Unbelievable
-
నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్!
పుట్టుకతో అందరూ ఒకలా ఉండరు. అయితే తమలోని ప్రత్యేకను గుర్తించి, దాన్ని అద్భుతంగా మలుచుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. తమ ప్రత్యేకతను మరింత స్పెషల్‌గా మలుచుకుని పాపులర్ అవుతారు. రికార్డులకెక్కుతారు. అదీ నమ్మశక్యంగాని రీతిలో. అలాంటి వండర్ విమెన్ గురించి చూద్దాం! న్యాకిమ్ గట్వేచ : 1993 జనవరి 27న పుట్టింది ఈ బ్యూటీ దక్షిణ సూడానీస్ సంతతికి చెందిన ఇథియోపియన్-జన్మించిన అమెరికన్ మోడల్. భూమిపై అత్యంత ముదురు చర్మపు రంగును కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. తన ప్రత్యేకమైన అందంతో ఇన్‌స్టాలో చాలా పాపులర్ ఈ బ్యూటీ.మాకీ కర్రిన్ : ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న మహిళగా రికార్డు ఈమె సొంతం. నాలుగు సంవత్సరాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయడం లేదు. యుక్తవయసులోనే అంటే 17 ఏళ్ల వయసులోనే ఈరికార్డుసాధించింది. ఆరడుగులమంచిన ఈ అందగత్తె ఎడమ కాలు పొడవు 53.255 అంగుళాలు, కాగా కుడి కాలు 52.874అంగుళాలు.కాథీ జంగ్ ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న సన్నజాజి తీగ. 1999లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 5 అడుగుల 8 అంగుళాలు పొడవుండే ఈ సుందరి నడుము 38.1 సెంటీమీటర్లు (15.0 అంగుళాలు)యు జియాన్క్సియా: చైనాకు చెందిన యు జియాన్క్సియా కనురెప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 12.4 సెం.మీ. ఎడమకంటిరెప్పమీ ఉంటే వెంట్రుక పొడవుతో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కొట్టేసింది. 20.5 సెంటీమీటర్ల పొడవుతో తరువాత తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఆ సమయంలో, ఆమె కనురెప్ప ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై బుద్ధుడు ఇచ్చిన బహుమతి అని నమ్ముతుంది.బీ మెల్విన్ జాంబియన్ మోడల్. పుట్టుకతోనే వెండిలాంటి మెరిసి తెల్లటి జుట్టుతో పుట్టింది. ఈ ప్రత్యేకతే ఆమెను మోడల్‌గా నిలబెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదిగింది. వలేరియా వాలెరీవ్నా లుక్యానోవా (Valeria Valeryevna Lukyanova) అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే పాపులర్ రష్యన్ మోడల్. ఆమె ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తోంది. బార్బీలా మరింత సహజంగా ఆకుపచ్చ/బూడిద/నీలం కళ్లపై మేకప్ , కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంది.లిబర్టీ బారోస్: ఎటు కావాలంటే పాములా మెలికలు తిరిగే ప్రపంచంలోనే తొలి అమ్మాయి. బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యాయామం మొదలు పెట్టి అద్భుతంగా రాణించింది. 2024 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. అంతేకాదు ఫ్లెక్సిబుల్ బ్యాక్ బెండ్ లో మూడు ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అబ్బి అండ్ హెన్సెల్: వీరు అవిభక్త కవలలు. 1996లో ఓప్రా విన్ఫ్రే షో ద్వారా వెలుగులోకిచ్చింది. వీరికి గుండె, ఊపిరితిత్తులు, వెన్నుపాము ఒకటే. కానీ తినడానికి నోరు వేరుగా ఉన్నాయి. అలాగే చేతులు మూడు. ఆ తరువాత వీరికి 12 ఏళ్ల వయస్సున్నపుడు ఆపరేషన్ చేసి మూడో చేతిని తొలగించారు. వీరిద్దరూ కలిసి బైక్, కారు నడపడంలాంటి కలిసే చేస్తారు. 2021లో మాజీ సైనిక అధికారిని పెళ్లి కూడా చేసుకున్నారు.నటాలియా కుజ్నెత్సోవ్ : రష్యన్ పవర్‌లిఫ్టర్. 14 ఏళ్ల వయస్సులో బాడీబిల్డింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 33 ఏళ్ల కుజ్నెత్సోవ్ కండలు తిరిగిన దేహంతో తన సత్తా చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టైటిళ్లను కైవసం చేసుకుంది. బాడీబిల్డర్ వ్లాడిస్లావ్ కుజ్నెత్సోవ్ను వివాహం చేసుకుంది. -
పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎందుకంటే..?
పచ్చిమిర్చి అంటే అబ్బా!.. ఘాటు అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే మిగతా కాయగూరల్లానే దీనిలోనూ ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాదు రోజు ఓ పచ్చిమిరపకాయను పచ్చిగా తింటే ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం పచ్చిమిర్చిని ఘాటు కోసం వాడతాం. ఇది మన ఆహారానికి మంచి స్పైసీని కాదు కావల్సినన్ని పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీలో తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది జీక్రియలను పెంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాదు ఇందులో ఉండే క్యాప్సైన్ మెటబాలిజం పెంచెందుకు దోహదపడుతుంది. అందువల్ల దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తత్ఫలితంగా క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ పచ్చి మిర్చి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలో తేలింది. అదే సమయంలో శరీరానికి వేడి చేసేలా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ముక్కలు చేసిన పచ్చి మిరపకాయల నీటిని సేవించడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తీసుకునే సలాడ్స్‌లో గ్రీన్ చిల్లీ స్మూతి రుచిని పెంచడమే గాక ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్ స్థాయిలను, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. ఈ స్పైసీ పదార్థాలను ఎప్పుడూ సరైన పద్ధతిలో వినియోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది గుర్తించుకోవాలి. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
అబ్బే.. అలా జరక్కూడదే..?!
గతమంతా చరిత్రే. ఘనమైనా కాకపోయినా కూడా హిస్టరీ హిస్టరీనే. దాన్నెవరూ మార్చలేరు. వింత, విశేషం, విషాదం.. జరిగిందేదైనా విని తరించాల్సిందే. వీటిలో కొన్ని 'అబ్బో..'అనిపిస్తాయి. మరికొన్ని 'అబ్బా..!' అనేలా ఉసూరుమనిపిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడో కోవకు చెందిన కథలుంటాయి. ఇవి మాత్రమే, 'అబ్బే.. అలా జరక్కూడదే..?!' అనిపిస్తాయి. చదివేవారి ముఖంలో ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు పుట్టిస్తాయి. అలాంటి యదార్థ సంఘటనలే ఇవి..! కవల సోదరుల వింత కథ! 1970, అమెరికాలోని ఒహాయో రాష్ట్రం. అక్కడి లిమా నగరంలో నివసించే జేమ్స్‌కు తన చిన్ననాటి విషయాలు తెలుసుకోవాలనిపించింది. తల్లిదండ్రులను అడిగితే, అతడికో కవల సోదరుడు ఉండేవాడని చెప్పారు. 'చిన్నతనంలోనే నిన్ను దత్తత తీసుకున్నాం. నువ్వూ నీ సోదరుడూ కవలలు. నిన్ను మేం పెంచుకున్నట్టే, నీ సోదరుడిని కూడా వేరే కుటుంబం దత్తత తీసుకుంది' అని వివరించారు. దీంతో ఎలాగైనా ఆ 'హలో! బ్రదర్' ని కలుసుకోవాలన్న తపన జేమ్స్లో ఎక్కువైంది. ఆ ప్రయత్నంలో భాగంగా తన సోదరుడు 40 మైళ్ల దూరంలోని పిక్వా పట్టణంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. చివరకు 39 ఏళ్ల వయసులో ఇద్దరూ కలుసుకున్నారు కూడా. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్టు! ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితిలో కన్నీంటి పర్యంతమయ్యారు. తర్వాత కాస్త శాంతించి, ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఇరువురూ తెలుసుకున్న కొన్ని నిజాలు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాల్లోకి నెట్టాయి. 39 ఏళ్ల క్రితం రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాక, వీరిద్దరూ వేర్వేరు నగరాల్లో పెరిగారు. కాకతాళీయంగా వీరిద్దరికీ పెంపుడు తల్లిదండ్రులు జేమ్స్ అనే పేర్లు పెట్టారు. వీరిద్దరూ చిన్నతనంలో లెక్కలు బాగా చేసేవారు, స్పెల్లింగులను ఇష్టపడేవారు కాదు. ఇరువురిదీ వడ్రంగి పని, చిత్రలేఖనంలో అందెవేసిన చేయి. 'లిండా' అనే పేరున్న అమ్మాయిలనే ఈ కవల సోదరులు పెళ్లి చేసుకున్నారు. అయితే, చిత్రంగా ఇద్దరి వైవాహిక జీవితాలూ విఫలమయ్యాయి. తర్వాత 'బెట్టీ' నామధేయులైన మహిళలనే వీరు పెళ్లాడారు. ఈ కవల సోదరులకి ఒక్కో కుమారుడే సంతానం. యాదృచ్ఛికంగా వీరి పేర్లు 'జేమ్స్ అలాన్' ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఈ విచిత్ర సోదరులకి ఓ పెంపుడు కుక్క ఉండేది. దాని పేరేంటో తెలుసా..? 'టాయ్' వీరి కథంతా విని, 'ఉంటే ఉండొచ్చు గానీ, మరీ ఇన్ని సారూప్యతలా' అని అప్పట్లో ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది!! చిత్రంలో విచిత్రం..! జర్మనీ లో జరిగిన ఈ యాదృచ్ఛిక సంఘటన చాలా ఏళ్లపాటు ఫొటోగ్రాఫర్ల మదిలో మెదులుతూనే ఉంది. 1914లో ఓ జర్మన్ మహిళ స్ట్రాస్‌బర్గ్ పట్టణంలోని ఫొటో స్టూడియోకు వెళ్లింది. తన కుమారుడిని ఫొటో తీయాలంటూ అక్కడి సిబ్బందిని కోరింది. దానికి అవసరమైన 'ఫిల్మ్ ప్లేట్'ను కూడా ఆమె కొనుగోలు చేసింది. దీంతో ఆ పాలబుగ్గల పసివాడిని తన కెమెరాలో క్లిక్‌మనిపించాడు అక్కడి ఫొటోగ్రాఫర్. ఇప్పటిలాగా ఫొటో తీసిన వెంటనే డెవలప్ చేసి ఇచ్చేసే సౌకర్యం ఆ రోజుల్లో లేకపోవడంతో కొద్ది రోజుల తర్వాత వచ్చి చిత్రాలు పట్టుకెళ్లమని చెప్పారు స్టూడియో సిబ్బంది. దీంతో ఆమె అక్కణ్నుంచి వెళ్లిపోయింది. అయితే, దురదృష్టవశాత్తూ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. దీంతో మళ్లీ స్టూడియోకు వెళ్లడం ఆమెకు కుదర్లేదు. యుద్ధ ప్రభావం కారణంగా స్టూడియో నడుస్తోందో, మూత పడిందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఇంకేముంది, తన 'ఫిల్మ్ ప్లేట్'పై ఆశలు వదులుకుంది. మళ్లీ ఎన్నడూ ఆ చిత్రాల గురించి ఆమె ఆలోచించలేదు. నెమ్మదిగా రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో ఆమె స్ట్రాస్బర్గ్ను విడిచిపెట్టి, ఫ్రాంక్ఫర్ట్ నగరానికి మకాం మార్చింది. మరో చిన్నారికి తల్లి కూడా అయ్యింది. ఓ కుమారుడు, కుమార్తెతో సంతోషంగా కాలం గడుపుతోంది. అయితే, తన దగ్గర వారికి చెందిన ఒక్క ఫొటో కూడా లేకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. వెంటనే స్థానిక స్టూడియోకు వెళ్లింది. ఈసారి మరో 'ఫిల్మ్ ప్లేట్'ను కొనుగోలు చేసి, తన కుమార్తెను ఫొటో తీయాలంటూ కోరింది. గతంలో జరిగినట్టుగా ఈ ప్రయత్నం విఫలం కాలేదు. అయితే, అత్యంత సంచలనంగా మారింది. దీనికి కారణం డెవలప్ చేసిన ఫొటోల్లో ఆమెకు తన కుమార్తెతో పాటు వెనకభాగంలో కుమారుడు కూడా కనిపిస్తుండటమే. రెండేళ్ల క్రితం 100 మైళ్ల దూరంలోని స్ట్రాస్‌బర్గ్ స్టూడియోలో తప్ప వేరే ఎక్కడా తన కుమారుడిని ఫొటోషూట్ చేయించలేదని ఆమె చెప్పింది. దీంతో స్టూడియో నిర్వాహకులకు సైతం కళ్లు తిరిగాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..? అప్పుడెప్పుడో బాలుడిని చిత్రించిన 'ఫిల్మ్ ప్లేట్'ను స్టూడియో వాళ్లు డెవలప్ చేయలేదు. అదే ఫిల్మ్ ప్లేట్ ఎన్నో చేతులు మారి, చివరకు ఫ్రాంక్ఫర్ట్ నగరానికి చేరింది. అక్కడ కూడా మళ్లీ పాత యజమానురాలైన జర్మన్ మహిళ చేతికే చిక్కింది. అయితే, ఇది గ్రహించని ఫొటోగ్రాఫర్.. దానిపైనే రెండో చిత్రం తీయడంతో ఇదంతా జరిగింది. ఒకే చిత్రంలో తన కుమార్తెతో పాటు, కాల గర్భంలో కలిసిపోయిందనుకున్న కుమారుడి చిత్రం కూడా కలిసిరావడంతో ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బైంది. విధి అంటే ఇదే కాబోలు!! -
నోరెళ్లబెట్టించే సంఘటనలు..
ఎన్నో వింతలకు నిలయం ఈ ప్రపంచం. ఎన్నో కథలు.. నమ్మాల్సినవి, నమ్మరానివీ! అయితే, అతికొద్ది కథలు మాత్రమే నమ్మశక్యం కానివిగా ఉంటూ నమ్మితీరాల్సిందే అనిపిస్తాయి. యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో కానీ చరిత్రలోని కొన్ని సంఘటనలు నోరెళ్లబెట్టిస్తాయి. వాటిలో కొన్నిటిని మనమూ తెలుసుకుందాం.. ఆశ్చర్యపోదాం! ఊ.. కొడతారా? కొట్టి పారేస్తారా?? రాజు.. రెస్టారెంట్ ఓనర్! పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన సంఘటన ఇది. ఇటలీ రాజైన ఒకటో ఉంబెర్టో విహారానికి వెళ్లాడు. అందులో భాగంగా జనరల్ ఎమ్మిలో పొంజియా వాగ్లియాతో కలిసి మోంజా నగరానికి చేరుకున్నాడు. స్థానిక రెస్టారెంట్లోకి ప్రవేశించిన రాజుకి సాదర స్వాగతం పలికాడు దాని యజమాని. మహారాజుకి ఏమేం ఇష్టమో తెలుసుకుని వాటిని తయారుచేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాడు. మరోవైపు, రెస్టారెంట్ యజమానిని చూసినప్పటినుంచీ రాజు మదిలో ఏదో మెదులుతోంది. దీనికి కారణం అతడు అచ్చు గుద్దినట్టు రాజు ఉంబెర్టోలా ఉండటమే! తొలుత సంశయించిన రాజు.. కొద్దిసేపటికి తన మనసులోని మాటను బయటపెట్టాడు. 'మీరు కాస్త అటుఇటుగా నాలాగే కనిపిస్తున్నారే!' అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా ముచ్చట ప్రారంభమైంది. ఇందులో రాజుకి దిమ్మదిరిగిపోయే నిజాలు తెలిశాయి. 1844 మార్చి 14నే ఇద్దరూ జన్మించారు. అది కూడా ఒకే నగరంలో! మార్గరీటా అనే పేరున్న మహిళలనే వీరు వివాహమాడారు. ఆసక్తికరంగా.. రాజు పట్టాభిషిక్తుడైన రోజు, యజమాని రెస్టారెంట్ తెరచిన రోజు కూడా ఒక్కటే! ఈ సంఘటన తర్వాత రాజు తరచూ ఆయన గురించి వాకబు చేస్తూ ఉండేవారు. అలా, 1990 జూలై 29 సాయంత్రం రాజుకి ఎవరో వచ్చి రెస్టారెంట్ యజమాని కొద్దిసేపటి క్రితమే మరణించాడని చెప్పారు. ఇది విన్న రాజు ఎంతగానో బాధ పడ్డాడు. అయితే, విచార కరంగా అదే రోజున ఆయన కూడా హత్యకు గురయ్యాడు. గేటానో బ్రెస్కి అనే వ్యక్తి ఉంబెర్టోను నాలుగు రౌండ్లు కాల్చి చంపాడు. ఇలా ఒకే రోజు మొదలైన వీరిద్దరి జీవితాలు.. అనేక సారూప్యతలతో ఒకే రోజున ముగిశాయి. హోటల్ రహస్యం..! 1953 నాటి సంఘటన.. ఓ వార్తాపత్రికలో రిపోర్టర్‌గా పనిచేసే ‘ఇర్వ్ కుప్సినెట్’ బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ పట్టాభిషేకాన్ని కవర్ చేసేందుకు లండన్ చేరుకున్నాడు. నగరంలోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న సావోయ్ హోటల్లో బసచేసేందుకు నిర్ణయించుకున్నాడు. అత్యంత విలాసవంతమైన ఆ హోటల్లో ఓ గదిని ఆయనకు కేటాయించారు సిబ్బంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఇర్వ్.. ఊసుపోక తన మంచం పక్కనే ఉన్న టేబుల్ సొరుగులను తెరిచాడు. అందులో కొన్ని వస్తువులున్నాయి. వాటిని పరిశీలించి చూశాడు. ‘హ్యారీ హానిన్’ అనే పేరు రాసి ఉంది వాటిపై! దీంతో ఇర్వ్‌కు ఆ వస్తువులు ఆసక్తికరంగా తోచాయి. ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ క్లబ్ హార్లెమ్ గ్లోబ్ట్రాటర్స్ క్రీడాకారుడు హ్యారీ హానిన్ పేరు అది. ఇతడు ఇర్వ్‌కు మంచి స్నేహితుడు కూడా! రెండు రోజులు గడిచాయి. ఈ సంఘటన అతని మెదడును తొలిచేస్తోంది. వెంటనే హ్యారీకి కాల్ చేశాడు. ‘హాయ్ హ్యారీ! నువ్వెప్పుడైనా సావోయ్ హోటల్లో బస చేశావా?’ అని అడిగాడు. దీనికి అవుననే సమాధానం వచ్చింది అటువైపు నుంచి. ఇక, ఇర్వ్ విషయం చెబుదామనుకునే లోపు హ్యారీ నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘ఇర్వ్.. నువ్వెప్పుడైనా ప్యారిస్‌లోని లీ మ్యూరైస్ హోటల్లో బస చేశావా?’’ అన్నదే ఆ ప్రశ్న. అంతటితో ఆగక.. అక్కడి గదిలో ఇర్వ్ కుప్సినెట్ పేరుతో కొన్ని వస్తువులను తాను చూశానని, అందుకే అలా అడగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు హ్యారీ. దీంతో ఇర్వ్‌కు దిమ్మదిరిగింది! ‘మిస్టరీస్ ఆఫ్ అనెక్స్ప్లెయిన్డ్’ పుస్తకంలో ఈ యదార్థ గాథ ప్రచురితమైంది. ప్యారిస్‌లో దొరికింది! ఈ యాదృచ్ఛిక సంఘటన 1920లో జరిగింది. అమెరికా రచయిత్రి అన్నే పార్రిష్ తన భర్తతో కలిసి విహారయాత్రకు ప్యారిస్ వెళ్లారు. అక్కడి పుస్తక విక్రయ కేంద్రాలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే ఇద్దరూ వాటిలోకి చొరబడ్డారు. పుస్తకాల పురుగులైన ఈ భార్యాభర్తలు మంచి పుస్తకం కోసం వెదుకులాటలో భాగంగా చివరికి ఓ షాపులో ఆగారు. అందులో అన్నేకు ఓ పుస్తకం దొరికింది. 'జాక్ ఫ్రాస్ట్ అండ్ అదర్ స్టోరీస్' అనే ఆ పుస్తకాన్ని చూడగానే ఆమెకు ఎక్కడలేని సంతోషం కలిగింది. అన్నేకు అత్యంత ఇష్టమైన కథల పుస్తకం అది. అంతేకాదు.., జాక్ ఫ్రాస్ట్ కాపీని చిన్నతనంలో ఆమెకు తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకంతో తనకు ఎంతో అనుబంధం ఉంది. వాటన్నిటీ గుర్తుకు తెచ్చుకున్న అన్నే.. ఆనంద బాష్పాలు రాలుస్తూ భర్తకు విషయమంతా చెప్పింది. జాక్ ఫ్రాస్ట్లో అంత సీనుందా అన్నట్టు ఫేసు పెట్టిన ఆయన పుస్తకాన్ని తెరిచాడు. అంతే.. మరో ఆశ్చర్యం. లోపలి పేజీల్లో 'అన్నే పార్రిష్, 209 ఎన్ వెబర్ స్ట్రీట్, కొలరాడో స్ప్రింగ్స్' అని రాసి ఉంది. అది కూడా అన్నే చేతిరాతతోనే! పదుల ఏళ్ల క్రితం అమెరికాలో పోగొట్టుకున్న పుస్తకం ప్యారిస్‌లో తేలి, మళ్లీ తన చేతికే చిక్కడాన్ని ఈ అమెరికన్ రచయిత్రి చాలా కాలం పాటు నమ్మలేకపోయింది!! -
ఇంటర్నెట్ లిటిల్ సెన్సేషన్