార్య, ముగ్గురు కుమార్తెలు జలుబు బారినపడ్డారు. అయితే భార్య, పిల్లలు కొద్దిరోజుల్లోనే కోలుకగా, జారెడ్ పరిస్థితి మాత్రం సివియర్ అయ్యిపోయి రోజురోజుకి పరిస్థితి దిగజారిపోవడం మొదలయ్యింది. ఇదేంటి పరిస్థితి ఇలా ఉందేంటని అతడిని ఆస్పత్రికి తరలించగా..అసలు విషయం బయటపడింది. ఇది సాధారణ జలుబు కాదని, రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే ప్రాణాంతకమైన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్(హెచ్ఎల్హెచ్)తో బాధపడుతున్నాట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యాధికి సంబంధించిన కేసులు 2006 నుంచి 2019 వరకు ఏకంగా 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసుల్లో మరణాల రేటు దాదాపు 40% ఉంటుందని అంచనా వేశారు. ఇది వైరస్ లేదా బ్యాక్టరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని తెలిపారు. దీన్ని సాధారణంగా మోనో లేదా ముద్దు వ్యాధి(కిస్సింగ్ డిసీజ్) అని పిలుస్తారు. సాధారణ మోనో(సాధారణ జలుబు) అయితే కొద్ది వారాల్లోనే తగ్గిపోతుందని, మోనో హెచ్ఎల్హెచ్ కలియితో వచ్చే జలుబు మాదిరి వ్యాధి మాత్రం అవయవ వైఫల్యానికి దారితీస్తుందని అన్నారు. ఇక్కడ జారెడ్ మాత్రం చాలా రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాడు. డయలాసిస్ కూడా చేయాల్సి వచ్చింది. అస్సలు అతను బతికే అవకాశాలపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చివరిగా కీమోథెరపీ వంటి శక్తిమంతమైన చికిత్సలను అందించారు. ఈ చికిత్స క్రమంలో ఏకంగా 19 కేజీల బరువు తగ్గిపోయాడు జారెడ్. చెప్పాలంటే ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అనూహ్యంగా కోలుకున్నాడు జారెడ్. అయితే కూర్చొవడం, నిలబడటం, నడవడం, ఊపిరి పీల్చుకోవడం, మాట్లాడటం, తదితరాలన్నింటిని కష్టబడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ కీమోథెరపీ కారణంగా పాదాల్లో నరాలు దెబ్బతిన్నాయి, వాసనను కూడా కోల్పోయాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మాములు వ్యక్తిలా అవ్వడానికి చాలా సమయమే తీసుకుంది. పాపం జారెడ్ తాను ఈ జలుబుని తేలిగ్గా తీసుకోవడంతోనే ఇంతటి పరిస్థితికి దారితీసిందని బాధగా చెప్పుకొచ్చాడు. తన వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులతో ఇది వరికిటి మాదిరిగా బలాన్ని పుంజుకున్నానని అన్నాడు. అస్సలు తన కుమార్తెలను ఎత్తుకోగలనా అని బాధపడిపోయాను, కానీ మళ్లీ ఇదివరకిటి మాదిరిగా కండలు తిరిగిన దేహంతో యథాస్థితికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు జారెడ్.(చదవండి: కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్..వెనుక ఇంత కథా..!) -
గోల్డ్ మెడలిస్ట్ సాదియాకి ఘన స్వాగతం! వాళ్ల వల్లే ఇది సాధ్యమైంది..
సాక్షి, విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్కి ఘన స్వాగతం లభించింది. షార్జాలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్‌లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి స్వదేశానికి వచ్చిన సదియాకి ఆమె తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు వెల్కమ్ చెప్పారు. కాగా సాదియా కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గోల్డ్ మెడలిస్ట్ సాదియా ‘‘షార్జాలో ఈనెల 16 నుండి 22 వరకు ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్‌లో పాల్గొన్నా. నాలుగు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ సహకారంతో స్వర్ణ పతకం సాధించాను’’ అని సాదియా సంతోషం వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, జగిత్యాల: అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి రంగు విరించి స్వప్నిక స్వర్ణంతో మెరిసింది. షార్జాలో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ కప్ టోర్నీలో స్వప్నిక ఈ ఘనత సాధించింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన స్వప్నిక.. జూన్ నెలలో రాంచీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఏషియన్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైంది. ఈ పోటీల్లో ఇండియా తరపున మొత్తం ఐదుగురు పాల్గొనగా.. స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ అనే మూడు విభాగాల్లో స్వప్నిక సత్తా చాటింది. మూడు విభాగాల్లో వేర్వేరుగా గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు క్లాసిక్ పవర్ లిఫ్టింగ్‌లోనూ (మూడు కలిపి) గోల్డ్ మెడల్ సాధించింది. స్వప్నిక ఈ ఫీట్ సాధించడంపై ఆమె తండ్రి రంగు వెంకటరమణతో పాటక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై స్వప్నిక స్వర్ణం సాధించడంతో ధర్మపురి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వప్నిక స్ధానిన ఎస్సారార్ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతుంది. -
పవర్ లిఫ్టింగ్ సదియా అల్మాస్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సీఎం జగన్‌ను కలిసిన క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్ కలిశారు. షేక్ సాదియా అల్మస్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. షేక్ సాదియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. అదే విధంగా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, షేక్ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సెంచరీ వయసులో పవర్ లిఫ్టర్‌గా రికార్డు సాధించిన బామ్మ
న్యూయార్క్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్ బామ్మ పేరు ఎడిత్ ముర్వే ట్రయిన్. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్ రికార్డు సాధించింది. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) వృద్ధుల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేమీ కాదు. ఇదివరకు ఆమె ఒక స్థానిక రిక్రియేషన్ క్లబ్లో డాన్ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీమె. పోటీల కోసం ప్రత్యేక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలేవీ పాటించలేదని, రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్టెయిల్ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతుండటం విశేషం. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) -
ఏక్తా కపూర్.. కష్టాలను ఎత్తి కుదేయండి
చిన్న వయసులో పెళ్లి. భర్త దాష్టీకం. మేరిటల్ రేప్. ఇంటి నుంచి పారిపోయి వస్తే ఎక్కడికీ పారిపోనివ్వని కడుపులో బిడ్డ. డిప్రెషన్. ఇన్ని కష్టాలు చుట్టుముడితే ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? కండలు పెంచుతాను అనుకుంది నైనిటాల్‌కు చెందిన ఏక్తా. ఫిట్నెస్ ప్రోగ్రామ్ ద్వారా తన మనసును, శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుంది. ఇవాళ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యింది. అంతేనా ఉత్తరాఖండ్‌లో మొదటి ఖరీదైన పర్సనల్ ఫిట్నెస్ సెంటర్ యజమాని అయ్యింది. ‘నా పోరాటం తెలిస్తే మీ కష్టాలు చిన్నవైపోతాయి. వాటిని ఎత్తి కుదేస్తారు’ అంటోంది ఏక్తా. ‘నేను నా కథను ఎందుకు చెబుతున్నానంటే కష్టాలు ఉన్నాయని భావించే స్త్రీలు నా కథ విని ధైర్యం తెచ్చుకుంటారనే. కష్టాలు నెత్తి మీద ఎప్పుడూ ఉండే బండరాళ్లు కాదు. వాటిని ఎత్తి కిందకు కుదేయవచ్చు. దాటి ముందుకెళ్లవచ్చు’ అంటుంది 32 ఏళ్ల ఏక్తా కపూర్. ఈ పేరు వినగానే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఏక్తా కపూర్ గుర్తుకు రావచ్చుగాని ఆమెకు ఈమెకు ఏ సంబంధమూ లేదు... ఆమె సీరియల్స్‌లో పెట్టే నాటకీయ కష్టాలు ఈమె నిజ జీవితంలో ఉన్నాయన్న ఒక్క పోలిక తప్ప. పోరాటం మొదలు.. ఏక్తా కపూర్ది నైనిటాల్. స్కూల్ అమ్మాయిగా ఉండగానే తల్లిదండ్రులు విడిపోయారు. ఏక్తా తండ్రితో ఉండిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా ఆమెను పెంచాడు. అతడు స్కూల్ టీచరు. 18 ఏళ్లు రాగానే తల్లితోడు లేని పిల్ల అని పెళ్లి చేశాడు. ‘ఆ పెళ్లితో నా కొత్త జీవితం మొదలవుతుందని అనుకున్నాను’ అంటుంది ఏక్తా. కాని అత్తవారింటిలో ఆమె నరకం చూసింది. భర్తకు వయసు చాలా ఎక్కువ. అబద్ధం చెప్పి చేశారు. పైగా అతను ఆమెను ఏనాడూ భార్యగా చూడలేదు. తాను భర్తగా ఉండలేదు. ‘నాకు ఏమీ తెలియదు. లైంగిక జీవితంపై అవగాహన లేదు. నేను అతన్ని స్వీకరించే లోపే అతను రోజూ మేరిటల్ రేప్ చేసేవాడు. ఆ రోజుల్లో దాని మీద ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అదొక నేరం కూడా కాదు’ అంది ఏక్తా. పారిపోయి ఇల్లు చేరి ఏక్తా అత్తవారింటి నుంచి పారిపోయి ఇల్లు చేరింది. తండ్రి అక్కున చేర్చుకున్నాడు. విడాకులు ఇప్పించాడు. ‘బంధువులందరూ నా వైపు సానుభూతిగా చూడటమే. ఇది చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలు అనేవారు. నాకు డిప్రెషన్ పెరిగిపోయి ఆత్మహత్యాయత్నం చేశాను. హాస్పిటల్లో చేరిస్తే నేను గర్భవతిని అని చెప్పారు. అప్పటికే బాగా వీక్‌గా ఉన్నాను. గర్భం నిలవడం కూడా కష్టమే అన్నారు. కాని కడుపులో ఉన్న నా కూతురిని కాపాడుకున్నాను’ అంది ఏక్తా. కూతురు పుట్టాక బంధువులు మళ్లీ ఆమెను చుట్టుముట్టారు. ఆ పిల్లను ఎవరికైనా దత్తత ఇచ్చేయ్.. అప్పుడే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవు అన్నారు. కాని ఏక్తా ఒప్పుకోలేదు. బిడ్డను తనతోనే ఉంచుకుంది. రకరకాల ప్రయత్నాలు పాపకు మూడేళ్లు వచ్చాక తండ్రికి అప్పగించి ఏక్తా రకరకాల పనుల వెంట తిరిగింది. ఢిల్లీలో కొన్నాళ్లు పని చేసింది. కొన్నాళ్లు ఏక్టింగ్ నేర్చుకుంది. కొన్నాళ్లు టీచర్‌గా పని చేసింది. కాని తనకు ఏదీ సూట్ కాలేదు. అప్పుడే ఒక బంధువు ఆమెకు ఫిట్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. ‘2014లో ముంబైలో జరిగిన ఆ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాక నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అర్థమైంది. నా ఫిట్నెస్ కోసం నేను చేసిన కృషి నా శరీరాన్నే కాదు మైండ్‌ను కూడా గట్టి పరిచింది. ఏ కష్టమైనా ఎదుర్కొనగలననే ధైర్యం వచ్చింది నాకు.’ అంటుంది ఏక్తా. మలుపు తిరిగిన జీవితం ఫిట్నెస్ ట్రైనింగ్‌లోనే ఆమెకు ప్రస్తుత భర్త శశాంక్ పరిచయం అయ్యాడు. అతను కూడా ఫిట్నెస్ ట్రైనరే. ‘అతని ద్వారా ఫిట్నెస్ మీద నుంచి మెల్లగా నా ఫోకస్ వెయిట్‌లిఫ్టింగ్‌పై పెట్టాను. కాని అది ఎక్కువగా మగాళ్ల ప్రపంచం. నీకు ఇక్కడ ఏం పని అన్నట్టు చూశారు. కాని వెయిట్ లిఫ్టింగ్‌లో నా సత్తా చూపాలనుకున్నాను. జాతీయ స్థాయిలో మెడల్ సాధించాక గాని అందరు మగాళ్ల నోళ్లు మూత పడలేదు’ అంది ఏక్తా. ఆమె సాధించిన విజయాలను చూసి ఒకప్పుడు జాలిగా మాట్లాడినవారు ఇప్పుడు గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. కండలు తిరిగిన ఆమె చేతులను చూసి వినయంగా తప్పుకుంటున్నారు. అంతే కాదు... ఆమె కష్టాలు దాటిన పద్ధతిని చూసి గౌరవిస్తున్నారు. ‘నా ఫిట్నెస్ నేను అందరికీ ఇవ్వాలనుకున్నాను. అందుకే డెహరాడూన్లో అత్యంత అధునాతనమైన ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించాను’ అంటోంది ఏక్తా. భర్త, ఆమె కలిసి ఆ స్టూడియో నిర్వహిస్తున్నారు. కూతురు చదువుకుంటోంది. ‘నా కూతురిని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త దొరికాడు’ అని సంతోషపడుతోంది ఏక్తా. ‘పోరాడండి. గెలుపొందండి. ఆగిపోవద్దు అని స్త్రీలకు నేను చెప్పదలుచుకున్నాను’ అంటున్న ఏక్తా కచ్చితంగా ఒక బలమైన కండలు తిరిగిన స్ఫూర్తి మనకు. – సాక్షి ఫ్యామిలీ -
నేను ఆ బాధను వర్ణించలేను: పవర్ లిఫ్టర్
బెంగళూరు: ఎవరైనా కరోనాతో చనిపోతే వారిని కడసారి చూడటానికి కుటుంబ సభ్యులకు, బంధువులకు సైతం వీలులేకుండా పోతుంది. కొన్ని చోట్ల అయితే మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయడానికి వీల్లేదనే సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రాని పరిస్థితి చాలాచోట్ల నెలకొంది. దీంతో మున్సిపాలిటీ వాళ్లో, ఆస్పత్రి సిబ్బందో అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకి మరణించిన వారి సంఖ్య పెరిగిపోతుండటంతో చనిపోయిన వారిని ఖననం చేసే పనిలో కొన్ని ఎన్జీవోలు కూడా పాల్గొంటున్నాయి. అలా పనిచేస్తున్న మెర్సీ మిషన్‌తో ప్రఖ్యాత పవర్ లిఫ్టర్ మొహమ్మద్ అజ్మతుల్లా భాగస్వామ్యులయ్యారు. అయిన కోవిడ్ 19తో మరణించిన మృతదేహాలను మోసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కరోనా వైరస్ కారణంగా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు నేను అనుభవించిన బాధను మాటలతో చెప్పలేను’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం ఐటీ సంస్థ డిఎక్స్ సి టెక్నాలజీలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తున్న అజ్మతుల్లా వారాంతాలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లాక్డౌన్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జూలై నెలలో కరోనా మరణాలు ఎక్కువ కావడంతో ఖననంలో కూడా పాలుపంచుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ‘మరణం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. కరోనాతో మరణించిన వారిని చూసి అందరూ భయపడుతున్నారు. వారి దగ్గరకు కూడా రావడం లేదు. కరోనా వచ్చి 20ఏళ్ల వయసులోనే మరణించిన వారిని నేను చూశాను. అదేవిధంగా 80 ఏళ్ల వయసులో కూడా కరోనాను జయించిన వారిని కూడా చూశా. కరోనా మనకు కూడా ఎప్పుడొ ఒకసారి రావచ్చు. నాకు దాని గురించి భయం లేదు. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను ఖననం చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది’ కదా అని అజ్మతుల్లా పేర్కొన్నారు. చదవండి: కరోనా భయం.. కొరవడిన మానవత్వం -
ఖాద్రి, సాగర్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ పురుషుల పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో సయ్యద్ రబ్బార ఖాద్రి, కె. సాగర్ స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 120 ప్లస్ వెయిట్ కేటగిరీలో సయేద్ విజేతగా నిలవగా... 120 కేజీల వెయిట్ విభాగంలో సాగర్ చాంపియన్‌గా నిలిచాడు. సయేద్ 730 కేజీల బరువునెత్తి తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. బి. శశాంత్ గౌడ (ఏవీ కాలేజీ) 405 కేజీలు లిఫ్ట్ చేసి రజతాన్ని గెలుచుకున్నాడు. 120 కేజీల విభాగంలో సాగర్ 520 కేజీలు, డి. నిఖిల్ రెడ్డి 430 కేజీల బరువునెత్తి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 105 కేజీల విభాగంలో కె. శ్రీకాంత్ (ఎస్ఆర్ఎం కాలేజీ; 595 కేజీలు), మహబూబ్ బాషా (కేశవ కాలేజీ; 465 కేజీలు), జునైద్ యూసుఫ్ (విద్యారణ్య కాలేజీ; 435 కేజీలు) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఫైనల్ పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ అధికారి శోభ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
ఘట్టమనేని ఘటికురాలు
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి. తెనాలిరూరల్: తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది. కామన్వెల్త్లో మెరిసిన రేవతి.. సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. 2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్ విమెన్’, ‘బెస్ట్ లిఫ్టర్’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు. అంతర్జాతీయపోటీల్లో సత్తా 2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్ఛాంగ్మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్ విమెన్‌గా, ఒకసారి బెస్ట్ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్ (2015)లో టాపర్‌గా నిలిచింది. లక్ష్యంపైదృష్టి సారించాలి చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ -
అథ్లెట్ల ప్రాణాలు తీసిన పొగమంచు
