grandma
-
గ్రానీస్ వర్క్... గ్రాండ్‌గా!
ఏడుపదుల వయసు దాటాక ఇంక చేసేదేముంది అని చాలామందిలో ఒక నిరుత్సాహపూరితమైన అభి్రపాయం ఉంటుంది. కానీ, చేయాలనుకున్న పనిని చేసి చూపించాలనుకునేవారికి వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్నారు ఈ బామ్మలు. కుటుంబ జీవనంలో గృహిణిగా, తల్లిగా బాధ్యతలు అన్నీ నిర్వర్తించాక తమకంటూ ఉన్న హాబీలు ఏవైనా ఉంటే వాటిని కొనసాగిస్తుంటారు కొందరు. హాబీనే వ్యాపారంగా మార్చుకొని ఏడు పదులు దాటిన వయసులోనూ సంపాదనపరులుగా మారినవారి నుంచి మనమూ స్ఫూర్తిని పొందుదాం.పద్మ పరిఖా ఏడుపదులు దాటి రెండు దశాబ్దాలు అయ్యింది. సరదాగా నేర్చుకున్న క్రోషెట్ అల్లికలతో తన ఇంట్లో పిల్లలకు డ్రెస్సులు రూపొందించేది. కొన్ని రకాల షో పీసులను అల్లికతో అందంగా తయారు చేసేది. పదేళ్ల క్రితం ఆమె మనమరాలు బామ్మ వర్క్‌కు ఆదరణ కల్పించాలనుకుంది. ఆమె ్రపోత్సాహంతో పి.బి. హ్యాండ్‌మేడ్.ఔట్లెట్.కామ్ప్రారంభించింది. దీని ద్వారా వెయ్యిమంది వినియోగదారులకు పద్మ తన ఉత్పత్తులను అందజేస్తోంది. క్రోషెట్ ఉత్పత్తులను పది దేశాలకు ఎగుమతి చేసి, చేతినిండా సంపాదించడమే కాదు... సత్కారాలు పొందుతూ ‘స్వీయ సంపాదన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’ అని వేదికల మీద గర్వంగా చెబుతుంది ఈ గుజరాతీ వాసి పద్మ పరిఖా.ఆశాపురి 50 ఏళ్లుగా స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లుతోంది. కుటుంబ సభ్యులకే పరిమితమైన ఆమె తన కళను విజయవంతమైన బిజినెస్‌గా మార్చుకుంది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ అల్లికల వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ తను నివసించే ఢిల్లీలోనే పదహారు మంది ఉద్యోగులను కూడా నియమించుకుంది.శీలా బజాజ్ 80 ఏళ్లు. ఢిల్లీ వాసి. ఆరేళ్ల క్రితం బిజినెస్ ఉమన్‌గా మారింది. మనవలు, మనవరాళ్ల కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లే శీలా కరోనా సమయంలో తన అభిరుచిని విస్తృతం చేసింది. తన మొదటి సంపాదన 350 రూపాయలు అంటూ ఆనందాన్ని పంచుకునే శీలా ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.ఎం.ఎస్. చంద్రప్రభ నాయర్ కొన్నేళ్ల క్రితం తన తోబుట్టువులతో కలిసి పుట్టింటికి వెళ్లినప్పుడు, అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. తిరిగి ఇంటికి వచ్చాక ఏళ్లుగా పక్కన పడేసిన కుట్లు, అల్లికల పనిని తిరిగి కొనసాగించింది. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానుకగా ఇచ్చింది. ఆర్డర్లు వస్తుండటంతో దానినే వ్యాపారంగా మొదలుపెట్టింది. -
వందేళ్లకు కల నిజమైంది.. ఏడు ఖండాలూ చుట్టేసిన బామ్మ
‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు. కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. డెస్టినేషన్ ఎన్ఎస్డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు. వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
చీర కాల కోరిక నెరవేరింది ఇలా...
చీరకట్టుకోవాలనేది ఆ బామ్మ కల. బామ్మది ఇండియా అయితే ఆమె కల గురించి ఆశ్చర్యపోవాల్సిందే. ‘అదేం భాగ్యం!’ అనుకోవాల్సిందే. అయితే బామ్మగారిది ఇండియా కాదు ఇటలీ. ఇటాలియన్ డీజె, ఇన్ఫ్లు్లయెన్సర్ వోలీ ఎస్సే బామ్మ ఇరవై సంవత్సరాల క్రితం తన కుటుంబంతో మన దేశానికి వచ్చింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చీర ఆమెకు బాగా నచ్చింది. అప్పటినుంచి చీర ధరించాలనే కోరిక మనసులో ఉండిపోయింది. ‘ఈరోజు నీ కలను నిజం చేస్తాను’ అని బామ్మను చీరతో సర్ప్రైజ్ చేసింది మనవరాలు వోలీ. చీర ధరించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న బామ్మ కళ్లలోని వెలుగు చీరకు కొత్త అందం తెచ్చింది. -
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్‌గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
బామ్మ సీక్రెట్ రెసిపీ : హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో నెలకు రూ. 50 లక్షలు
అటు బామ్మ సీక్రెట్, ఇటు అమ్మను మించిన అమ్మ అత్తగారి సాయంతో సక్సెస్‌పుల్ బిజినెస్ విమెన్‌గా అవతరించింది ఓ కోడలు. హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ అత్తా కోడళ్ల జంట నెలకు రూ. 50లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఈ అద్భుతమైన వీరి వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. గురుగ్రామ్‌కు చెందిన అత్తా కోడళ్లు తమ బంధానికి కొత్త అర్థం చెప్పారు. విజయవంతమైన వ్యాపార మహిళలుగా రాణించడమే కాదు తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అసలు ఈ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే.. జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్య. ఐటీ ఉద్యోగి నిధికీ ఈ సమస్య బాగా ఉండేది. 2019 వరకు ఊటీ ఉద్యోగంలో ఉంది. 2010లో పెళ్లి. మూడేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొడుకుకు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టి, కుమారుడుపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదు. కానీ ఆర్థికంగా బలపడాలని, ఏదైనా చేయాలని మాత్రం అనుకుంటూ ఉండేది. ఒక రోజు తన జుట్టు సమస్యను కూడా అత్తగారు రజనీ దువాకు చెప్పుకుంది. ఆమెకు కూడా ఇదే సమస్య ఉండటంతో ఏదైనా చేయాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇక్కడే వీరి జీవితాల్లో సరికొత్త అధ్యాయం షురూ అయింది. చిన్నపుడు బామ్మ చేసే మసాజ్, ఆయిల్ గుర్తొచ్చాయి నిధికి. ఐడియా మెరిసింది. అత్తగారితో కలిసి రంగంలోకి దిగిపోయింది. చాలా మంది స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉందని గమనించారు. అలాగే, ఈ సమస్య నుండి బయటపడటానికి, ఆన్లైన్లో ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, చవకగా, ఇంతకంటే మంచి, సహజమైన ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకుంది. అంతే ఆమె తల్లి, బామ్మ చెప్పిన చిట్కాలతో మంచి రెసిపీని తయారు చేసింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. చుట్టు పక్కల వాళ్లు కూడా బావుంది అంటూ కితాబిచ్చారు. అంతే 2023, మార్చిలో 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్' పేరుతో హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారానికి నాంది పలికింది. అత్తగారి సంపూర్ణ మద్దతుతో పూర్తి సహజసిద్దమైన తలనూనె తయారీ మొదలు పెట్టింది. “నూనెలో ఉపయోగించే చాలా పదార్థాలు నా తోటలో మాత్రమే పెరుగుతాయి. అలోవెరా, మందార పువ్వులు, కరివేపాకు లాంటి ఇతర సహజ పదార్థాలతో, ఇంట్లోనే తయారు చేస్తాం. మా తోటలోనే పెద్ద కుండలో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం మొదలు పెట్టామని నిధి తెలిపింది. ప్రతి నెల దాదాపు 200 నుండి 300 ఆర్డర్లు వస్తాయని తెలిపింది. సోషల్ మీడియాతో షాపింగ్ ఆరంభంలో సోషల్ మీడియా గ్రూప్‌లో చుట్టుపక్కల మహిళలకు నూనె అమ్మడం ప్రారంభించింది. అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో వారిలో నమ్మకం ధైర్యంపెరిగింది. ఇదే ఉత్సాహంతో నిధి సోషల్ మీడియాలో మరింత ప్రచారాన్ని మొదలు పెట్టింది. చిన్న రీల్స్‌తో నూనెను ఎలా తయారు చేస్తుందో వివరించేది. క్రమంగా ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. నెటిజన్స్, ముఖ్యంగా మహిళల ఆదరణకు నోచుకున్నాయి. ఫలితంగా ఆర్డర్లు పెరిగాయి. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ విక్రయాలను మొదలు పెట్టారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, కండీషనర్, స్కాల్ప్ స్క్రబ్, హెయిర్ ఆయిల్ కాంబో ప్యాక్ లాంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఆయిల్ 67వేల మందికి చేరుకుంది, లక్షకు పైగా బాటిళ్లను విక్రయించి, నెలవారీ రూ. 50 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 'నిధిస్ గ్రాండ్మా సీక్రెట్’ అనే ఇనస్టాకు 71 వేలకు పైగా ఫాలోయర్లు ఉండడం విశేషం. View this post on Instagram A post shared by Nidhi’s Grandmaa Secret (@grandmaasecret) -
కథల అమ్మమ్మ
నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది. విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి. ‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్‌లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం. కడ్మా అనేది జార్ఖండ్‌లో జెమ్షెడ్పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను. అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్‌లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను. ‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను. ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి! నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను. నా అక్షరాలకు చిత్ర రూపం! నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్‌లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్‌లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది! నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్ -
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
అయ్ బామ్మోయి!
సంప్రదాయ దుస్తుల్లో బామ్మలు వీధుల్లో స్కేట్బోర్డింగ్ చేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదు. బామ్మలు నిజమే. స్కేట్బోర్డింగ్ మాత్రం ఏఐ సృష్టి! ఆశిష్ జోస్ అనే ఆర్టిస్ట్ ప్రాంప్ట్–బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ‘మిడ్‌జర్నీ’ని ఉపయోగించి ఈ చిత్రాలను సృష్టించాడు. ‘స్కేటింగ్ నానీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మూడు రోజుల వ్యవధిలోనే 1.17 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘సాహసానికి వయసు అడ్డు కాదు’లాంటి ఎన్నో కామెంట్స్ కనిపించాయి. -
Viral Video: హుషారుగా ఉయ్యాల ఊగుతున్న 80 ఏళ్ల బామ్మ
-
ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే!
'హైపర్ సోషల్' సీఈఓ బ్రాడెన్ వాలెక్ అంటే లింక్డ్ఇన్లో దాదాపు తెలియని వారుండురు. ఈయన గతంలో ఓసారి సంస్థలోని ఉద్యోగులను మూకుమ్మడిగా తొలిగించిన అనంతరం ఏడుస్తున్న పోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ఫోటోనే షేర్ చేశారు. తన గ్రాండ్మా చనిపోయిందని అమ్మ నుంచి మెసేజ్ వచ్చిందని బ్రాడెన్ ఓ పోస్టు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఘటన వర్క్, లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. తాను హైపర్సోషల్ను ప్రారంభించింది కూడా ఇందుకే అని పేర్కొన్నాడు. హైపర్ సోషల్‌తో వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చని, దీని వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించాడు. బ్రాడెన్ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇది వెరీ సాడ్ పోస్టు అని ఓ లింక్డ్ఇన్ యూజర్ విమర్శించాడు. సీఈఓ పోస్టు ట్విట్టర్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఏడుపు గొట్టు సీఈవో కంపెనీ ప్రచారం కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. చదవండి: ‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా? -
సెంచరీ వయసులో పవర్ లిఫ్టర్‌గా రికార్డు సాధించిన బామ్మ
న్యూయార్క్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్ బామ్మ పేరు ఎడిత్ ముర్వే ట్రయిన్. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్ రికార్డు సాధించింది. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) వృద్ధుల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేమీ కాదు. ఇదివరకు ఆమె ఒక స్థానిక రిక్రియేషన్ క్లబ్లో డాన్ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీమె. పోటీల కోసం ప్రత్యేక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలేవీ పాటించలేదని, రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్టెయిల్ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతుండటం విశేషం. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) -
ఈ బామ్మ అదుర్స్..లేటు వయసులో ఇలా..
కాస్త పొద్దుపొడవక ముందే నిద్రలేవమంటే నేటితరం యువత వామ్మో అంటారు. ఎంతో యాక్టివ్‌గా ఉండాల్సిన వాళ్లు డీలా పడిపోతుంటే..వయసుపైబడిన బామ్మ మాత్రం లేడిపిల్లలా తిరుగుతూ, ఎన్నో సమస్యలను చక్కబెడుతున్నారు. కేరళలోని 88 ఏళ్ల దాక్షాయణమ్మ ఇప్పటికీ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ...ఉదయం ఐదు గంటల నుంచే తన విధుల్లో మునిగిపోతారు. లేటు వయసు బామ్మ.. ఉదయం ఐదుగంటలకే లేచి పనులు చేయడం ఏంటీ? అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. కర్ణాటకలోని చిక్క ఎమ్మిగ్నూరు గ్రామపంచాయితీ సర్పంచ్‌గా దాక్షాయణమ్మ ఎంతో చక్కగా సేవలందిస్తున్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంతోపాటు..గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీంతో గ్రామస్థులు దాక్షాయణమ్మని అజ్జీ అని ప్రేమగా పిలుచుకుంటారు. కన్నడ భాషలో అజ్జీ అంటే బామ్మ అని అర్థం. ఉదయం ఐదుగంటల నుంచే ఆమె గ్రామంలో పర్యటిస్తూ.. గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షించడం, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోని పరిష్కరిస్తుంటారు. ఈ వయసులోనూ గ్రామసర్పంచిగా రాణిస్తున్న అజ్జీ.. చిక్కఎమ్మిగ్నూరు, చిక్కనకట్టే, కొడగవల్లీ, కొడగవల్లి హట్టీ, కొటేహలు, హోసాహల్లీ, అయ్యన హల్లీ గ్రామాల్లోని 7,500 మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. గ్రామాభివృద్ధిని కోరుకునే ఆమె.. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యుత్ వంటి అనేక అంశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు. రోజూ ఎన్నో పనులతో తీరికలేకుండా ఉండే ఆమె .. వయసును అస్సలు లెక్క చేయరు. ‘‘నాకేమీ వయసు అయిపోలేదు. నేను ఎంతో జీవితాన్ని చూసాను, నా అనుభవంతో గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమాగా చెబుతున్నారు. 1940ల్లోనే అజ్జీ ఏడోతరగతి పూర్తిచేశారు. ఆ తరువాత ఆమెకు పెళ్లి అవడంతో పై చదువులు చదవలేకపోయారు. వివాహనంతరం ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులను తీర్చిదిద్దడంలో మునిగిపోయారు. ఎడ్యుకేషన్ విలువ బాగా తెలిసిన అజ్జీ తన ముగ్గురు కొడుకులని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఆమె కొడుకులలో ఒకరైన బీఎస్ శివమూర్తి కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో రీజనల్ మేనేజర్‌గా రిటైర్డ్ అయ్యారు. మరో కొడుకు వీరభద్రప్ప బెంగళూరులోని బీఈఎమ్‌ఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడో కొడుకు చిత్రదుర్గ జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు మాత్రం గృహిణులుగా స్థిరపడ్డారు. ఆడపడుచులు గౌరవంగా బతకాలి గ్రామంలోని స్త్రీలందరూ ఎటువంటి భయం, సిగ్గు వంటి వాటికి లోను కాకుండా ఉండేందుకు టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడం నాకున్న లక్ష్యాల్లో ఒకటని అజ్జీ చెప్పారు. ‘‘గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే మరో ముఖ్యమైన అంశం నిరక్షరాస్యత. ఈ తరం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా ఎవరి కాళ్ల మీద వాళ్లు ఆర్థిక స్వాతంత్య్రంతో నిలబడడమేగాక, దేశంలో బాధ్యతగల పౌరులుగా మెలుగుతారని అజ్జీ చెప్పారు. ఎమ్జీఎన్ఆర్ఈజీఏ గ్రామాల్లోని ప్రజలకు ప్రేరణ కలిగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేస్తే చిక్కఎమ్మిగ్నూరు మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆమెకు పెద్దపోస్టులు ఏమీ అవసరంలేదు.. దాక్షాయణమ్మకు పెద్ద పోస్టులు ఏవీ అవసరం లేదని చిక్కఎమ్మిగ్నూరు గ్రామ ప్రజలు చెప్పారు. 2016లో గ్రామం తీవ్ర నీటి కొరత ను ఎదుర్కొంది. ఆ çసమయంలో అజ్జీ తన సొంత పొలంలో బోరు వేయించి.. అక్కడినుంచి ఒక పైప్ లైన్ ద్వారా గ్రామస్థులందరికీ రోజూ నీళ్లు అందేలా చేశారు. బోర్ వేయడానికి, ౖపైప్‌లైన్ ఏర్పాటుకయ్యే ఖర్చుమొత్తాన్ని అజ్జీయే భరించారని వారు చెప్పారు. ఇంతటి ఔదార్యం ఉన్న ఆమె.. వృత్తిరీత్యా పిల్లలు వేరు వేరు నగరాల్లో ఉండడంతో గ్రామంలో ఒంటరిగానే ఉంటున్నారు. అయినా ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కాలేదు. రోజూ తన పొలం పనులు చూడడానికి వెళ్లే అజ్జీ పనిచేయడానికి వచ్చే కూలీలకు స్వయంగా వంటచేసి వడ్డిస్తారు. పంచాయితీని పాలించేంత బలంగా ఉన్నారు మా బామ్మ గ్రామపంచాయతినీ పరిపాలించేంత బలంగా ఉన్నారని అజ్జీ మనవడు అరుణ్ చెప్పాడు.‘‘ఈ వయసులో కూడా గ్రామ సమస్యలు పరిష్కరించడం, గ్రామంలోని తమ పొలాలను ఒంటరిగానే చూసుకోగలుగుతున్నారు. అమె ఆరోగ్యంగా ఉండడమేగాక.. 88 ఏళ్ల వయసులోనూ అజ్జీ కంటిచూపు ఎంతో చురుకుగా ఉంది. అందుకే ఆమె కళ్లజోడు లేకుండా న్యూస్‌పేపర్లు, డాక్యుమెంట్లను అవలీలగా చదివేస్తారు. బామ్మ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు కానీ బేసిక్ హ్యాండ్ సెట్ ఉంది. దానిలో కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడతారు. ఆమెకు తన సంతకాన్నీ ఇంగ్లీషులో ఎలా చేయాలో కూడా తెలుసునని’’ అరుణ్‌కుమార్ చెప్పాడు. -
మనవడి పాట...బామ్మ ఆట
టిక్‌టాక్... టాక్ ఆఫ్ ది జనం అయిపోయింది. అందులో వీడియోలు చేస్తూ.. చూస్తూ యూత్ ఎంత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారో సీనియర్ సిటిజన్సూ అంతే ఆనందిస్తున్నారు. ఇప్పటిదాకా యూట్యూబ్ వంటల చానల్స్ నిర్వహించే అమ్మలు, బామ్మలతోపాటు గ్రాండ్పాస్నూ చూశాం. ఇప్పుడు టిక్‌టాక్‌లో కూడా వాళ్ల ఎంట్రీ మొదలైంది. తమిళనాడుకు చెందిన 75 ఏళ్ల ‘చెళ్లాం’ వాళ్లకు ప్రతినిధి. మనవడు అక్షయ్ పార్థతో కలిసి హిందీ, తమిళం, ఇంగ్లిష్, మలయాళం మొదలైన భాషలన్నిట్లో పాటలతో టిక్‌టాక్ వీడియోలు చేస్తోంది ఈ మామ్మ. నిజానికి నటన అనేది మనవడైన అక్షయ్ పార్థ హాబీ. మామ్మకూ ఆట, పాట మీదున్న ఆసక్తి చూసి టిక్‌టాక్ వీడియోలకు ఆమెను ఒప్పించాడట. ఏ భాషలో ఏ పాటకైనా మనవడితో పోటీపడి మరీ నటిస్తోంది మామ్మ. వీళ్లకు పదిహేను లక్షల పైచిలుకు అభిమానులున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ల యాక్టింగ్ పట్ల టిక్‌టాక్ వీక్షకులకున్న క్రేజ్.. వీళ్ల వీడియోలకున్న డిమాండ్‌ను! ‘‘ఇంతమంది చూస్తున్నారంటే సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏ కొంచెం బోర్ కొట్టినా పది నిమిషాలు వీడియో చేసేసి మళ్లీ నా పనిలో పడిపోతా. దీన్ని నా మనవడు పరిచయం చేసినప్పటి నుంచి నాకు భలే టైమ్‌పాస్ అవుతోంది. చిన్నప్పుడు డ్యాన్స్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. మా వీడియోలను చిన్నాపెద్దా అందరూ చూసి ఆనందిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేం ఉంటుంది. అయితే పిల్లలూ.. జాగ్రత్త. కేవలం ఎంటర్టైన్మెంట్కే అయితే టిక్‌టాక్ కాని యూట్యూబ్ కాని.. ఇంకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఓకే. కాలక్షేపానికి చూడండి.. వదిలేయండి. అక్కడితో దాన్ని మరిచిపోండి. అంతేకాని దాన్నో వ్యసనంలా మార్చుకోవద్దు. మీది చదువుకొని.. మంచి విషయాలు.. నేర్చుకోవాల్సిన సమయం. మీ దృష్టిని వాటిమీదే పెట్టండి. ఇలాంటివన్నీ టైమ్పాస్కే. ఆడుకోండి.. ఆటల్లో భాగంగానే కాసేపు ఇలాంటివి చూడండి అంతే’’ అని పిల్లలకు సందేశం ఇస్తుంది చెళ్లాం మామ్మ. -
డిజిటల్ బామ్మ
ఒకప్పుడు అక్షరం ముక్క రాని ఈ బామ్మ ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్పర్ట్. సామాజిక అభివృద్ధి కోణంలో డిజిటల్ మీడియా పాత్రను అవగాహన చేసుకొని కొత్త అడుగులు వేస్తుంది. రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లాలోని హర్మద అనే గ్రామంలో జన్మించిన నౌరోతి ఎన్నడూ స్కూలు ముఖం చూడలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం రాళ్లు కొట్టే పని నుంచి రోడ్డు నిర్మాణ పనులలో కూలీ పనుల వరకు రకరకాల పనులు చేసేది. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలకు కూలీ డబ్బులు తక్కువ ఇచ్చేవాళ్లు. ‘మగవాళ్లతో సమానంగా కష్టపడుతున్నప్పుడు...వారితో సమానంగా కూలీ ఎందుకు ఇవ్వరు?’ అని ప్రశ్నించేది నౌరోతి.కేవలం ప్రశ్నించడంతో మాత్రమే ఊరుకోలేదు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి న్యాయపోరాటం చేసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి గెలిచింది. ఈ విజయం...నౌరోతిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆత్మవిశ్వాసాన్ని నింపింది.న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంది నౌరోతి. ‘‘చదువుకోకుండా ఇన్ని సంవత్సరాలు వృథా చేశాను’’ అని అనుకున్నదే ఆలస్యం తనలోని నిరక్షరాస్యతపై పోరాటం మొదలుపెట్టింది. తన గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిలోనియాలోని బేర్‌ఫుట్ కాలేజీలో అక్షరాభ్యాసం మొదలు పెట్టింది. త్వరగా నేర్చుకునే నైపుణ్యం, చురుకుదనంతో ఆరు నెలల్లోనే చదవడం, రాయడం నేర్చుకుంది. చదువుకు దూరమైన ఎంతోమంది మహిళలను తనతో పాటు బడికి తీసుకువచ్చేది. తన నాయకత్వ లక్షణాలతో గ్రామ ప్రజల మనసులు చూరగొన్న నౌరోతి పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌గా గెలిచింది.సర్పంచ్‌గా ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ఆల్కహాల్ మాఫియాపై పోరాటం చేసింది. ఇదంతా ఒక్క ఎత్తయితే... కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడం మరో ఎత్తు. కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల సమయం ఆదా కావడం మాత్రమే కాకుండా... ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుందని స్వయంగా తెలుసుకొని రంగంలోకి దిగింది. కంప్యూటర్‌పై పట్టు సాధించింది.మహిళాసాధికారతకు సంబంధించిన వార్తలు, ఆరోగ్యసమస్యలు, వ్యవసాయంలో వస్తున్న సరికొత్త మార్పులు...ఇలా ఎన్నో విషయాలు ఇంటర్నెట్లో చదివి పదిమందికి చెబుతుంటుంది నౌరోతి. కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో గ్రామస్తులకు చెబుతుంటుంది. నౌరోతి దగ్గర కంప్యూటర్ పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది శిష్యులు రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడడం మరో విశేషం! -
సాహోరే గుడివాడ బామ్మ..
-
సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్
సాంప్రదాయ రుచికరమైన వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు. సెంచరీ దాటేసిన ఈ గ్రానీ ప్రస్థానం తెలిస్తే అంతా ఔరా అనుకోవాల్సిందే. అవును 106 ఏళ్ళ వయసులో చలాకీగా, తన పనులు తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్ ప్రదర్శిస్తూ యూ ట్యూబ్ సంచలనంగా మారిపోయింది. 'కంట్రీ ఫుడ్స్' పేరుతో సొంత ఛానెల్‌ను నడుపుతున్న ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్‌తో దుమ్మురేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్ స్టార్.. యూ ట్యూబ్ సెన్సేషన్. తన వంట ట్యుటోరియల్స్ తో యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో గుడివాడ బామ్మ సూపర్ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్ ఒకటా రెండా.. చాలా పెద్దదే. ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై , పాయా, అరటి ఆకులతో చేసే స్పెషల్ ఫిష్ ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది. ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్ మిలన్ చికెన్ ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ఒక్క వీడియేకే 66లక్షల వ్యూస్ వచ్చాయంటేనే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్, దుబాయ్‌లలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడున్న బంధువులు ఫోన్ చేసి మరీ మస్తానమ్మ వంటకాలపై ప్రశంసలు కురిపించారట. ఒక ఆకలితో ఉన్న రాత్రి తాను, తన ఫ్రెండ్స్ కొంత ఆహారాన్ని సిద్ధం చేసుకున్న సందర్భంలో తాము కూడా యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చిందట మస్తానమ్మ మనువడు లక్ష్మణ్ కి. ఇలా మొదలు పెట్టిన ఫస్ట్ వీడియోనే వైరల్‌గా మారడంతో మరింత ఊత్సాహంగా దీన్ని ముందుకు నడిపించారు. ఇతనికి అమ్మమ్మ వెరైటీ రెసిపీలు మరింత సహాయం చేశాయి. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే మొదట్లో ఆమె వీడియోలను షూట్ చేస్తోంటే తనకు ఏమీ అర్థంకాలేదని, కానీ అసలు విషయం తెలిసిన తరువాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందని లక్ష్మణ్ వివరించారు. అంతేకాదు.. ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా చీరలు, గ్రీటింగ్ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట గ్రాండ్మా. ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్‌కు చెందిన ఓ ఫ్యాన్ చీరను పంపించారంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బామ్మకు యూ ట్యూబ్ ఫాలోయర్ల సంఖ్య ఎంతో తెలుసా. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో లేటెస్ట్ సంచలనంగా మారిన మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వాటర్ మిలన్ చికెన్ వీడియోపై ఒక లుక్కేసుకుంటే పోలా.. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకాలకు..
ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరిపోతామని అనుకుంటున్న తరుణంలో వారిని మృత్యువు కబళించింది. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడపిన వారు ఇక లేరని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అందివచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లి కన్నీరుమురువుతోంది. ఆమెను ఆపడం ఎవరితరం కావడం లేదు. - కిర్లంపూడి (జగ్గంపేట) ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి చెందిన సంఘటన కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామ శివారున శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించి కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన కర్రి చిట్టమ్మ(70), మనుమడు ఉల్లి మణి(25)తో కలిసి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి గృహప్రవేశానికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గెద్దనాపల్లి శివారుకు వచ్చేప్పటికి గెద్దనాపల్లి నుంచి కిర్లంపూడి వైపు వెళుతున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిట్టెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మనుమడు ఉల్లి మణిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై ఆలీఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గ్రామంలో విషాదఛాయలు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు మృతి చెందడంతో శృంగరాయునిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని చలించిపోయారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సర్పంచ్ వనపర్తి విశాలాక్ష్మి, ఎంపీటీసీలు బొజ్జపు నాగేశ్వరరావు, గూడెపు ఆదినారాయణ, గ్రామ పెద్దలు గొడే బాల, పి.సత్యానందం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతురాలి సోదరుడు ముక్కా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ చెప్పారు. -
బామ్మకు షాకిచ్చిన హైదరాబాద్ బుడ్డోడు!
హైదరాబాద్: నాయనమ్మ బయట ఆడుకోనివ్వడం లేదు. ఆడుకునే సమయాన్ని బాగా తగ్గించి నన్ను హింసిస్తోంది అంటూ ఓ బుడ్డోడు ఏకంగా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. నాయనమ్మకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ ఘటన నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 'సదరు పిల్లాడి తండ్రి ఓ కేబుల్ ఆపరేటర్. టీవీ సీరియళ్ల ప్రభావంతో అతను పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉంటాడు. ఎలాగోలా అతన్ని మేం సముదాయించాం' అని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. పోలీసులు ఎన్నో హామీలు, కొన్ని చాక్లెట్లు ఇచ్చిన తర్వాతే కేసు ఉపసంహరించుకోవడానికి ఆ బుడతడు అంగీకరించాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిచి వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది. ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది.