సాధారణంగా జలుబు మహా అయితే వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత అంతా నార్మల్‌గా ఉంటుంది. మన పెద్దలు ఈ జలుబు గురించి తమాషాగా.. అంటే మందులు వేసుకుంటే వారం రోజుల్ల తగ్గుతుంది లేదంటే నెల రోజులు పడుతుందని అంటుంటారు. నిజానికి జులుబు సాధారణమైన వ్యాధే గానీ వస్తే మాత్రం ఊపిరాడక దాంతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఇదంతా చెబుతున్నానంటే ఇలానే సాధారణ జలుబుగా తేలిగ్గా తీసుకుని ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాబోయ్ జలబు ఇంత సివియర్‌గా ఉంటుందా? అనిపించేలా అతడు చాలా అనారోగ్య సమస్యలనే ఫేస్ చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..
ఈ దిగ్బ్రాంతికర ఘటన కెనడాలోని అంటారియోలో చోటు చేసుకుంది. ఎంతో ఫిట్‌ణెస్‌గా ఉండే 33 ఏళ్ల పవర్‌లిఫ్టర్ జారెడ్ మేనార్ట్‌కి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. గతేడాది జారెడ్, అతని భార్య, ముగ్గురు కుమార్తెలు జలుబు బారినపడ్డారు. అయితే భార్య, పిల్లలు కొద్దిరోజుల్లోనే కోలుకగా, జారెడ్ పరిస్థితి మాత్రం సివియర్ అయ్యిపోయి రోజురోజుకి పరిస్థితి దిగజారిపోవడం మొదలయ్యింది. ఇదేంటి పరిస్థితి ఇలా ఉందేంటని అతడిని ఆస్పత్రికి తరలించగా..అసలు విషయం బయటపడింది.
ఇది సాధారణ జలుబు కాదని, రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే ప్రాణాంతకమైన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్(హెచ్‌ఎల్‌హెచ్)తో బాధపడుతున్నాట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యాధికి సంబంధించిన కేసులు 2006 నుంచి 2019 వరకు ఏకంగా 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసుల్లో మరణాల రేటు దాదాపు 40% ఉంటుందని అంచనా వేశారు. ఇది వైరస్ లేదా బ్యాక్టరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని తెలిపారు. దీన్ని సాధారణంగా మోనో లేదా ముద్దు వ్యాధి(కిస్సింగ్ డిసీజ్) అని పిలుస్తారు. సాధారణ మోనో(సాధారణ జలుబు) అయితే కొద్ది వారాల్లోనే తగ్గిపోతుందని, మోనో హెచ్‌ఎల్‌హెచ్ కలియితో వచ్చే జలుబు మాదిరి వ్యాధి మాత్రం అవయవ వైఫల్యానికి దారితీస్తుందని అన్నారు.
ఇక్కడ జారెడ్ మాత్రం చాలా రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాడు. డయలాసిస్ కూడా చేయాల్సి వచ్చింది. అస్సలు అతను బతికే అవకాశాలపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చివరిగా కీమోథెరపీ వంటి శక్తిమంతమైన చికిత్సలను అందించారు. ఈ చికిత్స క్రమంలో ఏకంగా 19 కేజీల బరువు తగ్గిపోయాడు జారెడ్. చెప్పాలంటే ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అనూహ్యంగా కోలుకున్నాడు జారెడ్. అయితే కూర్చొవడం, నిలబడటం, నడవడం, ఊపిరి పీల్చుకోవడం, మాట్లాడటం, తదితరాలన్నింటిని కష్టబడి నేర్చుకోవాల్సి వచ్చింది.
ఈ కీమోథెరపీ కారణంగా పాదాల్లో నరాలు దెబ్బతిన్నాయి, వాసనను కూడా కోల్పోయాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మాములు వ్యక్తిలా అవ్వడానికి చాలా సమయమే తీసుకుంది. పాపం జారెడ్ తాను ఈ జలుబుని తేలిగ్గా తీసుకోవడంతోనే ఇంతటి పరిస్థితికి దారితీసిందని బాధగా చెప్పుకొచ్చాడు. తన వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులతో ఇది వరికిటి మాదిరిగా బలాన్ని పుంజుకున్నానని అన్నాడు. అస్సలు తన కుమార్తెలను ఎత్తుకోగలనా అని బాధపడిపోయాను, కానీ మళ్లీ ఇదివరకిటి మాదిరిగా కండలు తిరిగిన దేహంతో యథాస్థితికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు జారెడ్.
(చదవండి: కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్..వెనుక ఇంత కథా..!)
Comments
Please login to add a commentAdd a comment