-
ఘోర ప్రమాదం.. అథ్లెట్ల దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు నలుగురు అథ్లెట్ల ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా విషయంగానే ఉన్నట్లు తెలిసింది. ఆరుమంది అథ్లెట్లు.. స్విఫ్ట్ డిజైర్ కారులో ఉదయం ఢిల్లీ నుంచి పానిపట్‌కు బయల్దేరారు. రోడ్డు మీద పొగమంచు విపరీతంగా ఉండడంతో.. ఎదురుగా ఉన్నవేవీ కనిపించలేదు. మంచి వేగంతో వెళుతున్న కారు సింధు ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. కారులో ప్రయాణిస్తున్న పవర్ లిఫ్టర్లు తికమ్ చంద్, సౌరభ్, యోగేష్, హరీష్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ సాక్ష్యం యాదవ్, మరో క్రీడాకారుడు బాలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి : తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ నెల 21 నుంచి జరిగే జాతీయస్థాయి జూనియర్, మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ – 2017 పోటీలకు రాష్ట్రం నుంచి లిఫ్టర్లను ఎంపిక చేసినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 53 కేజీల విభాగంలో షేక్ మహ్మద్ గౌస్, 120 కేజీల విభాగంలో జన్నాదుల ఈశ్వర్, మాస్టర్స్ కేటగిరీ 93 కేజీల విభాగంలో పసుపులేటి సురేష్, 105 కేజీల విభాగంలో ఆర్.నటరాజ్, గడ్డం రమేష్, 74 కేజీల విభాగంలో కరిముల్లా, డి. పార్థసారథిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదుగురు లిఫ్టర్లు జిల్లా నుంచి ఎంపిక కావడంపై అసోసియేషన్ ప్రతినిధులు మహ్మద్ రఫీ, ఎండీ సంధాని, ఎన్.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. -
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
మంగళగిరి : డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రతా క్లాసిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో గుంటూరు జిల్లాకు చెందిన జి.సాయిరేవతి, బి.చంద్రిక బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని హెల్త్జిమ్లో సోమవారం వారిద్దరినీ ఆయన అభినందించారు. జి.సాయిరేవతి 357.5 కేజీల బరువును ఎత్తి, బి.చంద్రిక 339 కేజీల బరువును ఎత్తి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో అసోషియేషన్ నాయకులు మహ్మద్ రఫీ, ఎన్.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్, షేక్ సంధాని తదితరులు పాల్గొన్నారు. -
పవర్‌లిఫ్టింగ్‌లో జిల్లాకు పతకాలు
మంగళగిరి: జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలలో జిల్లా యువకులు కాంస్యపతాకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరావు తెలిపారు. స్థానిక జిమ్‌సెంటర్‌లో ఆదివారం యువకులను ఘనంగా సన్మానించారు. మంగళగిరికి చెందిన షేక్ మహ్మద్‌గౌస్ 105 కేజీల విభాగంలో, సత్తెనపల్లికి చెందిన పసుపులేటి సురేష్ 160 కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించగా సత్తెనపల్లికి చెందిన గడ్డం రమేష్ 105 కేజీల విభాగంలో, మంగళగిరికి చెందిన జొన్నాదుల ఈశ్వరకుమార్ 120 కేజీల విభాగంలో ఐదవస్థానం సాధించారు. వారిని అసోషియేషన్ అధ్యక్షుడు మహ్మద్‌రఫీ, సభ్యులు ఎండీ ఖమురుద్దీన్, కె.విజయభాస్కర్,ఎస్కె.సంధాని, ఎన్.శేషగిరిరావు తదితరులు అభినందించారు. -
పవర్‌లిప్టింగ్‌లో గోవిందమ్మకు బంగారు పతకం
సింగరాయకొండ: రాష్ట్ర స్థాయి 52 కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరాయకొండ గురుకుల పాఠశాల జూనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ఏ గోవిందమ్మ బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్ డి. జయ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌లిప్టింగ్ పోటీల్లో ఈ ఘనతను సాధించిందన్నారు. ఈ సందర్భంగా గోవిందమ్మను, ట్రైనర్‌గా వ్యవహరించిన జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట కేజీబీవీ పీఈటీ ఉపాధ్యాయిని బి హబ్సిబాను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సూపరింటెండెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మృతి
హైదరాబాద్ : రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు. మల్లేష్ యాదవ్ మృతికి రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంతాపం ప్రకటించింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.