అరే బాప్‌రే.. నన్ను హంతకుణ్ని చేయకండి...! బుజ్జోడి వైరల్‌ వీడియో | Newborn baby interesting gesture video goes viral on internet | Sakshi
Sakshi News home page

అరే బాప్‌రే.. నన్ను హంతకుణ్ని చేయకండి...! బుజ్జోడి వైరల్‌ వీడియో

Published Tue, Apr 9 2024 10:53 AM | Last Updated on Tue, Apr 9 2024 1:52 PM

Newborn baby interesting gesture video goes viral on internet - Sakshi

అపుడే పుట్టిన బుజ్జాయిలు భలే ముద్దుగా ఉంటారు. బుజ్జి  బుజ్జి..లేలేత కాళ్లు చేతులతో..ముట్టుకుంటే కంది పోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు. అపుడే విరిసిన  పింక్‌ గులాబీల్లా,  మెరిసిపోయే  కళ్లతో మిటుకు మిటుకు చూస్తూ ఉంటారు. ‘‘ఎవర్రా మీరంతా.. నేను ఏ లోకంలోకి వచ్చాను’’ అన్నటు చూస్తూ ఉంటారు కదా.  

ఇంకొంతమంది ఉంటారు గడుగ్గాయుల్లాగా...డాక్టర్‌, నర్సుల డ్రెస్‌ గట్టిగా  పట్టేసుకుంటారు.  ఇంకొంతమందేమో అమ్మ స్పర్శ తగలగానే ఏడుపు మానేసి ముద్దుగా బజ్జుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోలోని శిశువు ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న కత్తెరను గట్టిగా పట్టుకుని వదలనే వదలడు. బొడ్డు పేగు  కోసిన తరువాత ఆ కత్తెరను సిబ్బంది ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉన్న వీడియో వైరల్‌గా మారింది.  ట్విటర్‌లో ఇది  ఇప్పటివరకు  25 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement