
న్యూయార్క్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్ బామ్మ పేరు ఎడిత్ ముర్వే ట్రయిన్. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్ రికార్డు సాధించింది.
(చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని)
వృద్ధుల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేమీ కాదు. ఇదివరకు ఆమె ఒక స్థానిక రిక్రియేషన్ క్లబ్‌లో డాన్ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీమె. పోటీల కోసం ప్రత్యేక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలేవీ పాటించలేదని, రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్‌టెయిల్ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతుండటం విశేషం.
(చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!)

Comments
Please login to add a commentAdd a comment