traditionally
-
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్‌గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ఈ శ్రావణ మాసం ఇల్లుని ఇలా తీర్చిదిద్దుకుందామా!
సంప్రదాయ వేడుకలకు వేదిక శ్రావణం. కళ కళలాడే వెలుగులను మోసుకువచ్చే మాసం. తీరైన శోభను తీర్చడానికి శ్రమతోపాటు డబ్బునూ ఖర్చు పెడతారు. ఎక్కువ కష్టపడకుండా పర్యావరణ స్నేహితంగా శ్రావణ మాస వ్రతాలకు, పూజలకు ఎకోఫ్రెండ్లీ థీమ్‌తో ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో హైదరాబాద్ వాసి డెకార్ నిపుణులు కల్పనా రాజేష్ ఇస్తున్న సూచనలు ఇవి.. ఆకులు అల్లుకున్న గోడ ఎక్కడైతే వ్రతం పీట పెడతారో ఆ చోట గోడకు తమలపాకులు, విస్తరాకులు, మర్రి ఆకులను ఒకదానికి ఒకటి కుట్టి, సెట్ చేయవచ్చు. మధ్య మధ్యలో బంతిపూలు లేదా గులాబీలు అమర్చవచ్చు. లేదంటే, ఇరువైపులా దండ కట్టి వేలాడదీయవచ్చు. ఏది సహజంగా ఉంటుందో దానిని ఎంపిక చేసుకోవాలి. బ్యాక్‌డ్రాప్‌లో వెదురు బుట్టలను ఉపయోగించవచ్చు. ఈ బుట్టలకు పూల అలంకారం చేస్తే కళగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలావరకు బ్యాక్ డ్రాప్లో వాడే కర్టెన్స్ ప్రింటెడ్‌వి వచ్చినవి వాడుతుంటారు. వాటిని ఎంపిక చేసుకుంటే మనం అనుకున్న థీమ్ రాదు. ఇక వీటిలో పాలియస్టర్వి వాడకపోవడం మంచిది. ఎకో థీమ్‌లో ఎంత పర్యావరణ హితంగా ఆలోచనను అమలు చేస్తే అంత కళ ఉట్టిపడుతుంది. రంగు రంగుల హ్యాండ్లూమ్ శారీస్‌ను కూడా బ్యాక్ డ్రాప్‌కి వాడచ్చు. వట్టివేళ్లతో తయారుచేసే తెరలు కూడా వాడచ్చు. అందమైన తోరణం... మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎలాగూ మామిడి ఆకులు తోరణం కడతారు. అలాగే, ఇప్పుడు వరికంకులతో తోరణాన్ని కట్టచ్చు. వీటిని వేడుక పూర్తయ్యాక మరుసటి రోజు బయట గుమ్మానికి అలంకారంగా వాడచ్చు. ఆ తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారిపోతుంది. అమ్మవారికి కట్టే చీర కూడా నారాయణ్‌పేట, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్ పట్టు చీర ఎంపిక చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ చేసుకోవాలంటే మూడు వెదురు కర్రలు తీసుకొని, క్లాత్, అరటి ఆకులతో సెట్ చేయవచ్చు. ఇత్తడి బిందెలు .. గంటలు ఇంట్లో బిందెలు ఉంటాయి కదా... వాటిలో మట్టిని నింపి, అరటి చెట్లను సెట్ చేసుకోవచ్చు. స్టీల్ బిందె అయితే నచ్చిన క్లాత్ చుట్టి, మట్టి నింపితే చాలు. కుందులు జత అడుగు పొడవు ఉన్నవి ఎంచుకొని, రెండు వైపులా అమర్చుకోవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం నింపి, మధ్యలో కొబ్బరిపువ్వు సెట్ చేసి పెడితే ఎంతో అందంగా వచ్చేస్తుంది. అమ్మవారికి మల్లెపూల దండ, కలువపువ్వు మంచి కాంబినేషన్. లేదంటే గులాబీలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర రెండువైపులా పాత కాలం నాటి ఇత్తడి పాత్రలు ఉంటే వాటిలో మొక్కలు పెట్టవచ్చు. ఇత్తడి గంటలు ఉంటే వాటిని డెకార్ ప్లేస్‌లో అలంకారంగా వేలాడదీయవచ్చు. అరటిగెల పెట్టచ్చు. ప్లాస్టిక్‌కు నో ఛాన్స్ ప్లాస్టిక్ పువ్వులతో వచ్చే అనర్థాలు ఎన్నో. వీటి బదులుగా బంతి, చామంతి, గులాబీ, కొబ్బరి ఆకుతో చేసిన దండలను, కాటన్ దారాలు ఉపయోగించవచ్చు. రంగవల్లికల కోసం రసాయన రంగులు వాడకుండా పువ్వులతో ముగ్గులు వేయచ్చు. ఆర్గానిక్ కలర్స్ వాడుకోవచ్చు. కింద కూర్చోవడానికి కోరాగ్రాస్ చాపలు, కలంకారీ, షోలాపూర్ బెడ్‌షీట్స్ వాడచ్చు. బొమ్మలతో భలే.. తెలుగు రాష్ట్రాల్లో మనవైన బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి, నిర్మల్, చేర్యాల మాస్క్స్... ఆ బొమ్మలు పెట్టి కూడా అలంకారం చేసుకోవచ్చు. బ్రాస్ ఖరీదు ఎక్కువ అనుకుంటే టెర్రకోట ప్లాంటర్స్, గుర్రపు బొమ్మలు, మట్టి ప్రమిదలు, రంగురంగు గాజులు... వాడవచ్చు. అతిథులకు ఎకో కానుక మార్కెట్లో వెదురు బుట్టలు దొరుకుతున్నాయి. పండ్లు, పూలు వంటివి ఈ బుట్టల్లో సెట్ చేయవచ్చు. అతిథులకు అందజేయడానికి ఇవి బాగుంటాయి. రసాయనాలు కలపని ఆర్గానిక్ పసుపు, కుంకుమ ఎంచుకోవాలి. చేనేత బ్లౌజ్ పీస్ పెడితే గిఫ్ట్ ప్యాక్ రెడీ అవుతుంది. మన దగ్గర ఉన్న పర్యావరణ వస్తువులను సరిచూసుకొని, వాటితో ఎలా అలంకరణను పెంచుకోవచ్చనేది ముందుగా ఆలోచించి, ఆ విధంగా సిద్ధంగా చేసుకుంటే సంతృప్తికరమైన డిజైన్ వస్తుంది. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కెమికల్ స్ప్రే చేస్తుంటారు. థర్మోకోల్ మీద ఆకులు పెట్టి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ అంటుంటారు. కానీ, మనం ఎంచుకునే థీమ్ మొత్తం తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉంటేనే అది పర్యావరణ హితం అవుతుంది. – కల్పనా రాజేశ్, డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు -
జుట్టును బట్టే గుర్తింపు!
జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చు అంటారు. వయసును బట్టి కూడా మన దేశంలో కేశాలంకరణ మారుతూ ఉంటుంది. అయితే ఆఫ్రికాలో మాత్రం.. జుట్టుకు, వాళ్ల ఆస్తిపాస్తులకు సంబంధం ఉంటుందట! అవును.. విక్టోరియా షెరోస్ రాసిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ హెయిర్.. ఎ కల్చరల్ హిస్టరీ అన్న పుస్తకంలో కేశాలంకరణ.. వ్యక్తి నమ్మకాలను, వయసును, మతంతో పాటు, లింగ భేదం లాంటి వైవిధ్యాలను కూడా చెబుతుందని అంటున్నారు. జుట్టు అలంకరణను బట్టి వాళ్లకు పెళ్లయిందా లేదా, భర్త పొజిషన్ ఎలాంటిది అనే విషయం కూడా తెలిసిపోతుందట. ఆఫ్రికా రాజకీయాల్లోనూ కేశాలంకరణది ప్రధాన పాత్రేనట. అందుకు హెర్బర్ట్ వింటర్, థామస్ బెల్లోస్ వంటివారి చరిత్ర ఉదాహరణగా నిలుస్తుంది. నిటారుగా ఉండే జుట్టు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందట. అందుకే నల్లజాతి మహిళలు వివిధ రకాల కేశాలంకరణలతో ఉన్నతంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారట. అయితే ఈ విషయంలో తమ ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుకోవాలా? ప్రస్తుత పరిస్థితిని అనుసరించాలా అన్న విషయంలో డైలమాలో పతున్నారు. తెల్లవారి కేశాలంకరణను అనుకరించడంలో, వారి ఆదర్శాలను వ్యతిరేకించడంలో అనిశ్చితికి గురౌతున్నారు. వెస్ట్రన్ కల్చర్ ప్రభావం వారికి భారంగా మారుతోంది. నలుగురిలో మెలగాల్సిన పరిస్థితుల్లో ఆఫ్రికన్ మహిళలు హెయిర్ స్టైల్ మార్చాల్సిన పరిస్థితి వస్తోంది. తమ సంస్కృతిలో కొనసాగే వీలు కనిపించట్లేదు. తమ స్టైలును మూఢాచారంగానో, ఛాందసంగానో ట్రీట్ చేస్తారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే బలవంతంగా తలకట్టు మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమను తాము ప్రదర్శించుకోవడం కోసం, అనుకున్నది సాధించడం కోసం కూడా ఆఫ్రికన్ మహిళలు హెయిర్ స్టైల్ మారుస్తున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం హెయిర్ స్టయిల్ ను పరిస్థితికి అనుగుణంగా మలచుకుంటున్నారు. కుటుంబం, రాజకీయం, ఉద్యోగం వంటి అనేక కారణాలతో ట్రెండ్ మారుస్తున్నారు. మహిళలు తమ వ్యక్తిగత ఛాయిస్‌ను తెలిపేందుకు చిహ్నంగా ఫైబర్ కలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. -
సంప్రదాయాన్ని విస్మరించం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో కోదండరాముని కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. కోదండ రామాలయం చుట్టు పక్కల ఇళ్లను తొలగించేందుకు సహకరించిన వాటి యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ఒంటిమిట్ట చెరువుకు నీరు చేరితే అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈనెల 28వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోదండరాముని దర్శనానికి రానున్నట్లు ఆయన తెలిపారు. సీతారాముల కల్యాణోత్సవానికి ఏప్రిల్ 2వ తేదీన గవర్నర్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, అధికారిక లాంఛనాలతో స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆలయంలో నూతన నిర్మాణాలకు తావు లేదన్నారు. ఆలయ శిల్ప సంపదను చెన్నైలోని ప్రత్యేక చిత్రకారుల సహకారంతో పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామకుటీరం, కృంగిశైల పర్వతం, ఇళ్లు కూలదోస్తున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దని, వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
గణనాథుని రథోత్సవ వైభవం
కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. మూల విగ్రహన్ని సుగంధ పరి మళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాలంకార భూషితులైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉం చి విశేష సమర్పణ చేశారు. ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. కాకర్లవారిపల్లికి చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుమారులు హరిప్రసాద్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరిం చారు. ఉభయదారుల ఉభయం వచ్చిన అనంత రం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవా న్ని ప్రారంభించారు. అశ్వాలు, వృషభాలు సర్వసైన్యాధిపతులు ముందు వెళుతుండగా స్వామివారు రథంపై కాణిపాకం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకొంది. ఈఓ పూర్ణచంద్రరావు ఆలయ ఏఈఓలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఉభయదారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.