Little Boy
-
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
కిడ్నాపర్ ను విడిచి వెళ్లనంటున్న బాలుడు
-
మా డాడీ మీద కేసు పెట్టమన్న బుడ్డోడు
-
USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు!
అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. రెండు భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కని్పంచే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా జరిగింది.. సిడ్నీ మూర్ (22), అరామిస్ యంగ్‌బ్లడ్ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌విల్లే. మొబైల్ వ్యాన్లోనే నివాసం. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్టన్కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్‌కు నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్విల్లేను కకావికలు చేసి పారేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్ ఇవ్వకముందే వారి మొబైల్ వ్యాన్‌పై విరుచుకుపడింది. చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్ హుటాహుటిన ప్రిన్స్టన్ను హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్‌ను కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్ వ్యాన్ పూర్తిగా నేలమట్టమైంది. హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసివాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిథిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్ గుక్కపట్టి ఏడుస్తూ కని్పంచాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్ గుర్తు చేసుకుంది. ‘‘హోరు వానలో జారిపోయిన భుజంతో నిలువెల్లా తడిసి చేతుల్లో మా చిన్న కొడుకుతో నా భర్త తిరిగొస్తున్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ హర్షాతిరేకాలు వెలిబుచ్చింది. టెన్నెసీలో అంతే... టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడోలకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్గొమరీ కౌంటీ నుంచి లొగాన్ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సికింద్రాబాద్ లో బాలుడి కిడ్నాప్ కలకలం
-
చింటూ అంటే చిన్నోడు అనుకున్నావా..స్టేజి మీద దుమ్ము దులిపేసాడు..
-
మ్యాన్ హోల్ లో పడిన బాలుడి ఘటనలో వెలుగులోకి వాస్తవాలు
-
ఈ ఘటనతో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి
-
ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదు..
-
‘జీవితాంతం చదువుతూనే ముసలోడినైపోతా’.. పిల్లాడి మాటలకు ఫిదా అవ్వాల్సిందే!
స్కూల్‌కి వెళ్లమన్నప్పుడు, హోంవర్క్ చేయమంటే పిల్లలు మారం చేస్తుంటారు. ఆ సమయంలో వారు ఏడుస్తూ చెప్పే బుజ్జి బుజ్జి మాటలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓ పిల్లాడు చదువుకోనని ఏడుస్తూ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందీ అక్షరాలు చదవాలని తల్లి కొరగా.. ఆ పిల్లాడు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘జీవితాంతం చదువుకుంటూనే వృద్ధుడిగా మారిపోతా..’అంటూ తల్లితో చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను గుల్జార్ సాహాబ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో కళ్ల నిండ నీళ్లతో పిల్లాడు పెన్సిల్, నోట్ బుక్ పట్టుకుని కూర్చున్నాడు. జీవితాంతం చుదువుకుంటూ ఉంటూనే ముసలోడినైపోతా అని తన తల్లితో చెబుతున్నాడు చిన్నోడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల మంది వీక్షించారు. 23,200 లైకులు వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘పిల్లాడు చెప్పేది తప్పేమి కాదు.. చదువుల వల్లే మనం వృద్ధులుగా మారిపోతున్నాం.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ज़िन्दगी भर पढ़ाई करते करते बुड्ढा हो जाऊंगा 🥲😅 pic.twitter.com/D3XNoifVSm — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 28, 2022 ఇదీ చదవండి: యాక్సిడెంట్ అయినా డెలివరీ ఆగలేదు! అతని సమాధానం ఏంటంటే.. -
ఈ బుడతడి మాటలకూ పోలీసులు ఫిదా
-
"సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!
ఎంతోమంది తమకు వీలైనంతలో సాయం చేసి అందర్నీ విస్మయపరిచిన ఘటనలను ఎన్నో చూశాం!. సాయం చేయాలన్న స్వచ్ఛమైన మనుసుంటే చాలు అని ఏవిధంగానైనా లేదా ఏ రూపంలోనైనా సాయం చేయవచ్చు అని నిరూపించారు చాలామంది. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇక్కడున్న చిన్న బాలుడు. అసలు విషయంలోకెళ్లితే... ఒక బాలుడు దాహంతో ఉన్న కుక్కకు చేతి పంపు ద్వారా నీళ్లు అందించాడు. అయితే ఈ ఘటనకు సంబందించిన వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా "వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి వీలైనంతగా వారు సహాయం చేయవచ్చు" అనే క్యాప్షన్‌ని జోడించి మరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు ప్రపంచమంతా ఇలాగే ఉండాలని కొందరూ, మానవత్వం హృదయానికి సంబంధించినది వయసుకి సంబంధించినది కాదు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है. Well done kid. God Bless you. VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1 — Dipanshu Kabra (@ipskabra) December 7, 2021 -
మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!
ఆస్ట్రేలియా: పోలీసుల అంటేనే చాలామందికి భయంవేస్తుంది. అంతేకాదు పైగా వాళ్లు వృత్తి రీత్యా క్రూరంగా ఉండాల్సి రావడం వల్లనో తెలియదు గానీ చాలా మంది ప్రజలకు పోలీసులపై సదాభిప్రాయం ఉండదు. కానీ ఈ ఆస్ట్రేలియా పోలీసునే చూస్తే కచ్చితంగా అభిప్రాయం మారతుందని చెప్పక తప్పదు. (చదవండి: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!) ఇంతకీ అసలు విషయంలోకెళ్లితే....ఆస్రేలియాకి చెందిన ఒక బాలుడు లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు యెప్రాడ్ రూస్టర్ అనే కోడిపిల్లను పెంచకుంటున్నాడు. ఆ బాలుడి పెంపుడు కోడిపిల్ల రాత్రిళ్లు విపరీతంగా శబ్దం చేస్తుందంటూ ఇరుగు పోరుగు వాళ్లు పోలీసులు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ఆ బాలుడి తండ్రి పోలీసులు ఇంకో పదిరోజుల్లో తమ కొడుకు పెంచుకుంటున్న కోడిపిల్లను తీసుకువెళ్లిపోతారని తెలిసి పోలీసులకు తమ సమస్యను వివరించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఫెయిర్‌ఫీల్డ్ సిటీ పోలీస్ ఏరియా కమాండ్ అధికారితో ఆ బాలుడు తండ్రి మాట్లాడుతూ...నా కొడుకు లుకేమియాతో బాధపడతున్నాడు. తరుచుగా కీమోథెరఫీ చికిత్సల కారణంగా డల్‌గా అవకూడదనే ఉద్దేశంతోనే రూస్టర్ అనే కోడిపిల్లను ఇచ్చాను. పైగా వాడు దానికి జాన్సన్ అనే పేరు పెట్టడమే కాక ఆహారం పెడుతూ ఆడుకుంటూ ఉత్సహంగా ఉంటున్నాడు" అని చెబుతాడు. దీంతో సదరు పోలీస్ అధికారి, కానిస్టేబల్ ఫ్రాంకీ వారి బాధను అర్థం చేసుకోవడమే కాక మీ కొడుకు ఏమి రూస్టర్కి వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదని చెబురు. పైగా ఆ బాలుడుతో తమకు అందమైన పోలం ఉందని అక్కడ ఈ యెప్రాడ్ రూసర్ హాయిగా పెరుగుతుందని అంటారు. అంతేకాదు నీవు ఎప్పుడూ కావల్సి వస్తే అప్పుడు ఈ రూస్టర్ని వచ్చి చూడవచ్చు అని ఆ బాలుడికి చెబుతారు. ఈ మేరకు ఆ బాలుడికి బొమ్మలు, పోలీస్ యూనిఫాం, టోపి వంటి బహుమతులు కూడా ఇస్తారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌తో సహా నెటిజన్లంత పోలీసుల దయార్ద్ర హృదయాన్ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!) -
Viral Video: సర్ప్రైజ్ గిఫ్ట్.. బాలుడు గుక్కపెట్టి ఏడ్చాడు..
పెద్దవారు చిన్న పిల్లలను సంతోషపెట్టడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటారు. కొందరు చాక్లెట్లు, ఆట బొమ్మలను బహుమతులుగా ఇస్తే.. మరికొందరు నచ్చిన ప్రదేశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లు వంటి వాటిని గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. చిన్న పిల్లలకు బహుమతులిచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను సర్ప్రైజ్ చేయడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లాడిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. అతనికి కుక్కపిల్లలు (పప్పీ) అంటే ఇష్టం. అయితే, ఒకరోజు బాలుడి తల్లిదండ్రులు అతని కళ్లకు మాస్క్‌ను కట్టారు. ఆ తర్వాత.. టవల్‌తో చుట్టిన కుక్కపిల్లని.. బాలుడి చేతుల్లో ఉంచారు. మెల్లగా.. కళ్లకు కట్టిన మాస్క్ తీసేశారు. అప్పుడు బాలుడు తన చేతిలో ఉన్న కుక్క పిల్లని చూసి ఆనందంతో మురిసిపోయాడు. వావ్.. అంటూ దాన్ని తన ప్రేమతో తన బుగ్గలకు హత్తుకున్నాడు. ప్రేమతో నిమిరాడు. ఆ తర్వాత.. సంతోషంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ఈ వీడియోను పర్రెరాస్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్..ఎంత ప్రేమతో హత్తుకున్నాడు..’, ‘కుక్కపిల్ల క్యూట్‌గా ఉంది’,‘ పప్పీని బాగా చూసుకోవాలి.. మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగుండాలంటూ’ కామెంట్లు పెడుతున్నారు. They surprised little man with a puppy, and I'm done for the day 🥺😢😭 🔊🔊 credit: Parreiras10 pic.twitter.com/YBHsTnLl92 — Jess💫 (@Jess_asli) November 1, 2021 -
కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!
ఆగ్రా: పొరపాటున చిన్నారి తల ప్రెజర్ కుక్కర్లో ఇరుక్కుపోయింది. తల ఇరకడంతో ఆ చిన్నారి గిలగిలకొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్‌ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తమ కుమారుడిని కాపాడడంతో ఆ కుటుంబసభ్యులు వైద్యుల కాళ్లపై పడి ‘మీరు దేవుళ్లు’ అని కీర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. (చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు) ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్ కుక్కర్‌తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్లో ఇరుక్కుపోయింది. బాలుడు ఎందుకు రోదిస్తున్నాడో చూసిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. కుక్కర్ నుంచి తలను బయటకు తీసేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించారు. చివరకు ఫలితం లేకపోవడంతో వెంటనే ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రికి తరలించారు. కుక్కర్‌ను తొలగిస్తున్న ఎస్ఎం ఛారిటబుల్ ఆస్పత్రి వైద్యులు (ఫొటో: IndiaToday) అక్కడ వైద్యులు మొదట పరిశీలించి అత్యంత క్లిష్టమైన కేసుగా భావించారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా బాలుడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండడంతో వైద్యులు చాలా జాగ్రత్తతో తీసేందుకు ప్రయత్నించారు. అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. డాక్టర్ ఫర్హాత్ ఖాన్ నేతృత్వంలో వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. కుక్కర్‌ను అత్యాధునిక యంత్రంతో కట్ చేయడంతో చిన్నారి తల క్షేమంగా బయటకు వచ్చింది. అయితే ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం. బాధితులు పేదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డాక్టర్ ఫర్హాత్ఖాన్ తెలిపారు. చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
కూకట్పల్లి: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్లో ఓ ఆన్లైన్ గేమ్‌కు బానిసై 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ క్లాసుల కోసం బాలుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. అయితే, క్లాసులు వినకుండా ఫోన్లో గేమ్‌లు ఆడేందుకు బాలుడు బానిసయ్యాడు. దీంతో అతను మరోసారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా, ఆట మధ్యలో తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు -
వైరల్ వీడియో: ఈ బుడ్డోడి డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
-
Viral Video: ఈ బుడ్డోడి డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
చిన్న పిల్లలు ఆడినా, పాడినా చూడమూచ్చటగా ఉంటుంది. వాళ్లు చేసే డ్యాన్స్ చూస్తే మనకు ఆనందం కలగకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక నృత్యం విషయంలో తమకు తెలియకుండానే చిన్న పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. కొన్నిసార్లు పెద్దల కంటే కూడా అద్భుతంగా డాన్స్ చేసి అబ్బుర పరుస్తారు కూడా. తాజాగా ఓ బాలుడు చేసిన డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మాజీ ప్రొఫెషనల్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘డ్యాన్సర్లతో పాటు బుడ్డోడు చేసిన నృత్యం అద్భుతం. మీరు తప్పకుండా చూడాలి’ అంటూ రెక్స్ చాప్మన్ కామెంట్ జత చేశారు. ఓ పార్క్‌లో కొంత మంది పలు వరసల్లో నిలబడి గ్రూప్‌గా డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తున్నారు. వారి పక్కనే ఓ చిన్న పిల్లవాడు కూడా వాళ్లను అనుకరించారు. వారు చేస్తున్న స్టెప్పలను వారికంటే అద్భుతమైన గ్రేస్‌తో చేశాడు. అతని డాన్స్ మూవ్మెంట్స్ చాలా సహజంగా ఉన్నాయి. అతని నృత్యం పార్క్‌లో ఉన్న చూపరులను ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికే 1.9 మిలియన్ నెటిజన్లు వీక్షించారు. 90 వేల మందికి పైగా కామెంట్లు చేశారు. ‘బుడ్డోడు నా కంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు’, ‘పెద్దయ్యాక ఈ పిల్లవాడు మంచి డ్యాన్సర్ అవుతాడు’, ‘అక్కడ చేస్తున్నవారి కంటే ఆ పిల్లవాడే అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అసలే ఎండాకాలం.. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మనుషులం.. మనమే ఎండవేడికి తాళలేకపోతున్నాం. ఇక నోరులేని జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు మాత్రం ఓ పక్షి దాహార్తి తీర్చి మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒక పిల్లవాడు తన ఇంటి బాల్కనీ పక్కన ఒక పావురాన్ని చూశాడు. చాలాసేపటి నుంచి అది ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది. పైగా అది చాలా నీరసంగా కనిపించింది. ఇది చూసిన ఆ బాలుడు చలించిపోయాడు. పాపం.. ఎంత దూరం నుంచి ఎగురుతుందో, ఆ పక్షికి కాసిన్ని నీళ్లు ఇద్దాం అనుకున్నాడు. అలా ఒక చిన్న స్పూన్‌ను నీటితో నింపి ఇనుప చువ్వల సందులో నుంచి పావురం ముందు పెట్టాడు. మొదట పావురం నీరు తాగడానికి తటపటాయించింది. దీంతో బాలుడు కొంత నీరు కింద పోశాడు. ఆ వెంటనే పావురం గాబరాగా ఆ నీరు తాగటం మొదలుపెట్టింది. కాసేపటికి చెంచాలో ఉన్న నీళ్లన్నీ తాగి తన దాహార్తిని తీర్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ బాలుడు చేసిన పనికి ‘హ్యట్సాఫ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్: బుడ్డోడి డాన్స్ చూస్తే నవ్వులే..
సాధారణంగా కోకిల కూస్తే.. సరదాగా మనం దానిలాగే పోటీపడి మరీ రాగం అందుకుంటాము. అలాగే కొన్ని జంతువులను వాటి ముందే అనుకరించి ఆటపట్టిస్తూ ఆనందపడతాము. అయితే అవి మన మీదికి రావనే ధీమా కలిగినప్పుడే ఇలాంటి చిలిపి పనులకు పూనుకుంటాము. తాజాగా ఓ బుడ్డోడు చిన్న కుక్కపిల్లను ఆటపట్టించిన ఓ వీడియోను నటి లావణ్య త్రిపాఠి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ ఉదయం మీ ముఖంపై నవ్వులు పూయిస్తూ.. ప్రకాశవంతం చేయడానికి ఇది చూడండి’ అని కామెంట్ జతచేశారు. ఈ వీడియోలో ఉన్న బాలుడు గేట్ లోపల ఉన్న కుక్కపిల్లతో ఓ ఆట ఆడుకుంటాడు. వాటి ముందు స్టైల్‌గా డాన్స్‌లు వేస్తాడు. వాటి కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ.. తొడగొట్టి మరీ మీరు (కుక్క పిల్లలు) నన్ను ఏం చేయలేరని రెచ్చగొడుతూ.. విభిన్నమైన హావభావాలు వ్యక్తం చేస్తూ నృత్యం చేశాడు. గేటుకు అవతలివైపు ఉన్న ఆ రెండు కుక్కలు బాలుడిపైకి అరుస్తూ, దునుకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అది గమనించిన బాలుడు మరింత రెచ్చిపోతూ డాన్స్ చేశాడు. ఈ బుడ్డోడి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలుడి చిలిపి చేష్టలకు పడిపడి నవ్వుకుంటున్నారు. అదే విధంగా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వు దొరికావో మా చేతిలో అయిపోయావే అని కుక్క పిల్లలు అనుకుంటున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘నేనైతే గేటు బయటే ఉన్నా అని బాలుడు డాన్స్ ఊపేశాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘నేను నవ్వు ఆపుకోలేక పోతున్నా బుడ్డోడా, నువ్వు తెలివైనోడివిరా బుజ్జి’ అని మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు. -
ఆనందం పట్టలేక ఏడ్చేశాడు
-
వైరల్: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు
సాధారణంగా మనకు చాలా ఇష్టమైన వాటిని ఎవరైనా బహుమతిగా అందజేస్తే మన ఆనందానికి అవధులు ఉండవు. అది ఆశ్చర్యపరిచే సందర్భమైతే ఇక మాటల్లో వర్ణించలేం. అలా కోరుకున్నది కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు కార్చుతూ ఏడ్చేస్తాం కూడా. అచ్చం అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ బాలుడికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలుడు సోఫా మీద కూర్చోని తన మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అతని తల్లి ఒక క్యూట్ కుక్కపిల్ల(పప్పి)ని ఆ బాలుడికి తెలియకుండా తీసుకువచ్చి ఇస్తుంది. కుక్క పిల్లలంటే అమితంగా ఇష్టపడే ఆ బాలుడు తన తల్లి తీసుకువచ్చిన ఆ కుక్క పిల్లను చూసి ఒక్కసారిగా ఆనందం పట్టలేక ఏడ్చేస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘సైమన్ బీఆర్ఎఫ్సీ హాప్కిన్స్’ అనే ట్వీటర్ ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘అతడు ఎల్లప్పుడూ కుక్క పిల్లలను ఇష్టపడతాడు. తన తల్లి క్యూట్ కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చినప్పుడు అతని స్పందన చూడండి’ అంటూ కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను వేల మంది నెటిజన్లు వీక్షించగా వందల మంది లైక్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు ఆ బాలుడి ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిని ప్రశంసిస్తున్నారు. ‘ఆ కుక్కపిల్ల బాలుడి అద్భుతమైన జీవితానికి నాంది పలికింది, ‘ఈ వీడియో చూస్తే నాకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగడంలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘కుక్క పిల్లలు స్వర్గం నుంచి దేవుడు పంపిన ప్రత్యేక కానుకని ఆ బాలుడు గుర్తించాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం!
ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం. జపాన్ వాసులైతే ఈ తేదీని అంత తేలికగా మరిచిపోలేరు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలైన నగరాలు హిరోషిమా, నాగసాకి. హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసానికి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటల ప్రాంతం (జపాన్ స్థానిక కాలమానం ప్రకారం)లో హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. దానికి లిటిల్ బాయ్ అని అమెరికా పేరు పెట్టింది. భూతలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే లిటిల్ బాయ్ పేలాడు. కొన్ని సెకన్లలో హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. 64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు!. అనంతరం మరో 70 వేల మంది మృత్యువాత పడ్డారు. కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ల శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్టగొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. క్షణాల్లో నగరం ఆవిరైపోయింది. ఎక్కడ చూసినా కూలిన భవంతులు. శవాల దిబ్బలు. వేల మంది గాయాలపాలై తీవ్ర అనారోగ్యానికి సైతం గురయ్యారు. ఆపై కెమికల్స్ వల్ల పుట్టుకొచ్చిన భయానక వ్యాధులతో లక్షల మంది మృత్యువాత పడ్డారు. అయితే అంత వినాశనం జరిగినా ఒకే ఒక్క భవనం జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం ఆ దుర్ఘటనకు సాక్ష్యంలా నిలిచింది. 73 ఏళ్ల క్రితం విధ్వంసాన్ని తట్టుకున్న భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందుతోంది. చివరగా ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. భారీ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ల తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం వారిలో ఆశల్ని చిగురింప చేసింది. యురేనియం ఆనవాళ్లు మెల్లగా చెరిగిపోయినా.. దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది రాబోయే తరాలని పీడించకుండా ఉండాలని ఎన్నో ప్రయోగాలకు వ్యాధిగ్రస్తులు తమ శరీరాలనే అప్పగించారు. ఆ ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ కారక వ్యాధులు ఎంతో తక్కువ. గత తరాల త్యాగాల ప్రతిఫలమే నేటి హిరోషిమా. నాటి విధ్వసానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన డోమ్ భవనం (కుడి ఫొటో ప్రస్తుతం) జపాన్ లొంగిపోయేలోపే దారుణం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్. అప్పటి జపాన్ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. శాంతికి చిహ్నంగా మారిన హిరోషిమా జపాన్‌లోని హొన్షు దీవిలో ఉన్న హిరోషిమా పెద్ద నగరం. హిరోషిమా అంటే జపాన్ భాష జపనీస్‌లో విశాలమైనది అనే అర్థం వస్తుంది. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశ విదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో కొత్త జీవితాన్ని గడుపుతోంది హిరోషిమా. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా. అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌ను నిర్మించారు. కొన్నేళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని 1955లో ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అణ్వాయుధాలు పూర్తిగా నిషేధం కావాలని మరెన్నో దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. -
ఈ బుడ్డోడు పెయింటింగ్ వేస్తే.. కాసుల వర్షమే!
ఆర్ట్ అంటే హార్ట్‌తో చూడాలి. అప్పుడే దానిలో నిగూఢంగా దాగి ఉన్నది అర్థమవుతుంది. నాలుగేళ్ల ప్రవాస భారతీయ బుడతడు పెయింటింగ్‌లు వేస్తుంటే లక్షలు కురుస్తున్నాయి. అద్వైత్ అనే బుడతడు వేసే పెయింటింగ్‌లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అద్వైత్ కొలార్కర్ పుణేలో జన్మించాడు. ప్రస్తుతం అతడి కుటుంబం కెనడాలో స్థిరపడింది. తల్లి శ్రుతి కొలార్కర్, అద్వైత్కు సంబంధించిన విషయాలను చెబుతూ... ఏడాది వయసు ఉన్నప్పుడే అద్వైత్ పెయింటింగ్ బ్రష్‌లను పట్టుకునే వాడనీ, పుణెలో ఒక ఆర్ట్ గ్యాలరీ యజమాని, రెండేళ్ల వయసులోనే అద్వైత్ ప్రతిభను గుర్తించాడని తెలిపారు. ప్రస్తుతం ఈ బుడతడికి సొంతంగా ఆర్ట్2డే గ్యాలరీ ఉంది.. కెనడాలోనే పెయింటింగ్‌లను ప్రదర్శించే అతి పిన్న వయస్కుడు అద్వైత్ మాత్రమేనని కెనడా సాంస్కృతిక శాఖ అధికారి బెర్నార్డ్ కార్మియర్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని ఆర్ట్ ఎక్స్‌పోలో ఏప్రిల్ 19-22 మధ్య జరిగిన ప్రదర్శనలో అద్వైత్ పెయింటింగ్‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘అద్వైత్ పెయింటింగ్‌లు వేసేటప్పుడు ఎవరి సలహాలు, సూచనలు, అవసరం ఉండదు. వాడికి నచ్చినట్లు వేస్తాడు. వాడి సంతోషమే మాకు కావాలి. వాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో జీవితాంతం అలానే ఉండాలని కోరుకుంటున్నామ’ని అతడి తల్లి శ్రుతి తెలిపారు. -
నాలుగేళ్ల బుడతడు వేసే పెయింటింగ్‌కు లక్షలు..