నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్! | Women with unique body features you won believe actually exist | Sakshi
Sakshi News home page

నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్!

Published Fri, Jul 26 2024 1:35 PM | Last Updated on Fri, Jul 26 2024 6:27 PM

Women with unique body features you won believe actually exist

పుట్టుకతో అందరూ ఒకలా ఉండరు.  అయితే తమలోని ప్రత్యేకను గుర్తించి, దాన్ని అద్భుతంగా మలుచుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. తమ ప్రత్యేకతను మరింత స్పెషల్‌గా మలుచుకుని పాపులర్‌ అవుతారు. రికార్డులకెక్కుతారు.  అదీ  నమ్మశక్యంగాని రీతిలో.  అలాంటి వండర్‌ విమెన్‌  గురించి చూద్దాం!
 

న్యాకిమ్ గట్వేచ : 1993 జనవరి 27న పుట్టింది ఈ బ్యూటీ  దక్షిణ సూడానీస్ సంతతికి చెందిన ఇథియోపియన్-జన్మించిన అమెరికన్ మోడల్.  భూమిపై అత్యంత ముదురు చర్మపు రంగును కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. తన ప్రత్యేకమైన అందంతో  ఇన్‌స్టాలో చాలా పాపులర్‌ ఈ బ్యూటీ.

మాకీ కర్రిన్ : ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న మహిళగా రికార్డు ఈమె సొంతం. నాలుగు సంవత్సరాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్‌ చేయడం లేదు. యుక్తవయసులోనే అంటే 17 ఏళ్ల వయసులోనే   ఈరికార్డుసాధించింది. ఆరడుగులమంచిన ఈ అందగత్తె ఎడమ కాలు పొడవు    53.255 అంగుళాలు, కాగా   కుడి కాలు 52.874అంగుళాలు.

కాథీ జంగ్  ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న సన్నజాజి తీగ. 1999లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించింది. 5 అడుగుల 8 అంగుళాలు పొడవుండే ఈ  సుందరి నడుము 38.1 సెంటీమీటర్లు (15.0 అంగుళాలు)

యు జియాన్‌క్సియా: చైనాకు చెందిన యు జియాన్‌క్సియా  కనురెప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.   12.4 సెం.మీ. ఎడమకంటిరెప్పమీ ఉంటే వెంట్రుక పొడవుతో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌  కొట్టేసింది.  20.5 సెంటీమీటర్ల  పొడవుతో తరువాత తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది.  ఆ సమయంలో, ఆమె కనురెప్ప ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై  బుద్ధుడు ఇచ్చిన బహుమతి అని నమ్ముతుంది.

బీ మెల్విన్  జాంబియన్‌ మోడల్‌. పుట్టుకతోనే వెండిలాంటి మెరిసి తెల్లటి జుట్టుతో పుట్టింది.  ఈ ప్రత్యేకతే ఆమెను మోడల్‌గా నిలబెట్టింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదిగింది.  

వలేరియా వాలెరీవ్నా లుక్యానోవా (Valeria Valeryevna Lukyanova)  అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే పాపులర్‌  రష్యన్ మోడల్. ఆమె ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తోంది.   బార్బీలా మరింత  సహజంగా ఆకుపచ్చ/బూడిద/నీలం కళ్లపై మేకప్ , కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంది.

లిబర్టీ బారోస్: ఎటు కావాలంటే పాములా మెలికలు తిరిగే ప్రపంచంలోనే తొలి అమ్మాయి. బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యాయామం మొదలు పెట్టి అద్భుతంగా రాణించింది.  2024 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  కెక్కింది. అంతేకాదు ఫ్లెక్సిబుల్ బ్యాక్‌ బెండ్ లో మూడు ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. 

అబ్బి అండ్‌ హెన్సెల్: వీరు అవిభక్త కవలలు.  1996లో ఓప్రా విన్‌ఫ్రే షో ద్వారా వెలుగులోకిచ్చింది.  వీరికి  గుండె, ఊపిరితిత్తులు, వెన్నుపాము ఒకటే. కానీ తినడానికి నోరు వేరుగా ఉన్నాయి. అలాగే చేతులు మూడు.  ఆ తరువాత  వీరికి 12 ఏళ్ల వయస్సున్నపుడు ఆపరేషన్‌ చేసి మూడో చేతిని తొలగించారు.  వీరిద్దరూ కలిసి  బైక్, కారు నడపడంలాంటి కలిసే చేస్తారు. 2021లో మాజీ సైనిక అధికారిని  పెళ్లి కూడా చేసుకున్నారు.

నటాలియా కుజ్నెత్సోవ్ : రష్యన్ పవర్‌లిఫ్టర్. 14 ఏళ్ల  వయస్సులో బాడీబిల్డింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  33 ఏళ్ల కుజ్నెత్సోవ్‌ కండలు తిరిగిన దేహంతో తన సత్తా చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక  టైటిళ్లను కైవసం చేసుకుంది. బాడీబిల్డర్ వ్లాడిస్లావ్ కుజ్నెత్సోవ్‌ను వివాహం చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement