
బామ్మకు షాకిచ్చిన హైదరాబాద్ బుడ్డోడు!
హైదరాబాద్: నాయనమ్మ బయట ఆడుకోనివ్వడం లేదు. ఆడుకునే సమయాన్ని బాగా తగ్గించి నన్ను హింసిస్తోంది అంటూ ఓ బుడ్డోడు ఏకంగా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. నాయనమ్మకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ ఘటన నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
'సదరు పిల్లాడి తండ్రి ఓ కేబుల్ ఆపరేటర్. టీవీ సీరియళ్ల ప్రభావంతో అతను పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉంటాడు. ఎలాగోలా అతన్ని మేం సముదాయించాం' అని ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. పోలీసులు ఎన్నో హామీలు, కొన్ని చాక్లెట్లు ఇచ్చిన తర్వాతే కేసు ఉపసంహరించుకోవడానికి ఆ బుడతడు అంగీకరించాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిచి వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.