
వైరల్
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్‌గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్‌కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది.
విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment