Viral News Telugu: Little Boy Dance Viral In Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: ఈ బుడ్డోడి డ్యాన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Published Mon, Jun 14 2021 11:34 AM | Last Updated on Mon, Jun 14 2021 2:23 PM

Little Boy Dance Viral In Social Media - Sakshi

చిన్న పిల్లలు ఆడినా, పాడినా చూడమూచ్చటగా ఉంటుంది. వాళ్లు చేసే​ డ్యాన్స్‌ చూస్తే మనకు ఆనందం కలగకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక నృత్యం విషయంలో తమకు తెలియకుండానే చిన్న పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. కొన్నిసార్లు పెద్దల కంటే కూడా అద్భుతంగా డాన్స్‌ చేసి అబ్బుర పరుస్తారు కూడా. తాజాగా ఓ బాలుడు చేసిన డ్యాన్స్‌ వీడియో.. సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మాజీ ప్రొఫెషనల్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘డ్యాన్సర్లతో పాటు బుడ్డోడు చేసిన నృత్యం అద్భుతం. మీరు తప్పకుండా చూడాలి’ అంటూ రెక్స్‌ చాప్మన్‌ కామెంట్‌ జత చేశారు.

ఓ పార్క్‌లో కొంత మంది పలు వరసల్లో నిలబడి గ్రూప్‌గా డ్యాన్స్‌ ప్రాక్టిస్‌ చేస్తున్నారు. వారి పక్కనే ఓ చిన్న పిల్లవాడు కూడా వాళ్లను అనుకరించారు. వారు చేస్తున్న స్టెప్పలను వారికంటే అద్భుతమైన గ్రేస్‌తో చేశాడు. అతని డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చాలా సహజంగా ఉన్నాయి. అతని నృత్యం పార్క్‌లో ఉన్న చూపరులను ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికే 1.9 మిలియన్‌ నెటిజన్లు వీక్షించారు. 90 వేల మందికి పైగా కామెంట్లు చేశారు. ‘బుడ్డోడు నా కంటే చాలా బాగా డ్యాన్స్‌ చేస్తున్నాడు’, ‘పెద్దయ్యాక ఈ పిల్లవాడు మంచి డ్యాన్సర్‌ అవుతాడు’, ‘అక్కడ చేస్తున్నవారి కంటే ఆ పిల్లవాడే అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్నాడు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


చదవండి: నెగిటివ్‌ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement